Monday, 4 July 2016

భారతీయ శాస్త్ర విజ్ఞానము -- 7

భారతీయ శాస్త్ర విజ్ఞానము -- 7

గగన యానము
నిప్పు లేనిదే పొగరాదు కానీ పొగలేకున్నా నిప్పు వుండవచ్చు.ఈ దృష్టాంతము ఎందుకు చెబుతున్నానంటే హిమాలయము అన్న ఒక పేరును తీసుకొందాము. ఆ పేరు వింటూనే ఇంకా ఆ పర్వతమాలను చూడని శిశువు మనసులో పెద్ద పెద్ద మంచురాళ్ళు కలిగిన అపరిమితమైన ఎత్తుగల ఒక పర్వతమును వూహించుకొంటాడు . ఇక్కడ హిమాలయము వాస్తవము కానీ ఆ శిశువు వూహించిన విధముగా మంచురాళ్ళు వుండవు గానీ మంచు తో కప్పబడిన రాళ్ళు వుంటాయి. అది తాను వెళ్ళి చూసినవెంటనే వాస్తవము గ్రహించగలుగుతాడు.కాబట్టి విమానముల గూర్చి విననిదే విపరీతమైన ఊహలతో మన పూర్వులు భాగవత ,భారత, రామాయణాలలో , పురాణాలలో, శాస్త్రాలలో విమానముల గూర్చిన ప్రస్తాపన తెచ్చియుండరు. అందులోకూడా ఎన్నో విధములైన విమానములను గూర్చి విశధ పరచియుండరు. ఇందులోని నిజానిజాలను పరికించి,పరిశీలించి, పరీక్షించి, పరిశోధించితే వాస్తవము మనకు తెలుస్తుంది. భారతములో ధృతరాష్ట్రుని యొక్క సంతాన వ్యామోహాన్నిగూర్చి మనమెంతో ఈసడించుకొంటాము. కానీ మహాభారతములో ధృతరాష్ట్రుడు తనది తప్పని తెలిసినా తన సుతులపై వ్యామోహము చంపుకోలేక పోతున్నానంటాడు. అదేవిధంగా దుర్యోధనుడు తనకు దాయాది మాత్సర్యము తప్పని తెలిసినా తానది మానుకోలేనని చెబుతాడు. ఈ మాట ఎందుకు చెప్పుకువచ్చినానంటే మన పూర్వులు తప్పో ఒప్పో నిజానికే ప్రాధాన్యమునిచ్చేవారు అని తెలియ బరచుటకు. ఇంకొక విషయము గమనించండి.
ప్రసిద్ధ ఆధునిక గణిత శాస్త్రవేత్త తనచే తెలియబరుపబడిన ఎన్నో గణిత సూత్రములు, నామక్క ల్ నరశింహస్వామి దేవేరి నామగిరి తాయరు (లక్ష్మీ దేవి) తనకు నిద్రావస్థలో తెలిపినవే యని స్వయముగా తెలియబరచినారు.ఆ విషయమును వారి మాటలలోనే చదవండి "While asleep, I had an unusual experience. There was a red screen formed by flowing blood, as it were. I was observing it. Suddenly a hand began to write on the screen. I became all attention. That hand wrote a number of elliptic integrals. They stuck to my mind. As soon as I woke up, I committed them to writing."

అనేకల్ అన్న ఊరికి  చెందిన సుబ్బరాయ శాస్త్రి అన్న ఒక మహా పండితుడు  భరద్వాజుని 'విమాన శాస్త్రాన్ని శ్రీ G.వెకటాచల శర్మ అను పండితునిద్వారా, తాను చెబుతూవుంటే, వ్రాయించినాడు కానీ ఆయన చెబుతూ పొయిన ఆ శాస్త్రము ఏకాలమూకు చెందినదన్న ఆధారము లేదని కొందరు పాశ్చాత్య అనుయాయులు పనికట్టుకొని ప్రచారము చేసినారు. రామానుజన్ గారు చెప్పినది నమ్మక తప్పలేదు ఎందుకంటె అవి గణిత పరముగా సాధింపబడినవి(ఇప్పటికీ సాధింపబడనివి కూడా వున్నాయనుకోండి). వైమానిక శాస్త్రములోని ఇబ్బంది ఏమిటంటే ఈ పాశ్చాత్య వ్యామొహకులకు సంస్కృతము క్షుణ్ణముగా తెలియదు.శాస్త్రములలో తెలిపిన సాంకేతిక పదముల తమ అనువాదమును యదార్థమునకు అనుసంధించుకోలెరు.ఈ సందేహాలన్నీ అందుకే!


