భారతీయ శాస్త్ర విజ్ఞానము ...8
వైమానిక శాస్త్రము
బొధానంద వృత్తి,శౌనక సూత్రములు. మణిభద్ర కారిక ఇత్యాది గ్రంథములలో 25 విధాల విమానాలున్నయని తెలిపినారు.ఇవి 'రాజ లోహ'మన్న లోహవిశేషము తో తయారు చేస్తారట.సౌమ సుందల మార్ధిక మన్న లొహములను 3:8:2 నిష్పత్తిలో కలిపి ప్రత్యేకమన శ్రద్ధతో అగ్ని కుండములో (Furnace) 272 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు కాచి ఈ లోహమును తయారు చేస్తారట.ఈవిషయాలలో దేశవిదేశాలలో ఎన్నో ప్రయోగములు గుప్తముగా జరుగుచున్నవని తెలియవచ్చుచున్నది.
విమానపీఠమును రాజ లోహముతో తయారుచేయవలెన్నది పై శాస్త్రములందు చెప్పిన మాట. ఈ పీఠము యొక్క బరువు మొత్తము విమానపు బరువులో 1/100 వుండవలెనట. వెడల్పు విమానపు ఎత్తులో సగము వుండవలెని యున్నది. ఈ విమాన స్తంభమును హటకాస్య లోహముతో చేయవలెనని లల్లడు తన యంత్ర కల్పతరువులో వ్రాసినట్లు చెప్పబడివుంది. లోహతంత్రమను గ్రంథములో ఎలోహ మూలకములనేవేవి మిశ్రణము చేయవలెనో ఇందుకు వాడవలసిన ప్రత్యేకమైన కొలిమి (Special Furnace) మరియు ఎంత ఉష్ణోగ్రత అవసరము అన్న విషయమును గూర్చి తెలుపబడినదట. ఇవికాక విమాన నిర్మాణమునకు వలయు విషయములెన్నో వివిధ గ్రంథములలో వివరించబడినది. కాబట్టి విమాన నిర్మాణము మన పూర్వులకు విశధముగా తెలియునని తెలియవచ్చుచున్నది.
ఇక విమానములలోని వివిధ రఖములను పరిశీలించుదాము. విమానాలను పూర్వులు రెండు విధములుగా విభజించినారు.1. మాంతికము :ఇందులో 25 విధములగు విమానములున్నాయి అని సౌనక సూత్రములు చెబుతూవుంటే మణిభద్ర కారికలో 32 అని తెలుప బడింది. ఇక తాంత్రిక విమానములు భైరవాది 57 విధములు గలవని భరద్వాజులవారు చెప్పడము జరిగింది.నేను ఎక్కువ వ్రాసేకొద్దీ చదువరులకు శ్రద్ధ తగ్గుతుందని వ్రాయుట లేదు. ఒక మూడు నాలుగు తాంత్రిక విమానముల గూర్చి అతి క్లుప్తముగా వివరించుతాను.
1. శకునము : ఈ విమానమునకు 28 భాగములు గలవని విమాన శాస్త్రము చెప్పుచున్నది. అవి ఏవన
పీఠము(Floor Board) ; బోలు కంభము (Shallo Mast) ; మూడు చక్రములు కలిగి రంధ్రాలతో కూడుకొన్న కీలకములు ( hree wheeled keelakas,may be joints, with holes) ; 4 తాపకములు (Heaters) , వాయు చూషక నాళములు (air-suction pipes), జలావరణము (Water Jacket) , తైల భాండము (Oil Tank), వాయు తాపకము (Air Heater) , దాహకము (chhullee or Heater) , ఆవిరి భట్టీ(Steam Boiler), విద్యుదుత్పాదక యంత్రము( electric generator) , వాయు ప్రేరక యంత్రము (air propelling machine) , వాతపా యంత్రము లేదా వాయు చూషక నాళము (Air Succsion Pipe) , దిక్ప్రదర్శక ధ్వజము ( direction indicating banner), శకున యంత్రము (Sakuna Yantra, May be the maine engine) , రెండు రెక్కలు( two wings ) , విమానము ఎగురుటకు వలయు తోక భాగము( tail portion for helping vimaana to rise), ఔష్మ్యక యంత్రము ( Thermodynamic mechanism ) సూర్య కిరణాకర్షణ యంత్రము ( sun-ray attracting bead) వ్ ఈ 28 శకున విమానము యొక్క భాగములు.
