Monday, 4 July 2016

వర్ణం, కులం, సామాజిక వర్గం, జాతి


వర్ణం, కులం, సామాజిక వర్గం, జాతి, Caste, Tribe, Community … భారతీయ సమాజం
(కందుకూరి శివానందమూర్తి గారి ఉపన్యాసములు -- సేకరణ విశ్లేషణ VVS శర్మ గారు )


మొన్న హైదరాబాదు విశ్వవిద్యాలయంలో విద్యార్థి ఆత్మహత్య, నిన్న తునిలోఒక కులంవారి గర్జనలో జరిగిన దౌర్జన్యం,హింసాకాండ 
మొదలైన మన దేశం లో కలకలం రేపే వార్తలన్నిటిలో కులాల ప్రసక్తి ఉన్నది. ప్రతి రాజకీయ నాయకుడు, వార్తా మాధ్యమం, 
సామాజిక వేత్త, మత ప్రచారకుడు, కులం విషయం లేవనెత్త కుండా ఉండడు. కులం గోడలు బద్దలు కొడదాం, పేర్లలో కులం తోకలు 
కత్తిరిద్దాం, కులం వెనకబాటు తనం, కుల తత్త్వం, కుల వివక్ష, కులగజ్జి, కుల పిచ్చి … ఇలాంటి పద వాక్య ప్రయోగాలు కోకొల్లలు.
కులం మతం భారతీయ సమాజంలో ఉన్నాయి. ఇది సత్యం. ఉత్తిష్ఠంతు కుల మతాది భూత పిశాచా అని మంత్రం చదివితే 
మాయమైపోవు. ప్రతికులానికి మతానికి వాని వాని ప్రత్యేకలక్షణాలు, పరిణామ దశలు ఉంటాయి. గత నూరు సంవత్సరాలలో వీటి 
రాజకీయ ప్రభావం చాలా పెరిగినది. దేశానికి స్వతంత్రం వచ్చాక వీటికి ప్రత్యేకమైన ఉపయోగాలు వచ్చాయి. ఇవి లేకపోతే మన 
రాజకీయ నాయక గణానికి ఎన్నికలు ఎలా జరపాలో, ఎలా విభజించి పాలించాలో తెలియదు. ఈ వ్యవస్థ కు నేడు బలం 
ఇస్తున్నవారు రాజకీయ నాయకులే. వారి ప్రభావం విద్యార్థులపై కూడా పడుతున్నది.
1984-86లో నేను అమెరికా లో పనిచేసినప్పుడు, మా అమ్మాయిలు హైస్కూల్లో చదువుకునేవారు. వారి ప్రపంచ చరిత్ర పాఠ్య 
పుస్తకంలో భారత దేశం గురించి వ్రాసినప్పుడు, ఆ రచయిత మన వెనకబాటు తనానికి రెండు కారణాలు గుర్తించాడు. మొదటిది 
కులవ్యవస్థ, రెండవది భారతీయులు గోమాంసం తినకపోవడం. అప్పటికి ఇప్పటికీ విదేశీయుల, వారి భావజాలాన్ని స్వీకరించిన 
మన మేధావుల దృష్టిలో మన ఈ సమస్యలకన్నిటికీ మూలకారణం హిందూమతం. ఆధునిక హిందువులలో ఈ విషయాన్ని 
గుర్తించిన వారిలో ముఖ్యుడు రాజీవ్ మల్హోత్రా. ఆయన పుస్తకాలు శాస్త్రీయంగా ఈ విషయాలను వెల్లడిస్తాయి. (See Rajiv 
Malhotra (2011), Breaking India: Western Interventions in Dravidian and Dalit Faultlines (Publisher: 
Amaryllis; ISBN 978-8-191-06737-8))
భగవద్గీతలో ఒక శ్లోకాన్ని అనేకులు అపార్థం చేసుకున్నారు. ( widely misunderstood and misinterpreted) తి.తి.దే వారి 
ఆంధ్రమహాభారతములో ఒక పర్వానికి టీకా తాత్పర్యములను సమకూర్చిన ఒక తెలుగు ఆచార్యుడు ఒక సభలో దీనిని 
భగవద్గీతలో తనకు నచ్చని భావముగా పేర్కొన్నాడు.
వర్ణం, ఆశ్రమం, ధర్మం,అనే సంస్కృత పదాలను తోచిన రీతిలో అనువదించడం ఒక కారణం.ఈ పదాల అర్థాలు చూద్దాం. పదానికి 
పదార్థానికి చాలా విచిత్రమైన సంబంధం ఉన్నది. ఒక పదానికి అనేక అర్థాలు. ఈ పోస్ట్ శీర్షికలో ఉన్న పదాలన్నీ వేరు వేరు అర్థాలు 
కలవి. మాక్సుముల్లర్ వంటి వారు వేదాలను అనువదించడం విదేశీయుల విపరీతార్థాలకు ఒక కారణం. వారి ముఖ్యోద్దేశం మన 
మతగ్రంధాలను చులకన చేయడమే.

చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగశః|
తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తారమవ్యయమ్|| 4-13 ||

(సత్త్వము, రజస్సు , తమస్సు అనే మూడు) గుణములు, ఆగుణములచే చేయబడు కర్మల యొక్క విభాగము ననుసరించి (గుణ 
కర్మ విభాగశః) నా చేత నాలుగు వర్ణములు సృజింపబడినవి (చాతుర్వర్ణ్యం మయా సృష్టమ్) . వాని కర్తనైనప్పటీకి నన్నుఅకర్తగను, 
అవ్యయుడననియు (నాశ రహితుడననియు) తెలియుము.
భగవద్గీతలోని ఈశ్లోకమును భగవద్వాణిగా జాగరూకతతో అర్థంచేసుకోవాలి. గీత సర్వ ఉపనిషత్తులకు సారం అని చెబుతారు. దీని 
వేద మూలం ఎక్కడ? వేదం ఈ వర్ణ విభజనని గురించి ఏమి చెప్పింది? వజ్రసూచికోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు దీనికి మూలం. 
విశేషాలు తరువాతభాగం.

॥ వజ్రసూచికా ఉపనిషత్ ॥ 
ఇది సామవేదానికి సంబంధించిన ఉపనిషత్తు. వజ్ర సూచిక అంటే వజ్రముతో చేసిన సూది Diamond edged sharp pointed needle . అతి కఠినమైన పదార్థం వజ్రాన్ని మొనగా, అంచుగా కలిగియున్న సూక్ష్మమైన సూది. కఠినాతి కఠినమై ఉంటేనే ఆ సూచిక యొక్క సూక్ష్మత్వం నిలిచి ఉంటుంది. మొద్దుబారదు. వంగదు. ఇది ధర్మము యొక్క లక్షణానికి ప్రతీక. ధర్మాన్ని పాటించడం కత్తి అంచుపై నడక వంటిది. దాని పరీక్షకు కావలసినది వజ్ర సూచిక. వర్ణాశ్రమ ధర్మము అటువంటి ధర్మమే. ఆ ధర్మమును నిర్వచించి పరీక్షించగల సాధనమే ఈ ఉపనిషత్తు. ఈ వర్ణాశ్రమ ధర్మము కలిలో పాటించుటకు అతి కఠినమైనది. బహుళంగా అపార్థం చేసుకొనబడినది. గీతలో భగవంతుని వాక్యం - గుణముల, కర్మల ప్రాతిపదికపై నేను చతుర్వర్ణాలను సృష్టించాను - అనేదాన్ని విపులంగా భగవంతుని తత్త్వానికి అనుగుణంగా వేదభాగమైన ఈ ఉపనిషత్తు వివరిస్తుంది.. 
చిత్సదానన్దరూపాయ సర్వధీవృత్తిసాక్షిణే । నమో వేదాన్తవేద్యాయ బ్రహ్మణేఽనన్తరూపిణే ॥ 
ఓం వజ్రసూచీం ప్రవక్ష్యామి శాస్త్రమజ్ఞానభేదనమ్ । దూషణం జ్ఞానహీనానాం భూషణం జ్ఞానచక్షుషామ్ ॥ 1॥ 
మొదటి మంత్రం - ఇది అజ్ఞానాన్ని నశింపచేసే శాస్త్రం. జ్ఞాన హీనులను దూషించి జ్ఞాన దృష్టి కలవారికి భూషణముగా పనిచేస్తుంది. 
బ్రాహ్మణ క్షత్రియ వైశ్యశూద్రా ఇతి చత్వారో వర్ణాస్తేషాం వర్ణానాం బ్రాహ్మణ ఏవ ప్రధాన || ఇతి వేదవచనానురూపం స్మృతిభిరప్యుక్తమ్ ॥2॥ 
బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులని నాలుగు వర్ణాలున్నాయి. అందులో బ్రాహ్మణులు ప్రధానులు అనే వేదవాక్యములకు అనుగుణంగానే స్మృతులుకూడా చెబుతున్నాయి. ఇది కొంత విచారించవలసిన విషయం. ఈ ఉపనిషత్తు ఇలా చెప్పేసరికి వేయి ప్రశ్నలు పుట్టాయి. 
తత్ర చోద్యమస్తి కో వా బ్రాహ్మణో నామ కిం జీవః కిం దేహః కిం జాతిః కిం జ్ఞానం కిం కర్మ కిం ధార్మిక ఇతి ॥ 
అసలు ఎవరు బ్రాహ్మణుడు? జీవుడా? దేహమా? జాతి (పుట్టుక) వలనా? జ్ఞానం వలనా? కర్మ వలనా? ధర్మాచరణ వలనా? బ్రాహ్మణుడు ప్రధానమనే పలుకు చోద్యంగా ఉన్నది. 
తత్ర ప్రథమో జీవో బ్రాహ్మణ ఇతి చేత్ తన్న । అతీతానాగతానేకదేహానాం 
జీవస్యైకరూపత్వాత్ ఏకస్యాపి కర్మవశాదనేకదేహసమ్భవాత్ సర్వశరీరాణాం 
జీవస్యైకరూపత్వాచ్చ । తస్మాత్ న జీవో బ్రాహ్మణ ఇతి ॥ 
జీవుడు బ్రాహ్మణుడా? కాదని తెలుస్తూనే ఉన్నది. “అతీతానాగతానేకదేహానాం” - గడచినవి రాబోయేవీ ఐన అనేకదేహాలలో జీవుడు సమానముగానే ఉండునుకదా? ఆ జీవునికి బ్రాహణత్వము ఎందుకు ఎక్కడ, వస్తుంది?. అవస్థాభేదములేని జీవునకు వర్ణమే లేదు. 
తర్హి దేహో బ్రాహ్మణ ఇతి చేత్ తన్న । ఆచాణ్డాలాదిపర్యన్తానాం మనుష్యాణాం 
పఞ్చభౌతికత్వేన దేహస్యైకరూపత్వాత్ | 
జరామరణధర్మాధర్మాదిసామ్యదర్శనత్ బ్రాహ్మణః శ్వేతవర్ణః క్షత్రియో 
రక్తవర్ణో వైశ్యః పీతవర్ణః శూద్రః కృష్ణవర్ణః ఇతి నియమాభావాత్ । 
పిత్రాదిశరీరదహనే పుత్రాదీనాం బ్రహ్మహత్యాదిదోషసమ్భవాచ్చ । 
తస్మాత్ న దేహో బ్రాహ్మణ ఇతి ॥ 
పోనీ దేహము బ్రాహ్మణుడందామా? అదీ సరికాదు. బ్రాహ్మణునినుండి చండాలుని వరకు అదేదేహము, అదే రక్త మాంసములు అదే చర్మము. అవే పంచ భూతములతో నిర్మాణము చేయబడిన దేహము. వర్ణము పదానికి రంగు అనే అర్థము తీసికొంటే బ్రాహ్మణుడు శ్వేత వర్ణముతోనూ, క్షత్రియుడు రక్తవర్ణముతోనూ, వైశ్యుడు పీత వర్ణముతోనూ శూద్రుడు కృష్ణ వర్ణముతోనూ లేరు కదా? పోనీ దేహము బ్రాహ్మణుడే అయితే మృతదేహాన్ని దహనంచేసిన పుత్రునకు బ్రహ్మహత్యాదోషం రావాలి కదా? అందుచేత దేహానికి బ్రాహ్మణత్వం లేదు. 
తర్హి జాతి బ్రాహ్మణ ఇతి చేత్ తన్న । తత్ర జాత్యన్తరజన్తుష్వనేకజాతిసమ్భవాత్ మహర్షయో బహవః సన్తి । 
ఋష్యశృఙ్గో మృగ్యాః, కౌశికః కుశాత్, జామ్బూకో జామ్బూకాత్, వాల్మీకో 
వాల్మీకాత్, వ్యాసః కైవర్తకన్యకాయామ్, శశపృష్ఠాత్ గౌతమః, 
వసిష్ఠ ఉర్వశ్యామ్, అగస్త్యః కలశే జాత ఇతి శృతత్వాత్ । ఏతేషాం 
జాత్యా వినాప్యగ్రే జ్ఞానప్రతిపాదితా ఋషయో బహవః సన్తి । తస్మాత్ 
న జాతి బ్రాహ్మణ ఇతి ॥ 
ఈ శ్లోకం అనేకరకాలుగా ముఖ్యమైనది. అర్థం కనబడుతోనే ఉన్నది. జాతి (పుట్టుక) వలన బ్రాహ్మణులు అంటే వేద ద్రష్టలైన బ్రహ్మర్షుల, మహర్షుల జన్మ వృత్తాంతాలు దానికి పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. వైదిక సాహిత్యాన్ని విభజించి ఇతిహాస పురాణ వేదాంత గ్రంథాలను రచించిన వ్యాసుని తల్లి జాలరి వనిత. అందుచేత జన్మ బ్రాహ్మణత్వానికి కారణము కాదు. ఈ శ్లోకం ఇంకా చర్చించాలి. 
(ఆధారం సద్గురు కందుకూరి శివానందమూర్తిగారి ఉపనిషత్ ప్రసంగములు)

