మదర్స్ డే --ఫాదర్స్ డే
దయ వుంచి ఓపికతో ఒక్క సారి ఈ వ్యాసము చదవండి. ఆరోజు ఉగాది పండుగ.
ఉగాది సందడి ముగిసింది. తలంటి స్నానాలు. కొత్త బట్టలు. పూజలు. దేవాలయ సందర్శనాలు. బంధుమిత్రులకు శుభాభినందనలు. మిఠాయి పంపకాలు. మృష్ఠాన్న భోజనాలు ఇంకా ఎన్నో వేడుకలు. అన్నిటినీ అనుభవించి అలసిన నన్ను నిద్రాదేవి ఆహ్వానిస్తున్నవేళ ఒక చిన్న ఆలోచన చిగురించింది. పాశ్చాత్యులు ఎన్నోవిధములగు DAY లు ప్రాచుర్యమునకు తెచ్చి మనకు రుద్ధినారుకదా! వారు మనకు తెలుపక మునుపు మనము ముఖ్యము అనుకొన్నవి మనము ఆచరించుట లేదా అని. నా ప్రశ్న దానికి జవాబుగా నా బుద్ధి యొక్క స్పందన మీరు చదువుటకు గానూ అదే రూపములో మీముందు ఉంచుచున్నాను.
1. అమ్మ అంటే ?
అమ్మ అడిగిన వరాలిచ్చే దేవుని బొమ్మ. వేసవిలోచెట్టు నీడ అమ్మ , దాహార్తికి వాన మేఘమమ్మ,తీయనైన నీటి చలమ అమ్మ, ఇంటి వెలుగు అమ్మ, కంటి చూపు అమ్మ. అసలింటికి పట్టుకొమ్మ అమ్మ, అందుకే ఆమెను మనకిచ్చింది బ్రహ్మ.
అమ్మ తల్లి మాత జనని అన్న ఎన్నో ప్రతినామాలు ఉన్నాయిఅమ్మకు. అమ్మ అనే పదము ఓం నుండి వచ్చిందని పెద్దలంటారు. మనము అంకాళమ్మ, ఎల్లమ్మ, మల్లమ్మ అని దేవతలకు అమ్మను చేరుస్తాము. తల్లిని అమ్మ అంటాము. సమాజములు స్త్రీని అమ్మ అని పిలుచుట మన సాంప్రదాయము. దీనిని బట్టే అమ్మ అన్న మాట ఎంత పవిత్రమైనదో మనకు తెలుస్తుంది. మాతృ శబ్దము నుండి మాత అంటే అమ్మ అన్న శబ్దము వచ్చిందని అందరికీ తెలిసిన విషయమే! మాతృ శబ్దమమునుండినే లాటిన్ లోని matter, మితెర (గ్రీక్) మదర్ అన్న శబ్దాలు వచ్చినాయి. అంటే పురాతన నాగరికత గా చేప్పుకునే గ్రీకు అరబ్బీ,జర్మన్(mutter) డచ్ (moeder) ఈ భాషలే కాకుండా అనేకమైన భాషలలో మాతర్ అన్న సంస్కృత శబ్దాన్నే కృతకము చేసి తల్లికి ప్రత్యామ్నాయముగా వాడుకుంటారు.
కావున ప్రపంచము లోని భాషలకు సంస్కృతము మాతృక , ప్రపంచములోని తల్లులకు మన 'మాత' యే మాతృక. అదే విధంగా పితృ, భ్రాతృ, దుహితర్ అను సంస్కృత శబ్దాలనుండి పుట్టినవే father, brother, daughter మొదలగునవి. మాత అన్న శబ్దము కూడా ఆ పరాశక్తి అమ్మకు వాడుతాము . దీనిని బట్టే అమ్మ అన్న మాట యొక్క ప్రాశస్త్యము మనకు తెలుస్తుంది. ఇది ఇంకొక విషయము కూడా తెలుపుతుంది, అది ఏమిటంటే మన సంస్కృతి ఎంత ప్రాచీనమైనది అన్నది పాశ్చాత్య నాగరికత ఎంత నవీనము అన్నది.
2. మరి అమ్మ అన్న శబ్దమునకు ఇంత మహత్తు ఉన్నదికదా మనము 'మదర్స్ డే' రోజున మాత్రమె తల్లిని తలచుకొనవలెనా? ఫాదర్స్ డే రోజే తండ్రిని తలచుకోవలేనా?
ఈ మాటకు జవాబు చెప్పేముందు పండుగ అన్న మాటను గూర్చి చెప్పుకుందాము. మనము ఇంకా కాస్త ముచ్చటించుకున్నా తరువాత ఈ 'మదర్స్ డే' గూర్చి చెబుతాను.

మనము మన సనాతన ధర్మములో ఆచరించే ఈ పండగలన్నిటి చారిత్రక, పౌరాణిక కారణాలు ఏమైనప్పటికీ…నా అభిప్రాయములో…మూల కారణము (Central Point) చెడుపై మంచి సాధించిన విజయాన్ని సంబరంగా జరుపుకోవటమే.
మనకు అకారణమైన పండుగలు వుండవు. పాశ్చాత్యులకు సకారణమైన పండుగ ఒక్కటీ లేనట్లు. వాళ్ళు అతి గొప్పవనుకొనే పండుగలు కూడా, పాత పుస్తకాలపై కొత్త లేబుళ్ల లాంటివే! మిగిలినవన్నీ దివసాలే ! దివసము అంటే దినము అని అర్థము (Day) అది వాస్తవమే. వానిని తద్దినాలు అనికూడా అనవచ్చు. తప్పుగా అనుకోవద్దు. తత్+దినము అంటే ఆ రోజు అని అర్థము .అది అమ్మ రోజు కావచ్చు నాన్న రోజు కావచ్చు మరే రోజైనా కావచ్చు. కానీ మన సాంప్రదాయ మదికాదు. కాలే వత్తిని కాస్త ఎగ దోస్తాము ఎందుకంటే అది ఇంకా బాగా మండాలని. అంటే మన అన్ని పండగల సారాంశము ఒకటే కాబట్టి మనలో వుండే మంచిని మళ్ళీమళ్ళీ ఉత్తేజితము చేస్తాము. పెద్దలైన తలిదండ్రులు గతించిన తరువాత కూడా వారు గతించిన దినమును గుర్తుంచుకొని మరీ జ్ఞాపకార్థము పేదలకు అన్నము పెట్టుట, బ్రాహ్మణునికి దానము చేయుట మొదలైనవి చేసి తృప్తి చెందుతాము. పాశ్చాత్య సంస్కృతికి మన సంస్కృతికి హస్తిమశకాంతరము, పర్వత పరమాణు సారూప్యము మరియు అజగజ సామ్యము. వాళ్ళ పద్ధతికి మన పద్ధతికి పండుగకు తద్దినానినికి ఉన్నంత తేడా వుంది.
