Monday, 4 July 2016

ఈ సమీర మీ సిరి వెన్నెల ......

ఈ సమీర మీ సిరి వెన్నెల ......

ఈ సమీరమీ సిరి వెన్నెల
ఈ రేయి నూయాల లూపెనే
ఆనందమందగ నీయక
నీ తలపు తలుపులు మూసెనే       || ఈ సమీర మీ సిరివెన్నెల ||

ఆ యామిని మృదు గామిని
ప్రియ భామినిని చేరాలని
ఆశించ నీవది కాదని
అన్నావు నీ దయ రాదనీ               || ఈ సమీర మీ సిరివెన్నెల ||

కను లెర్ర బడె నంగారమై
తడియారి పోయెను దాహమై
దరి దారి గానక 'మోహన'
శిలనైతి భూమికి భారమై                 || ఈ సమీర మీ సిరివెన్నెల ||

Suprabha Pavuluri likes this.

No comments:

Post a Comment