1. శంకరభగవత్పాదుల వారు కొన్ని పుణ్య క్షేత్రాలను పునరుత్థానం చేసారట. దాని గురించి చెబుతారా
ఆయన పునరుద్ధరించినవి శ్రీ చక్రములు ప్రతిష్ఠించినవి లెక్కకు మిక్కుటములు, అన్నీ చెప్పుటకు గంట చాలదు. ముఖ్యమైనవి మాత్రము ముచ్చటిస్తాను.
అమ్మా! తన నిరంతర ప్రయాణములలో బదరికాశ్రమము చేరి అచ్చట తన గురువులు గోవింద భగవత్పాదుల వారిని వారి గురువు గౌడ పాదుల వారిని దర్శించుకొని వారి అనుమతి బడసి కైలాసము వెడలినారు శంకరులవారు. ఆయన అమ్మవారి అనుగ్రహించగా సౌందర్య లహరిని మరియు పరమేశ్వరునిచే మోక్ష లింగ, వరలింగ, భోగలింగ,ముక్తి లింగ, యోగలింగ మను 5 స్ఫటిక లింగములను గ్రహించి ఆయన మారులా తన యాత్ర కొనసాగించినాడు. అమ్మ చె నోసంగబడి వంద శ్లోకములు గలిగిన సౌందర్యలహరిలో 51 శ్లోకములు ప్రమాద వశమున పోగొట్టుకొనుట సంభవించగా ఆయన, ముందుగా చదివిన తన ధారణా చె అవి తిరిగి పూరించి మనకు అంద జేసిన మహనీయుడు.
కేదారమునకు దగ్గర జోషీ మఠములో ముక్తి లింగమును ప్రతిష్ఠించి జ్యోతిషీ మఠమును నెలకొల్పినారు.
నేపాలు లోని నీలకంఠ క్షేత్రమున వరలింగమును ప్రతిష్ఠించినారు. అది నేటికినీ భక్తుల పూజలను అందుకుంటూనే వున్నది.
ఆయన తిరుమల కొండలో స్వామీ కొప్పెర వద్ద ధనాకర్షణ, జనాకర్షణ యంత్రములను వేసినారని చెపూకొనేవారు. దేవాలయ పునరుద్ధరణ సమయమున అది నిరూపింపబడినది.
వృషభాద్రి వరాహాద్రి జ్ఞానాద్రి కనకాచలః
ఆనందాద్రిశ్చ నీలాద్రి స్సుమేరు శిఖరాచలః
ఈ శ్లోకములోని 7 పర్వతముల పేర్లు గమనించితే మనకు వెంకటాద్రి శేషాద్రి పేర్లు కనిపించవు.
అంజనాద్రిః వృషాద్రిశ్చ శేషాద్రిః గరుడాచలః
తీర్థాద్రిః శ్రీనివాసాద్రిః చింతామణి గిరిస్థతాః
ఇది ఇంకొక శ్లోకము ఇందులో వెంకటాద్రి కనిపించదు.
రెడింటిలోనూ వృషము అన్న మాట వుంది. వృషము అన్న మాటకు వృషభము అని అర్థము వున్నది వృషభ వాహనుడు శివుడు. పైగా శంకరుల కాలమునకు అసలు దుర్గమమైన నలమా తప్ప అంటే దుర్గమ మగు అటవీ పర్వత ప్రాంతము తప్ప వేరేమీ లేదు. ఆ స్వయంభూ విగ్రహము సకల అధిదేవతా స్వరూపము. 11 వ శతాబ్దములో రామానుజా చార్యుల వారు వచ్చిన పిదపనే తిరుమల తిరుపతి అన్న పేర్లు ఆయా ప్రాంతములకు పెట్టుట జరిగింది. శంకరుల కాలమునకు ఈ పేర్లు లేవు అనిచేప్పుటకు నేను ఈ విషయము చెప్పవలసి వచ్చినది. అప్పుడు దాదాపు ఒక 1500 సంవత్సరములకు పూర్వము మాత్రమే దిగువ తిరుపతి 'కొత్తూరు' గా పిలువ బడేది. రామానుజులవారు వానికి తిరుపతి తిరుమల అన్న నామకరణము చేయుట జరిగినది.