2. సుందర విమానము : ఇది 8 భాగములను కలిగియుంటుంది. అవి
పీఠము (ground plate), ధూమ్ర నాళము లేక ధూమోద్గత యంత్రము (smoke chimney),5 వాయు యంత్రములు( 5 gas-engines), భుజ్య లోహ (ప్రత్యేక పద్ధతిలో వివిధ మూల లోహ మిశ్రణముతో తయారు చేయబడుతుంది)నాళము (bhujya metal pipe), వాయు ఉత్పాదకము లేక కొలిమితిత్తి (wind blower), విద్యుతుద్పాదక యంత్రము (Electricity Generator) చతుర్ముఖ తాపోత్పాదన యంత్రము (four-faced heater) మరియు విమాన నిర్ణయము (outer cover). వీని పొడవెడల్పులనే కాక ఎత్తూ ఎంత వుండవలసినది తెలుపుతూ ఏదేది ఎక్క్డెక్కడ ఏవిధముగా వుంచవలెనన్నది కూడా ముందుతెలిపిన గ్రంథములలో వివరించినారు.
3. రుక్మ విమానము
పీఠ రుక్మ విమానస్య కూర్మాకారం ప్రకల్పయేత్
వితస్తిహసాయామం గాత్రమె కవితస్తికం
రుక్మము అనగా బంగారు. బంగారు ప్ధానముగ ఇంకా మరికొన్ని లోహ మిశ్రణములతో ఒక లోహమును తయారుచేసి దానిని రుక్మము యొక్క తయారీకి వుపయోగించుతారు. ఈ లోహమును రాజ లోహమన్నారు. రుక్మము అంతరీక్ష నౌక.ఇది స్తూపాకారము కలిగియుంటూ అండమును బోలియుంటుంది. మానవ చోదితము. తారాజువ్వ వలె ఆకాశమునకెగుస్థుంది. రష్యనులు మనిషి లేకుండా మన శాస్త్ర గ్రంథ సహాయముతో తయారు చేసి విజయము సాధించినారట.అతిపెద్ద అంతరీక్ష నౌకగా దీనిని తయారుచేస్తే ప్రయాణీకులను గ్రహాంతరసీమలకు తీసుకుపోగలుగుతుంది.మనుష్య రహితముగా చిన్నదిగా తయారుచేస్తే అస్త్ర వాహకముగా వుపయోగ పడుతుంది. ఆర్థిక సహాయము ప్రభుత్వ ప్రోత్సాహము లేక మన దేశమున మన పూర్వుల విజ్ఞానము అడవిగాచిన వెన్నెలయిపోయినది.
త్రిపుర విమానము
మస్త్య పురాణము లో త్రిపుర విమానమును గూర్చి కూడా వర్ణించినారు. అంటే త్రిపురాసురులు ఆకాశములో హర్మ్యములు నిర్మించినారు శివుదు వారి పురములను యుద్ధములో కూల్చినాడు అని చదివియుంటాము. ఈశ్వరుడు ప్రయోగించిన అస్త్రములను నేడు మనము missiles అన్న పేరుతో పిలుస్తాము. ఇది ఒక అతిపెద్ద అంతరిక్ష నౌక. గగనములో చలనము లేకుండా నిలబదగలదు.ఏదిశలో పయనించవలెనంటే ఆ దిశలో ప్రయాణము చేయగలదు.
సౌభకము:
ఈ సౌభక విమానము యొక్క ప్రస్తాపన సంస్కృత వ్యాస భారతములొవస్తుంది. భక్తి వేదాంత ప్రభురిల స్వామి వారు భాగవత పురాణమును ఉటంకించుతూ సౌభకమును గూర్చి ఈ విధముగా చెప్పినారు .