3.స్త్రీలకూ పాశ్చాత్యులు అమిత గౌరవమునిచ్చినారని చెబుతారు. దానిని గూర్చి కాస్త తెలుపుతారా?
దాదాపు 13 వ శతాబ్దపు చివరి వరకు నాగరికత లేని ఆ జాతికి పెళ్లి అన్నది ,నేటికి కూడా,ఆడామగా సంబంధము. అదే మనకు రెండు కుటుంబాల అనుబంధము. వారిది సంబంధమే కాబట్టి ఈ రోజు ఒకరితో వుంటే రేపు వీనికి లేక ఆమెకు విడాకులిచ్చి వేరొకరితో సంబధం ఏర్పరచు కొంటారు . విడాకులు అన్న మాట మనకు కూడా ఉన్నదే అని ఆశ్చర్య పడవద్దు. 'ఆకు' అనే మాటకు 'కాగితము' అన్న అర్థము ఒకటుంది. 'విడి' అంటే విడిపోవుటకు అని అర్థము. ఈ పదము 'divorce papers' అన్న మాటకు అనువాదార్థకముగా వచ్చినది. మన సాంప్రదాయములలోని పెళ్లి మంత్రములలో ఈ ప్రస్తాపన ఎక్కడా రాదు. ఇక పెళ్లి చేసుకొన్నా దంపతులు అదృష్ట వశాన రెండు మూడేళ్ళు వుంటే వారికి సంతానము కలిగితే ఎవరితో వుండేది ముందే వ్రాసుకొంటారు లేకుంటే ఆ పిల్లలకు అనాధాశ్రయమే గతి. ఆమె వేరోకనితో పెళ్లి చేసుకొంటే అతడు ఆమె పిల్లలకు 'అంకులు'. ఆ మగ వాని పిల్లలకు ఆమె 'ఆంటి'. ఇట్లా స్వంత తల్లి దగ్గర లేని వాళ్ళు mothers' day రోజు వాళ్ళ అమ్మను కలిస్తే లేక వాళ్ళ అమ్మ వాళ్ళను కలిస్తే వారు కలిసి భోంచేస్తారు. తరువాత ఎవరి దోవ వారిది. ఇది MOTHERS' DAY. ఆలాగే Fathers' Day కూడా. మిగతవన్నీ మతాకర్షణ మారణాయుధాలు.
PALTO పాశ్చాత్యుల మహా పురుషుడు. ఆయన 'THE REPUBLIC' 'THE LAWS' అన్న రెండు పుస్తకాలు వ్రాసినాడు. ఆ వ్రాతలు వారికి శిరోధార్యములు. ఆయన గారి 'THE REPUBLIC' లో 'స్త్రీ' కి ఆత్మ వుండదు. అది పురుషునిలో మాత్రమె ఉంటుందని నుడివినారు. అనగా స్త్రీ కేవలము ఒక వస్తువుతో సమానము. ఇది ఆయన వచనము లోని తాత్పర్యము. వారే తమ 'THE LAWS'అను పుస్తకములో స్త్రీ కి ఆత్మ లేనందున ఆమెకు ఆత్మానాత్మ విచారణ కలుగదన్నారు. అందువల్ల స్త్రీ కి న్యాయస్థానములో సాక్ష్యము నిచ్చు అర్హత లేదు.
ఇంచుమించు 14 వ శతాబ్దము వరకు ఓటు హక్కు వారికి లేదు ఎందుకంటే వారికి ఆత్మా లేదు కావున. ఇటువంటి అసమానతలు ఎన్నో కలిగి యుండిన ఈ ప్రథ ఇంచుమించుగా 1950 వరకు ఐరోపా దేశాలలో ఉండినదని విన్నాను. వారు '50 వరకు బ్యాంకులలో ఖాతా ప్రారభించుటకు కూడా అనర్హులు. ఒకవేళ భర్త భార్యను వదిలిపెడితే ఆమెను 'మంత్రగత్తె'(डायन,Witch) గా పరిగణించేవారు. అటువంటి ఆడవారిని అమిత క్రూరముగా కాల్చి చంపిన ఉదంతములు వేనకు వేలు. వ్యభిచారము విచ్చలవిడిగా వుండేది. కన్న బిడ్డలను కాన్వెంట్ల వద్ద (అంటే సన్యాసినుల మఠము)(మనము బడి కి ప్రత్యామ్నాయముగా వాడే కాన్వెంటుకు ఆ అర్థము ఆంగ్ల నిఘంటువులో దొరకదు. అది కూడా తెలుసుకోకుండా మన పిల్లలను కాన్వెంటు కు పంపుచున్నాము) దిగ విడిచి పోయేవారు. వ్యభిచార నేరము కోర్టులో విచారణ జరిగితే ఆడవారి సాక్ష్యములు అంగీకరింప బడేవి కావు.
దాదాపు 200 వందల సంవత్సరాల చరిత్రలో ఇంతవరకు ఒక్క స్త్రీ కూడా ఆమెరికాలో ప్రసిడెంటు కాలేదు. ఈ సారి Hillary Clinton కు పోటీ చేయుటకు అవకాశము వచ్చింది. ఆమె గెలువగలిగితే మొదటి US President అవుతుంది.
అటువంటి సమయములో ఫ్రాన్సు కు చెందిన 'Simone de Beauvoir' 1949 లో 'The Second Sex'
(a detailed analysis of women's oppression and a foundational tract of contemporary
feminism) అన్న విశ్లేషణ గ్రంథము ఫ్రాన్స్ లో మహిళా చైతన్యమును తీసుకు రాగలిగినది. తన 14 వ ఏటి వరకు తీవ్ర మత ఛాందసత కల్గిన'కాథలి' క్కయిన ఆవిడ మతమును వదలి మానవతను అవలంబించి'jean-Paul-Sartre' తో అవివాహితగా కాలం గడిపినా స్త్రీ స్వాతంత్ర్యము కొరకు మిక్కుటముగా శ్రమించినది. ఆతనుకూడా ఆమెకు చేదోడు వాదోడు గా ఉండినాడు. ఆ ఉద్యమము ఐరోపా ఖండములో చెప్పుకోదగిన చైతన్యమును తెచ్చింది.
