అజరామర సూక్తి- 301
अजरामर सूक्ति – 301
Eternal Quote - 301
https://cherukuramamohan.blogspot.com/2021/07/301-301-eternal-quote-301.html
सत्सङ्गश्च विवेकश्च निर्मलं नयनद्वयम् ।
यस्य नास्ति नरःसोऽन्धः कथं न स्यादमार्गगः ॥ - गरुडपुराण
సత్సంగశ్చ వివేకశ్చ నిర్మలం నయనద్వయంl
యస్య నాస్తి నరః సోऽన్ధః కథం నస్యాదమార్గగః ll గరుడ పురాణము
సత్సంగము, వివేకము మానవుని మలినరహిత మగు ఆరోగ్యకరములగు రెండు
నేత్రములు. ఆరెండు గుణములు లేకపోతే ఆరెండు కళ్ళూ గ్రుడ్డివే!
గ్రుడ్డికళ్ళతో చూడవలసినది, చూడ గలిగినది ఏమీ ఉండదు. అంధత్వము ఆవరించి
ఉన్నంతవరకు వాల్మీకి మారలేదు. ఎప్పుడయితే ఆయనకు సప్తర్షి సాంగత్యము
లభించినదో అప్పుడే ఆయన నేత్రద్వయములు తెరుచుకొన గలిగినాయి. ఎప్పుడయితే
నారద సాంగత్యము లభించినదో కడుపులోనున్న ప్రహ్లాదుడు దైత్యుడయ్యును సాదు
వర్తనుడై సంకర్షణ భక్తుడై విష్ణువునే తనకు, కాలాంతరమున ద్వారపాలకునిగా తన
రసాతల లోక పాలకునిగా యుంచుకొన్నాడన్నది పురాణ కథనము.
ఈ శ్లోకమును ఒక పరి పరికించండి.
సంసార విష వృక్షస్వ ద్వేఫలే అమృతోపమే l
కావ్యామృత రసాస్వాదః సజ్జనై స్సంగమస్సహ ll
సంసారమనే విషవృక్షానికి అమృతముతో సమానమైన రెండు ఫలములు ఉంటాయి.
ఒకటి సద్గ్రంథపఠనం, రెండోది సత్పురుష సహవాసం. గ్రంథాలు చదివినా..వాటిని
అర్థము చేసుకోగలిగే విజ్ఞానం అవసరం. కానీ సత్సాంగత్యానికి.. ‘సత్పురుషుడా..
కాదా?’ అని గుర్తించగలిగిన వివేకం ఉంటే సరిపోతుంది.
సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తిః
ఇది పారలౌకికం. ఈ లోకానికి సంబంధించి.. సత్సహవాసం వల్లమనిషి
సంస్కరింపబడతాడు. వ్యక్తులు సంస్కరింప బడితే సమాజం బాగుపడుతుంది. అప్పుడు
దేశం సుఖశాంతులతో వర్థిల్లుతుంది. సత్సాంగత్యం ప్రభావం వర్ణనాతీతం.
సత్పరుషులైన సప్తర్షులను కలియుట చేతనే బోయవాడు వాల్మీకిగా మారి ప్రపంచప్రసిద్ధి
గాంచిన రామాయణ మహాకావ్య రచన చేయగలిగాడు. నాస్తికుడైన ‘నరేంద్రుడు’..
రామకృష్ణ పరమహంస అనే గురువును పొందుట వల్లనే వివేకానందునిగా మారి
భారతదేశానికి, హిందూమతానికి ప్రపంచ ప్రఖ్యాతి కలిగించినాడు.
సువాసనగల, అందమైన పూలతో సాంగత్యము చేసి హారంగా మారడం వల్లనే
దారానికి భగవంతుని కంఠసీమలో స్థానము లభించింది. ఈ విధంగా సత్సాంగత్యానికి
సత్ఫలితము ఉన్నట్లుగానే.. దుస్సాంగత్యానికి దుష్ఫలితము ఉంటుందని ప్రత్యేకంగా
చెప్పవలసిన పనిలేదు. కాబట్టి, మానవులు సత్సాంగత్యము ద్వారా సత్ఫలితాలు
పొందగలరని ఆశిద్దాం.