వర్ణం, కులం, వర్గం, సామాజిక వర్గం, జాతి, Caste, Tribe, Race, Community
శబ్దం - అర్థం – Meaning, Denotation, Connotation,
Many words in a language are untranslatable. One word needs an essay to explain in another language. Such words in Sanskrit are varna, kula, jati, varga - dharma and karma.
నిన్న మన శీర్షికలో వర్ణం, కులం, జాతి, వర్గం, సామాజిక వర్గం, అనే తెలుగు (సంస్కృత) పదాలు caste , community, race, tribe అనే ఆంగ్ల పదాలు ఉపయోగీంచాం. ఇవన్నీ వేర్వేరు పదాలు. వేర్వేరు అర్థాలు కలవి. సమానార్థకాలు కావు. కాని నేడు సమానం గా వాడుతున్నారు. ఇది కొంచెం చూదాం.
Humanities (మానవీయ/మానవ విజ్ఞాన శాస్త్రాలు) and Social Sciences (సామాజిక శాస్త్రాలు) are different from natural sciences.
మాచిన్నప్పుడు వీటిని Arts Subjects అనేవారు. Civics, Social Studies etc ఆంధ్రభారతి నిఘంటువు Arts కి కళలు, లలిత కళలు అని అర్థం ఇస్తుంది. BA అంటే కళా బ్రహ్మచారి అని అనువదించాలి. విదేశీయుల వేద సాహిత్య అనువాదం ఇలానే ఉంటుంది. కుల విభేదాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకొని వెళ్ళడానికి కారణాలలో ముఖ్యమైన దోషులు ఈ సామాజిక శాస్త్రాలే.. ఉదాహరణకు sociology, anthropology, anthropometry, philology, history, Indology, raciology
Scientific method, in all these sciences involves classification (hence division and discrimination) and taxonomy building. Instead of Chaturvarna, we built thousands of categories including the constitution created SC, ST, BC, OBC, FC. షెడ్యూలు కులాలు అంటే ఒక వర్గములోని కులాల జాపితా This is not a Hindu religious exercise. All these more than 1000 castes today have Hindu/Christian/Muslim counter parts. Two major high level classes are dalit (literally meaning oppressed by others) and backward (by their own effort).
నిన్న కొంత కుతూహలంతో కాపుల చరిత్ర చదివాను. అందులో ముఖ్యంగా తెలుగు, ఇంగ్లీషు వికిపీడియా వ్యాసాలు. వ్యవసాయం, సైనిక దళాలు, పాలనా విషయాలు మొదలైనవి అనాదిగా వీరివృత్తులు. వీరిలో కొన్నిప్రాంతాలవారు రెడ్డి కులస్తులుగా , కమ్మవారిగా, వెలమలుగా పరిణామం జరిగినది. ఈ ప్రాంతాల విభజన బ్రాహ్మణ శాఖలలోను కనుపిస్తుంది. వేగినాడు, వెలనాడు, తెలగాణ్యము, కాసలనాడు, పాకనాడు, ములకనాడు రేనాడు మొదలైనవి. పాకనాటి కాపులు రెడ్లు అనీ, కమ్మనాటి కాపులు కమ్మవారు అయినారని అక్కడ ఇచ్చిన సమాచారం. శ్రీకృష్ణ దేవరాయలు, మదురై నాయక ప్రభువులు కాపులే నని వాడుక. నాయకుడే నాయుడు, నాయకర్ మొదలైన పదాలకు మూలమని, ఇంటి పేర్లలో ఉండే …నేని అనే అంతిమ శబ్దం నాయుని నుండి వచ్చిందని చదివాను. ఆంధ్రను పాలించిన కొండవీటి రెడ్లు, బొబ్బిలి వెలమలు విఖ్యాతులే. ఒంటరి, తెలగ, బలిజ .. ఇలా ఎన్నో ఉపకులాలు కూడా ఉన్నాయి. వీరు దళితులు (ఇతరులచేత అణచివేయబడినవారు) కాదు కేవలం స్వయంకృషిచేత వెనకబడియున్నవారు. (విఖ్యాతులకు ధనవంతులకు కూడా లోటులేదు) నిన్న ముద్రగడ పద్మనాభం కాపుజాతికి న్యాయం కోసం పోరాడుతా అన్నారు. కాపు అనేది ప్రత్యేక జాతి కాదు, ఒక వర్గం మాత్రమే.
వర్ణం, కులం, వర్గం, సామాజిక వర్గం, జాతి, Caste, Tribe, Race, Community
వజ్రసూచికోపనిషత్తు (Continued)
తర్హి జాతి బ్రాహ్మణ ఇతి చేత్ తన్న । తత్ర జాత్యన్తరజన్తుష్వనేకజాతిసమ్భవాత్ మహర్షయో బహవః సన్తి ।
ఋష్యశృఙ్గో మృగ్యాః, కౌశికః కుశాత్, జామ్బూకో జామ్బూకాత్, వాల్మీకో
వాల్మీకాత్, వ్యాసః కైవర్తకన్యకాయామ్, శశపృష్ఠాత్ గౌతమః,
వసిష్ఠ ఉర్వశ్యామ్, అగస్త్యః కలశే జాత ఇతి శృతత్వాత్ । ఏతేషాం
జాత్యా వినాప్యగ్రే జ్ఞానప్రతిపాదితా ఋషయో బహవః సన్తి । తస్మాత్
న జాతి బ్రాహ్మణ ఇతి ॥
ఈ శ్లోకం అనేకరకాలుగా ముఖ్యమైనది. జాతి (పుట్టుక) వలన బ్రాహ్మణులు అంటే వేద ద్రష్టలైన బ్రహ్మర్షుల, మహర్షుల జన్మ 
వృత్తాంతాలు దానికి పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. వైదిక సాహిత్యాన్ని విభజించి ఇతిహాస పురాణ వేదాంత గ్రంథాలను 
రచించిన వ్యాసుని తల్లి జాలరి వనిత. అందుచేత జన్మ బ్రాహ్మణత్వానికి కారణము కాదు. ఈ శ్లోకం ఇంకా చర్చించాలి.
ప్రశ్న ఉపనిషత్తులలో ఇందరు బ్రహ్మర్షుల, మహర్షుల ప్రసక్తి ఉంటుందా? ఇది పురాణాల విషయం. ఇది అసలు ఉపనిషత్ 
మంత్రమేనా? ద్వాపరయుగాంతములో వేద విభజన తరువాత, బ్రహ్మ సూత్రాల తరువాత వ్యాసుడు భారతం,పురాణాలు 
రచించాడు. తరువాత సామవేద భాగమైన ఈ ఉపనిషత్తు లభించినదా? లేక ఈ మంత్రము ప్రక్షిప్తమా? ఈ రోజులలో వచ్చే 
ఇలాంటి అర్థంలేని పలుకులెన్నో ఉన్నాయి. 
• Casteism in Vedas - The purpose of this post is to give a translation of the Vajra Suchika 
Upanishad, which discusses castes in Vedas, and talks about the evolution of man to the Perfect 
Being, Brahman
• The Vajra Suchika "Upanishad" may not actually be a real Upanishad. There are a number of 
spurious texts of relatively recent origin which have been given the status of "Upanishad" but which 
are not actually quoted by the original Vedanta commentators.
Comment - పురాణమిత్యేవ న సాధు సర్వం , న చాపి కావ్యం నవమిత్యవద్యం | సంతః పరీక్షాం తరత్ భజంతె, మూఢః 
పరప్రత్యయనేన బుద్ధిఃసమాధానం
వేద కాలముతరువాత వైశంపాయనుని శిష్యుడైన యాజ్ఞ వల్క్యుడు కృష్ణ యజుర్వేదాన్నివదలిపెట్టి సూర్యుని వద్దనుండి 
శుక్లయజుర్వేదాన్ని గ్రహించలేదా? “అనంతో వై వేదా” అని చెప్పినట్లు అప్పటి మహర్షులు ఉపనిషత్తు ద్రష్టలు కూడా అయి 
ఉంటారు. బృహదారణ్యకము తరువాతకాలముదే కదా! వేద విభజన తరువాత కూడా ఆరణ్యకములు ఉపనిషత్తులు శ్రుతిగా 
లభించియుండవచ్చును. కృష్ణా వతారమునాటి మహర్షుల ప్రసక్తి కొన్ని ఉపనిషత్తులలో ఉన్నది. కొందరు పరిశోధకులకు 
తిథులు ముఖ్యము. మనకు శ్రుతివాక్యము శబ్ద ప్రమాణము.
ఋష్య శృంగుడు లేడి కడుపున పుట్టాడట! కౌశికుడు అంటే విశ్వామిత్రుడు దర్భలలో నుండి పుట్టాడట. జాంబూకుడు నక్క 
కడుపున పుట్టాడట. వాల్మీకి వల్మీకమునుండి పుట్టాడట. బోయగా బతికి నారదుడు, బ్రహ్మల అనుగ్రహంతో మహర్షియైనా, 
వల్మీకములోనే మహర్షిగా ఆతనిజన్మ. బ్రహ్మజ్ఞానసిద్ధి, బ్రాహ్మణత్వము వల్మీకములోనే ఆయనకు సిద్ధించాయి. వ్యాసుడు 
(కృష్ణ ద్వైపాయనుడు) జాలరి కన్యకు పుట్టాడట. గౌతముడు కుందేలు వీపునుండీ జన్మించాడట. వశిష్ఠుడు ఊర్వశికి 
పుట్టాడట. అగస్త్యుడు మైత్రావరుణుల తేజస్సులతో కుంభ సంభవుడైనాడట. వీరిజన్మకారకులలో బ్రాహ్మణత్వము ఎంతవరకు 
ఉంది? బ్రాహ్మణ జాతి, అబ్రాహ్మణ జాతి అని ఉన్నాయనే నిర్ణయము సాధ్యమా? అందుచేత జాతిని బ్రాహ్మణత్వానికి ఆధారంగా 
ఈ ఉపనిషత్ శ్లోకం తిరస్కరించినది.
(వీరందరి గాథలు సేకరించడానికి పురాణాల జ్ఞానమేకాక జాతక కథలు, జైన పురాణాలు తెలిసి ఉండాలి. అగస్త్య విశ్వామిత్ర, 
వశిష్ఠుల పూర్తి గాథలు గురువుగారి “మహర్షుల చరిత్రలు”లో ఉన్నాయి. మిగతా ఋషుల వివరాలు http://www.sanskrit-
lexicon.uni-koeln.de/లింకులో Puranic Encyclopedia లో లభిస్తాయి)
తర్హి జ్ఞానం బ్రాహ్మణ ఇతి చేత్ తన్న । క్షత్రియాదయోఽపి

