కాళిదాస మహాకవి
https://cherukuramamohan.blogspot.com/2016/07/blog-post_53.html
దండి భవభూతి
కాళీదాసులు భోజరాజు ఆస్తానములోని మూడు పండిత మేరువులంటారు. ఒకసారి వారి మధ్య ఎవరు
గొప్ప అన్న వివాదం తలెత్తింది. వారిలో ఎవరు గొప్ప అన్నది నిర్ణయించటము సామాన్య మైన
పండితునికే కాదుకదా అసామాన్యు పండితునకైనా సాధ్యము కాని విషయము. ఇప్పుడు ఆ స్పర్ధ
వారిమధ్యనే కలిగినది. తీర్చగలిగినది కాళికామాత మాత్రమే అని వారు అర్థము
చేసుకొన్నారు.. ఉండేదిధారా నగరమైనా ఉజ్జయిని అక్కడికి దాదాపు 60 మైళ్ళే. వెంటనే ప్రయాణమై ముగ్గురూ ఉజ్జయిని చేరి
కాళికాలయానికి వెళ్లి అమ్మవారిని 'ఎవరు గొప్ప' అని అడిగినారట. అమ్మ ఈ విధంగా జవాబు చెప్పింది:
కవిర్దండి
కవిర్దండి భవభూతిస్తు పండితః'కోహంరండే' '
'త్వమేవాహం
'త్వమేవాహం'త్వమేవాహం' నసంశయః
కవులలో
ఉత్తముడు దండి పండితులలో భవభూతి అని చెప్పిందట అమ్మ. కాళీ వర ప్రసాదుడైన
కాళిదాసుకు హడ్డులేని ఆగ్రహమొచ్చి మరినేనెవరు 'రండా' అన్నాడట. అమ్మ 'త్వమేవాహం'
అని అన్నదట. అంటే 'నీవే నేను ' 'నీవే నేను' ' 'నీవే నేను' అని
అనీంటూ ఇందులో సంశయమే పెట్టుకోనవసరము లేదని అన్నడట. అంతటి గొప్పవాడు ఆ మహనీయుడు.
ఆయనను కొందరు మొన్నటి షేక్సుపియరుతో పోలుస్తారు. ఇది చాలా బాధాకరము. కాళిదాసు వంటి
మహాకవి అప్పటి కవులలోనే కాదు, ఆతరువాత కూడా పుట్టలేదని
చెపుతారు.దానికి ఒక చమత్కారమైన శ్లోకం ఉంది.
ఆ శ్లోకము
ఇది--
‘పురా
కవీనాం గణనా ప్రసంగే కనిష్ఠి కాధిష్ఠిత కాళిదాసః
అద్యాపి
తత్తుల్య కవేరభావాత్ అనామికా సార్ధవతీ బభూవ.’
అర్ధము-
పురా=పూర్వము
కవీనాం-గణనా-ప్రసంగే=
మహా కవులను లెక్కించుటకు (మొదట)
కనిష్ఠిక+అధిష్ఠిత=చిటికెన
వ్రేలు తెరచి
కాళిదాసః=
కాళిదాసుని లెక్క పెట్టారుట
అద్యాపి=అప్పటినుండి,
తత్తుల్య=ఆయన
తో సమానమైన
కవే:+అభావాత్=కవులెవరూ
లేకపోవడం చేత
అనామికా=
చిటికెన వ్రేలు పక్కన ఉన్న ఉంగరపు వ్రేలును సంస్కృతం లో ‘అనామిక’ మంటారు. ‘అనామిక’
అనే పదానికి ‘పేరు లేనిది’ అనే మరొక అర్ధం కూడా ఉంది.
సార్ధవతీ-బభూవ
= ఉంగరపు వేలుకి 'పేరులేనిది
’ అనే పేరు సార్ధకమై పోయిందట.
డినాం
పదలాలిత్యం మాఘే సంతి త్రయోగుణాఃll
ఈ శ్లోకముతో
ఈ వ్యాసమును ముగిస్తాను.
ఉపమా
కాళిదాసస్య బారవే రర్థ గౌరవం l
దండినాం
పదలాలిత్యం మాఘే సంతి త్రయోగుణాఃll
మాఘకవి
‘శిశుపాలవధం’ మాత్రమె వ్రాసినా అది సంస్కృత భాషామతల్లికి అలంకార ప్రాయము.
విమర్శనాగ్రేసర చక్రవర్తియగు మల్లినాతసూరి గారు ఈ విధముగా అన్నారు,
‘మాఘే మేఘే గతః వయః’ - మాఘానికీ (అనగా, శిశుపాల వధకీ) మేఘసందేశానికీ(కాళిదాస కృతి) వ్యాఖ్యానం చేసేసరికి
బడలిపోయాను. అంటే కాళీదాసు మాఘుని యంత ల్కేక మాఘుడు కాళీదాసంత గొప్పవాడు
అని అన్వయము.
ఇక్కడ తెలిపిన కాళిదాసు విక్రమార్కుని నవరత్నములలో
ఒకడు. బహుశ కాళీదాసు పేరే అంత గోప్పదేమో!
స్వస్తి.
No comments:
Post a Comment