తరువాత భోగలింగమును శృంగేరిలోనూ, మోక్ష లింగమును చిదంబరము లోనూ, యోగ లింగమును కంచిలోనూ ప్రతిష్టించుట జరిగినది.
ఇక ఆయన పునరుద్ధరించిన దేవాలయములను గూర్చి చెప్పుకోనుటకు మన సమయము చాలదు. బదరి కేదారముల ఆలయములు కూడా ఆయన పునరుద్ధరించినవే. పురాణ ప్రసిద్ధములైన పుష్పగిరి మొదలైన పుణ్య క్షేత్రములను దర్శించుతయే కాక లెక్కకు మిక్కుటములైన క్షేత్రములను అయన పునః ప్రతిష్ఠిం చినాడు. కంచిలో అమ్మవారి భీకరత్వమును శాంతింపజేయుటయేగాక అప్పటి రాజుతో అమ్మవారికి వూరికి మధ్యలో ఆలయును ఏర్పాటు చేయించి పూజలు అందుకునే విధముగానూ పట్టణమును కాపాడే విధముగానూ ఏర్పాటు చేసినారు. త్యాగరాజ, శ్యామా శాస్త్రి, ముత్తుస్వామి దీక్షితుల పుట్టిన వూరయిన తిరువారూరులోని శివునకు బలులు ఇచ్చుట మాన్పింప జేసినారు. మాన్గాడు అన్న అమ్మవారి పుణ్యక్షేత్రములో అర్థ మేరువుతో శ్రీ చక్రమును ప్రతిష్ఠ చేసి అక్కడి నిరనతర యజ్న గుండములోని వేడిమిని ఉపశమింపజేసినారు. ఇట్లు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెనో అమ్మా!
2.శంకరులు కాశ్మీర దేశంలో స్థాపించిన శారదా క్షేత్రం ప్రస్తుతం ఎక్కడ ఉంది ?
కాశ్మీరు ఆక్రమిత ప్రాంతములో వుంది.
3 . శంకరాచార్యుల సాహిత్యం గురించి చెప్పండి.
శంకరాచార్యుల వారు వాడిన ఛందస్సు వృత్తాలు, వేరెవరూ వాడలేదు అంటారు. దీని గురించి చెప్పండి.
శంకరాచార్యులు సుమారుగా ఇరవై రకములైన పద్యములను
ఉపయోగించినారన్నది నేను విన్న విషయము.
ఉపయోగించినారన్నది నేను విన్న విషయము.
సంస్కృతములో ఇంద్రవజ్ర, ఉపేంద్రవజ్రలను కవల పిల్ల లనవచ్చును. ఇదే
విధముగా వంశస్థ-ఇంద్రవంశలు కూడ. ఇంద్రవజ్రకు గణములు- త-త-జ-
గ-గ, ఉపేంద్రవజ్రకు గణములు- జ-త-జ-గ-గ. ఇంద్రవజ్రలో మొదటి
అక్షరము దీర్ఘము, ఉపేంద్రవజ్రలో అది హ్రస్వము. ఈ రెంటికి తేడా ఇంతే.
రెంటిని కలిపి వాడిన పద్యమును ఉపజాతి యందురు. ఈ మిశ్రణము 14
విధములుగా సాధ్యము. కాళిదాసువంటి మహాకవులు తమ కావ్యములలో
సర్గములనే ఉపజాతిలో వ్రాసినారు. ఆచార్యులు ఉపజాతిని
అర్ధనారీశ్వరస్తోత్రము, ద్వాదశలింగస్తోత్రము, కాశీపంచకము,
కౌపీనపంచకము, శివస్తోత్రము,
సుబ్రహ్మణ్యపంచరత్నము, ఉమామహేశ్వరస్తోత్రము, యతిపంచకములలో
ఉపయోగించినారు.