పరమార్థదర్శినోఽభిజ్ఞా బహవః సన్తి । తస్మాత్ న జ్ఞానం బ్రాహ్మణ ఇతి ॥

జాతిని తిరస్కరించినప్పుడు మరి జ్ఞానము బ్రాహ్మణత్వానికి సూచకమా? క్షత్రియులలో జనకుల వంటి జ్ఞానులు ఉన్నారు. 

శూద్రులలో ఉన్నారు. శుక రూపంలో శుకమహర్షి వంటి జ్ఞాని ఉన్నారు. జ్ఞానము మాత్రమే బ్రాహ్మణత్వానికి లక్షణం కాదు.

తర్హి కర్మ బ్రాహ్మణ ఇతి చేత్ తన్న । సర్వేషాం ప్రాణినాం

ప్రారబ్ధసఞ్చితాగామికర్మసాధర్మ్యదర్శనాత్కర్మాభిప్రేరితాః సన్తో జనాః

క్రియాః కుర్వన్తీతి । తస్మాత్ న కర్మ బ్రాహ్మణ ఇతి ॥

చేసే కర్మలలో బ్రాహ్మణ కర్మలు, అబ్రాహ్మణ కర్మలు అని ఉన్నాయా? అంటే అదీ కాదంటున్నాడు. సమస్త ప్రాణులకు సంచిత, 

ప్రారబ్ధ, ఆగామి కర్మలున్నాయి. యజ్ఞాలు చేసినా, మద్య మాంస వ్యాపారాలు చేసినా ఆ కర్మఫలం ఎక్కడికో దారితీసి 

తదనుగుణమైన శరీరాన్ని పొంది అనుభవిస్తాడు. కర్మలలో బ్రాహ్మణా బ్రాహ్మణ లక్షణాలు లేవు. ఏజాతిలో పుట్టినా తన 

పూర్వజన్మ సంస్కారముల (కర్మ ఫలంగా వచ్చినవి) ప్రేరేపణతో ఇప్పటి కర్మలు చేస్తున్నాడు. బ్రాహ్మణత్వానికి ఇవేవీ 

classifying features కావు.

తర్హి ధార్మికో బ్రాహ్మణ ఇతి చేత్ తన్న । క్షత్రియాదయో హిరణ్యదాతారో బహవః

సన్తి । తస్మాత్ న ధార్మికో బ్రాహ్మణ ఇతి ॥

ధార్మికుడు (దాన ధర్మాలు విరివిగా చేసేవాడు) బ్రాహ్మణుడా? అంటే అదీకాదంటున్నాడు. క్షత్రియులు దానాలు చేశారు. 

ఇతరులు చేశారు. అందుచేత దాన ధర్మాలు చేయడం మాత్రమే బ్రాహ్మణత్వ లక్షణం కాదు.

తర్హి కో వా బ్రహ్మణో నామ ।

ఇంతవరకు ఖండనమే అయినది. అసలు ఎవరు బ్రాహ్మణుడు? జీవుడా? దేహమా? జాతి (పుట్టుక) వలనా? జ్ఞానం వలనా? 

కర్మ వలనా? ధర్మాచరణ వలనా? అంటే అవి కాదని, తెలిసినది. ఇక సిద్ధాంతము. ఇప్పుడు ఊహలు వదలి, self surrender 

అయి గురువుని అడగాలి. ప్రశ్న అదే. (To be continued)


5
వర్ణం, కులం, వర్గం, సామాజిక వర్గం, జాతి, Caste, Tribe, Race, Community
శబ్దం - అర్థం – Meaning, Denotation, Connotation, -- అసలు ఈ పదాల అర్థాలు ఏమిటి?
కులం = family , community వంశం, రాముణ్ణి ఇక్ష్వాకు కులతిలకా! అంటారు. కుల గౌరవం, కుల దీపకుడు ఇటువంటివే 
కులగౌరవం మంట కలిసింది అంటే కుటుంబగౌరవమే. కులవృత్తి , కులదేవత, గురుకులం, కులపతి, కుల పర్వతం, కులసతి. 
నన్నయ ను ఆంధ్రమహాభారతములో “కుల బ్రాహ్మణుడు” అన్నారు. (ఆది. 1. 10). అంటే చాళుక్య వంశీయుల గురుస్థానము 
అనుకోవాలి.
SC, ST, BC, OBC, FC – Categories = తరగతి, తరగతులు
The word VARNA is untranslatable into English and applies to individual rather than society.
సీ. తనకులబ్రాహ్మణుననురక్తు నవిరళ
జపహోమతతత్పరు విపుల శబ్ద
సంహితాభ్యాసు బ్రహ్మాండాది
నానాపురాణ విజ్ఞాన నిరతు
బాత్రు నాపస్తంబసూత్రు ముద్గలగోత్ర
జాతు సద్వినుతా వదాత చరితు
లోకజ్ఞు నుభయభాషా కావ్య రచనాభి
శోభితు సత్ప్రతిభాభి యోగ్యు
ఆ. నిత్యసత్యవచను మత్యమరాధిపా
చార్యు సుజను నన్నపార్యు జూచి
పరమధర్మ విదుడు వరచళుక్యాన్వయా
భరణుడిట్టులనియె గరుణతోడ (ఆది. 1.10).
అలాగే వృత్తులవలన వచ్చేవి కులాలు. కుమ్మరి, కమ్మరి, పూజారి, కంసాలి, ఇంజనీర్, డాక్టర్, ప్రాచీన ఆర్యుల సమాజంలో 

నట, విట, గాయక, వైద్యులు కొంతతక్కువగా చూడ బడేవారు. E.g. వడ్డెర - రాతిపని చేయు ఒక కులము. (ఆంధ్రభారతి)
Community = 1. a social group of any size whose members reside in a specific locality, share 

government, and often have a common cultural and historical heritage. 2. a social, religious, 

occupational, or other group sharing common characteristics or interests and perceived or perceiving 

itself as distinct in some respect from the larger society within which it exists: the business 

community; the University Community; community living in Utopia apartments
Appears to be a better English translation to Kulam
Caste అనే పదాన్ని మన కులాల కోసం పోర్చుగీస్ పదాన్ని మార్చి ఆంగ్లంలో ఉపయోగించడం మొదలు పెట్టారు.
Caste = Indian Sociology term defined by an endogamous and hereditary social group limited to 

persons of the same rank, occupation, economic position, etc., and having mores distinguishing it 

from other social words. Application to Hindu social groups was picked up by English in India 1610s 

from Portuguese casta "breed, race, caste," earlier casta raça, "unmixed race," from the same Latin 

word. The current spelling of the English word is from this reborrowing. Caste system is first 

recorded 
in 1840. It is neither varna nor kula. Indian kula is just a community based on common 

avocations and habits (incl. food habits) and traditions. This is not varna. There are thousands of 

kulas and Yajurveda says Siva belongs to every one of the above kulas as listed by the Rudra 

Prasna then. 

