శృంగార గంగా ప్రవాహం
శృంగారం గంగా ప్రవాహం వంటిది . యెటువైపుదిగినా యెటుమునిగినా ఒక్కటే ! అంటాడు తెనాలి రామకృష్ణ కవి. అసలెందుకీ ప్రసక్తి వచ్చింది? యేమి కథా కమా మీషు అని తెలుసుకోవాలనిఉందా? అయితే చిత్తగించండి!
మ: వర బింబాధరమున్, పయోధరముల్ ,వక్రాలకంబుల్ , మనో
హర లోలాక్షులుఁ జూపక,యవ్వలి మొగంబైనంత నేమాయె, నీ
యురు భాస్వత్ జఘనంబు, క్రొమ్ముడియు ,మాకుంజాలవే! గంగ క
ద్దరి మే లిద్దరి కీడునుంగలదె? యుద్యద్రాజ బింబాననా!
హర లోలాక్షులుఁ జూపక,యవ్వలి మొగంబైనంత నేమాయె, నీ
యురు భాస్వత్ జఘనంబు, క్రొమ్ముడియు ,మాకుంజాలవే! గంగ క
ద్దరి మే లిద్దరి కీడునుంగలదె? యుద్యద్రాజ బింబాననా!
అర్ధం;- ఉద్యత్ రాజబింబాననా! చంద్రునితో సమముగా ప్రకాశించు మోముగలదానా! ; వరబింబాధరమున్-చక్కని దొండపండువంటి పెదవియు; పయోధరముల్-స్తనములు; వక్రాలకంబుల్-వంకరలుదిరిగిన ముంగురులును; మనోహర-అందమైన; లోలాక్షులు-చంచలమైన కన్నులు(చూపులు) జూపక-మాకుకనబడనీయక; అవ్వలిమొగంబైన-మొగమటుతిప్పియుండుటవలన- నేమాయె?-యేమితక్కువయగును? నీ-నీయొక్క;ఉరు-విశాలమై; భాస్వత్-ప్రకాశించు;జఘనంబు-పిరుదులు;క్రొమ్ముడియు- కేశపాశమును;మాకున్ జాలవే- మాకు సరిపోవా?(మాకివేచాలులెమ్మనిచెప్పుట) గంగకు-గంగాప్రవాహమునకు; అద్దరి-ఆవలియొడ్డు; మేలు-తగును; ఇద్దరి-యీవలియొడ్డు;కీడునుంగలదే;- అపకారము గల్గుటయు ;కలదే-కలదా?
మేము నీసమాగమ మాసించి వస్తే కోపంతో అటుతిరిగి పడుకున్నావు. దొండపండులాంటి నీపెదవి, పూలచండ్లవంటి నీపయోధరాలు, గుంగురులైన నీముంగురులు , మనోహారులగు నీబిత్తరి చూపులు మాకు దక్కరాదనియా? ఈపన్నాగము. అయినా మాకేంతక్కువ! విశాలమైన నీపిరుదులు ,వెనుకకు వ్లాలుచున్న నీ జుట్టుముడియు మాకు చాలవనుకుంటివా? గంగలో మునుగుట కెటైన నేమి ఆదరియైననూ, యీదరియైననూ యొకటేగదా! అటుమేలు, యిటుకీడుగల్గునా? అట్లే శృంగారమునకుగూడ ముందైనా, వెనుకయినా యొక్కటే! యటునుండియే ప్రారంభింతును.
అని దీని యభిప్రాయము;
ఈపద్యం చిన్నాదేవి యలిగి నప్పుడు రాయల వారే స్వయంగా చెప్పారని యొక కథనం,కాదు తెనాలి రామకృష్ణకవి తాతా చార్యులపై పగతో వారియుంపుడుగత్తె కడకు మారువేషమున బోయినవేళ నామెవిలాసముగా నటువైపు తిరిగి పరుండ, నామెననున యించుచు తెనాలివారే యీపద్యమును చాటువుగా చెప్పినారని మరోకథనం.
No comments:
Post a Comment