Monday, 4 July 2016

నా కేదార్ నాథ్ యాత్ర

నా కేదార్ నాథ్ యాత్ర

స్వోత్కర్షగా భావించరన్న మీ సంస్కారము నాకు తెలుసు కాబట్టి నా జీవితములో జరిగిన ఈ సన్నివేశమును మీతో పంచుకొను చున్నాను. 
కేదార్‌నాథ్ ఆదిశంకరులచే స్థాపించబడిన శివాలయం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. అసలు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఏవేవి అన్నది తెలుసుకొనుటకు ఈ ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రము చూడండి.

సౌరాష్ట్రే సోమనాథం చ, శ్రీశైలే మల్లికార్జునమ్
ఉజ్జయిన్యాం మహాకాళమ్, ఓంకారమమరేశ్వరమ్

ప్రజ్వాల్యాం వైద్యనాథంచ, డాకిన్యాం భీమశంకరమ్
సేతుబంధే తు రామేశం, నాగేశం దారుకావనే

వారాణస్యాం తు విశ్వేశం, త్ర్యంబకం గౌతమీ తటే
హిమాలయే తు కేదారం, ఘృష్ణేశం చ శివాలయే

ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః
సప్త జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి.

హిమాలయాల్లోని చార్‌ధామ్ పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి. ఆదిశంకరులు ఈక్కడ ఈశ్వర సాన్నిధ్యం చెందటం ఇక్కడి ప్రత్యేకత. అతి పురాతన శివలింగాలలో ఇది ఒకటి. ఇది సముద్ర మట్టమునకు 3,583 మీటర్ల  (11,755 అడుగులు) ఎత్తులో వుంది.

కేదార్‌నాథ్ గుడి పవిత్రమైన శైవ క్షేత్రం. గర్హ్వాల్ కొండల పైభాగంలో ఉంది. ప్రతికూల వాతావరణం కారణంగా అక్షయతృతీయ నుండి దీపావళి వరకు భక్తుల సందర్శనార్ధం ఈ గుడిని తెరచి ఉంచుతారు. ఇక్కడ పూజలు నిర్వహించడానికి అధికారమున్న కుటుంబం అంటూ ఏదీ లేదు. గుడిలో ప్రతిష్టితమయిన లింగం యొక్క కాలం ఇదమిద్దంగా ఇంతవరకు నిర్ణయించబడలేదు. గుడి చేరటానికి రోడ్డు మార్గం లేదు. గౌరికుండ్ నుండి గుర్రాలు, డోలీలు మరియు కాలినడకన మాత్రం గుడిని చేరవచ్చు. ఈ గుడిని ఆదిశంకరులు నిర్మించినట్లు విశ్వసిస్తున్నారు. కేదార్‌నాథ్ గుడి వెనుక భాగంలో ఆదింకరుల సమాధికి ఉంది. 12 జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. ఉత్తరాఖండ్ లోని 
చార్‌ధామ్‌లలో ఇది ఒకటి. గంగోత్రియమునోత్రిబద్రీనాథ్ మరియు కేదార్‌నాధ్ లను చార్ ధామ్‌లుగా వ్యవహరిస్తారు.