In endogamy exogamy issue gotra comes into picture
వర్ణం = రంగు, చాతుర్వర్ణంగా సమాజ అభివర్ణన, Classification based on a criterion, wavelength in case of 

colour and guna and karma in society) USA uses this skin colour meaning for race – White, Black, 

Colored etc.
సామాజిక వర్గం Social Category - ఉదా - పురోహిత వర్గం, . పారిభాషిక పదం - ఉదా: కాపు సామాజిక వర్గం,
జాతి - పుట్టుకచేత ఒక వర్గానికి సంబంధించినవి. - వృక్షజాతి, జంతు జాతి, మానవ జాతి, తెలుగు జాతి, భారత జాతి కొంత 

కృత్రిమ పదాలు. Nation-State నిర్వచనం అవసరమౌతుంది. ఆంగ్లో ఇండియన్ అనే పదాన్ని అలాగే జాతి సూచకంగా 

వాడేవారు. ఆంగ్లేయుల పాలనాకాలంలో ఈజాతి ఉద్భవించింది. ఇండో ఇటాలియనులు, ఇండో అమెరికనులు .. ఇలా నేడు 

ఎన్నో జాతులు.

6
వర్ణం, కులం, వర్గం, సామాజిక వర్గం, జాతి, Caste, Tribe, Race, Community
వజ్రసూచికోపనిషత్తు (Continued)
తర్హి కో వా బ్రహ్మణో నామ । (Then who is called a Brahmana?)
ఇంతవరకు ఖండనమే అయినది. అసలు ఎవరు బ్రాహ్మణుడు? జీవుడా? దేహమా? జాతి (పుట్టుక) వలనా? జ్ఞానం వలనా? 
కర్మ వలనా? ధర్మాచరణ వలనా? అంటే అవి కాదని, తెలిసినది. ఇక సిద్ధాంతము. ఇప్పుడు ఊహలు వదలి, self-
surrender 
అయి గురువుని అడగాలి. ప్రశ్నఅదే.
బ్రాహ్మణుడెవరు? అని అడుగుతూ బ్రాహ్మణుని లక్షణాలు, బ్రాహ్మణత్వము అనే తత్త్వము (abstraction) చెబుతున్నాడు. 
ఇది హేతువాద మార్గం. మొదట పూర్వపక్షం -- ఇది కాదు, ఇదికాదు (న+ఇతి = నేతి) నేతినేతి అనిచెబుతూ బ్రాహ్మణుడంటే 
ఎవరో నిర్ణయం (ఉత్తర పక్షం) చెబుతున్నాడు.
యః కశ్చిదాత్మానమద్వితీయం జాతిగుణక్రియాహీనం
షడూర్మిషడ్భావేత్యాదిసర్వదోషరహితం సత్యజ్ఞానానన్దానన్తస్వరూపం
స్వయం నిర్వికల్పమశేషకల్పాధారమశేషభూతాన్తర్యామిత్వేన
వర్తమానమన్తర్యహిశ్చాకాశవదనుస్యూతమఖణ్డానన్దస్వభావమప్రమేయం
అనుభవైకవేద్యమపరోక్షతయా భాసమానం కరతళామలకవత్సాక్షాదపరోక్షీకృత్య
కృతార్థతయా కామరాగాదిదోషరహితః శమదమాదిసమ్పన్నో భావ మాత్సర్య
తృష్ణా ఆశా మోహాదిరహితో దమ్భాహఙ్కారదిభిరసంస్పృష్టచేతా వర్తత
ఏవముక్తలక్షణో యః స ఏవ బ్రాహ్మణేతి శృతిస్మృతీతిహాసపురాణాభ్యామభిప్రాయః
అన్యథా హి బ్రాహ్మణత్వసిద్ధిర్నాస్త్యేవ ।
సచ్చిదానాన్దమాత్మానమద్వితీయం బ్రహ్మ భావయేదిత్యుపనిషత్ ॥
• యః కశ్చిదాత్మానమద్వితీయం = ఎవరైతే కేవలము ఆత్మస్వరూపుడో, అద్వితీయుడో, (ఆత్మవత్ సర్వ భూతాని, సర్వం 
ఖల్విదం బ్రహ్మ వంటి వాక్యార్థాలను అవగతం చేసుకొని ఉండాలి, సమస్త భూతములు తనవలెనే ఉన్నాయనేభావన 
సంపూర్ణంగా గ్రహించి ఉండాలి. తానొకడే ప్రపంచమంతా వ్యాప్తిచెంది ఆ జ్ఞానం వలన అన్నింటిలో తానే ఉన్నానన్న భావన 
కలిగిఉండాలి.)
• జాతిగుణక్రియాహీనం –
• షడూర్మిషడ్భావేత్యాదిసర్వదోషరహితం – (జరామరణములు, మోహము, దుఃఖము, ఆకలిదప్పులు - ఇవి షడూర్ములు; 
పుట్టుట, ఉండుట, వృద్ధి చెందుట, మార్పు, క్షయము, నాశనము - ఇవి షడ్భావములు . ఇవన్నీ దేహము దోషములు. తాను 
దేహమును కానని తెలుసుకొని ఉండాలి )
• సత్యజ్ఞానానన్దానన్తస్వరూపం – సత్యము, జ్ఞానము, ఆనందము, అనంతము అయిన స్వరూపం కలిగి యుండాలి . ఇది 
పరబ్రహ్మ వస్తువుయొక్క నిర్వచనమే
• స్వయం నిర్వికల్పమ్ – (సంకల్పములో వేరే వ్యాపారములేనివాడు బ్రాహ్మణుడంటాడు. అంటే ఒక కోరికగాని, కర్తవ్యంకాని, 
భేదదృష్టి గాని లేనివాడు.)
• అశేషకల్పాధారమశేషభూతాన్తర్యామిత్వమ్ - అన్నింటిలో ఏకదృష్టితో సర్వాంతర్యామిగా తానే ప్రవేశింపగలిగిన బ్రహ్మజ్ఞానికి 
కర్తవ్యము, తద్వారా సంకల్పము లేవు
• వర్తమానమన్తర్యహిశ్చాకాశవదనుస్యూతమఖణ్డానన్దస్వభావమప్రమేయమ్ - వర్తమానమన్తర్యహిశ్చాకాశవత్ - అంటే 
ఆకాశమువలె బయట లోపలా ఉండేవాడు. బ్రహ్మయే ఆకాశము. కం బ్రహ్మ? ఎవరు బ్రహ్మ? అంటే ఖం బ్రహ్మ. ఆకాశమే 
బ్రహ్మ. ఎలా? సృష్టి అనే చిత్రాన్ని రచించేందుకు ముందు తగ్గ కాన్వాస్ కావాలి. అదే ఆకాశం. బ్రహ్మయే ఆకాశంగా మొదట 
వివర్తం చ్చెందినది. అఖండానంద స్వభావమ్ - అంటే అవిచ్చిన్నమైన ఆనందంకలవాడు. సామాన్యమైన మానవునికి 
ఆనందం తరువాత దుఃఖం ఉండితీరుతుంది. ఆనందం క్షణికం. "Happiness is an occasional episode in the 
general drama of pain." 
• అప్రమేయం - తర్కము వలన తెలియబడనివాడు. ప్రమాణము ప్రమేయము న్యాయ దర్శనంలో ముఖ్య తత్త్వాలు. ప్రత్యక్ష, 
అనుమాన, శబ్ద, ఉపమాన, అర్థాపత్తి, అనుపలబ్ధి వంటి ప్రమాణాల ద్వారా ఇదమిత్థమని తెలియబడని వాడు. తెలియబడే 
వస్తువులన్నీ ప్రమేయాలు. प्रमातुं ज्ञातुं परिच्छेत्तुं वा योग्यं न - १ अपरिच्छेद्ये २ बहुसंख्यकवीर्य्यवति ३ इदमित्थमिति 
निश्चेतुमशक्ये (వాచస్పత్యం)
• అనుభవైకవేద్యమపరోక్షతయా భాసమానం - అనుభవేక వేద్యంగా బ్రహ్మజ్ఞానాన్ని గ్రహించినవాడు. బుద్ధితోగాని, 
బుద్ధికుశలతతోగాని, యుక్తివాదముచేతకాని బ్రహ్మజ్ఞానాన్నిగురించి ప్రవచనాలు, విమర్శలు చేసేవాడుకాదు. అహంబ్రహ్మాస్మి 
అతనికి శుష్కవచనం కాదు. ఆత్మానుభవం కలిగినవాడు.
• కరతళామలకవత్సాక్షాదపరోక్షీకృత్యకృతార్థతయా - కరతలామలకంగా, (అరచేతిలో ఉసిరికాయ పెట్టినట్లుగా) 
ఉత్తమలక్షణములుగల భగవంతుని దర్శించగలిగినవాడు. అలాచూడటంచేత కృతార్థుడై తరువాత చెప్పిన దోషాలు లేనివాడు
• కామరాగాదిదోషరహితః -
• శమదమాదిసంపన్న -
• మాత్సర్య తృష్ణా ఆశా మోహాదిరహితః -
ఏవముక్తలక్షణో యః స ఏవ బ్రాహ్మణేతి శృతిస్మృతీతిహాసపురాణాభ్యామభిప్రాయః అన్యథా హి బ్రాహ్మణత్వ సిద్ధిర్నాస్త్యేవ । - 
ఇంతవరకు చెప్పినలక్షణములు కలవాడే బ్రాహ్మణుడు. పైన చెప్పిన లక్షణములన్నీ భగవంతునివి. అట్టిభగవంతుని 
కరతలామలకముగా చూడగలవాడు బ్రాహ్మణుడు. అలా చూడటముచేత కృతార్థుడై ఆశ నిరాశలులేకుండా ఉన్నవాడు 
అవుతున్నాడు. సచ్చిదానంద స్వరూపుడైన భగవంతుని తెలుసుకొనుట చేత ఒక వస్తువునందు మోహము, మరొక 
వస్తువుయందు మాత్సర్యము, దంభము, అహంకారము, ఇత్యాదులు లేని వాడే బ్రాహ్మణనామానికి అర్హుడు. ఇది 
జాతివాచకము కానే కాదు.
ఇతి శృతిస్మృతీతిహాసపురాణాభ్యామభిప్రాయః - అని తేల్చి చెప్పింది ఈ ఉపనిషత్తు.

