Monday, 4 July 2016

రూపాయి దండకము





రూపాయి దండకము

https://cherukuramamohan.blogspot.com/2016/07/blog-post_4.html

రూపు రంగు మారు రూపాయి కల్గిన

దాని కెవరు సాటి ధరణి యందు

క్రిస్సు గెయిలు నకును క్రీము కలరొచ్చును
రామ మొహనుక్తి రమ్య సూక్తి

అంతటి ఘనత గల్గిన రూపాయిని గూర్చి చెప్పగలిగే
శక్తి నాకు లేకున్నా చేతులెత్తి ఈ దండకము రూపములో రూపాయికి 
మ్రొక్కుచున్నాను.



రూపాయి దండకము

శ్రీ రూప రూపాయి నా ముద్దు పాపాయి నా అన్నమున్పప్పు పై నేయి నీవున్నచో హాయి లేకున్నచో 
గోయి వెన్నెల్లు లేనట్టిదౌ రేయితేయాకు యే లేనిదౌ చాయి హస్తమ్ము లేనట్టిదౌ చేయి బ్రేకైనదౌ 
టాయి మార్జాల శయ్యాదృశంబైనదౌ పోయి ఏమాత్రమూ విల్వ లేనట్టిదౌ రాయి నల్లుల్ల 
మంచాన నే పాన్పు నేర్పర్చినిద్రించ నెంచేటిదౌ హాయి నీ వున్కి లేకున్న నా మన్గడే సున్న అన్నన్న 
నేరీతి నూహింతు నీ తోడు లేనట్టి ఈ జన్మ నే మన్మనంబందు, నే నందుకే నీదు ప్రేమన్ సదా 
నాత్మ కాంక్షింతు , నా వద్ద కొచ్చేది నీ వంతు, పాకెట్టు లోనన్ సదా నిన్ను గాంచంగ నేనెంతు
నీదాస దాసుండ నీ తోడు లేకుండ నే నోటిదౌ కుండ నేనెండు పూదండ నే బర్రె గుదిబండ, నే 
చాకిబండ న్మరే కాకి ముక్కట్టు కొన్నట్టిదౌదొండ,నే వాడియున్నట్టి దౌ బెండ నే
మార్గశీర్షమ్ములో నెండ,నే నాకులున్ పూవులున్లేనిదౌ మండ నే శిగ్గు లేనట్టిదౌ రండ, నేనుండ 
నీరీతి నా పై దయన్ జూపితే నన్ను రక్షించితే, చాలు , దండాలు వేవేలు నే గోలులో బాలు 
వేసేసినట్లౌను నే నందుకే నిన్సదా నాకు తోడుండ కాంక్షింతు, నీనీడలో నుందు,నీ తోడిదే 
పొందునా గ్లాసులో మందు నీ గొప్పలన్ జెప్ప నేనెంత, నాకున్ననాసక్తితో శక్తియున్
యుక్తియున్, భక్తియున్, రక్తియున్జేర్చి ప్రార్థింతు మాకేమొ రూపాయిగా నాఫ్రికా ర్యాన్డుగా
చైనజప్పాను లో ఎన్నుగా నీవు యూరోపు యూరోగ యూఏఇ దిర్హంగ,సౌదీ రియ్యాలుగా
ఇంగ్లాండు లో పౌండ, యూయెస్సులో డాలరా, క్వైటు దీనార, ఇంకెన్ని దేశాలలో నీవు నే 
పేర్లతో నుంటివో చెప్ప, నా శక్యమే, చూడ నాడేమొ నీ పేర్లు ఏముండెనో లేదొ నామైండు
లో పైడి నాణేలుగా,వెండి నాణేలుగా, రాగి నాణేలుగా మారుచున్, మారుచున్ నేడు పేపర్ల 
రూపమ్ములన్ దాల్చియున్నావు, నా దృష్టి లో నీవు శ్రీ విష్ణు కన్నన్ మహా
గొప్ప ఏలన్న నో వెయ్యి నామాలె తా గల్గె నీ పేర్లు రూపాలు వేలాది వేలయ్యె నీ కేది
పోటీ మరెవ్వారు సాటీ సదా కోటి దండాలు ఏ ఎండయున్, వానయున్ నీరుయున్ నిప్పుయున్ 
చోరులున్ నిన్నునేరీతియున్, దాకలేనట్టి దుర్గమ్ముగా నీవు ఆల్ ప్రూఫు భోషాణమున్ ఇల్లుగా 
గల్గి యున్నావు నీ గొప్ప నె జెప్ప నా భాష భావాలు ఏపాటి, లేదంత లే ధాటి, అత్యంత అందాల 
ఓబోటి! శ్రీ వేంకటేశుండె సమ్మోహితుండౌచు నీ ప్రేమకున్, తామహా సాగరం బౌచు చెప్పంగ 
లేనంతగా, నిన్నుతా బొందె నల్కాపురీశుణ్ణి యర్థించి, ఈ నాటికీ తాను వడ్డీ యనే పేరుతో 
నంతయో ఇంతయో ఎంతయో కొంత, పే జేయుచున్, అస్సలున్ గూర్చి ఆలోచనే లేక తా ఠీవిగా
పట్టువస్త్రాలతో పైడి యాభూషలున్, కేజికేజీ కిరీటాలతో వానిలో,రత్న మాణిక్యముల్ తాపి తా
రోజుకో రీతి మేకప్పు తో రెప్పపాటన్నదే లేక చూసే, విధంగాను ఫోజుల్ని ఇచ్చేను, నేమందు నీ 
చోద్య మయ్యారె తా సుంత చింతైననూ లేకయు న్నప్పులన్ తీర్చకన్ గొప్పగా, పప్పు తో నెయ్యి తో 
నొప్పు పొంగళ్ళతో జీడి బాదాము, కిస్మిస్సుతో ఎలకుల్ పచ్చ కప్రమ్ముతో గూడి వైనాలుగా తిన్చు,