ఆలయం ముందరి భాగంలో కుంతీ దేవి, పంచ పాండవులు, శ్రీకృష్ణుని మూర్తులు వరుసగా కుడ్య శిలలుగా దర్శనమిస్తాయి. గర్భగుడిలో కేదారీశ్వరుడు స్వయంభువుడుగా దర్శనం ఇస్తాడు. ఇక్కడ కురుక్షేత్ర యుద్దానంతరం సగోత్రీకుల హత్యాపాతకం నుండి బయట పడటానికి పాండవులు శివుని కోసం గాలిస్తూ ఇక్కడికి చేరిన పాండవులను చూసి శివుడు భూగర్భంలోకి వెళ్ళగా పాండవులు ముఖ్యంగా భీముడు  విడవకుండా వెన్నంటి శివుని వెనుకభాగాన్ని స్పర్శించి పాపవిముక్తులైనట్లు పురాణ కథనం. తలభాగం నేపాల్ లోని పసుపతినాధుని ఆలయంలో ఉన్నట్లు స్వయంగా శివుడు పార్వతీతో చెప్పినట్లు స్థల పరాణం చెప్తుంది. పాండవులు కుంతీ దేవితో ఇక్కడ ఈశ్వరుని పూజించినట్లుగా ఆ కారణంగా వారి విగ్రహాలు ఆలయంలో ఉన్నట్లు కొందరు విశ్వసిస్తారు. ఆలయ ప్రాంగణంలో యాత్రీకులకు కావలసిన పూజా సామగ్రి దుకాణాలలో లభిస్తుంది. ఆలయ మార్గంలో ప్రయాణించే సమయంలో వృక్షాలతో కూడిన పచ్చని పర్వతాలు జలపాతాలు యాత్రీకులను అలరిస్తాయి. హిమపాతం వర్షం ఏ సమయంలోనైనా సంభవం. ఆలయం పర్వత శిఖరాగ్రంలో ఉంటుంది కనుక భక్తులు శిఖరాగ్రాన్ని చేరి దర్శించి కిందకు రావడం ఒక వింత అనుభూతి.
రిషికేశ్ నుంచి పూర్తి కొండచరియల మార్గంలో ఈ ప్రయాణం సాగుతుంది. రోడ్డు మార్గంలో దాదాపు 16గంటల ప్రయాణం సాగుతుంది. ఈ మార్గంలో గంటకు 20 కిలోమీటర్లకు మించి ప్రయాణం సాగదు. ఒకవైపు కొండ, మరోవైపు వెయ్యి మీటర్ల లోయతో ఒళ్లు గగుర్పొడిచే విధంగా ప్రయాణం సాగుతుంది. కేదార్ నాథ్ కు రావాలంటే హరిద్వార్ నుంచే ట్రావెల్స్ మాట్లాడుకుంటే మంచిది. . సొంతంగా ప్రయాణించాలంటే మాత్రం రిషికేశ్ కు రావాల్సిందే. ఉదయం 8గంటలకు రిషికేశ్ లోని ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సర్వీస్ స్టాండ్ నుంచి గౌరీకుండ్ వరకు బస్సు దొరుకుతుంది. ఆలస్యమయితే మళ్లీ మరుసటి రోజు తెల్లవారుజామునే బయల్దేరాలి. రిషికేశ్ నుంచి దేవప్రయాగ, రుద్రప్రయాగ మీదుగా అగస్త్యముని, గుప్త్ కాశీ, ఫాటా ద్వారా గౌరీ కుండ్ చేరుకుంటారు. మార్గమధ్యంలో ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ ఏర్పడి గంటల కొద్దీ వేచిచూడాల్సి రావొచ్చు. అన్నింటికీ సిద్ధమై ముందుకు కదలాలి. సాయంత్రం 