To be continued















వర్ణం, కులం, సామాజిక వర్గం, జాతి, Caste, Tribe, Race, Community … భారతీయ సమాజం
7
వజ్రసూచికా ఉపనిషత్తు లో బ్రాహ్మణ శబ్దానికి అర్హతపొందేవానికి ఉండవలసిన లక్షణాలు చెప్పబడ్డాయి. నాటి వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్యాదులు, బహుశ నేటి రామకృష్ణ పరమహంస, రమణమహర్షి వంటి వారలు మాత్రమే ఆపదానికి అర్హులని అనిపిస్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు "చాతుర్వర్ణం మయాసృష్టం" అన్నాడుకదా.. మరి ఈ వర్ణ వ్యవస్థ భగవంతుని నిర్ణయమా? మానవ కపోల కల్పితమా? ఈ విషయంలో తరచు చెప్పబడే ఋగ్వేద పురుషసూక్త మంత్రం ఒకటున్నది.
బ్రాహ్మణోஉస్య ముఖమాసీత్ | బాహూ రాజన్యః కృతః |
ఊరూ తదస్య యద్వైశ్యః | పద్భ్యాగ్మ్ శూద్రో అజాయతః ||
"నేను హిందూనెట్లైతా?" అంటూ "హిందూమతానంతర భారతదేశము"ను గురించి కలలుకనే కంచె ఐలయ్య వంటి మేధావులనుండి సామాన్య చరిత్ర అధ్యాపకుల ద్వారా ఉదహరింపబడే మంత్రభాగం ఇది. నిన్న ఏ.పీ. ఇంటర్మీడియేట్ తెలుగు మీడియం చరిత్ర గైడ్ పుస్తకం వెబ్ లో చూడటం తటస్థించింది. కాపు జాతి మాత్రమేకాదు రాష్టవాసులంతా వెనుకబడిన జనులేఅనే సత్యం అవగతమైంది. INTERMEDIATE I YEAR HISTORY(Telugu Medium) TEST PAPERS: ..
https://books.google.co.in/books?id=js7YBQAAQBAJ
దానిలో ఒక మాదిరి ప్రశ్న , దానికి రచయిత సమాధానంలోభాగం చూడండి.
ఈ ఉపాధ్యాయుడుకాని, విద్యాశాఖ అధికారులుగాని, ఈ రాతలు గమనించారా? తెలుగుమీడియం లో చదివే విద్యార్థులు దౌర్భాగ్యులే!
1. మంత్రం అనువాదం పూర్తిగా తప్పు. ముఖమంటే తల కాదు. అసలు అర్థం నోరు, రెండవ అర్థము మొగము The mouth प्रजमृजा यतः खातं तस्मादाहुर्मुखं बुधाः; ब्राह्मणोऽस्य मुखमासीत् Rv. 10.
90. 12; सभ्रभंगं मुखमिव Me. 24; त्वंमम मुखं भव V. 1 ‘be my mouth or spokesman’. — 2 The face, countenance;
ఇది సృష్టి ఆరంభాన్ని సూచించే సూక్తం. (సు+ఉక్తం) బ్రహ్మయే ప్రజాపతిగా, హిరణ్యగర్భునిగా వివర్తం చెందాడు. మానవ సృష్టి జరగలేదు. నాదంవేదం అయి బ్రహ్మ ముఖం గా వచ్చింది. ప్రజాపతియే తొలి బ్రాహ్మణుడయ్యాడు, వాక్పతి, వాచస్పతి బ్రహ్మణస్పతి అయ్యాడు.
2. రాజన్య అంటే రాజు, పాలకుడు, king, royal personage క్షత్రియ అన్నపదమే
వాడబడలేదు ఇక్కడ రాజు మనువు (మన్వంతరానికి ఆద్యుడు) బాహు అంటే చేతులు (arms) దేహం కాదు. శర్మ వర్మ అనే పదాలు యజుర్వేదంలో వస్తాయి. శర్మ చమే, వర్మ చమే అనే పదాల అర్థం బుద్ధిబలము, బాహు బలము ఇమ్మని, ఇవి అందరికీ కావాలి. ఇవి కులంతోకలు కావు.
3. వైశ్య శూద్రుల గురించి చెప్పేముందు ఒక ఉదాహరణ - భారత దేశపటంపై భారతమాతను చిత్రిస్తే - కాశ్మీరును తలగాను, పంజాబు, బెంగాలు లను చేతులుగాను, మధ్యభారతాన్ని ఊరువులుగాను, తమిళ, కేరళ దేశాలని పాదాలుగాను గుర్తించి అవమానించినట్లౌతుందా?
ఈ ప్రజాపతి, హిరణ్యగర్భుడు అనే పురుష స్వరూపం ఎక్కడ ఉన్నది? ఆయన పాదాలు మాత్రామే భూమిపై ఉన్నాయి. ఈ వర్ణన మానవ సమాజాన్ని ఉద్దేశించినదే కాదు. దానికి మొత్తం పురుష సూక్తం అర్థంచేసుకోవాలి
నాభ్యా ఆసీదంతరిక్షమ్ | శీర్ష్ణో ద్యౌః సమవర్తత |
పద్భ్యాం భూమిర్దిశః శ్రోత్రాత్ | తథా’ లోకాగ్మ్ అక’ల్పయన్ ||
పద్భ్యాం భూమి -- హిరణ్య గర్భుని (ప్రజాపతి) పాదాలు భూమిమీదే ఊంటాయి. అంటే భూమిమీద స్త్రీపురుష సంయోగంలో పుట్టిన జీవులన్నీ శూద్రులే. - జన్మనా జాయతే శూద్ర అంటే అదే. సంస్కారాలు వేదాధ్యయనం సద్గుణ సంపత్తి, దోష రాహిత్యం, బ్రహ్మజ్ఞానం మాత్రమే ఒక జీవిని బ్రాహ్మణునిగా చేస్తాయి.
పురుష సూక్తంలో వర్ణము, విభజన, బ్రాహ్మణాధిక్యతను సూచించే పదములేలేవు. నోరు వేదాన్ని, బాహువులు రక్షణని, మిగిలిన దేహం స్థితిని చూపిస్తాయి. (The base of creation with feet firmly on the ground) మూలాధార పద్మాసన భాగము.