ఇక్కడ ఒక్క మాట చెబుతాను. పాశ్చాత్య నాగరికత తెరచిన అరచేయి లాంటిది. వాళ్ళకు చెప్ప గలిగినవి చెప్ప కూడనివి, చేయ గలిగినవి చేయ కూడనివి అన్న తారతమ్యము వుండదు.అది వాళ్ళ నాగరీకత. మనది సంస్కృతి వారిది నాగరికత. ఇది బహు చక్కని మాట. ఇక కమునిష్టు దేశాలది ముడిచిన అరచేయి. వారిది 'గవి లో మాయ'అంటే లోపల ఏముందో ఏమి జరుగుతూందో ఎవరికీ తెలియదు. మన సంస్కృతి 'గోకర్ణము' లాంటిది. అనగా ఆవు చెవి లాంటిది. మనము తీర్థము తీసుకోనేట్లుంటే చూపుడు వ్రేలుకు మధ్య వ్రేలుకు నడుమన బొటన వ్రేలును దూర్చి తీర్థము తీసుకొనవలెను. అది ఆవు చెవి ఆకారాన్ని కలిగియుంటుంది. అంటే సగము మూసి సగము తెరిచి వుంటుంది చేయి. కావున చెప్పగలిగినవి చెప్పలేనివి అన్న విచక్షణ కలిగి యుంటాము. 'మధ్యేమార్గము మంచి మార్గము''అతి సర్వత్ర వర్జ్యేత్' అన్న నానుడులు మనము ఆచరణలో పెట్టే వారము. మనసు మాటలో మాట చేత లో ప్రతిఫలించ వలెనన్న 'త్రికరణ శుధ్ధి' ఇచట ప్రతిబింబించు చున్నది కదా! మరి మన సంస్కృతిని విస్మరించ నగునా!
మంచిని ఎక్కడ వున్నా గ్రహించ వలసిందే. కానీ దానికి విచక్షణ అవసరము కదా! ఇక్కడ ఇంకొక చిన్న విషయాన్ని వివరించ దలచు కొన్నాను. ఎవరో సహనము పాటించుట తప్పు కాదు కదా
అన్న అబిప్రాయమును వ్యక్తము చేసినారు. మన దేశపు ఇప్పటి పరిస్థితిని ఒక మధుమేహ రోగితో(మోసాలు ద్రోహాలు, మానభంగాలు, కుళ్ళు,కుట్ర మొదలగు విషయముల కలగా పులగమే ఈ మధు మేహము) పోల్చవచ్చు. మొదలే తాను తనను వదలని వ్యాదితో బాధపడుతూ వుంటే కాలికి దెబ్బ తగిలితే ఏమి చేయాలి. సహనము మాత్రం పాటించే వీలు లేదు. పాటించితే కాలే తీసివేయ వలసి రావచ్చు. 'యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః --యత్రైతాస్తు అపూజ్యన్తే తత్రైతాస్తఫలాక్రియాః' అనిచెప్పిన దేశమునకు, తమతమ దేశములలోని 'Red Light Area' లలో 'జాగ్రత్త మీరు మీ బిడ్డ వద్దకు వెళ్ళుట లేదు కదా'(ఆ విధంగా ఆ దేశాలలోని ఆ ప్రాంతాలలో వ్రాసి యుంచుతారని విన్నాను) అని వ్రాసుకొనే దేశాలతో పోలిక ఎక్కడ?

ఇక ఈ విషయాలు కాస్త గమనించండి.***********
ఫాదర్స్
డే మదర్స్ డే- ఫాదర్స్ డే..... 4
సతి
అసలు
ఈ వివరమును ఒక సారి గమనించితే ‘సతి’ కి ప్రాధాన్యత మన దేశాచారము లో లేదన్నది మనకు
తెలుస్తుంది. ఇది కేవలము విదేశీ దండయాత్రల వల్ల ఏర్పడిన విపత్కర బాధామయ పరిస్థితి.
లక్షలాది స్త్రీలను బలాత్కరించగా
కోట్లాది
స్త్రీలు ఆత్మా సమర్పణము గావించుకున్నారు. అసలు ‘సతి’ అన్న మాట ఈశ్వరుని పత్ని
‘సతీ దేవి’ తండ్రి యగు దక్షుని చే అవమానమును పొంది యజ్ఞకుండమునకు ఆహుతి యగుట వల్ల
ఆ పేరు సిద్ధమైనది. దీనిని బట్టి కూడా ఆ దురాచారము శాస్త్ర చోదితము కాదని
తెలియుచున్నది. అసలు సింహాసన ద్వాత్రింశికలో, యుద్ధమునకు వెళ్ళు వీరుడు తన
ఇల్లాలిని రాజు యండ లో నుంచి యుద్ధమున వీరమరణము పొందగా ఆమె సహగమనమునకు
ఉద్యుక్తురాలయినపుడు రాజు ఎంతగానో నివారించగా ఆమె ఈ విధముగా చెబుతుంది. అసలు భర్త
లేని ఇల్లాలికి కలుగు ఇబ్బందులు ఆమె ఎంత వివరముగా తెలుపుతుందో చూడండి.
"అకులపాటుతోడ
అశుభాకృతియై యొకవేళనైన,
పో
కాకును
లేక, సొమ్ములకునర్రులు సాపక, పేరటంబులన్
పోక
తొరంగి,
పూతలును పువ్వులు దూరముగాగ ముండయై
యేకడ
జేరినన్ విధవ కెగ్గులె కాక తరింపవచ్చునే?
చచ్చియు
చావక తనలో
వెచ్చుచు
నియమముల నింక విధవాత్వమునన్
నిచ్చట
మాడుటకంటెను
చిచ్చురుకుట
మేలు సతికి క్షితి మెచ్చంగన్
దీనిని
బట్టి కూడా ఇది శాస్త్ర విదితము కాదని పరిస్థితుల ప్రభావము, సంఘములో
తన నిస్సహాయత చాటుచున్నవి. అవి నాటి పరిస్థితులు. ‘ప్రాణం వాపి పరిత్యజ్య మానమే
వాభి రక్షతు’ అనుకున్నారు నాడు. మన పాశ్చాత్య నాగరికత ‘మానము పోయినా మంగళసూత్ర
ముంటే చాల ‘ని చెబుతూవుంది. కాబట్టి ఒక సాంఘీక కట్టుబాటు నాటి ప్రజా బాహుళ్య విచార
ధారను అనుసరించి యుంటుంది.
ఈ
వాస్తవమును చదవండి.
Despite
the fact that the Brahmins originally condemned the practice (Auboyer 2002) the tradition continued. Over the centuries the custom
died out in the south only to become prevalent in the north, particularly in
the states of Rajasthan and Bengal. While comprehensive data are lacking across
India and through the ages, the British East India Company recorded that the
total figure of known occurrences for the period 1813 - 1828
was 8,135; another source gives the number of 7,941 from 1815 - 1828, an average of 618 documented incidents per year. However, these numbers are
likely to grossly underestimate the real number of Satis as in 1823,
575 women performed sati in the state of Bengal alone
(Hardgrave 1998).