7తర్వాత ఈ రూటులో ప్రయాణం చేయడం అతి కష్టం. ఈ రూటులో ఉండే ఏటీఎంలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్ముకోకూడదు. కొండ ప్రాంతాలు కాబట్టి ఇంటర్నెట్ సరిగ్గా పనిచేయదు. ముందుగానే నగదు చేతిలో ఉంచుకుంటే మంచిది. గౌరీకుండ్ నుండి కాలిబాటలో 14 కిలోమీటర్ల దూరంలో కేదార్‌నాధుని గుడి ప్రతిష్టితమై ఉంది. గౌరీకుండ్ ఒక చిన్న ప్రాంతం. 20 నుంచి 30 ఇళ్లున్న ఈ ప్రాంతం కేదరీనాథ్ వెళ్లేందుకు బేస్ పాయింట్. 100కు మించి వాహనాలు కూడా నిలపలేని ప్రాంతమిది. ఉదయాన్నే ఇక్కడున్న వాహనాలను తిప్పిపంపిస్తారు. అంత సమయం వరకు బయటనుంచి వాహనాలను అనుమతించరు. గౌరీకుండ్ లో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కౌంటర్ ఉంటుంది. ఇక్కడే గుర్రాలను అద్దెకు తీసుకోవచ్చు. గుర్రం ద్వారా ప్రయాణం నాలుగు గంటలు సాగుతుంది. మామూలు వ్యక్తులెవ్వరికీ గుర్రం ప్రయాణం అలవాటు ఉండదు కాబట్టి చాలా కష్టపడాల్సి వస్తుంది. కాళ్లు, వెన్నెముక విపరీతమైన నొప్పికి గురవుతాయి. ప్రయాణ సమయంలోనూ జాగ్రత్త వహించాలి. ఇక డోలీ ద్వారా వెళ్లాలంటే దాదాపు రూ.5500 ఖర్చవుతుంది. నలుగురు మనుష్యులు కలిసి మోసుకెళ్తారు. వీళ్లంతా నేపాలీలు. బహుమర్యాదగా ఉంటారు. దాదాపు ఆరు గంటల పాటు ప్రయాణం సాగుతుంది. కాలిబాటన వెళ్లే వారు కూడా చాలా మంది ఉంటారు. అయితే 40 సంవత్సరాలు వయస్సు దాటిన వారు ఏ మాత్రం ప్రయత్నించకపోవడం మంచిది. కాలినడకన వెళ్తే దాదాపు పది గంటలు పడుతుంది. అయితే బాగా అలిసిపోతారు. ఓ వైపు లోయ, మరోవైపు జారే మెట్లతో అత్యంత ప్రమాదకరంగా సాగుతుంది. ఏడు కిలో మీటర్ల తర్వాత రాంబాడా అనే ప్రాంతంలో టీ, కాఫీ, ఫలహారాలు దొరుకుతాయి. చీకటి పడితే పడుకోడానికి వసతి సౌకర్యాలు కూడా ఉంటాయి. ఈ ప్రయాణంలో ప్రధాన అవరోదం వాతావరణం. గౌరీకుండ్ లో మాములుగా ఉండే వాతావరణం నాలుగు కిలోమీటర్ల తర్వాత మారుతుంది, చలి పెరుగుతుంది. పది డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. కేదారినాథ్ కొండపైన 5డిగ్రీల కంటే తక్కువగా ఉంటుంది. ఇక్కడ హిమపాతం, చలి లాంటి ప్రతికూల వాతావరణం అధికం కనుక ఈ గుడిని అక్షయతృతీయ నుండి దీపావళి వరకు మాత్రమే దర్శించడానికి తెరచి ఉంచుతారు.

