అరచేతి గీతవై ..... (ఘజల్ )
అరచేతి గీతవై నీవు తలరాత మార్చవా
చిరుదీప కళికవై నా మది చీకటుల చిదుమవా
కెంజాయ సూర్య కాంతిన మరుమల్లె పొదలలా
మరుమల్లె పొదల పైన పరచిన వెన్నెల్ల వెలుగులా
కలిగించు కాంతి నా బ్రతుకున కరుణింత జూపుచూ ||అరచేతి గీతవై||
బ్రహ్మాణి లేత చేత పలికే రాగాల వీణలా
రాగాల వీణ తీగలపై కొనగోటి మీటులా
రవళింపజేసి నా మదిని రంజింప జేయుచూ ||అరచేతి గీతవై||
పరువాల పట్టుచీరకు సరసాల సరిగెలా
సరసాల సరిగే తీగలకు సమకూరు వెండిలా
అందాలు చిందు అంబరమై అలరింప జేయుచూ ||అరచేతి గీతవై||
ఆనంద నందనారామపు అందాల కొలనిలా
అందాల కొలనిలో మెలిగే అరుదైన మీనులా
నివసించి పరవశింపగా నా ఊహల్ల నూగుచూ ||అరచేతి గీతవై||

No comments:
Post a Comment