ఇంద్రవజ్ర
కస్తూరికా
శ్యామల కోమలాంగీం
కాదంబరీపాన మదాలసాంగీం
వామ స్తనా లింగిత రత్నవీణాం
మాతంగ కన్యాం మనసా స్మరామి – త్రిపురసుందరీమానసపూజాస్తోత్రము (18)
కాదంబరీపాన మదాలసాంగీం
వామ స్తనా లింగిత రత్నవీణాం
మాతంగ కన్యాం మనసా స్మరామి – త్రిపురసుందరీమానసపూజాస్తోత్రము (18)
ఉపేంద్రవజ్ర, ఔపచ్ఛందసిక, కవిరాజవిరాజితము
తెలుగులో మనము
కవిరాజవిరాజితము అని పిలిచే వృత్తమునకు హంసగీతి అని కూడ పేరు ఉన్నది. ఈ వృత్తములో
మహిషాసుర మర్దిని స్తోత్రము చాల ప్రసిద్ధమైనది. దీని రచయిత రామకృష్ణకవి అని
చెబుతారు, కాని ఇతనిని గురించిన మరే వివరాలు మనకు
తెలియవు. కొందరు ఇది శంకరాచార్య కృతమని కూడ అంటారు. శంకరులు దీనిని వ్రాసినారో
వ్రాయలేదో మనకు తెలియదు. కాని ఈ వృత్తములో యమునాష్టకములో కూడా ఎనిమిది పద్యములు ఉన్నవి.
క్రింద ఉదాహరణ-
మధువనచారిణి
భాస్కరవాహిని జాహ్నవిసంగిని సింధుసుతే
మధురిపుభూషణి మాధవతోషిణి గోకులభీతివినాశకృతే
జగదఘమోచిని మానసదాయిని కేశవకేలినిదానగతే
జయ యమునే జయ భీతినివారిణి సంకటనాశిని పాలయ మాం – యమునాష్టకము (2)
మధురిపుభూషణి మాధవతోషిణి గోకులభీతివినాశకృతే
జగదఘమోచిని మానసదాయిని కేశవకేలినిదానగతే
జయ యమునే జయ భీతినివారిణి సంకటనాశిని పాలయ మాం – యమునాష్టకము (2)
ద్రుతవిలంబితము
పేరుకు తగ్గట్లు
ఇందులో మొదట ధ్రుత (లఘువులు ఎక్కువ), తరువాత విలంబిత (గురువులతో) గమనములు రెండును గలవు. శివానంద
లహరినుండి ఒక ఉదాహరణ-
సదుపచార
విధీ ష్వను బోధితాం
సవి నయాం సహృదం సదు పాశ్రితాం
మమ సము ద్ధర బుద్ధి మిమాం ప్రభో
వర గుణేన నవోఢ వధూ మివ – శివానందలహరి (78)
సవి నయాం సహృదం సదు పాశ్రితాం
మమ సము ద్ధర బుద్ధి మిమాం ప్రభో
వర గుణేన నవోఢ వధూ మివ – శివానందలహరి (78)
పంచచామరము
పంచచామరము
ఒక అందమైన వృత్తము. పాదమునకు ఎనిమిది ల-గములు గల ఈ వృత్తము తాళయుక్తము, పాడుటకు చక్కగా నుండును.
ఇట్టి శిలాఫలకాన్ని చెక్కుట శంకరులవంటి శిల్పాచార్యకవికి కష్టము కాదు గదా? నర్మదాష్టకము ఈ
ఛందస్సులోనే చెప్పినారాయన.
పుష్పితాగ్ర ,
పృథ్వీ, ప్రహర్షిణి, భుజంగప్రయాతము ఇత్యాది ఎన్నో ఛందోరూపములలో ఆయన కవిత్వము
అలరారుతూ వున్నది.
4. శంకరాచార్యుల శిష్య పరంపరను గురించిన విశేషాలను తెలుపండి.
సదాశివసమార౦భా౦శ౦కరాచార్యమధ్యమామ్
అస్మదాచార్య పర్య౦తా౦ వ౦దే గురు పర౦పరామ్!!
అస్మదాచార్య పర్య౦తా౦ వ౦దే గురు పర౦పరామ్!!
నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం II ...
