దత్తపది
నాగఫణి శర్మగారు చేయితిరిగిన అవధాని వారు పూరించిన
దత్తపది మరియొకటి ; కోతిమీర, కరివేపాకు, అల్లం, చింతపండు;
వరుసగా నాల్గు పాదాలలో చెప్పాలి.
మరి పద్యం చిత్తగించండి!
కోతి మీరెను యుధ్ధాన కోప గరిమ
కర్రి వేపాకు రాముడా కాదు బలియ!
అల్ల మునిజన సత్తపో బలము వలన
చింత పండెను నేడిటు సేతు నెద్ది;
లౌకిక వ్యవహారంలో భోజనోప యోగ్య పదార్ధములే యిక్కడ రావణుని విచారమునకు
ప్రబలమైన కారణాలుగామారాయి . కవి ప్రతిభ!
" అపారే కావ్య సంసారే కవిరేకః ప్రజాపతిః యధాస్మై రోచతే విశ్వం తధేదం పరివర్తతే!!!

No comments:
Post a Comment