Monday, 4 July 2016

చకార కుక్షి


  • చకార కుక్షి

    https://cherukuramamohan.blogspot.com/2016/07/blog-post_67.html

  • భోజరాజు ఆస్థాన కవిపండిత మూర్ధన్యుడైన కాళీదాసునకు కాశీ పట్టణమున

    జరిగిన ఈ ఉదంతమును చదవండి.

    కవికులగురువుగా గణుతికెక్కిన  సంస్కృత మహాపండితుడు మహాకవి

    కాళిదాసు.

    సంస్కృతములో అజరామరమైన రఘువంశము కుమార సంభవము , మేఘ

    సందేశము వంటి కావ్యములు మరియు అభిజ్ఞాన శాకుంతలము, మాళవికాగ్ని

    మిత్రము, విక్రమోర్వశీయము  వంటి నాటకము లు వ్రాసిన మహాను భావుడు.

    ఒక సందర్భంలో కాళిదాసు కాశీకి పోతాడు. ఎందుకు ఎప్పుడు ఎవరితో అన్న

    ప్రశ్నలు దయతో వేయవద్దు. చాటువులలో ఆ వివరాలు నేనెక్కడా

    గుర్తించలేదు. కాళిదాసు కాజోలు (ప్రసిద్ధ హిందీ నటి) కాయస్త

    వంశజులటనే అని ఒక పాఠకుడు అడిగినాడు. నా ఉద్దేశ్యములో

    వారిని  కలుపుచున్నది ఏకై''బంధమే. చాటువులు చదివేటపుడు చరిత్రలోకి

    దయతో పొవద్దు. ఆయన చరిత్రను గూర్చి మరొకసారి ఎప్పుడైనా

    ముచ్చటించుకొందాము.

    మహాభారత రచయిత అయినవేదవ్యాసుని విగ్రహం చూసి, ఆ విగ్రహము

    బొడ్డులో వ్రేలు పెట్టి, ఈయన "చకార కుక్షి" అని ప్రక్కవ్యక్తితో హేళనగా

    అన్నాడట మన కాళీదాసు. అంటే పొట్ట (కుక్షి) నిండా ''కారములున్నవాడు

    అని అర్ధం. వ్యాసులవారికి కోపము వచ్చింది, దానితో కాళీదాసు వ్రేలు

    వ్యాసవిగ్రహపు బొబొడ్డులోనే ఇరుక్కుపోయింది.

    దీనికి కారణం ఒకటుంది.

    మహాభారతం వ్యాసుల వారు చెబుతూ వుంటే వినాయకుడు వ్రాయడానికి

    ఒప్పుకొంటాడు. అయితే వినాయకుడువ్యాసునికి   ఆపకుండా చెప్పాలని ఒక

    షరతు పెడతాడు. వ్యాసుడు తెలివిగా క్లిష్టమైన సమాసాలతో శ్లోకాలు చెప్పడం

    మొదలు పెడతాడు.  అవి అర్థం చేసుకోవడానికి వినాయకుడు స్వల్ప వ్యవధి

    తీసుకొనేవాడు. వానిని వ్యాస ఘట్టములు అంటారు. ఆ కాస్త సమయాన్ని

    వ్యాసుడు తరువాత శ్లోకం తయారు చేసుకోవడానికి

    ఉపయోగించుకునేవాడు.

    వినాయకుని వేగమునకు సరిదీటుగా శ్లోకములను చెప్పుటకు గానూ

    వ్యాసులవారు 'చ కారములను ఎక్కువగానేవాడవలసి వచ్చేది. వారి వేగము

    మనము ఊహించుకోలేము. అందుకే మహా పండితుడైనకాళిదాసు ఆయనను

    చకార కుక్షి అని ఆక్షేపిస్తాడు.  దానికి కోపమొచ్చిన వ్యాసుడు కాళిదాసును

    ఒక్క చకారం కూడ లేకుండా ద్రౌపదికి, పాండవులకు గల

    బాంధవ్యాన్నిశ్లోకరూపములో చెబితే గాని వ్రేలు వదలనని చెబుతాడు.

    "రక్షించినారు స్వామీ!" అని కాళిదాసు ఈ దిగువశ్లోకము చెబుతాడు.

    ద్రౌపత్యా పాండుతనయాః పతిదేవరభావుకాః

    నదేవరో ధర్మరాజః సహదేవో నభావుకః

    ధర్మరాజు మరిది కాడు, సహదేవుడు బావ కాడు అని

    ఒక్క 'చకారం' వాడకుండా ఈ చమత్కార శ్లోకము చెప్పినాడు

    కాళీదాసు.  వ్యాసుడు సంతసిల్లి కాళీదాసును దీవించి పంపుతాడు.

    మనము కాళిదాసు దండి భారవిని గూర్చి ఎంతో గొప్పగా చెప్పుకొన్నాము

    చెప్పుకొంటూ వుంటాము . అసలు ఈ శ్లోకము చూడండి.

    ఉపమా కాళిదాసస్య భారవే అర్థ గౌరవహ:

    దండిన్యా పద లాలిత్యం మాఘై సంతి త్రయో గుణః

    మాఘ కవి శిశుపాలవధ అన్న ఒక్క కావ్యమే వ్రాసినది. మిగతవి ఏవయినా

    వ్రాసినాడేమో నాకు తెలియదు.  కాళీదాసు ఉపమాలంకారములు, భారవి

    యొక్క అర్థ గౌరవము, దండి యొక్క పదలాలిత్యము ఆ కావ్యమునకు

    సొంతమట. ఆయనెంత గొప్పవాడో చూడండి. అంతంత పౌరాణిక చారిత్రిక

    పురుషులు నడయాడిన నడయాడిన ప్రాంతము కాశి.

No comments:

Post a Comment