Monday, 4 July 2016

నిత్య పారాయణ రామాయణ శ్లోకములు

నిత్య పారాయణ రామాయణ శ్లోకములు


ఈ రామాయణ శ్లోకములు మీ భక్తీ పారాయణ శ్లోకములుగా ప్రతిరోజూ పఠించండి

వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వ వక్త్రాన్వితం

నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా

హస్తాబ్జైః అసి ఖేట పుస్తక సుధాకుంభం కుశా ద్రిం హలం

ఖట్వాంగం ఫణి భూరుహం దశభుజం సర్వారి గర్వాపహమ్

సర్వారిష్ట నివారకం శుభకరం పిగాక్ష మక్షాపహం 

సీతాన్వేషణ తత్పరం కపివరం,కొటీందు సూర్య ప్రభం 

లంకాద్వీప భయంకరం సకలదం సుగ్రీవు సమ్మానినం

దేవేంద్రాది సమస్త దేవ వినుతం కాకుత్స దూతం భజే

భావం ——వానర ,నారసింహ ,గరుడ ,సూకర (వరాహం ),అశ్వ అనే అయిదు ముఖాలతోను 

అనేక అలంకారాలతో ,దివ్య కాంతి తో ,దేదీప్యమానమైన 15 నేత్రాలు ,పద్మాలవంటి హస్తాలు 

ఖడ్గం ,డాలు ,పుస్తకం ,అమృత కలశం ,అంకుశం ,పర్వతం ,నాగలి ,మంచంకోడు (ఖట్వాంగం 

),పాము, చెట్టు, ధరించిన వాడు , మరియు అన్నివిధములైన అరిష్టములను తొలగించే వాడు, 

పసుపు వన్నె కలిగిన నేత్రద్వయము కలిగిన వాడు,సీతాన్వేషణ తత్పరుడు,కపిశ్రేష్ఠుడు,కోటి 

సూర్య చంద్ర ప్రకాశము గల్గినవాడు , లంకాద్వీపమును భయభ్రాంతి గావించినవాడు, 

సుగ్రీవాది సకల సన్నిహితులచే సంమానింప బడిన వాడు . దేవేంద్రాది సకల దేవతలచే 

నుతిమ్పబదేడు వాడు,అగు శ్రీరాముని దూతయైన హనుమంతునికి నమస్కరించుచున్నాను.

శరణాగతుడై వచ్చిన విభీషణునికి రక్షణ ఇవ్వవలదని ఒక్క హనుమంతుడు తప్ప అందరూ 

చెప్పినవారే ! కానీ రాముడు వారందరితో ఇతడు" 'రాఘవం శరణం గతః'శరణ్య శరణం గతః' 

అనినాడు.నాకు ఇతడు ఇకపై మిత్రుడే, శరణాగతుడు కూడా కాదు." అని నొక్కి 

వక్కాణించుతాడు. అసలు ఈ మాట చూడండి ఎంత సంస్కారవంతమైనదో!

సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే

అభయం సర్వభూతేభ్యో దదామేతద్వ్రతమ్మమ

ఒక్కసారి నేనే త్రాతనని నమ్మి, నేను నీవాడను అని శరణు కోరినవాని, సర్వ భూతములనుండి 

కూడా రక్షణ కల్పించుట నా వ్రతము. మానవ, దేవ, దానవ, పశుపక్ష్యాది సమూహముల నుండి 

ఎవరైనాసరే ఏవయినా సరే నా అభయమునకు అర్హులు. అసలు ' సకృత్ +ఏవ' అనడములోనే 

అసలుమర్మము దాగివుంది.ఒక్కసారి 'రక్షమాం' అని దృఢమైన నమ్మకముతో అంటే 

చాలుఆయన రక్షకునిగా నిలుస్తాడు. అసలది ఆయన వ్రతము. కానీ మనది 'ఏరు దాటించితే 

ఎంగన్న' వ్రతము. భక్తీ, యోగము, తపస్సు ఎన్నివున్నా పరమాత్మ పై అచంచల విశ్వాసము 

అత్యంత ప్రాముఖ్యము. ఈ శ్లోకము సర్వులకూ సర్వదా పఠనీయము. శ్రీ రాముడు 

ఎంతటి మహానీయుడో చూడండి.పాశ్చాత్య పుస్తకాలలో ఇటువంటి కమనీయ గుణాభిరాముడు 

భూతద్దము పెట్టి వెదకినా దొరకడు.