కేదార్‌నాథ్ ఆలయానికి యాత్రికులు గౌరీకుండ్ నుండి కాలిబాటలో వెళ్ళాలి. 14 కిలోమీటర్ల పొడవున్న ఈ మార్గంలో కొందరు శ్రమకు ఓర్చి కాలిబాటన ప్రయాణం చేస్తారు. ఈ ఆలయానికి యాత్రికులను గుర్రాలలోను, డోలీలలోను మరియు బుట్టలలోనూ చేరుస్తుంటారు. బుట్టలలో యాత్రికులను ఒక మనిషిని ఒక మనిషి మాత్రమే మోస్తూ చేరవేయడం విశేషం. డోలీలో ఒక మనిషిని నలుగురు పనివాళ్ళు మోస్తూ ఆలయానికి చేరుస్తుంటారు. గుర్రాలలో యాత్రీకులతో ఒకరు గుర్రాన్ని నడిపిస్తూ తోడు ఉంటారు. వీరు యాత్రికులను ఆలయానికి కొంతదూరం వరకు తీసుకు వెళతారు. తరువాత ఆలయదర్శనం చేయడానికి వీరిలో ఒకరు యాత్రికులకు తోడు వస్తారు దర్శనానికి సహకరిస్తారు. తిరిగి వారిని భద్రంగా గౌరికుండ్ లోని వారి బస వరకు తీసుకు వస్తారు. పనివాళ్ళ కోరికపై అనేకమంది యాత్రీకులు మార్గంలో అదనంగా వారి ఆహార పానీయాల ఖర్చును భరిస్తారు. రానూ పోనూ 28 కిలోమీటర్ల ఈ ప్రయాణానికి చేర్చి వారికి రుసుము చెల్లించాలి. కొందరు ఒక మార్గానికి మాత్రం కూడా వీరిని కుదుర్చుకుంటారు అన్నీ యాత్రీకుల నిర్ణయం మాత్రమే. మార్గంలో హిమపాతం, వర్షం లాంటి అవాంతరాలు ఎదురైనప్పుడు వారు యాత్రికులకు వేడినీటిని అందించడం, ప్రాణ వాయువు కొరత ఏర్పడినప్పుడు చికిత్సాలయానికి తీసుకొని పోవడం లాంటి అనేక సేవలు వీరందిస్తారు. ఈ ప్రయాణానికి వెళ్ళే సమయం 5 నుండి ఆరు గంటలు వచ్చే సమయం 3 నుండి నాలుగు గంటలు ఇదికాక దర్శన సమయం అదనం. వాతావరణం కారణంగా ప్రయాణం కష్టమైనప్పుడు యాత్రికులు అక్కడి తాత్కాలిక గుడారాలలో రాత్రి సమయంలో బస చేసి మరుసటి రోజు ఆలయానికి వెళ్ళడం సహజం కానీ ఇది చాలా అరుదు. వీరిలో అనేకమంది నేపాలీయులే వీరు విశ్వాసపాత్రులు రుసుము మాత్రం యాత్రికులు ముందుగానే నిర్ణయించుకుంటారు. ఆలయమునకు అనేక శ్రమలను ఓర్చి చేరే భక్తులకు అక్కడి అత్యంత శీతల వాతావరణం మరికొంత ఇబ్బందిని కలిగించడం సహజం. యాత్రికులకు గౌరీ కుండ్‌లో ఆక్సిజన్ సిలిండర్లు వారి బస యజమానులు సరఫరా చేస్తుంటారు. వీటికి అదనపు రుసుము చెల్లించి యాత్రికులు తమ వెంట తీసుకు వెళుతుంటారు. వీటిని వాడని పక్షంలో బస యజమానులు తీసుకొని రుసుములో కోంత తగ్గించి ఇస్తారు. ఆలయ ప్రాంగణం కొంత మంచుతో కప్పబడి ఉంటుంది. పేరుకు పోయిన మంచు అక్కడక్కడా యాత్రికులకు వింత అనుభూతిని ఇస్తుంది. ఆలయ సమీపంలో ప్రవహించే నదిని మందాకినీ నామంతో వ్యవహరిస్తారు. ఆలయ దర్శనం పగలు మూడుగంటల వరకు కొనసాగుతుంది. ఉత్తరకాశి నుండి హెలికాఫ్టర్ ద్వారా యాత్రికులను ఆలయానికి చేరుస్తుంటారు కానీ ఇది ఖరీదైనది మరియు పరిమితమైనది. ఇవి అనేకంగా ముందుగానే యాత్రికులచే ఒప్పందము జరిగి ఉంటుంది కనుక జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఉత్తరకాశి నుండి ఉదయం 6 నుండి 7 గంటల సమయం నుండి యాత్రికులను ఆలయానికి చేర్చుతుంటారు. హెలికాఫ్టర్లు యాత్రికులను కొన్ని కిలోమీటర్ల దూరంలోనే వదిలివేస్తాయి కనుక కొంతదూరం ప్రయాణించి ఆలయ దర్శనం చేసుకోవడం తప్పనిసరి.

