మనమూ, మఱియు గ్రీకు వారు ఒకే విధమైన వారాలను పాటిస్తాము. దానికి కారణం మన ఈ గ్రహ పద్దతి యవనుల
(గ్రీకులు) నుండి ప్రారంభమైందన్న ఒక వాదన. నేను చదివినదాని ప్రకారము. యవనాచార్యులు అనే ఋషి వ్రాసిన
ఒక జ్యోతిష్యగ్రంథము ఆధారముగా ఈ వాదన ప్రారంభమైనది. ఆ యవనాచార్యులు ఎవరు అనేది ఇదమిత్థంగా
ఎవరూ నిర్ణయింపలేకపోయినారు. కానీ అన్నిటికన్నా ముందునుండి ప్రాచుర్యంలో ఉన్నది, ఇప్పటికీ జ్యోతిషీ
వేత్తలందరూ ప్రామాణికముగా పాటించేది బృహత్పరాశర హోరా శాస్త్రము. పరాశరుడు వేదవ్యాసుని తండ్రి.
వేదవిజ్ఞానము యవనులు, మ్లేచ్చులు, బార్బరికులు, కుషనులు, చీనులు తదితర జాతులు పుట్టకముందే
ఉద్భవించింది. దానిని అప్పటికే వ్యాసుడు విభజించినాడు. (ఆ కాలంలో ఆంధ్రులను కూడా నాగరికత లేని వారు
అని పిలిచే వారంట - ఆంధ్రభాగవతములో పోతనామాత్యులు దీనిని రాయలేదు కానీ, సంస్కృత భాగవతములో
వ్యాసుడు రాసినాడు). ఆంధ్రులు నాగరికులు అని తెలిపిన మొట్టమొదటి ఋజువు సుమారు 1500 ఏళ్ళ కిందటిది.
దీన్ని బట్టి చూస్తే మీకే అర్థమవుతుంది, యవనులు (గ్రీకులు) మన సంప్రదాయాలను అనుసరించినారో లేక మనము
వారి సంప్రదాయాలను అనుసరించినామో. దీనికంతా కారణము, మనపై రుద్దబడిన ఆంగ్లవిద్యా మహిమ. వారు
గ్రీకు సంప్రదాయానుయాయులు కనుక ఈ విధమైన ప్రచారము జరిగి ఉండవచ్చు. దీనినే మనము ఇంకా
పఠిస్తూ, పాటిస్తూ ఉండడం మన జాతి దౌర్భాగ్యం.

No comments:
Post a Comment