రాజస్థానులో, బెంగాలులో
మహమ్మదీయుల దండయాత్రలవల్ల సహగమనమును పలు రీతులుగా పాటించవలసి వచ్చినది కానీ అన్యథా
కాదు. పై పెచ్చు పైన కనబరచిన అంకెలు ఈ ప్రథ ప్రబలము కాదు అని చెప్పకనే
చెప్పుచున్నవి. మరి ప్రబలముగా లేని ‘సతి సహగమనము’ ను మాన్పించుటకు అంత ప్రాచుర్యము
ఎందుకు వచ్చినది ? ఆ ప్రాంతాలను ముస్లీములు దురాక్రమించుటయే
గాక ప్రజల దనము ప్రాణములనే గాక స్త్రీల మానమును విచ్చలవిడిగా హరించినారు. వారి
పోరు పడలేక అగ్నికి ఆహుతియైనారు ఎందఱో స్త్రీలు. ఆ స్త్రీలు మానానికి బదులుగా
ప్రాణమునే వదిలిన సాధ్వీ మణులు .
బాల్య
వివాహములు మరియు వితంతు వివాహములు.
బాల్య
వివాహము (Child
Marriage) అనగా యుక్త వయసు రాక మునుపు అనగా బాల్య దశలో చేసే
వివాహము. నేడు చట్ట ప్రకారము 18 సంవత్సరాల వయసు నిండని
అమ్మాయికి, మరియు 21 సంవత్సరాలు నిండని
అబ్బాయికి జరిగే వివాహమును బాల్య వివాహముగా చెప్పవచ్చు. పూర్వము బాల్య వివాహాలు
ఎక్కువగా జరిగేవి. దీనికి పెక్కు కారణములున్నవి.
ఫ్రెంచివారు, పోర్చుగీసు
వారు, డచ్ వారు, బ్రిటీషు వారు మొదలైన
విదేశీయులు భారతదేశాన్ని పాలించు కాలంలో కొంతమంది విదేశీ అధికారులు భారతీయ కన్యలను
బలవంతంగా వివాహమాడేవారు లేదా చెరచేవారు. వివాహితులను ఎత్తుకెళ్ళరని భావించిన
భారతీయులు తమ పిల్లలకు బాల్యంలోనే వివాహం చేసేవారు. ఇక మహమ్మదీయులు చెరపట్టిన
స్త్రీల సంఖ్య అగణ్యము.
పూర్వము
కుటుంబాల మధ్య సంబంధ బాంధవ్యాలను పటిష్టపరచుకోవడానికి ఆడపిల్ల పుట్టగానే తమ
బంధువర్గంలో పలానావాడికి భార్య పుట్టిందని ఇరువర్గాలవారు నిర్ణయించేసుకొని పిల్లలు
కొంచెం పెద్దవారవ్వగానే వివాహం చేసేవారు.
కుటుంబాలలోని
వృద్ధుల కోరిక మేరకు వారు చనిపోయేలోపు తమ వారసుల పెళ్ళిళ్ళు చూడాలనే కోరికను
తీర్చడానికి కూడా బాల్యవివాహాలు జరిపించేవారు. మరికొన్ని కుటుంబాల్లో పిల్లలు
యుక్తవయసు (Teenage)
కు వచ్చిన తర్వాత వక్ర మార్గాల్లో ప్రయాణిస్తారనే భావనతో ముందు జాగ్రత్తగా
బాల్యవివాహాలు జరిపించేవారు.
బాల్య
వివాహం జరిపించినప్పటికీ అమ్మాయి యుక్త వయసుకు వచ్చిన తర్వాత మాత్రమే కాపురానికి
పంపింఛేవారు. ఇలా చేయడం వల్ల అమ్మాయికి అబ్బాయికి ఒకరిపై ఒకరు ఇష్టం ఉన్నా
లేకపోయినా కలిసి జీవితం గడపాల్సి వచ్చేది.
చాణక్యుడు
బాలికకు వివాహ యోగ్యత 12 సంవత్సరములని నిర్ణయించినాడు. నా వయసు అనగా దాదాపు 70 సంవత్సరాలున్నవారికి తమ పెద్దల ద్వారా విన్న జ్ఞాపకము ఉండవచ్చు, వధువు కు వరునికి కనీసము 3 సంవత్సరాలుండవలెనన్నది మన
సాంప్రదాయము. పోఎల్లి త్వరగా అంటే పిల్లల 18-21 సంవత్సరముల నడుమ
జరిగిపోతే వారి సంతానము ఇల్లు పొలము పనులలో తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా వుండే
వారు. ఒకవేళ చిన్న వయసులో పెళ్లి చేస్తే, పెళ్లి అయిన వెంటనే
పునస్సంధానము జరిపేవారు కారు. కారణము పెళ్లిజంటకు లోకానుభావము రావలెననే! అబ్బాయికి
15 అమ్మాయికి 12 సంవత్సరములున్నపుడు
వివాహమైతే, ముందు ఒకరికొకరు స్నేహితులౌతారు, ఆడుకుంటారు, పాడుకుంటారు ఆతరువాత ఆదిడంపతులవలె
అన్యోన్యత పెంచుకుంటారు. అప్పుడు వారిరువురికి బంధనము గట్టిపడి సక్రమమైన సంతానము
కలుగుటకు దోహద పాడుతారు. నిజానికి ఈ తంతులో పెద్దల పాత్ర ఎంతగానో వుంటుంది.
ముదుసలికి బాలిక నంటగట్టుట శాస్త్రములందు చెప్పబడలేదు. అట్టివి పదివేల కుటుంబాలలో
పది జరిగి వుంటే జరిగి ఉండవచ్చు. అసలు పెళ్లి మంత్రమే ఏమిచేబుతూ వుందో చూడండి :
అష్టాదశ
వర్షాత్కన్య పుత్రవత్ పాలితా మయా
ఇదానీం
తవ దాస్యామి దత్తం స్నేహేన పాలయా
'ఓ వర రత్నమా 18 సంవత్సరముల, కుమారునిగా
పెంచబడిన, నా బాలికను నీకు దాసిగా సమర్పిస్తున్నాను. ఆమెను
నీవు స్నేహితురాలిగా చూసుకొనేది' అని బాలిక తండ్రి వరునితో
చెబుతాడు. ఈ ఒక్క మాట చాలు మన పూర్వుల సంస్కారంకి తార్కాణముగా! నా బిడ్డ నీ
పనులన్నీ చక్కబెడుతుంది నీవు మాత్రము ఆమెను స్నేహితురాలిగా ఆదరముతో, అభిమానముతో ,ఆత్మీయతతో, అనురాగముతో,
అనునయముతో,అత్యంత ప్రేమతో, అసాధారణ సానుభూతి తో ( అసలు సానుభూతి అంటే 'అయ్యో
పాపము' కాదు, సహా+అనుభూతి అంటే ఒక
విషయము పై ఇరువురి స్పందన ఒకే విధముగా ఉండుట) ఇవి కావలసినవి .