1998,99 ప్రాంతములో బంధు మిత్రులమైన కొంత మందిమి కలసి ఉత్తరాది యాత్రకు పోయినాము. అది సుదీర్ఘమైన యాత్ర. మా మా ఉద్యోగములకు నెలరోజులు శెలవు తీసుకొని బయలుదెరినాము. మా యాత్రలకు గానూ యాత్రాచాలకుల(TravelAgents) 
సహాయము గైకొనక  అంతా సొంతమే చూసుకోన్నాము. నేనిపుడు కేవలము నా కేదార్ నాథ్ అనుభవము మాత్రమే మీతో పంచుకొంటున్నాను. మేము ఋషీకేశ్ లో విడిది చేసినాము. ఆ చుట్టుప్రక్కల చూడతగ్గ మందిరములు మఠములు చూసిన తరువాత కేదార్నాత్కు పోయే రోజు రానే వచ్చింది. కేదార్ నాథ్ కు యంత్రచోడిత వాహన (Motor Vehicles ) సదుపాయము లేదు. అటువంటి వాహనములు గౌరీ కుండ్ వరకు మాత్రమె పోతాయి అని పైననే తెలియబరచటమైనది. మేము ఋషికేశ్ నుండి ఏర్పాటు చేసుకొన్నా Van లో బయలుదేరి ఎటువంటి ఉడుడుడుకులు లేకుండా గౌరికుండ్ చేరుకొన్నాము. ఆరాత్రికి అక్కడ అద్దెకు తీసుకొన్న విశ్రాంతి గృహములో ఆహార నిద్రలు ముగించుకొని తెల్లవారుజ్హాముననే లేచి దంతాదావన స్త్నాన సంధ్య పూజాది కార్యముల ముగించుకొని మా అమ్మమ్మ గారికి డోలీ ఏర్పాటుచేసి, నాపిల్లలిద్దరికి ఒక గుఱ్ఱము, నా శ్రీమతికి ఒక గుఱ్ఱము ఏర్పాటు చేసి మిగత వారంతా ఎవరికీ తోచిన ప్రయాణ సాధనమును వారు ఎన్నుకోనగా చివరకు నేను , వేరొక మిత్రుడు మాత్రము కాలినడకన 14 కిలోమీటరులు నడువ నిశ్చయించుకొన్నాము.అతను కాఫీ కొంచెము 
ఎక్కువగా త్రాగే అలవాటు ఉన్నందువల్ల ఒక ఫ్లాస్క్ లో కాఫీ పోసుకొని , ఫ్లాస్కు కొంతసేపతను కాసేపు నేను మెడకు తగిలించుకొని,మేమిరువురము కాలినడకన బయలుదేరినాము. మేము తీసుకొన్న ప్రత్యెక జాగ్రత్తలు ఏమీ లేవు. నాకప్పటికి 55 
సంవత్సరములు. అతనికి 50 సంవత్సరములు ఉండవచ్చును.  నాకు నడక చాలా ఎక్కువ అలవాటు. ఒక 40 కిలోమీటర్లు అవలీలగా నడిచే వాణ్ణి. దయవుంచి అతిశయమనుకోవద్దు. ఆస్య గ్రంధి లో నున్న నా చిరకాల మిత్రులకీ వాస్తవము తెలుసు. ఆ రోజు మాత్రము నామనసు ఎదో 
తెలియని ఆవేదన ఆలోచనతో నిండిపోయి వుండినది. ఆ శంభుడే దిక్కని బయలుదెరినాము. సగము దూరము నడచిన తరువాత ఆక్కడ ప్రాణవాయువు అతి తక్కువై వున్నదని, ఇంకా ఎత్తుకు పోయేవరకూ ఆమాత్రము కూడా ఉండదని, ఒక గంటలో స్వామీ దర్శనము ఆపుతారని, అన్నింటికీ మించి నేను ముందుకు , నామిత్రుని వేగముతో నడువలేనని, ఆతను నాతోనే వుంటే తానుకూడా ఆ రోజుకు దర్శనభాగ్యము కోల్పోతాడని అర్థమై పోయినది. నేనాయనకు నచ్చజెప్పి తానయినా దర్శనము చేసుకోనిమ్మన్న ఉద్దేశ్యముతో ముందుకు సాగానంపినాను. ఆతోన్దరలో 'తాను  దూర  సందు లేదు మెడకేమో  డోలు' అన్నట్లు ఫ్లాస్కు నామేడకు శివుని హారమై కూర్చుంది. 
కేవలము  ఎక్కగలిగితే కేదారము, లేకుంటే అంతకన్నా ఎత్తయిన కైలాసము అన్న మొండి ధైర్యముతో  అడుగు ముందుకు వేసినాను.