వర్ణం, కులం, సామాజిక వర్గం, జాతి, Caste, Tribe, Race, Community … భారతీయ సమాజం
8
రామాయణంలో కులాల వేట
నేనూ ఆచార్య కవన శర్మ గారూ వాస్తవం లోనూ (నిజ జీవితంలో) కల్పనలోనూ (ఫేస్ బుక్) కూడా మంచిమిత్రులం. ఒకేబళ్ళో (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనే భారతీయ విజ్ఞాన సంస్థానంలో) చదువుకుని అక్కడే అనేక సంవత్సరాలు బడిపంతులు ఉద్యోగాలు చేసినవాళ్ళం. ప్రస్తుతం ఇద్దరం బెంగుళూరు నగరారణ్యంలో వానప్రస్థాశ్రమంలో ఉన్నాము. ఆయన నిజజీవితంలో చేయితిరిగిన రచయిత. బ్రెయిన్ డ్రెయిన్, కాన్ఫరెన్సుల తిరునాళ్ళు, తిరిగివచ్చిన థీసిసులు వంటి రచనలు ఆయనే వ్రాయగలరు. ఆయన ఈ మధ్య రచన “రామకాండం”. ఆయన బ్లాగ్ "కవన శర్మ కబుర్లు" లో పెట్టిన టపా ఇది ……. …. తంగిరాల రామశర్మగారు మా సంస్థానంలోనే పదవీవిరమణచేసిన జీవ రసాయన శాస్త్ర ఆచార్యుడు.
KAVANA SARMA KABURLU - Prof KVN Sarma’s Blog
కల్పన -వాస్తవికత
నిన్న ఆచార్య తంగిరాల రామశర్మ ఫోన్ చేసి "మీ రామ కాండాన్ని ఇంగ్లీష్ లో ప్రచురిస్తే బావుంటుంది . అది మహిమల్ని గణన లోకి తీసుకొని రామాయణం కదా" అన్నారు . అది నా ఆలోచనలని రేపింది .
భారతీయ విశిష్ట కావ్యాల గురించి విమర్శలు వ్రాయటం, ( రామాయణ విష వృక్షం ) ఒక వర్గాన్ని. ప్రాశస్త్యం తెలియచేస్తూ వ్రాయటం (రామాయణ కల్పవృక్షం) ఇంకో వర్గాన్ని, ఆకట్టుకుంటాయి. ఈ రెండు వర్గాలు పరస్పరం మినహాయిన్చుకుంటాయి (exclusive, బహిష్కరించుకుంటాయి) అల్లా అని అవి రెండు కలిపితే సమగ్రం ( సంపూర్ణం exhaustive ) కావు. ఈ రెంటికి పూర్తిగా చెందని ఒక మధ్యవర్గం (మూడో వర్గం) ఉంటుంది . వీరు రెండు వర్గాలతో కొంత ఏకీభవిస్తూ , ఇరు వర్గాలతోను ఏకిభవించని స్వంత అభిప్రాయాలు ఎక్కువగా కలిగిన వారుగా ఉంటారు . వీరికి సత్యం పట్ల కోరిక ఉంటుంది వీరిని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం మొదటి రెండు వర్గాలు చేసి కుదరక విసిగి వీరిని తాము కాని ఇతర సమూహం ( Complimentary set ) లో జమ కట్టేస్తారు .ఈ రెండువర్గాల వారికి ఐనవి (either ) కానివి ( or ) అనేవే ఉంటాయి . కొంత అవుతూ కొంత కానివి., కొంత కాకపోతూ కొంత అయ్యేవి ఉండవచ్చు అన్న స్పృహ ఉండదు రామాయణాన్ని వడకట్టి అభూత కల్పనలు తీసేసి అసలు కథ ఇదై ఉంటుంది అని వ్రాస్తే, ఇద్దరికీ నచ్చదు
మూడో వర్గం ఉంటుందని ఒప్పుకునే వారిలో కొందరికి , ఆచార్య రెడ్డి శాస్త్రి అన్నట్టు రామ కాండం ( కథ) రసం లేక చప్పగా ఉంటుంది . మరి రసపట్టులో తర్కం ఉండరాదన్ననియమం పెద్దాయన పింగళి ఎప్పుడో పెట్టాడు .
కొద్ది మంది ఓపిక ఉన్న రామ శర్మ గారి లాంటి సత్య (పరి ) శోధకులకి ఉత్సుకత కలిగించ వచ్చు అనే ధైర్యం తో వ్రాస్తూ పోతా ఇకముందు
****
LEAVE A COMMENT అని బ్లాగులో చెప్పారు. పైగా నేను ఆయన కావ్యాన్ని (కాదేమో! రసాత్మకం కాదన్నారు రెడ్డి శాస్త్రి) ఇంతవరకు నేను ఏమీ అనలేదు కనుక మన కులం విషయాలను కలుపుకొని ఏదైనా వ్రాయవచ్చు - అనిపించింది. రెడ్డిశాస్త్రి గారి కులం నాకు తెలియదు. శాస్త్రంచదివిన రెడ్డిగారా? బాబూ లాల్ బహదూర్ శాస్త్రిగారి వలె ఉపాధి పొందారా? లేదా నిఝం గానే శాస్త్రిగారా? రామ శర్మ గారు, కవన శర్మగారు, నేను - మా విషయంలో అనుమానంలేదు. అంతా బుద్ధిబలం కలవారమే. కనీసం ద్విజులం “ born-again Hindus".
శ్రీ రాముడు మనిషి. క్షత్రియ కులం వాడు.వంశం సూర్య వంశం. ఇక్ష్వాకు వంశం, రఘువంశం, కాకుస్థ వంశం అనికూడా అంటారు. ఆర్యుడు. హింసా ప్రవృత్తికలవాడు. North Indian. పురుషాహంకారముకలిగి భార్యను హింసించిన వాడు. బెయిలివ్వకుండా తానే ప్రాసిక్యూటర్, జడ్జీ అయి భార్యకు అగ్ని పరీక్ష, దేశ బహిష్కరణ శిక్ష విధించి నిర్భయ, గృహహింస ౘట్టాల క్రింద విచారింప దగినవాడు. నేటి హిందువుల హింసా ప్రవృత్తికి అతడే ఉత్ప్రేరకుడు. శంబూకవధ ద్వారా నిన్నటికి మొన్న రోహిత్ వేముల ఆత్మహత్యగా చిత్రించిన హత్యకు ఉత్ప్రేరకుడు. ద్రావిడ విరోధి…. ఇది ఒక వర్గం సాహిత్యం. మార్క్సు మహర్షివేదం సహాయంతో చేయబడిన వ్యాఖ్యానాలు అనేకం
Miracles తీసేసి మనిషిగా, సుమారు 60 సం బ్రతికి, జలప్రవేశంతో తనువు త్యజించి మానవ సహజమైన బలహీనతలు కలిగియున్న ఆ నాటి ఇక్ష్వాకు వంశపు కోసల రాజు చరిత్రగా రామాయణం చదువుకుందామనే వారు కొద్దిమంది. వందల, వేల సంవత్సారాలుగా పవిత్రగ్రంధంగా భావింపబడి ఋషిప్రోక్తంగా, దేవర్షిద్వారా సాక్షాత్తూ బ్రహ్మదేవుని ఆదేశం పై రచించబడి, స్మృతి మరియు ఇతిహాసముగా, మంత్రమహిమ కల పారాయణ గ్రంథంగా, భూమిపై నడయాడిన అవతార పురుషుని వృత్తాంతంగా, కల్పవృక్షంగా భావింపబడిన రామాయణాన్ని చదివేవారు అనేకులు, అసంఖ్యాకులు.
కవన శర్మగారు చేసినది వాల్మీకి రామాయణం, దాని వందలాది, అనుసృజనల వర్గీకరణ. రామాయణంలో పలు కులాలూ, జాతులూ ఉన్నాయి. దేవతలు, ఋషులు, మానవులు, బ్రాహ్మణులు, క్షత్రియులు, శూద్రులు, వానరులు, రాక్షసులు, నాగజాతీయులు ఉన్నారు మనుష్యరూపం ధరించే పర్వతాలు, మాట్లాడే పక్షులు ఉన్నాయి. ఇందులో చరిత్ర ఎంత? కల్పన ఎంత? అని ఆధునికులకు, ముఖ్యంగా పరిశోధకులకు కలిగే ప్రశ్నలు. వాసనా త్రయంలో శాస్త్ర వాసన బలీయమైనది. పుష్పక విమానం వంటి ఎగిరే ప్రయాణ సాధనాలు, సేతునిర్మాణం వంటి సివిల్/మిలిటరీ ఇంజనీరింగ్ ప్రాజెక్టులు, వేదాలు, శాస్త్రాలు, యజ్ఞాలు (అశ్వమేధం) , ఇష్టిలు (పుత్రకామేష్టి), తంత్రాలు (నికుంభిలా), అస్త్ర విద్యలు, మూలికా వైద్యం, ఉన్నాయి. అందుచేత ఒక ఆధునిక వైజ్ఞానికుడు రామాయణం చదివితే ఆయనకు కనిపించే ఆయనను ఆకర్షించే విషయాలు వేరుగా ఉంటాయి. వేరొకరికి ఆదిత్య హృదయ స్తోత్రం ముఖ్యమైనదిగా కనబడవచ్చు.
కవన శర్మ గారి వర్గీకరణలో నేను మూడవ వర్గం వాడిని. రామాయణ మహాభారతాలంటే నాకు చాలా భక్తి గౌరవం. వానిని కేవలం కాల్పనిక సాహిత్యంగానో, పురాణ చరిత్ర (ఇతిహాస) గ్రంధాలలవలెనో చూడను. శ్రుతులతరువాత స్మృతులుగా వాటిని పరిగణిస్తాను. నానృషికురుతేకావ్యం అని చెప్పినట్లు అవి ఋషిప్రోక్తాలు. ఆధునిక చరిత్రకారులవలె వానిలోని ఆ నాటి సమాజ స్వరూప స్వభావాలు, చారిత్రక, వైజ్ఞానిక విషయాలు అధ్యయనం చేయడం అవసరమే. రామాయణ భారతాలు సాహిత్య విద్యార్థులకు కావ్యాలు, చరిత్ర విద్యార్థులకు ప్రాచీన చరిత్రలు, సామాజిక శాస్త్ర విద్యార్థులకు ప్రాచీన సమాజాల వర్ణన, భారతీయులకు ధర్మ శాస్త్రాలు, హిందువులకు మత గ్రంధాలు, కళాకారులకు, భక్తులకు, మూల గ్రంధాలు. అంటే భారతీయులందరూ వీటి మూల ప్రతులతో పరిచయం కలిగిఉండాలి. ఈ ఇంటర్నెట్ యుగంలో ఇది సాధ్యమే.
*****
నాలుగవ విదేశీయ రచయితల వర్గం ఒకటి ఉంది. ఈ మూడు వర్గాలకంటె ముఖ్యమైనది.. మనదేశంలో కంటె సంస్కృతసాహిత్యానికి పెద్ద పీట వేస్తున్నవి యూరప్ అమెరికాలలోని విశ్వవిద్యాలయాలు. Religion, Comparative Religion, South Asian Studies, Eastern Religions, Sanskrit ఏపేరైతే ఏమిటి? అనేక విదేశీయులు వేదాలు, ఉపనిషత్తులు, పురాణేతిహాసాలు, స్మృతులు వీటిని పరిశొధిస్తున్నారు. ఇది మన మతం, సంస్కృతి, భాషలు, గ్రంథజాలం పై అనురాగం, భక్తి వలన మాత్రంకాదు. ఉదాహరణకు 1995 ప్రాంతాలలో అమెరికాలో క్లే సంస్కృత లైబ్రరీ అనే పెద్ద ప్రాజెక్ట్ మొదలైనది. షెల్డన్ పోలక్ అనే అమెరికన్ ప్రొఫెసర్ వాల్మీకి రామాయణాన్ని అనువదిస్తూ గత 10 సంవత్సరాలలో అయోధ్య, అరణ్య కాండలను వ్యాఖ్యానంతో సహా ప్రచురించాడు. ఆయనను రెండో వర్గంలో వానిక్రింద గుర్తించినా ఆయన ప్రయత్నం ముఖ్యోద్దేశం రాముడు మనం అనుకున్నంత ధర్మ స్వరూపుడు కాడు, అప్పటి సమాజం చాలా వెనుక బడినదని నర్మగర్భంగా చిత్రించడం. ఇలాంటి ప్రయత్నాలను పాండిత్యంతో ఎదుర్కోగల వ్యవస్థ మనకు లేదు. పైగా ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి, ఆయన కొడుకు రోహన్ వంటివారు వీరికి కోట్లాది డాలర్ల విరాళం ఇస్తున్నారు. క్రైస్తవ మత సంస్థల హస్తంకూడా Comparative Religion శాఖలలో ఉండే ఉంటుంది.