గూండాల రౌడీల, యంయల్యె, యంపీల దౌష్ట్యాలు లెక్కించకన్ వారి గొంతెమ్మ కోర్కెల్ సదా
తాను తీర్చేయుచున్,ఘాటు యాసిడ్ తొ క్లీన్జేసినా పోని ఫుల్ బ్లాక్ మనీ నెల్ల రాబట్టుచున్  
హాయి గా నిల్చె తా నీడ పట్టందు నేనందుకే చెప్పుచున్నాను నిన్ గల్గియున్నట్టి ఏ కోతి 
మూతైననూ పళ్ళు ఎత్తై ననూ ముక్కు నడ్డైననూ కాళ్ళు కుంటైననూ మెల్ల కన్నైననూ వారు నా 
దృష్టిలో మిస్సు వర్ల్దేకదా విశ్వ సౌందర్య సామ్రాజ్య సామ్రాజ్ఞులై సర్వదా భాసమానా మయూఖాల 
నొప్పేరు నె సర్వదావారి యాజ్ఞల్ని పాలించుచున్ సేవలన్ జేయుచున్ సంతసం బందుచుండేను
నీ వట్లు కాకుండా నా బాధలన్ గాంచి నీ కంటనీరొచ్చి నా తోడు నీవైనచో రంభయున్ ఊర్వశీ
మేనకా దీపికా భూమికా, సారికా, మల్లికా కాక వేరెవ్వ రైనా ఫిదా యౌచు ప్రేమాతిరేకంబుతో 
వారు నా చెంత కొచ్చేరు, బెడ్రూము జోచ్చేరు, అందాన్ని మెచ్చేరు గోళ్ళూన్చి గిచ్చేరు, ముద్దుల్ల 
ముంచేరు, కోరింది ఇచ్చేరు, నేనంటె చచ్చేరు, వద్దంటె ఏడ్చేరు, శ్రీకామినీ కామితానేక 
సంధాయినీ సర్వ సౌభాగ్య సంవర్షిణీ లోభ సంరక్షిణీ రాజకీ యాధినేతా నివాస స్థితా మోహినీ
మానినీ బాల వృద్ధా బలాధిక్య, దారిద్ర్య సందోహ బృందా సమాకర్షిణీ, మాన సంరక్షిణీ 
ఘర్షణాద్యక్షిణీ నిన్ను పొందంగ నీతుల్ని బూతుల్గ బూతుల్ని నీతుల్గ మార్చేయరా, ఫార్ములా 
లమ్మరా, రక్షణా శాఖ సీక్రెట్లు ఎల్లల్ని దాటించరా దొంగపాస్పోర్టులన్ జేయరా, ఎన్నొ వీసాల 
మోసమ్ములన్, జేయరా గుట్టు లెప్పట్టునన్ రట్టు గానీయకుండా హవాలా హవా, సాగిపోనివ్వరా
నేత లంతా నినున్ బాక్సులన్ బేగులన్ కారులందుంచి నీ నోట్లతో వోట్లు సాధించ యా మేక 
వన్నెల్ పులుల్ చేత మమ్మల్ని పాలింప జేయింపవా, పెళ్లి కైనా నిషేకాని కే నైననూ పుట్టుకల్
చావు కైనన్ మరే నీవు లేకుండ నేరీతి నా కార్యముల్ జేయ వీలౌను నీగూర్చి నేనెంతగా చెప్పినన్ 
తక్కువే యందుకే బెమ్మినిన్ తిమ్మిగా, తిమ్మినిన్ బెమ్మిగా జేయు నీగొప్ప తానొప్ప
దెవ్వారికీ కాంతు తల్లీ మహీ కల్పవల్లీ మహా టేస్టు జెల్లీ సదా కుట్టు నా మైండు
నల్లీ పకోడాన వుల్లీ పసందైన కిళ్ళీ మూవీ గాంచు వేళన్ టయిం పాసుకై నములు పల్లీ
శుభాలిచ్చు బంగారుబల్లీ సదా వాడి పోనట్టిమల్లీ నీవున్న నేనౌదు ఖల్లీ మహాలక్ష్మి శ్రీలక్షి సంతాన 
సౌభాగ్య ధాన్యాధి లక్ష్మీమహావీర లక్ష్మీ మహాధీర లక్ష్మీ మహా శూరలక్ష్మీ నమస్తే, నమస్తే నమః

పాట

సాకి :                శుకపిక సుమధుర రవపు మేళమున
                        ఝరి తరగల  గలగలల గానమున
                        కోమల కిసలయ శోభల నలరే
                        వసంత  మయమౌ ఈ నందనమున

పల్లవి :             ఎద నిండిన భావముతో మది నిండిన రాగములో
                       పదిలముగా పాట జేసి  పరవశించి పాడనా
                       పురి విప్పిన నెమలినై తనువు మరచి యాడనా      ||ఎద నిండిన ||  

   చరణము 1:  చిరుగాలికి చిగురుటాకు సిగ్గు  తోడ తల వంచగ
                        గిలిగింతలు కలిగించెను  తుంటరి తెమ్మెర చివురుకు
                       పులకరించె పల్లవము పరవశించె నా హృదయము ||ఎద నిండిన||  

చరణము 2 :   గున్న మావి కొమ్మ మీద గూటి చెంత చిలుక భామ
                      అలుక లోన కులుకు దోపి గోరువంక కై వెదకెను 
                      చూసి, చూసి నా కన్నుల నీరు వంక యై కదలెను     ||ఎద నిండిన || 






No comments:

Post a Comment