నేను
చట్టమును విమర్శించుట లేదు గానీ నేడు వయసు ముదిరిన ఆడ మగ పిల్లల పెళ్ళిళ్ళు జరుపుత
ఎంత కష్టమౌతూ వుందో తల్లిదండ్రులకు తెలియనిది కాదు. అసలు ఈనాటి పెళ్ళిళ్ళలో
ఆడపిల్లలో సిగ్గు,
పిల్లవానిలో అమాయకత్వము నేతిబీరలోనేయ్యి పెరుగు తోటకూరలోని పెరుగు
అన్నది ఒక బహిరంగ సత్యము. మరి పెళ్ళయినా పదికాలాల పాటు ఉంటుందా అంటే అది చీదితే
ఊడేముక్కు, జాడీలో బూజు పట్టిన తొక్కు.
మరి
పెళ్లి వయసును నిర్ణయించిన మేధావుల సూచనలు సరియైనవేనా! ఈ కాలము యోగ్యత విజ్ఞత చేత
నిర్దారిమ్పబదుట లేదు. సంఘసంస్కరణల పేరుతో సంస్కర్తలగా తమకు తాము ఉద్ఘాటించుకొని
వీదులలోకోచ్చిన మహానీయులనేకులు అప్పటి పాశ్చాత్య ప్రభుత్వపు గుర్తింపు కొరకు కాదా
అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడో స్వార్థపరుల నడుమ జరిగిన కొన్ని అవకతవకలకు
భూతాద్దము పట్టి వీనిని సమూలముగా పెకలింప వచ్చిన అవతార పురుషులమని తాము చాటుకుని
తమ మద్దత్తుదారులచే చాటింప జేసుకున్నారేమో!
వీరేశలింగం
పంతులు గారిని గూర్చి కాస్త తెలుసుకుందాము.
April
16, 1848 న పుట్టిన వీరు ప్రారంభదశ నుండి ఆంగ్లేయ పాఠశాలల యందు
చడువుటచే పాశ్చాత్య నాగరికతా
విధానమును దేశీయ లేక ప్రాంతీయ విధానములకు జోడింప సమకట్టినారు. వారిని
గూర్చి ఈ క్రింది వివరములు పుష్టిని చేకూర్చుతాయి.
Receiving
formal education at an Indian school, Veeresalingam was sent to an English
school where his talents and versatility were noticed and underwent further
improvement.
Veeresalingam
completed his matriculation in 1869 and got his first job as a teacher in
Korangi village. After working as a teacher for sometime and as a head master
for two years, he moved to
Dhavaleswaram,
near Rajahmundry City as a head master in an English medium school.
వారికి
రావ్ బహద్దూర్ అన్న బిరుదమును ఘనమైన బ్రిటీషు ప్రభుత్వము ఇచ్చింది. వారి ధోరణిలో
వీరు పనిచేయుటవల్ల అన్న విషయమును మనకు తెలుపకనే తెలుపుచున్నది కదా!
He
was honored with title of "Rao Bahadur" in 1893 by the government in
appreciation of his work towards the society.
వితంతువులు
విదేశాలలో ఎటువంటి నియమములు పాి్టించేే వారో చూడండి.
In
some parts of Europe, including Russia, Czechoslovakia, Greece, Italy and
Spain, widows used to wear black for the rest of their lives to signify their
mourning, a practice that has since died out. Many immigrants from these
cultures to the United States as recently as the 1970's have loosened this
strict standard of dress to only two years of black garments. However, Orthodox
Christian immigrants may wear lifelong black in the United States to signify
their widowhood and devotion to their deceased husband.
Often,
women are required to remarry within the family of their late husband after a
period of mourning. With the rise of HIV/AIDS levels of infection across the
globe, rituals to which women are subjected in order to be "cleansed"
or accepted into her new husband's home make her susceptible to the
psychological adversities that may be involved as well as imposing health
risks.
As
of 2004, women in United States who were "widowed at younger ages are at
greatest risk for economic hardship.
లక్షలాది
సంవత్సరముల నాగరికతను త్రోసిరాజని క్రీస్తు శకము 14 వ శతాబ్దిలో కన్ను
తెరచిన నాగరికతను, ఎటువంటి పరీక్షా,పరిశీలన,
పరిశోధన లేకుండా ఆదర్శము చేసుకొనుట ఆత్మా సాక్షిగా ఆలోచించితే మనకే
అవగతమౌతుంది. వారు శేష జీవితమును , తమవేదికయైన
రాజమహేంద్రవరము, కాకినాడ విశాఖపట్టణము మొదలగు ప్రాంతములను
వదలి చేన్నపత్తనములో గడిపి 27 మే 1919
లో తనువూ చాలించినారు. వీరు చేసినారని చెప్పబడే సంస్కరణలలో బాలికలకు విద్య కూడా
ఒకటి. స్త్రీ విద్యనూ గూర్చి T.B. మెకాలే గారి Parliament
ప్రసంగాన్ని ఒకసారి చదవండి. 17, 18
శతాబ్దములలో కూడా స్త్రీలు ఎంత విద్యా వంతులై వుండినారో మీకే తెలుస్తుంది. ఈ
విషయముపై మీరు రాజీవ్ దీక్షిత్ హిందీ భాషణమును వింటే మన దేశములో స్త్రీ విద్య ఎంత
ప్రబలముగా ఉండేదో అర్థమౌతుంది. నేను నా చదువు మా అమ్మమ్మ గారి వద్దనున్దినే
మొదలుపెట్టినాను. ప్రాథమిక పాఠశాలకు పోకుండానే 6వ తరగతికి
ఉన్నత పాఠశాలలో చేరినాను. ఈ దేశములోని ఇల్లాండ్రు ఒకవేళ బడికి పోకున్నా తమ
పెద్దలద్వారా వలసిన చదువు విజ్ఞానము నేర్చుకున్నారు. స్త్రీల పరిస్థితి,,
14,15 శతాబ్దములలో పాశ్చాత్య దేశాములందు మిక్కిలి దయనీయముగా
వుండేది. ఘోష, లోపాముద్ర, గర్గి,
మైత్రేయి వంటి 27 మంది సాధ్వీమణులు మంత్రములను
ఋగ్వేదములో సంకలనము చేసినది మనము గమనిచ వచ్చును. ఝాన్సీ లక్ష్మి బాయ్(నవంబరు 19,
1828 –జూన్ 17, 1858) 12 వ శతాబ్దములోని,
నాయకురాలు నాగమ్మ, రాణీ రుద్రమ్మలు ఎంతటి
విజ్ఞానవంతులో మనకు తెలుసు.ఈ దేశములో చరిత్ర కందని చదువుకున్న స్త్రీలు ఎందరో మనము
లెక్క కట్టలేము. మరి చదువు లేనిది మన దేశపు స్త్రీలా ఆడుగడుగునా పురుషాధిక్యతతో
అవనత శిరములతో అవమానములను అనుభవించిన పాశ్చాత్య స్త్రీలా!