వర్ణం, కులం, సామాజిక వర్గం, జాతి, Caste, Tribe, Race, Community … భారతీయ సమాజం
9
రామాయణంలో కులాల, మతాల వేట
ఆధునిక మేధావులందరిదీ ఒకటే ప్రశ్న - రాముడు చారిత్రక వ్యక్తియా? వాల్మీకి అనే కవిగారి కావ్యంలో (పోనీ పుక్కిటి పురాణంలో) నాయకుడా? ఈ కథలో పాత్రలు కేవలం కల్పితాలు అని వాల్మీకి వ్రాయలేదనుకోండి. “Is the story of Sri Rama, an ancient king of India and the hero of the Indian epic, the Ramayana, a real one? Or is it just a myth?”
ఎందరు రాములు? ఎన్ని రామాయణాలు? ఎందరు రచయితలు?
ఆచార్య్య కవన శర్మగారు (రామాయణంలో) కల్పన, వాస్తవికత అన్న శీర్షికతో రామాయణాల వర్గీకరణ ప్రస్తావించి మూడు వర్గాలు - విషవృక్షం, కల్పవృక్షం, కాండం (ఆయన రచన) అనే ఉదాహరణలు ఇచ్చారు. చిన్నప్పుడు రామ శబ్దం చదువుతూ రామః,రామౌ, రామాః (రాముడు, ఇద్దరు రాములు, రాములు) విన్నాము. రామో రామశ్చ రామశ్చ - పరశు రాముడు, శ్రీ రాముడు, బల రాముడు విష్ణువు అవతారాలని చెబుతారు. కల్పన, వాస్తవికత అనేవి రెండు exclusive sets అనినేను అనుకోను. కల్పనలో వాస్తకవిత, వాస్తవికతలో కల్పన సహజవిషయాలు. సత్యాసత్యాలలో అనేక వర్ణాలు ఉన్నాయి. పారమార్థిక సత్యం, ప్రాతిభాసిక సత్యం, వ్యావహారిక సత్యం. అలాగే అసత్యానికి కూడా. సత్యం అనేది ఒక సంశయాత్మక భాషా పదం (Fuzzy Linguistic Variable) దీని కోణాలు ఇంగ్లీషులొ చెబుతాను. {పరమ సత్యం. absolutely true, true, quite true, more or less true, not quite true, quite false, false, absolutely false, శుద్ధ అబద్ధం}. సూర్యుడు తూర్పున ఉదయించును. .. ఇది కేవలం భూమి ఉపరితలంపై నివసించే వారికి సత్యం. అంతరిక్షంలో అసత్యం అర్థంలేని వాక్యం. తూర్పూ అసత్యమే, ఉదయించడం అంతే.
ఏకే రామానుజన్ అనే మైసూరు అయ్యంగారు, అమెరికాలో ప్రొఫెసరుగా ఉండెవాడు. ఒక సదస్సులో ఈ వ్యాసం సమర్పించాడు.. Three Hundred Ramayanas: Five Examples and Three Thoughts on Translation by A. K. Ramanujan.
ఈ వ్యాసంలో ఆయన ఒక ఉపాఖ్యానాన్ని చెబుతాడు.
ఒకనాడు అయోధ్యలో ఉత్తమాసనంపై శ్రీరాముడు కూర్చొని ఉంటాడు. అప్పటికి లవకుశులరాక, సీత భూమిలోకి వెళ్ళిపోవడం జరిగాయి. హనుమ ఆసనం ప్రక్కనే స్వామిని చూస్తూ కూర్చొని ఉంటాడు. ఇంతలో రాముని వేలునుండి రాజ ముద్రిక గా ఉపయోగించే వజ్రాల ఉంగరం జారిపోతుంది. అది నేలపై ఆగ లేదు. భూమికి అక్కడ రంధ్రం పడి రామబాణం వలె, సుదర్శనం వలె ఎక్కడకో వెళ్ళిపోయింది. శ్రీరాముడు హనుమను ఆ ఉంగరం వెంటనే తెచ్చి ఈయమంటాడు. అష్టసిద్ధులుకల హనుమకు ఇది తేలికపనే, అంగుష్ఠమాత్రునిగా మారి ఉంగరాన్ని అన్వేషిస్తూ అధోలోకాలు (నాగలోకం -రసాతలం) వెళ్ళిపోతాడు. ఈ జీవిని అక్కడ సేవకులు ఒక పళ్ళెంలో పెట్టి (ఆహారంగా కావచ్చు) అక్కడి నాగ రాజు కై ఉంచి ఆయన రాకకై నిరీక్షిస్తారు.
ఈ లోపల లక్ష్మణుడు రామునివద్దకు వసిష్ఠుని, బ్రహ్మదేవుని తీసుకొని వస్తాడు. "రామా నీతో ఏకాంతంగా మాట్లాడాలి, అంతవరకు లోనికి ఎవరైనా వస్తే వారికి శిరచ్చేదం చేయాలి" అని అడుగుతారు. ఆవిధంగా లక్ష్మణుని ఆజ్ఞాపిస్తాడు రాముడు. వారు రామునితో "నీ అవతార సమాప్తికి సమయమాసన్నమయినది. నీశరీరమును వదలి నీలోకమునకు రమ్మని" చెబుతారు. ఇంతలో విశ్వామిత్రుడు వచ్చి లక్ష్మణునితో "తక్షణమే రాముని చూడాలి. నీవు వెళ్ళీ ఆయనతో నేను వచ్చానని చెప్పు" అంటాడు. లక్ష్మణునికి కూడా లోపలికి వెళ్ళే అనుజ్ఞలేదు. విశ్వామిత్రుడు కోపముతో "నీవు వెళ్ళకపోతే అయోధ్యను భస్మంచేస్తాను" అని హెచ్చరిస్తాడు. అప్పుడు లక్ష్మణుడు తనఒక్కడికే మరణ శిక్ష పడుతుందనే ఉద్దేశ్యంతో లోనికి వెళ్ళీ రామునికి విశ్వామిత్రుని రాకను తెలియ చేస్తాడు. అప్పటికి వసిష్ఠుడు, బ్రహ్మదేవుడు వచ్చినపని అయిపోయింది. వారు గది బయటకు వస్తున్నారు. లక్ష్మణుడు రామునితొ తనకు శిరచ్చేదంచేయమని అడుగుతాడు. రాముడు బ్రహ్మ వసిష్ఠులు వచ్చినపని అయింది. నిన్ను శిక్షింపవలసిన పనిలేదు అంటాడు. కాని నన్ను శిక్షింపవలసినదే లేకపోతే నీధర్మ పాలన వ్రతానికి ఆటంకం కలుగుతుంది. సీతనే శిక్షించిన నీవు నన్నూ శిక్షింపవలసినదే. నీ ఆజ్ఞగా భావించి నేను ఈలోకాన్ని విడిచిపెడుతున్నాను. అని సరయూనదిలోనికి వెళ్ళిపోతాడు. రాముడుకూడా మంత్రులతో చెప్పి సరయూప్రవేశం చేసి దివ్యదేహంతో తనలోకానికి వెళ్ళిపోతాడు.
ఈ సమయానికి రసాతలంలో హనుమకు నాగరాజు దర్శనమౌతుంది. "ఎవరివి? ఇక్కడకు ఎందుకువచ్చావు?" అని అడిగిఏ - నేను రామబంటు హనుమంతుడను. - అని బిలంలో పడిన ఉంగరంగురించిచెబుతాడు. నాగరాజు ఆజ్ఞపై సేవకులు వేయి ఉంగరాలున్న ఒక పాత్రను తెస్తారు. నీ రాజు పాత్ర భూమిపై ముగిసింది. రామలక్ష్మణులు భూలోకం వదిలారు ముందు ఎన్నో కల్పాలు, మన్వంతరాలు, మహాయుగాలు గడిచాయి. ప్రతి త్రేతాయుగంలోనూ రాముడున్నాడు. నీకు కావలసినది ఏ రాముని ఉంగరం? అది వీటిలో గుర్తింపగలవా? అని అడుగుతాడు. "నీ ప్రభువు అయోధ్యా వాసం అయిపోయింది. ఆయన అక్కడలేడు" అని చెబుతాడు.
ఈ కథ ఈ సందర్భంలో చెబుతారు. ఎందరో రాములు, ప్రతి రామునికి ఒక రామాయణం. అని తెలుస్తున్నది. దీనికి అనుబంధంగా రెండు రామాయణాలు - వాల్మీకి, కంబన్, ఇద్దరు అహల్యలు అని రెండు రామాయణాల్లో అహల్యావృత్తాంతంలోని తేడాలు చూపిస్తాడు.
రామానుజన్ వ్యాసం ఈ క్రింది గ్రంథంలో దొరుకుతుంది. R ic h m a n , P a u la (ed.). Many Ramayanas: The Diversity of a Narrative Tradition in South Asia. Berkeley & Los Angeles: University of California Press, 1991 ఈ వ్యాసం ఢిల్లి యూనివర్సిటిలో పెద్ద వివాదానికి దారితీసింది. మేధావులు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు కూడా పరిశోధన ముసుగులో చేసే మత యుద్ధం (క్రూసేడ్) చాయలు తరువాత పోస్టులో. ఈ పరిశొధనల వెనుక ఆంతర్యం ఒకటే మన దేశంపై .Globalisation పేరుతో పశ్చిమసంస్కృతి, క్రైస్తవ మతాల దాడి. రామాయణాలన్నీ fictional works అని నిరూపించడం.


వర్ణం, కులం, సామాజిక వర్గం, జాతి, Class, Caste, Tribe, Race, Community, Religion … భారతీయ సమాజం
10
కులం కులాంతరం వర్ణ సంకరం
కర్ణుని కులమేమిటి? కృష్ణుని యాదవ వంశాన్ని తమ పురు (కురు, భరత) వంశం కంటె తక్కువదని దుర్యోధనుడు ఎందుకు అధిక్షేపిస్తాడు? వర్ణాలు గుణకర్మల మీద, కులాలు వృత్తులపైన, జాతులు సమూహాల పైన ఆధారపడి వచ్చిన తరగతిభేదాలని చూచాము. ఎన్టీఆర్ తన దాన వీర శూరకర్ణ చిత్రంలో కర్ణునిది తక్కువ కులమని (BC), ఏకలవ్యునిది తక్కువ జాతి (tribal, ST, dalit) అని ద్రోణాచార్యుని బ్రాహ్మణిజం (అంటే ఏమిటొనాకు తెలియదు) కారణం వలన కుల వివక్ష జరిగి వాళిద్దరు అణచివేయబడ్డారని ప్రతిపాదిస్తాడు.
వర్ణాలు ఉన్నాయి కాని వర్ణాంతర వివాహాలు ఎప్పుడూ ఉన్నాయి. కర్ణుని సూత పుత్రుడు అంటారు. ఒక సూతుడు గంగలో కుంతిచేత వదలివేయబడిన కర్ణుని పెంచుకుంటాడు. సూత శబ్దానికి అర్థమేది? क्षत्रियाद्विप्रकन्यायां सूतो भवति जातितः విప్రకన్యకు క్షత్రియునివలన పుట్టినవాడు The son of a Kshatriya by a woman of the Brâhmaṇa caste (his business being that of a charioteer); ఇది విలోమ వివాహం. అనులోమ ఎప్పుడూ ఒప్పుకున్నారు. ( ఉదా: వేయిపడగలులో రామేశ్వర శాస్త్రి.) బ్రాహ్మణులు నాలుగు వర్ణాల నుండి, క్షత్రియుడు మూడు వర్ణాల నుండి, వైశ్యుడు రెండు వర్ణాల నుండి, శూద్రుడు తన వర్ణం నుండి స్త్రీలను వివాహం చేసుకోవచ్చు. పిల్లలకు తల్లి కులమే వస్తుంది. కాని ఆమధ్య సుప్రీం కోర్టు ఒక దళిత మహిళకేసులో బిడ్డకు ఒక ఉన్నతకులాని చెందిన తండి కులమే వస్తుందని తీర్పు నిచ్చింది. కేరళలో నంబూద్రి బ్రాహ్మణ, నాయరు కులాల మధ్య సంబంధం ఇదే. మొన్న రోహిత్ వేముల కేసులో ఈ సమస్యే వచ్చింది.
సూతులకు ఉపనయన సంస్కారం ఉన్నది. రాజ్యాధికారం కూడా ఉన్నది. క్షత్రియులతో వివాహ సంబంధాలుకూడా ఉన్నాయి. విరాట్రాజు భార్య ఉత్తర తల్లి సుధేష్ణ సూత స్త్రీయే. ద్రౌపది కీచకుడిని సూతపుత్ర అని సంబోధిస్తుంది. అందుకే దుర్యోధనుడు కర్ణునికి అంగ రాజ్యాభిషేకంచేస్తే వర్ణ ప్రసక్తి రాలేదు. పాండవుల తల్లి కుంతీదేవి యాదవ కన్య. కురు వంశీయులు, యదు వంశీయులు చంద్రవంశీయులే. కాని యదువు యయాతికి బ్రాహ్మణ భార్య దేవయాని యందు, పురుడు క్షత్రియభార్య శర్మిష్ఠ యందు జన్మించారు. అందుచేత కృష్ణుని మూల పురుషుడు సూతుడే. కృష్ణుడు పార్థ సారథియై కులధర్మం పాటించాడు. ఆయన ది సూతకులం, క్షత్రియ వర్ణం అంతే కాదు, భీష్ముడు కృష్ణుని సుబ్రహ్మణ్య అని సంబోధిస్తాడు. కర్ణుడి ముగ్గురుభార్యలలో ఇద్దరు క్షత్రియులే. వాళ్ళ పేర్లు తెలుసా? వృషాలి, సుప్రియ, ఊర్వి. పశ్చిమ భారతంలో ఈ పేర్లు ధరిస్తారు.
ఏకలవ్యుడు నిషాద రాజు హిరణ్యధన్వుని కుమారుడు. భీముడు హిడింబను వివాహముచేసుకోవడానికి అడ్డం రాని జాతిభేదం ద్రోణుని కి రాలేదు. కేవలం అర్జునుని మించిన విలుకాడు ఉండడని తన శపధం నేపథ్యంలోనే బొటనవేలు గురుదక్షిణగా అడుగుతాడు. ద్రోణుడు, అశ్వత్థామ దుర్యోధనునికి సేవకవృత్తిలో ఉండి స్వధర్మం మరచిపాయిన నామ మాత్ర బ్రాహ్మణులు.
రామాయణ భారతాల నూతన అనుసృజనలు, విమర్శలు ఆ నాటికాలాన్ని, ఆనాటిధర్మాలను మరచిపోయి ప్రస్తుత విలువలతో శిక్షాస్మృతితో మూల్యాంకనం చేస్తున్నారు. మనం రామాయణ భారతాలు ఎలా చదవాలి? నేను ౘాలా కాలం క్రితం on the meaning of the Mahabharata అని ఒక అద్బుతమైన పుస్తకం చదివాను. 1942 లో బొంబాయి విశ్వవిద్యాలయంలో వి. ఎస్. సుక్తాంకర్ ఇచ్చిన 4 ఉపన్యాసాల సంకలనం ఇది. ఆయన భండార్కర్ ఇన్స్టీట్యూట్ తరఫున Critical Edition of Mahabharata సంపాదకుడు. ఆయన రచన రామాయణానికి అన్వయిస్తుంది. ఆయన సూచన ప్రకారం ఇవి three planes - mundane, ethical, and metaphysical లో చదివి అర్థం ఛెసుకోవాలి. తెలుగులో చెప్పాలంటే ఆధిభౌతిక ఆధ్యాత్మిక ఆధిదైవిక పరిమాణాలలో అన్వయంచేసుకోవాలి