నా శ్రీమతి, పిల్లలు బంధువులు , మిత్రులు చివరకు నాతో బాటూ నడచిన మిత్రుడు కూడా దర్శనము ముగించుకొని వెనుదిరిగినారు. దారిలో నాకు కనిపించి దర్శ్హన సమయము ముగిసి పోయినదని కూడా తెలిపినారు. నాకు ఊపిరాడుట లేదు, ఎముకలు కోరికే చలి , వదలని వాన నాకు తోడురాగా , చెమటతో తడిసిన మేనితో ( అంటే శరీరము ఏమాత్రము సహకరించుట లేదు . నాపని ఐపోయినదన్న నిర్ణయానికి వచ్చివేసినాను .) తడబడే అడుగులతో ప్రయాణమును ముందుకే సాగించినాను. పుణ్యక్షేత్రము లోనికి అడుగుపెట్టుటకు చివరిమీట్టు నుండి అడుగు ముందుకు వేయబోయేటపుడు అక్కడ వున్నా 'chaivaalaa' 'chai' త్రాగమన్నాడు. దేవును దర్శనము చేసుకొని వచ్చి త్రాగుతానన్నాను. ఆతను ఆలయ ద్వారములు మూసివేసినారు ఇక దర్శనము రేపే అన్నాడు. అతనికి జవాబుకూడా చెప్పే పరిస్థితి లేని నేను మౌనముగానే లేని శక్తిని క్రోఢీకరించుకొని శివ నామమును మదినిండా మననము చేసుకొంటూ ఆలయ ప్రాకారము వద్దకు చేరినాను. మూసినా తలుపులగుండా అసలేమయినా కానీ పించుతుందేమో అని చూసినాను.  ఏమీ కనిపించలేదు. ఎంత పాపము చేసినానో మా అంతమందిలో నాకొక్కనికే స్వామి దర్శనము ల్బించాలేదని వ్యాకుల చిత్తుడనై ఒక్క సారి ప్రహరీ చుట్టూ ప్రదక్షిణము చేసి తిరోగామానము చ్యుతకు సిద్ధపడి మూడు వంతుల ప్రదక్షిణము నా శక్తినంతతిని కూడగట్టుకొని చేసినాను. అక్కడ జరిగింది ఒక చమత్కారము. స్వామి ప్రహరీ గోడకు  ఆదిక్కున ఒక వామన ద్వారము (wicket door ) సరిగా  నేనక్కడికి చేరుతూనే తెరువబడింది. లోపలినుండి ఒక వ్యక్తీ బయట ఉన్న ఒకతనితో గట్టిగా చెబుతున్నాడు. ఆయన మాటలు అయ్యే వరకు పరమేశ్వరధ్యాయుదనైన నేను , హిందీలో నా పిడచ గట్టుక పోయిన నోటితోనే స్వామిని చూడాలన్న నాకోరిక తెలుపుకోన్నాను, 'దైవం మానుష రూపేణ' అంటారు కదా! ఆయన ఆర్ద్రత నిండిన హృదయముతో రండి అని నా చేయి పట్టుకొని నడిపించుకు గర్భగుడిలోనికి తీసుకు పోయి కేదారనాతుని దర్శనము చేయించినాడు. నాతో బాటూ ఒక పెళ్ళయిన జంట మాత్రమె ఆసమయములో దేవుని సన్నిధానము లో వుండినారు. నాకంతినీరు మందాకినిలో కలిసేతంత ప్రవహిన్చినదేమో అన్నంత ముకిలిత హస్తములతో అశ్రుపూరిత నయనములతో తదేక ధ్యానముతో కేదార నాథుని చూసి వెనుదిరిగినాను. నాకు దర్శన భాగ్యము కలిగించిన వ్యక్తికి త్రికరణ శుద్ధిగా నమస్కరించి , ఒక్క క్షణము పరాంగానములో కూర్చొని వెనుదిరిగినాను. 
chai vaalaa నన్ను ఆదరముగా కూర్చుందజేసి ఒక tea త్రాగిన పిదప రెండవది కూడా ఇచ్చి డబ్బు వద్దన్నాడు. ఆయన ఎంత ఉన్నత మనస్కుడో! ఆయనకు డబ్బు చెల్లించి ఒక గుర్రమును ఏర్పాటు చేయంజన్నాను. వెంటనే ఒక అబ్బాయిని పిలిచి గుర్రమును ఏర్పాటు చేయమన్నాడు. ఆ పిల్లవాడు గుర్రమును నావద్దకు తెచ్చి ఎక్కమన్నాడు. నేను ఎక్కగాలిగేతుగా వుంటే అసలు నడచి పోయి వుమ్వాడేవాడినన్నాను , tea వాళ్ళ కలిగిన శక్తి తో ! ఆ బాలుడు tea కొట్టు యజమాని నన్ను జాగ్రత్తగా గుఱ్ఱము మీదికి ఎక్కించినారు.
ఆ పిల్లవాడు ఒక్కసారి గుఱ్ఱము వీపుపై గట్టిగా చరిచి 'చల్' అన్నాడు . ఆ గుఱ్ఱము నన్ను ఏ రాణా ప్రతాప్ గానో, ఏ శివాజీ గానో , ఏ ఝాన్సీ లక్ష్మిబాయ్ గానో తలచి ఆఘ మేఘాలపై మేము తీసుకొన్న విడిదికి చేర్చింది. అక్కడ ఉన్న గుర్రపు తాలూకు వ్యక్తీ నన్ను క్రిదికి దించి కూర్చుండ జేసినాడు.  ఆటరువాతనే మావాల్లంతా ఒక్కొక్కరు గూడు చేరినారు. 