భారత
దెశమును తమ కబంధ హస్తాలలలో కబళించి యుంచుకున్న పాశ్చాత్యులు కొంత మంది
విద్యావంతులైన మహానుభావులను పలు విధములుగా ప్రలోభపెట్టి వారికి సంఘ సంస్కర్తలన్న
ముసుగు తగిలించి దేశముపైకి వదలినారు. అంతే కానీ అన్యధా కాదు.
మనసు
పెట్టి మన పూర్వుల చరిత్ర,
దేశ సంస్కృతి, వారి సేవానిరతి, వేద ప్రాశస్త్యము, శాస్త్ర పరిజ్ఞానము ను
తెలుసుకుంటే మనపై
మిగతది
మళ్ళీ ........
*********************************************************************************
మదర్స్ డే ఫాదర్స్ డే -- 7
4. వివాహము విడాకులు ను గూర్చి కాస్త తెలుపుతారా?
1. విడాకులు:
జనాభా పెరిగే కొద్దీ మనస్తత్వాలు కూడా ఒకరికొకరికి సంబంధము లేనంత ఎక్కువౌతాయి. 'పుర్రె కొక బుద్ది జిహ్వ కొక రుచి' అన్నారు పెద్దలు. 'లోకో భిన్న రుచి' అన్నది ఆర్య వాక్కు. రెండు వస్తువుల మధ్య కరుకుదనము ఎక్కువైతే రాపిడి కూడా అధికముగా వుంటుంది. ఈ సూత్రము జీవితానికి ఎంతో అన్వయించుతుంది. కరుకు దనానికి నునుపు దనము తోడైతే రాపిడి తగ్గుతుంది. అసలు ఇంకొక విషయం. చిన్నవయసులో అబ్బాయికి అమ్మాయికి పెళ్లి జరిగిందను కొందాము. వారు ఆటపాటల్లో ఒకరి నొకరు అర్థము చేసుకొంటూ ఏంతో ఆనందంగా జీవితాన్ని గడిపి వేస్తారు. కాలము మారింది. పరిస్థితులు మారినాయి. పరదేశ వాసనలు పెరిగినాయి. సంపాదనలోనే సర్వస్వ మున్నదన్న అపోహ ప్రబలిపోయింది. అన్నిటికీ మించి పెరిగే వయసుతో ఏర్పడిన స్థిరాభిప్రాయలతో 26-30 సంవత్సరాలమధ్య పెళ్ళిళ్ళు జరిగి తమ గ్రాహ్యత(perseption ) మార్చుకోలేక ఎన్నో పెళ్ళిళ్ళు పెడాకు లౌతున్నాయి. సర్దుబాటు తనము తగ్గిపోయింది. భార్య భర్తను గానీ భర్త భార్యను గానీ తన వైపు మార్చుకోవాలన్న తపన తగ్గిపోయింది. సర్దుబాటు తనమే 'క్షమ'(tolerance )అంటే తాలిమి. అది ఇప్పుడు మనలో వుందా. పెద్దలు 'తాలిమి తనను గాయు ఎదుటి వారిని గాయు' అని చెప్పినారు. రామాయణము బాలకాండ 33వ సర్గలో కుశ నాభుడు తన కుమార్తెలకు ఇట్లు చెబుతాడు 'అమ్మా మీరు క్షమ లో దేవతలనే మించినారు' అని చెబుతూ ఈ క్రింది శ్లోకాలను చెబుతాడు.
'అలంకారోహి నారీణాం క్షమాతు పురుషస్యవ
'అలంకారోహి నారీణాం క్షమాతు పురుషస్యవ
దుష్కరం తచ్చయత్ క్షాంతం త్రిదసేషు విశేషతః '
యాదృశీ వః క్షమా పుత్రః సర్వాసా మవిసేషితః
క్షమా దానం క్షమా యజ్ఞః క్షమా సత్యం హి పుత్రికాః''
క్షమా యశః క్షమా ధర్మః క్షమయా నిష్ఠితాం జగత్' ఈ 2 1\2 శ్లోకాల సారాంశము ఓర్పు అనగా క్షమా అధికంగా కలిగి యుండటమే . విడి పోవుటకు మూల కారణము ఆవేశము. అదే అన్ని అనర్థాలకు మూలము. విడిపోయిన తరువాత అంతా బాగుంటుందని ఎవరైనా చెప్పగలుగుతారా. రెండు వైపులా పెద్దలు ఒక తటస్తమైన మంచి మనసు కలిగిన మధ్య్వర్తితో చర్చలకు కూర్చుంటే మంచి ఫలితము రాదా. ‘శతకోటి దరిద్రాలకు అనంతకోటి వుపాయాలంటారు పెద్దలు.'మనసుంటే మార్గ మదే కనిపిస్తుంది. నిలకడ లేని ఆకుకు కంప చేట్టే గతి. ఆకు ఆడ గానీ మగ గానీ.
ప్రజాస్వామిక ప్రభుత్వాలు వచ్చిన తరువాత, కంపూటర్లు వచ్చిన తరువాత, విదేశీ సంస్కృతులు విరివిగా దిగుమతి చేసుకొన్న తరువాత విడాకులు విచ్చలవిడి అయినాయి గానీ, అంతకు ముందు ఈ సమస్యలు అరుదుగా తలెత్తినా ఇంటి గడప కే పరిమిత మయ్యేవి.

అసలు భారతీయ సాంప్రదాయ బద్ధమైన ‘వివాహం’ అన్న శబ్దానికి వ్యుత్పత్తిని గమనించండి.
సంస్కృతంలో 'వహ్' అనే ధాతువుకు 'వి' అనే ఉపసర్గను 'ఘఞ్' అనే ప్రత్యయాన్ని చేరిస్తే వి+వహ్+ఘఞ్ = వివాహః అనే పదం ఏర్పడింది. దీనికి అర్ధం విశేష ప్రావణం అనగా విశేషమైన (ప్రత్యేకమైన) సమర్పణం. ఈ పదానికి అనేక పర్యాయ పదాలున్నాయి. పరిణయం, ఉద్వాహం, కల్యాణం, పాణిగ్రహణం, పాణిపీడనం, పాణిబంభం, దారోప సంగ్రహణం, దార పరిగ్రాహం, దారకర్మ, దారక్రియ మొదలైనవి.
ఇయం సీతా మమ సుతా సహ ధర్మచరీ తవ |ప్రతీచ్ఛ చ ఏనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణినా |
పతివ్రతా మహభాగా ఛాయే వానుగతా సదా ||ఈ శ్లోకం, జనకుడు రాముని చేతిలో మంత్రజలం విడుస్తూ చెప్పింది.
