Monday, 4 July 2016

కలత మది లోనిది మాసిపోలేనిది .....

కలత మది లోనిది మాసిపోలేనిది .....

కలత మది లోనిది మాసిపోలేనిది .....
ఎందుకో నెందుకో ఆడే నాతో విధి
గతము కరుకైనది రేయి బరువైనది
అందుకే అందుకే నిదుర రాకున్నది         || కలత ||

తారకలు లేని రాకా నభో వీధిలో
జాబిలే లేదు కనిపించ నా పరిధిలో
నాదు తలరాత నేనుంచి విధి చేతిలో
ఆడబడుచుంటి నవలీల తన లీల లో      || కలత ||

పిలుపుకై వేచి నీనుండి నేనుండగా
గాలి రాలేదు నీ పిలుపు నందివ్వగా
తలపులను వేడ పిలిపింపగా మోహనా
వదలి పోమంచు నాతోనే నిలిచెనుగా        || కలత ||

No comments:

Post a Comment