పరమేశ్వరుని సంకల్పము లేనిదే , నేను తిరిగి నా అనుభవము మీతో పంచుకొని యుండి ఉండలేను.
నమః శివాభ్యాం నవయౌవనాభ్యాంపరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యామ్ |

నగేంద్రకన్యావృషకేతనాభ్యాంనమో నమః శంకరపార్వతీభ్యామ్

నమః పార్వతీ పతే హరహర మహాదేవ్



కేదార్ నాథ్ యాత్ర......
శ్రీయుతులుసుబ్బారావుగారుతమఅనుభవమును ఈవిధముగా తెలిపినారు. నామనసుకుతోచినది ఈదిగువనతెలుపుచున్నాను.
Rao Subba Mamidanna Naa kedar yatra 10.05.2015. Helicopter lo velli vachchamu. Akkada emi ledu. Temple tappa. No coffe no tea. No staying there. Have darshan and come back.
సుబ్బారావుగారూమీరుచాలాఅదృష్టవంతులు. పాపప్రక్షాళనము జరిగినతరువాత స్వాీమి దర్శనము చేసుకొన్నారు. ప్రక్షాళనముచేత స్వామి తన స్వ స్థావరమును పునీతముచేసిన పిదప మీరు పోయి ఆ ఆనంద మూర్తిని దర్శనము చేసుకొన్నారు. ఆెతేజోమూర్తిని దర్శించి మీపాపాలు బాపు కొన్నారు. మీరు పు్ణ్యాాత్ములైనారు. కాఫీ టీ లదే ముందండి మీరు దిగగానే గౌరీకుండ్ లో
కావలిసినంత కావలసినన్నిమార్లు త్రాగి యుంటారు. మీఅదృష్టమునకుమరొక్కసారినమస్కారము. కేదారనాథుని గూర్చిఇంకొన్నిమాటలు మనవిచేసుకొంటాను. నా అనుభవాలు కాదు లెండి.
14 to 17 జూన్ 2013ఉత్తరాఖండ్ వరదలకు కేదార్‌నాథ్ ఆలయం చెక్కు చెదరలేదు. ప్రస్తుతం ఇదే అంశమే దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదార్‌నాథ్ ఆలయం వరదలు బీభత్సం సృష్టించినప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే నిలిచిపోయింది.
గంగమ్మ ఆగ్రహంతో వేలాది మంది ప్రజలు జల సమాధి అయినప్పటికీ.. కేదార్ నాథ్ ఆలయం మాత్రం ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఇది భారత దేశ నిర్మాణ గొప్పదనమని చరిత్రకారులు అంటున్నారు. పూర్వం కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత కృష్ణుడు సలహా మేరకు పాండవులు హిమాలయాలకు వెళ్లారు. అయితే మంచుకొండల్లో శివయ్య దాగుకొని పాండవులకు దర్శనమివ్వలేదు.
ఇంకా శివపరమాత్ముడు వృషభరూపంలో మంచుకొండల్లో దాక్కున్నాడు. దీంతో భీముడు వృషభుడిని బయటికి లాగడంతో వృషభం భాగాలు పడ్డాయి. ఇలా మూపుర భాగం పడిన చోటే కేదార్ నాథ్‌గా ప్రసిద్ధి చెందింది. సుమారు 400 సంవత్సరాలు మంచు కిందే కేదార్‌నాథ్ ఆలయం ఉన్నదని, ఆలయాన్ని మంచు సైతం ఏమీ చేయలేకపోయిందని చరిత్ర కారులు అంటున్నారు.
అత్యంత కఠిన శిలలతో ఆలయ నిర్మాణం చేపట్టడం జరిగిందని, ఆలయ గోడల మందం 12 అడుగులు కావడంతో పెను వరదలకు సైతం కేదార్‌నాథుడి దేవాలయం చెక్కు చెదరలేదు. ఇకపోతే.. కేదార్‌నాథ్‌లోనే ఆదిశంకరాచార్య తనువు చాలించారు. కేదార్ నాథ్ సమీపంలోనే ఆదిశంకరాచార్య సమాధిని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి కేదార్ నాథ్ ఆలయ ప్రాశస్త్యం అంటే ఇదే కాబోలు..!
పెరిగిపోయిన పాపాన్నిపరమాత్ముడు లయము చేసినాడు . దేవసేనాపతిఅంటే కుమారస్వామి
తాను మనభారతీయ సైన్యమును ఆవహించి ఆ పున్యక్షేత్రమునుపునీతముచేసినాడు.
సాంబసదాశివశంభోశంకర గిరిజాపతి హర గౌరీశా
శశి శేఖర శ్రీకైలాసాధిప దక్షాధ్వరహర విశ్వేశా





No comments:

Post a Comment