పై శ్లోకమునకు అర్ధం -
'ఇయం సీత' ఇదిగో సీత. నా పుత్రిక. "కౌసల్యానందవర్ధనా! రామా! . ఈమె నీకు సహధర్మచారిణి. ఈమె నంగీకరించి పాణి గ్రహణం చెయ్యి. పతివ్రత అయిన మా సీత నిన్నెప్పుడూ నీడలాగ అనుసరిస్తుంది" అని చెప్పినాడు. ఎంతటి గొప్ప మాటనో చూడండి. నీడ వస్తువును వెన్నంటియే వుంటుంది. ఇంతటి సంస్కారముతో కూడిన భావములు వేరు ఏ మతముల కల్యాణము లందును కనిపించవు. అవి కేవలము ఆడ మగవారి మధ్య వడంబడికలే! అందుకే వారికి DIVORCE , تالق (TALAQ) వున్నాయి. మనది రెండు మనుషుల బంధము కాదు, రెండు మనసౌలా బంధము, రెండు కుటుంబముల బంధము. ఒకరి కొకరై తమ మధ్యన ఎటువంటి పొరపొచ్చులు వచ్చినా ఇరు పార్శ్వముల వారు ఒకచోట చేరి సదవగాహన సాధించి ఒక్కటి యగుటయే తమ ధ్యేయముగా కలిగి మంతనాలు సాగిస్తారు. అటువంటప్పుడు విడాకులు పొడాకులై కొట్టుకు పోతాయి గాలికి.

కళ్యాణ సమయములోని ఈ మంత్రమును వినండి.
విశ్వంభర స్సర్వ భూతా సాక్షిణ్య స్సర్వదేవతా
ఇమాం కన్యాం ప్రదాస్యామి పితౄణాం తారణాయవై
బ్రహ్మాదులు, సర్వ భూతములు, సర్వ దేవతల సాక్షిగా నా కన్యను స్వీకరించి మన ఇరు వర్గముల పితృ దేవతలను తరింప జేయుము.
ఇంకొక అతి ముఖ్యమైన మంత్రము గమనించండి.
అష్టాదశ వర్షాత్కన్య పుత్రవత్ పాలితా మయా
ఇదానీం తవ దాస్యామి దత్తం స్నేహేన పాలయా
'ఓ వర రత్నమా 18 సంవత్సరముల, కుమారునిగా పెంచబడిన, నా బాలికను నీకు దాసిగా సమర్పిస్తున్నాను. ఆమెను నీవు స్నేహితురాలిగా చూసుకొనేది' అని బాలిక తండ్రి వరునితో చెబుతాడు. అంటే భార్య దాసి కాదు అన్నది మనము అర్థము చేసుకొనవలసిన విషయము. ఈ విషయము గమనించండి, కన్యా దాత వరుని ఎంత నిర్దుష్టముగా నిర్మొహమాటముగా అడిగి అతని సమ్మతిని పొందుతాడో చూడండి.
కన్యాదాత : "ధర్మేత్వయా ఏషానాతి చరితవ్య"
ధర్మాచరణమున నీవు ఈమెను అతిక్రమించి చరింపరాదు.
వరుడు : "నాతిచరామి". అతిక్రమించి చరించను
క.దా : "అర్ధేత్వయా ఏషానాతి చరితవ్య" అర్ధార్జనమున నీవు ఈమెను
అతిక్రమించి చరించరాదు.
వ. : "నాతిచరామి"
క. దా : "కామేత్వయా ఏషా నాతి చరితవ్య"
కామాచరణమున ఈమెను అతిక్రమించి చరింపరాదు.

ఇక సంస్కృతములో మంత్రాలు చెబుతారు అంటే అందులో ప్రతియొక్క మాట ఒక హిత వాక్యము తప్పితే వేరేమీ ఉండదు. అందులోని మంత్రములను ఉదాత్త, అనుదాత్త, స్వరితములను స్థాయీ భేదములతో ఉచ్చరించుట వలన మంత్రము పరిపుష్టి చెంది యా మంత్ర ఫలమును అందజేస్తుంది. ఇది నేటి SCIENCE కూడా నిరూపించిన వాస్తవము. ఇటువంటి కొన్ని విషయములు తులసి, తులసీదళము అన్న ఎండమూరి వీరేంద్రనాథ్ నవలలు చదివితే కూడా తెలియవచ్చు. అసలు సంస్కృతము లేకుంటే సంస్కృతి లేదు మనము లేము అన్న వాస్తవాన్ని కలకాలమూ గుర్తుంచుకొనుట మనకు మన దేశ ప్రతిష్ఠకు ఎంతో ఆవశ్యకము.
ఇల్లాలు యొక్క ప్రాశస్త్యము ఎంత గొప్పగా విశధీకరించినారో మన పూర్వులు గమనించండి.
కార్యేషు దాసీ కరణేషు మంత్రీ
రూపేచ లక్ష్మి క్షమయా ధరిత్రి
భోజ్యేషు మాతా శయనేషు రంభా
షట్కర్మయుక్తా సహధర్మ పత్ని
అన్నారు. ఎక్కడా స్త్రీ ని మన పూర్వులు అగౌరవ పరచినది కానరాదు.
నీకు ఒక దాసిలా అన్ని పనులకు నా బిడ్డ చేదోడు వాదోడుగా వుంటుంది, ఆమెను స్నేహితురాలిగా చూసుకో అన్న ఈ మాట ఎంత గొప్ప మాటో చూడండి. నీకు దాసీ గా ఇస్తున్నా, నీవు స్నేహితురాలిగా చూసుకొనవలెను సుమా అంటున్నాడు. అది ఒకరికొకరు మమేక మైనపుడే సాధ్యమౌతుంది. అంటే ఆ విధముగా మీరు పాలూ నీరుగా కలిసి వుండండి అని చెబుతున్నాడు తండ్రి. ప్రపంచములోని ప్రబల మతములలో ఇటువంటి సూక్తులను వివాహక్రియ లో చూడలేరు.
వారు కలిగిన అమానుషాచారములు ఈ ధర్మమున ఆవగింజంత యైనను కానరావు. కావున పరమత పరాయణత్వమును మాని , ఆర్ష ధర్మావలంబులై జీవితమును కొనసాగించి కష్టములను ఎదుర్కొని పారద్రోలగల్గు శక్తిని కల్గి ఆలూ మగలు సుఖముగా జీవించ గలుగు మార్గము ఈ ధర్మమున మాత్రమె ఉన్నదని నా గట్టి నమ్మకము. ఇట్టి వివాహ బంధము జీవితమునకు అందము ఆనందము మధుర మకరందము.
*******************************************************************************
మదర్స్ డే ఫాదర్స్ డే -- 8
5. మరి స్త్రీలకు మన శాస్త్రములందు గౌరవ మివ్వ బడినదా?