"నారాయణం, పద్మభువం, వశిష్టం,
శక్తించ తత్ పుత్ర పరాశరంచ, వ్యాసం,
శుకం, గౌడపదం మహాంతం, గోవింద
యోగీంద్ర మధ అస్య
శిష్యం,
శ్రీ శంకరాచార్య, పద్మ పాదంచ,
హస్తా మలకంచ శిష్యం,
తం తోటకం వార్తిక
కార మన్యాన్,
అస్మత్ గురూన్ సంతత
మానతోస్మి''
5. మహావిష్ణువు ఆజ్ఞానుసారం శంకరుల వారు బదరినారాయణ క్షేత్రాన్ని, జ్యోతిర్మఠాన్ని స్థాపించారు కదా, వీటి విశిష్టతను తెలియచేస్తారా ?
అమ్మా నేను మహావిష్ణువు ఆజ్ఞానుసారము జ్యోతిర్మఠము స్థాపించినట్లు వినలేదు. ఆయన 4 దిక్కులలో అద్వైత వేదాంతమును ప్రతిష్ఠించుటకు గానూ ఉత్తరమున దీనిని ఎన్నుకొన్నట్లు మాత్రమే పెద్దల మూలముగా వినియున్నాను. ఇచ్చట రాజరాజేశ్వరి దేవిని ప్రతిష్ఠించి ఆ తల్లి అర్చన చేయు విధానమును వారు ఏర్పరచినారు.
6. కేదార్నాథ్ లో వరదలు వచ్చే ముందు దాకా, 'శంకరాచార్యుల వారి సమాధి' ఉండేది. వారు పరమేశ్వరునిలో నేరుగా లయమైనప్పుడు, సమాధి ఎక్కడి నుంచి వస్తుంది ?
ఇవి అన్నీ ఊహా జనితములే. శంకరులవారు శివసాయుజ్యమును చేరినారంటారు. అసలు కాలడిలో కూడా వారి సమాధి ఉన్నదని అంటారు . అట్లే కంచిలోనూ. మహనీయులను తమ వారిగా చెప్పుకొనుట లోకాచారము కదా అమ్మా!
7. నేటితరం వారు శంకరాచార్యుల వారి బోధనల నుంచి తప్పక పాటించాల్సినది ఏమిటి ? యువతకు మీరిచ్చే సందేశం ఏమిటి ?
అమ్మా ఇది తరము తో కాదు నిరంతరమునకు సంబంధించినది.
జీవాత్మ పరమాత్మ ఒకటే. మనము చేప్రతిపనికి మన ఆత్మే సాక్షి. దానికి నీ సంజాయిషీ నచ్చితే నీ ధర్మమూ నీవు నేరవేర్చినట్లే.
ఏ రూపమున నీవు పరమాత్ముని పూజించిన అది చెందేది ఒకనికే!
జ్ఞానము మోక్షమునకు మూలము . అచంచల భక్తి , పరతత్వానురక్తి, తాపత్రయ విముక్తి పరమేశ్వరుని సాధనకు మూల సూత్రములు. మనోవాక్కాయకర్మలను సంఘటితము చేసి ప్రతిఫలాపేక్ష లేకుండా చేసే ప్రతిపనీ భగవంతుని సన్నిహితము చేస్తుంది అన్న విషయములు టూకీగా నేను గ్రహించినది.
1. జీవేశ్వర భిన్న రూపము -- ఇది అద్దము ప్రతిబింబము వంటిది. బింబము నిజము ప్రతిబింబము అబద్ధము.
2. ఆత్మా నిష్టం కర్తృగుణం -- స్పటిక లోహిత దర్శనం . కర్తృగుణం నిజానికి జేవు౮నికి సహజంగా లేదు. ఈ శరీరము మూలముగానే అవి జీవునిపై ఆరోపింప బడుతున్నాయి. స్పటికము మరియు మంకెన పువ్వు లేక మందారపు పువ్వు సామ్యము.
3. శరీర త్రయ సంయుక్తో జీవస్సంగీ త్రుతీయకః . శరీరములు మూడు. స్థూల సూక్ష్మ కారణ శరీరములు. ఈ మూడు శరీరాలకు అతీతుడు జీవుడు. వీటితో జీవుని కలయిక బియ్యము నువ్వులు కలయుట వంటిది. దీనికి ఘట మఠాకాశ దృష్టాంతరమును ఉదాహరించుతారు ఆచార్యుల వారు. ఇవి అన్నే అన్నపూర్ణోపనిషత్తు లోనివే . మఠము లో ఘటము
No comments:
Post a Comment