ఇంకొక ముఖ్యమైన విషయం :

ధర్మాత్మా సత్యసంధస్యరామో దాశరధిర్యధిః

పౌరుషేచాప్రతిద్వన్ద్వః శరైనంజహిరావణిం

ఈ మాటలనే మంత్రముగా జేసి రావణ కుమారుడైన ఇంద్రజిత్తు పైకి వదిలి అతనిని 

కూల్చినాడు. అసలు ఈ మాటల సారాంశమేమి? అవి మంత్రమని మనమేవిధముగా 

చెప్పగలము. చంపేది లక్ష్మణుడు చచ్చేది మేఘనాతుదనబడు ఇంద్రజిత్తు. కానీ బాణము పై 

ఆవాహన చేసిన మంత్రము రామునికి సంబంధించినది. అది విశేషము. అసలు ఈ 

విశేషములోగల విశేషము ఎంతో ముఖ్యమైనది ఒకటి ఉంది. ఈ శ్లోకములో మూడు 

విశేషణములు రామునికి వాడబడినాయి. 1. ధర్మాత్మ 2. సత్యసంధస్య 3.పౌరుషేచ 

అప్రతిద్వందః, ఈ మూడిటినీ మన మూడవ కన్నుతో ఒకసారి చూస్తాము.


1. చెట్టు చాటునుండి వాలిని చంపినా వ్యక్తీ ధర్మాత్ముడా ?

2. తండ్రికి, ప్రజలకు యౌవరాజ పట్టాభిషేకమునకు ఇచ్చగించినట్లు తెలిపి తెల్లవారిన 

వెంటనే అడవులకు పోవుట సత్యసంధత అనిపించుకొంటుందా?

3. ఖరునితో యుద్ధము చేయునపుడు మూడడుగులు వెనుకకు తగ్గిన రాముడు 

పౌరుషమందు ఎదురులేనివాడా?

ఈ ఒక్క మంత్రమే అన్నింటికీ జవాబుచెప్పింది.ఎందువల్లనంటే ఈ 

మంత్రమునభిమంత్రించి లక్ష్మణుడు ఇంద్రజిత్తుపై వదలిన వెంటనే శిరస్త్రాణ, 

కుండలసహితమైన బంగారు కాంతులీను ఇంద్రజిత్తుని తల మొండెము నుండి తొడిమెను 

విడిచిన పండులా వేరుపడినది. అసలు ఇంకొందరు వెకిలిగా రాముడు 'పాయస పాత్రుడు' కానీ 

'దశరథ జాతుడు' కాదు కదా అని అన్న వాళ్ళు వున్నారు. దశరథుని శక్తి ఆ పాయసములో 

నిక్షిప్తము చేయబడినదని నాడు ధర్మానుసారులైన పండితులు చెప్పగా విన్నాను. 

రామాయణములో విడివిడిగా జరిగిన ఈ 

ఉదంతముల నుటంకించిన వారికిఈ శ్లోకమే/మంత్రమే కనువిప్పు .

ఒకసారి పరికించండి. యుద్ధము జరిగేది లక్ష్మణ మేఘనాథుల మధ్యన.లక్ష్మణుడు 

బాణమును అభిమంత్రించినది రాముని పేరుపై.అప్పటికి ఉన్న యుద్ధ మంత్రములగానీ, లేక 

తన సుగుణ సంపదను,భాతృభక్తిని, మంత్రముగా చేసిగానీ వాడలేదు. అదిచాలు రాముడెంత 

గొప్పవాడు అని మనము తెలుసుకోడానికి, కువిమర్శకుల నోరు మూయించడానికి. పై శ్లోకము 

మంత్రము. కులాతీతమైన మంత్రము. తప్పక కంఠస్థము చేసి అనునిత్యము , ముఖ్యముగా మీ 

నూతన కార్యారంభములలో విధిగా, పైన చెప్పిన

సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే

అభయం సర్వభూతేభ్యో దదామేతద్వ్రతమ్మమ

అన్న శ్లోకము తో కూడా అనునిత్యము భక్తిశ్రద్ధలతో మననము చేసుకొనేది.

ధ్యాన శ్లోకములనీ వరుసగా :

వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వ వక్త్రాన్వితం

నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా

హస్తాబ్జైః అసి ఖేట పుస్తక సుధాకుంభం కుశా ద్రిం హలం

ఖట్వాంగం ఫణి భూరుహం దశభుజం సర్వారి గర్వాపహమ్

సర్వారిష్ట నివారకం శుభకరం పిగాక్ష మక్షాపహం 

సీతాన్వేషణ తత్పరం కపివరం,కొటీందు సూర్య ప్రభం 

లంకాద్వీప భయంకరం సకలదం సుగ్రీవు సమ్మానినం

దేవేంద్రాది సమస్త దేవ వినుతం కాకుత్స దూతం భజే


ధర్మాత్మా సత్యసంధస్యరామో దాశరధిర్యధిః

పౌరుషేచాప్రతిద్వన్ద్వః శరైనంజహిరావణిం


సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే


అభయం సర్వభూతేభ్యో దదామేతద్వ్రతమ్మమ

No comments:

Post a Comment