అసలు విమానముల ప్రస్తాపన వేదములలోనే వస్తుంది.ఈ విషయము పరిశీలించండి.
యజుర్వేదము, 10:19

ఓ నిపుణవంతుడైన అభియంతా (Engineer)!  శ్రేష్ఠులగు నిపుణులు నడపగల నావలను నిర్మించు. మేఘములు దాటి గగన తలము పై విహరించు విమానముల నిర్మించు.అటు నీటిలోనూ ఇటు గాలిలోను పయనించగల సాధనములను నిర్మించు. అవి మెరుపుల నడుమ కూడా పయనించగల శక్తిని ప్రసాదించు.ఏఏ భగవత్సృష్టిలో మమ్ము కీర్తివర్ధనుల గావించు.
వేదములలో
1. విమాన నిర్మాణ యానముల గూర్చిన ప్రస్తాపన వున్నది.
2. ఆధునిక సాంకెతిక విజ్ఞాన సంబంధిత విషయములెన్నో మనకు వానిలో కనిపించుతాయి.
3. భూమ్యాకాశ యుద్ధముల గూర్చిన వివరణ విశ్లేషణలెన్నో వానిలో అగుపించుతాయి.
4. నేడు మన శాస్త్రజ్ఞులు ప్రయత్నించేఎన్నో అద్భుతమైన ఆశ్చర్యకరమైన మానసిక మరియు తాపసిక   శక్తుల గూర్చిన వివరణలందులో ఎన్నో వున్నాయి.
5.గ్రహానర వాసులు.
6. గ్రహాంతర యానము.
7. గ్రహాంతర యానమునకు తాపసిక,వైజ్ఞానిక శక్తుల వినియోగము.
వంటి ఎన్నో విషయములు మనకు తెలుస్తాయి.