వర్ణం, కులం, సామాజిక వర్గం, జాతి, Class, Caste, Tribe, Race, Community, Religion … భారతీయ సమాజం
11
వర్ణం, కులం, వర్గం, జాతి, సమాజం ఇవన్నీ సంస్కృత పదాలే. ఇందులో వర్ణం వర్గం భాషకు, వాక్కుకు సంబంధించిన పదాలు. వర్ణం అక్షరం అనే పదాలకు అర్థాలు వేరు. ప్రతి వర్ణం ఒక ప్రత్యేక శబ్దాన్ని సూచిస్తుంది. కులం, జాతి, సమాజం సమూహాలను సూచించే పదాలు. సంస్కృతానికి వర్ణాలు 50. ప్రాకృతానికి 40, (అచ్చ) తెలుగుకి 36. పోలికకు ఇంగ్లీషుకు (జనరల్ అమెరికన్ ఇంగ్లీషుకు) 44. ఇవన్నీ పరస్పర సంబంధాలు కలవే. వర్ణాలకు మూలం మహేశ్వరుడు. పాణిని మహేశ్వర సూత్రాలు వర్ణాలని సూచిస్తాయి. (అ,ఇ, ఉ, ణ్), ( ఋ, ఌ, క్) మొదలైనవి. నటరాజు నృత్తావసాన సమయంలో వినిపించి సిద్ధులచే సేకరింపబడినవి. అ నుండి చ్ వరకు గలవి అచ్చులు , హ నుండి ల్ వరకు గలవి హల్లులు. సంస్కృత , ప్రాకృత, తెలుగు భాషలను వ్రాయడానికి ఉద్దేశించినది తెలుగు లిపి. ప్రతి శబ్దానికి ఒక అక్షరం. అ నుండి క్ష వరకు ఉన్నవి అక్షరాలు. అచ్చుల తరువాత ఉన్నవి, ఐదేసి అక్షరాల వర్గాలు. కవర్గము అంటే క నుండి ఙ వరకు ఉన్నవి. తెలుగులో చ వర్గంలో 7 అక్షరాలు ఉండేవి ౘ, ౙలతో కలిపి. ఒకో వర్గానికి ఒకొక ఉత్పత్తి స్థానము ఉంటుంది. క కంఠం వద్ద ప పెదవుల వద్ద ఉత్పత్తి అవుతాయి.
వర్ణం అంటే రంగు. ఇక్కడ ఒక కాంతి కిరణాన్ని ప్రిస్మ్ లో పంపిస్తే VIBGYOR రంగులు వస్తాయి. అలాగే గుణకర్మల బట్టిచేసిన విభజన వర్ణాశ్రమ ధర్మాలు. దీనిలో లోపం ఏమీలేదు. వర్ణ వ్యవస్థ అనేది భారతదేశంలో లేదు. కుల వ్యవస్థ కూడా లేదు. ఉన్నది కుల విభజన మాత్రమే. వ్యవస్థ అంటే System, విభజన అంటే Division,Classification. వర్ణం వ్యక్తి సంబంధం. జాతి సంబంధం కాదు. బ్రాహ్మణులు కాదు, నిర్వచింపబడినది బ్రాహ్మణత్వం. ఇదే వజ్ర సూచికోపనిషత్తయినా, భారతంలో యక్షప్రశ్నలైనా, గీతాశ్లోకమైనా. కుల వ్యవస్థ నశించాలి, కూలద్రోయాలి అనే నినాదాలకు అర్థంలేదు. వ్యవస్థ లేదు కనుక, ఉన్నది multi lane high way, where yellow lines are constantly crossed.
కులం, కులాంతరం, మతం, మతాంతరం, వర్ణ సంకరం
మన నాయకుల, మేధావుల ఉపన్యాసాలు వింటే --- "కుల మతాలకు అతీతంగా" "లౌకిక ప్రజాస్వామిక దేశం" "కుల గజ్జి - మత పిచ్చి" వీటి మధ్య కట్టుకున్న గోడలు, కులం వెనకబాటుతనం వంటి స్లోగన్స్, కులాల గోడలు పగలగొట్టి తెలుగు జాతిని ఏకం చేద్దాం వంటి ప్రిస్క్రిప్షనులు --- వినబడుతూ ఉంటాయి, ఒకప్పుడు కాపు జాతి, కాపుల వెనకబాటుతనం, kamma hegemony, రెడ్డి రాజ్యాలు నాడూ నేడు, ఇవన్నీ ఇప్పుడు సమాజపు వివరాలు కావు కేవలం రాజకీయ పరిభాషలు. కాని సమాజంలో చూస్తూంటే కులాంతర, మతాంతర, దేశాంతర వివాహాలు ఎక్కువగా జరుగుతూనే ఉన్నాయి. గత 5 సంవత్సరాలలో మా సహోద్యోగుల శుభలేఖలలో 60శాతం అన్య భాష, అన్య కులం, అన్య ప్రాంతం, అన్య దేశం వివాహాలే ఉంటున్నాయి. మానవ సమూహాల మధ్య గోడలు, తడికలు కూడా లేవు. కేవలం రోడ్డు మధ్యలోని పసుపు గీత ఒక్కటే ఉంది. ఈ మధ్య మా బంధుకోటిలోనే విదేశీ క్రైస్తవ కోడళ్ళు, అల్లుళ్ళూ, రెడ్డి, కమ్మ ఇతర కులాల కోడళ్ళూ అల్లుళ్ళూ కనబడుతున్నారు. తల్లి దండ్రులు సర్దుకుపోయి సంప్రదాయం గా కనుపింఛే Wedding ceremony మాత్రం కానిచ్చి తృప్తి పడుతున్నారు. ఇక విడాకులు కూడా అబ్బురం కలిగించటం లేదు. ఈ మధ్య మిత్రులు ఆచార్య వేము భీమశంకరం గారి పద్యం చూచాను.
అంటరానితనము వెంటనే మాన్పింప
వలె నటంచు చెప్పు ప్రజల యందు
వారి వియ్యమందు వారెందరున్నారు?
విమల సుగుణధామ వేము భీమ
ఇది కొంచెం సంప్రదాయ ఆలోచన . ఫూర్వం అయితే వియ్యమందడం, ఇప్పుడు పెళ్ళి ఇద్దరు వ్యక్తుల తాత్కాలిక ఒడంబడికగా కనుపిస్తుంది. ఇక్కడ ఇతర విషయాలు నిరుపయోగాలు. వివాహం జాతి విషయం కాదు. ఇద్దరి వ్యక్తిగత విషయం
వివాహాలు 4 రకాలు - (మా అమ్మాయి విశ్లేషణ) self-arranged marriages (often called love marriages), self-arranged marriages with family consent, marriages arranged by parents with consent of prospective bride and groom and నాలుగవది - తాంబూలాలిచ్చేశాను. తన్నుకు చావండి – వెరైటీ After all family is the basic unit of a society made up of a couple Categories 2 and 3 appear more stable, wider intelligence collection అనిపిస్తుంది.
కన్యా వరయతే రూపం మాతా విత్తం పితా శ్రుతం
బాంధవా కులమిచ్చంతి మిష్టాన్న మితరే జనాః
ఇంగ్లీషులో Marriages are made in heaven అని ఒక లోకోక్తి ఉంది. దీనికి ఒక లాయరుగారు తనదైన శైలిలో కొన్ని వాక్యాలు జోడించాడు. But divorces are made right here on earth. For uncontested divorce fee Rs 1000 only. మన వివాహాలలో అగ్ని ఇతర దేవతల పర్యవేక్షణ ఉన్నది. సామాన్యంగా శివ కల్యాణమో సీతా రామ కల్యాణమో గుర్తుచేసే శ్లోకాలు శుభలేఖలో వేసుకుంటాము. ఆచార్య భీమశంకరం గారు తమ మనుమరాలి వివాహ శుభలేఖలో జత పరచిన జానక్యాః కమలామలాంజలిపుటేయ.. శ్లోకానికి వారు కూర్చిన భావానువాదం మీకోసం




No comments:

Post a Comment