" సాళ్వుని యొక్క సౌభక విమానము , తపస్సు చే శంకరుని మెప్పించి, మయుని చే తయారు చేయబడి సాళ్వునిచే పొందబడినది. ఇది కొన్నిసార్లు అనేక విమానాలు గానూ కొన్ని సమయములసలేమీ లేనత్లుగానూ ఆకాశంలో కనిపిస్తుంది. కాబట్టి ఇది అత్యంత అసాధారణ మైనది. కొన్నిసార్లుభూమిపై, కొన్నిసార్లు నీటి మీద తేలుతూ కొన్నిసార్లు ఆకాశంలోఎగురుతూ,కొన్నిసార్లు ఒక కొండ శిఖరం మీద విడిది చేసినట్లు యాదవులు చూసి భయభ్రాంతులైనారట. అద్భుతమైన ఈ విమానం ఆకాశము నుండి ఉల్కా పాతములను సృష్టించగలదట. అత్యంత చంచలమైన ఈ విమానము యాదవులలో అలజడి సృష్టించినదట." ( భక్తివేదాంత , 1986)
పుష్పక విమానము:
దీనిని గూర్చి మనము రామాయణములో వింటాము. ఇది సుదూర ప్రయాణములు చేయగలిగినది. పుష్పకము అంటే పూలవలె బహు తేలికైనది అని అర్థము.అంటే దీనిని బహు తేలికైన లోహమును, వివిధ నిష్పత్తులలో మూల లోహముల కలిపి,తో తయారు చేసినారెమో! బహుశ దీనికి విస్తరించే స్వభావము వుడేదేమో!అంటే ఇది స్థితిస్థాపకత (Elasticity) కలిగియుంతుందన్నమ్మాట. అందుకే ఈ విమానమునెందరు అదిరోహించినా ఇంకా ఒక్కరికి స్థలము వుంటుందని రామాయణమున చెప్పబడినది.
నాకు తెలిసిన, తెలుసుకొన్న మేరకు తెలియబరచినాను. మన పూర్వుల గొప్పదనము గుర్తించండి. మీరు తెలుసుకొంటే మీ పిల్లలకు చెప్పగలరు. వారిలోనుండి ఏ శాస్త్రజ్ఞుడో బయల్వెడల వచ్చు.దీనిని వ్రాయుటకు నాకు దాదాపు 10 రోజులు పట్టింది. పది నిముసములు వెచ్చించి మన పూర్వ చరిత్రను తెలుసుకొండి. మన అపూర్వ సంపదను గుర్తించండి.
ముక్తాయింపుగా ఎ వాక్యములను చదవండి. ప్రతి దేవాలయములోనూ దేవతా విగ్రహము వుంటుబ్ది. ఆప్రదేశమును గర్భగుడి అంటారు. ఆ గభ గుడి గోపురమును విమాన గోపురము అంటారు. మీరు గమనించితే తిరుమల విమానగోపురముపఈ ఎందరో దేవతల విగ్రహములను చూడవచ్చు. ముఖ్యముగా విమాన వెంకటేశ్వర స్వామిని గుర్తించుటకు వీలుగా బాణపు గుర్తును గూడా వేసియుంటారు. పైన తెలియ బరచిన విమానములలో ముఖ్యముగా 'రుక్మమూ ఈ గోపురాకృతిలోనె వుంటుంది. దీనివల్ల మనకు దేవతా విమానములుండేవని మనకు ఒక ఊహ కలుగుట లేదా!
లేవండి- మేలుకోండి- అపూర్వ ఘంతగల మన పూర్వులను గుర్తించి దేశానికి పునర్వైభవము గొనిరండి.
కొన్నిరోజుల తరువాత మనపూర్వుల యొక్క వేరొక ఆవిష్కరణను గూర్చి తెలుసుకొందాము.

No comments:
Post a Comment