 వ్యాస భాగవతము 3.23.11 నుండి 3.23.41  ఒకసారి పరికించితే తన అర్ధాంగి కోరిక మేరకు ఆకాశ హర్మ్యమును తన తపో బలముతో నిర్మించి    మేరు పర్వతమునందేకాక, వైశ్రంభక,సురాసన,నందన,పుష్పభద్రక,చైత్రరథ్య,మానస సరోవర ప్రాంతములన్నియును విహరించి ఆమెకు తృప్తిని కలిగించి అత్యుత్తమ సంతతిని పొందుతాడు.ఆమెతో గ్రహాంతర, లోకాంతర యానము గావించినాడు. ఆ విమానము యొక్క గుణములేవి యని పరిశీలించుదాము.
భ్రాజిష్ణున విమానేన
కామజ్ఞేన మహీయస
వైమానికాన్ అత్యాసెత్
చరన్ లోకాన్ యధానిలః
 తాను కోరిన దిక్కునకు తన నియంత్రణలోని విమానమును పలు దిశల వీచు గాలివలె ఎన్నో లోకములు అంటే గ్రహములు, భార్యా సమేతుడై తిరిగినాడు.
ఇటువంటి విషయాన్నే త్రిపురాసురుల యందు కూడా గమనించుతాము. ఇక రామాయణమునందలి పుష్పక విమానమును గూర్చి మనకు తెలిసినదే. లంకకు సీతాన్వేషణమునకు వెడలిన  హనుమంతుడు నవరత్న ఖచితమయమైన, ఇది భవనమా అన్నట్లున్న,  పుష్పకమును చూసినట్లు వివరింపబడినది.
వైమానిక శాస్త్రములోని మొదటి ప్రకరణములో తన రచనకు ముందు వున్న, తాను పరిశీలించిన గ్రంధముల పాట్టిక ఇచ్చినారు. అందులోని ముఖ్యమైన కొన్ని ఈ క్రింద ఉటంకించడమైనది.  1. అగస్త్య కృతాశక్తి సూత్రములూ ఈశ్వర(ఎవరన్నది నాకు తెలియదు)'సౌదామిని కలా,భరద్వాజుడే రచించిన అంశుబోధిని,శాక్తాయన్ కృతమగు 'వాయుతత్వ ప్రకరణమూ,నారదకృతమైన వైస్వానర తంత్రము మొదలైనవి.విమాన శాస్త్రమునకు తీక టిప్పణి వ్రాసిన బొధానంద్ గారు ఈ విధముగా తెలిపినారు: 
నిర్మాత్య తద్వేదాంబుధిం భరద్వాజో మహామునిః| 
నవనీతం సముధ్గృత్య యంత్ర సర్వస్వ రూపకం|| 
నానా విమాన వైచిత్ర్య రచనాక్రమ బోధకం|| 
అష్టాధ్యాయౌర్విభజితం శతాధికరణౌర్యుతం|| 
సూత్రిః పంచశతైర్యుక్తం వ్యోమయాన ప్రధానకం
వైమానికాధికరణాత్సర్వం ముక్తంభగవతాత్స్వయం 
'వేద సముద్ర మంథనము చేసి సామాన్య మానవునికి సులభముగా ఉపయుక్తమౌ రీతిన, యంత్రసర్వస్వమన్న వెన్నను అందునుండితీసి అందించినారౌ భరద్వాజులవారు. ఆ గ్రంథమునదలి 40 అధికరణమందున విమాన సంబంధిత విషయ ప్రస్తాపన జరిగినది. ఇది 8 అధ్యాయములుగా విభజింపబడినది.అందులో 100 అధికరణములు,500 శ్లోకములు విమానవిషయ ప్రధానమైనవే!
భారతీయ వైమానుక శాస్త్రమును గూర్చి ప్రాక్పశ్చిమ శాస్త్రజ్ఞులేమన్నారో చూడండి.

Johannes Adrianus Bernardus van Buitenen (21 May 1928 – 21 September 1979) was anIndologist at the University of Chicago where he was the  Professor of Sanskrit in the Department of South Asian Languages and Civilizations. తన mahaa bhaarata Volume--3 లో The Razing of Soubha మరియు  The War of The Yakshas ఈ క్రింది విధముగా రచయిత చేతనే వివరించ బడినది : "The areal city is nothing but an armed camp of flame throwers and thundering canon, no doubt a space ship అందులొనే నివత కవచములు అన్నపదమునకు space suits తప్ప అన్యము కాదని ఆయనే చెప్పినారు. 

It is in the study of creativity that Indian science continues to be relevant .If students had access to authoritative narratives  of Indian Science in the University, they would not pay attention to outlandish claims of ancient flying machines. 

         -- Subhash Kak, Regents Professor of Electrical and Computer Engineering                      at Oklahoma State University and a Vedic Scholar

మనస్పూర్తిగా మనపూర్వులను, వారి సత్య నిష్ఠను, వారి శక్తి సామర్థ్యాలను నమ్ముతున్నాను కాబట్టి నా శక్తికి మించిన ప్రయాసపడి ఈ పూర్వీక వైమానిక జ్ఞానాన్ని గూర్చి మరియు పూర్వుల గొప్పదనమునుగూర్చి నేటి తరానికి తెలియజేయవలెనన్న తపనతో వ్రాస్తున్నాను.సమయము వెచ్చించి చదివేది.విషయము 10 మందికి పంచితే ఏ ఒక్క విశేషజ్ఞుడైనా ఒక అడుగు ముందుకు వేసి పరిశోధించితే మన పూర్వుల జ్ఞాన సంపదనుగూర్చి లొకానికి చాటిన వారవుతారు.
భారతీయ శాస్త్ర విజ్ఞానము -- 8 లో విమాన శాస్త్రాన్ని గూర్చి ఇంకాస్త తెలుసుకొందాము......

No comments:

Post a Comment