सत्सङ्गश्च विवेकश्च निर्मलं नयनद्वयम् ।
यस्य नास्ति नरःसोऽन्धः कथं न स्यादमार्गगः ॥ - गरुडपुराण
सत्संग और विवेक - ये मानव के दो नेत्र समान हैं l अगर इ दो आदमी को उपलब्ध नहीं है तो वह
नेत्र हीन कहाजासक्ता है l इस विषय को थोड़ा विस्तार से चर्चा करें l
एक बार इस दोहे को देखीए l
काजल की कोठरी में कैसो हू सयानो जाय,
एक लीक काजर की लागिहै पे लागिहै।
इस दोहे का तात्पर्य है कि व्यक्ति कितना भी चौकस हो, कितना बुद्धिमान हो, सर्तक हो, लेकिन
अगर वह बुरे व्यक्ति का संग करता है तो उस पर उसका बुरा प्रभाव पड़ना निश्चित है। मनुष्य का
स्वभाव है वह जल की तरह नीचे जाने को सदैव तत्पर रहता है।
उसके विचारों, उसके जीवन को सही दिशा देने के लिये सज्जनों का साथ जरूरी है।
व्यक्ति की पहचान उसके मित्रों से होती है जिनके साथ वह उठता बैठता है, समय बिताता है।
अगर इंसान उन्नति करना चाहता है, सुख पाना चाहता है तो वह सदैव अच्छे लोगों का साथ करे।
इतिहास में ऐसे कई उदाहरण हैं। जब एक भटका हुआ व्यक्ति सत्संगति के कारण राह पर आ
गया। ऋषि वाल्मीकि को ही लें। पहले वे डाकू थे। सप्तऋषि के वचनों से प्रभावित होकर वह
तपस्वी बन गये और बाद में उन्होंने रामायण की रचना की। इसी प्रकार अंगुलिमाल एक डाकू था।
महात्मा बुद्ध से साक्षात्कार होने पर वह उनके वचनों से प्रभावित हो उनकी शरण में आ गया।
उसका जीवन ही बदल गया।
उदाहरण देने के लिये इतिहास का सहारा न भी लें, अपने आस पास ही देखें, तो पायेंगे कि जिसने
सत्संग किया, वह तर गया। गन्दे नाले का पानी गंगा नदी में गिरता है तो उसक अपना अस्तित्व
मिट जाता है अर्थात वह भी गंगाजल हो जाता है। स्वाति की बूँद सीप में गिरती है तो मोती बन
जाती है। पारस के स्पर्श से लोहा भी सोना बन जाता है।
satsaṅgaśca vivekaśca nirmalaṃ nayanadvayam ।
yasya nāsti naraḥso'ndhaḥ kathaṃ na syādamārgagaḥ ॥ - garuḍapurāṇa
One who doesn't have two pure eyes (namely) 1) the company of the wise and 2)
prudence, is blind. How can he not tread wrong paths?
No one is born all intelligent. Our knowledge base grows as we grow. The kind of
stimulus and exposure that surrounds us greatly influence us in who we become.
Being around the virtuous makes one want to be virtuous, too. Company of the
wise and knowledgeable comes only by God's grace. If we make use of it, their
company will make us wise and prudent, too. One with wisdom rarely treads on
wrong paths.
Valmiki and Dhruva are two best known examples who with the help of the
association of Saptarshis and Narada, could accomplish their desire.
Hence the verse opines that wisdom and the company of the wise should act as
two eyes, giving the person clarity of vision. One with clear vision stays on his
path. However, one who can't see is termed as 'blind'. And one who doesn't
possess these two eyes is deemed blind. It is no wonder he can't 'see straight'!
Keep good company and your clarity of vision.
స్వస్తి.
No comments:
Post a Comment