స్త్రీ గౌరవము
జీవితములోని వివిధ సందర్భములలో వివిధ పరిమాణములు గల గౌరవము స్త్రీల కంగీకరింపబడినట్లే వివిధ పదవులలో నుండు స్త్రీలకు గూడ వివిధ పరిమాణములు గల గౌరవ మంగీకరింప బడినవి. అనగా తల్లి కొక విధమగు గౌరవమును, భార్య కొక విధమగు గౌరవమును, కూతున కొకవిధమగు గౌరవమును వితంతువున కొక విధమగు గౌరవమును ఇట్లే యొక్కొక స్థానములో నున్న స్త్రీ కొకవిధమగు గౌరవమును నంగీకరింపబడినవి. అందందఱికంటె మాతకు చూపబడిన గౌరవము సర్వాధికమై యొప్పుచున్నది. తల్లి, తండ్రి, గురువునను మువ్వురు పైనను భక్తి గల్గి యుండుట పరమధర్మము.

ఇమంలోకంమాతృభక్త్యా పితృభక్త్యాతుమధ్యమం
గురుశుశ్రూషయాత్వేవ బ్రహ్మలోకం సమశ్నుతే
(మను 2-233)
గురుశుశ్రూషయాత్వేవ బ్రహ్మలోకం సమశ్నుతే
(మను 2-233)
(ఈలోకమును మాతృ భక్తి చేతను మధ్యమ లోకమును పితృ భక్తి చేతను బ్రహ్మలోకమును గురు శుశ్రూష చేతను పొంద వచ్చును.)
మాతా మాతామహీ గుర్వీ పితృ మాతృష్వసార్దయః:
శ్వశ్రూ: పితామహి జ్యేష్ఠా జ్ఞాతవ్యా గురప:స్త్రియ:
(ఉశన: 1-26)
శ్వశ్రూ: పితామహి జ్యేష్ఠా జ్ఞాతవ్యా గురప:స్త్రియ:
(ఉశన: 1-26)
(తల్లి, మాతామహి, గురుభార్య తలిదండ్రుల యక్క చెల్లెండ్రు, అత్తగారు, నాయనమ్మ, అక్క-అను స్త్రీలు గురువులు)
ఆడపడుచులకు గూడ గృహములో గొప్ప గౌరవ మీయబడినది.
జామయోయా నిగేహాని శవంత్యవ్రతపూజితా:
తానికృత్యాహ తానీవ వినశ్యన్తి నమంతత:
(మను. 3-58)
తానికృత్యాహ తానీవ వినశ్యన్తి నమంతత:
(మను. 3-58)
(ఎవరి యక్క చెల్లెండ్రు పూజింపబడని వారై శపింతురో వారిగృహములు దయ్యము చేత కొట్టబడినవివలె నశించును)
సౌభాగ్యవంతురాండ్రగు నింటి యాడపడుచులకును గర్భిణులకును నతిథులకు కంటెనుగూడ ముందుగ భోజనము పెట్టవలెను.
సువాసినీ: కుమారీశ్చరోగిణో గర్భిణీస్త్రియ:
అతిథిభ్యోగ్రఏవైతాన్ భోజయేదవిచారయన్.
(మను. 3-114)
అతిథిభ్యోగ్రఏవైతాన్ భోజయేదవిచారయన్.
(మను. 3-114)
సాధారణముగ స్త్రీలందఱును పూజింపతగినవారే.
భర్తృభ్రాతృపితృ జ్ఞాతిశ్వశ్రూశ్వశురదేవరై:
బంధుభిశ్చస్త్రియ: పూజ్యాభూషణాచ్ఛాదనాశనై:
(యాజ్ఞ. 1-88)
బంధుభిశ్చస్త్రియ: పూజ్యాభూషణాచ్ఛాదనాశనై:
(యాజ్ఞ. 1-88)
(భర్తలు, భ్రాతలు, తండ్రులు, జ్ఞాతులు, మామలు, అత్తలు, మఱదులు, బంధువులు గూడ స్త్రీలను భూషణములతోను, భోజనములతోను, వస్త్రములతోను పూజింపవలెను.)
'పాణిగ్రహణాద్ధి సహత్వం సర్వకర్మను,
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
- (ఆ.ధ.2-14-17)
-
-
-
-
-
-
-
-
-
-
-
-
(పాణిగ్రహణమువలన స్త్రీకి కర్మలలో పురుషునితో సహత్వము కల్గుచున్నది.) అని చెప్పుటచేత పురుషుడే కర్మ చేసినను దానిని భార్యకూడ చేయుచున్నట్లే యర్థము. ఆమెకొన్ని కర్మలలో పాల్గొనవలసికూడ నుండును. అంతేకాదు, కొన్నిటిలో నామె వేదమంత్రములనుగూడ నుచ్చరింపవలసి యుండును.
మరి ఎక్కడ స్త్రీలకు గౌరవమివ్వలేదో చూడండి. పాశ్చాత్యులు కానీ వారి అనుయాయులుకానీ మన గ్రంధాలను అందుబాటులోనికి రానిక, మన జ్ఞాన గృహమును అంధకార బంధురము జేసినారు. మనము కుటుంబ బాధ్యతలతోనో, డబ్బు సంపాదించవలెనను తపన తోనో , వీటిని గూర్చి తెలుసుకొనక , మనలను తప్పుదారి పట్టించే ప్రచ్రనలను చదువుతూ గతి తప్పినాము. మనలను పెడత్రోవ పట్టించు రచనలు చేయుటకు అటువంటి రచనలు చేసే వారికి డబ్బిచ్చి ప్రోత్సహించి మరీ వ్రాయించుకొనుచున్నారు. ఆ వసతి ఈ ధర్మములో లేదు. ఏది చేసినా మనఃపూర్వకముగానే చేస్తాము. ప్రలోభాలకు లొంగి కాదు. ఈ విషయమును ఒక సారి గమనించండి:
6.మరి మన శాస్త్రాలలో 'న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి' అని అంటారు కదా నిజ మెంత?
'న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి'
ఈ వాక్యము యొక్క పూర్తి పాఠము ఈ విధముగా వున్నది
'పితా రక్షతి కౌమారే భర్తా రక్షతి యౌవ్వనే
పుత్రస్తు స్తావిరే భావే న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి'
ప్రకృతి సిద్ధమైన వాస్తవమేమిటంటే ఆడ మగల శారీరిక గుణ గణములు ఒకటి కాదు. ముదిమి మీద పడిన తరువాత ఒక జంటను గమనించితే భర్త భార్య కన్నా పెద్దవాడై యుండి కూడా ఆమెను తాను చేయి పట్టుకొని, అవసరమైనప్పుడు, నడిపిస్తుంటాడు. కొడుకులు,ఆ కాలములో అధికముగా నీతి వర్తనులుండే వాళ్ళు(రావణుడు,దుర్యోధనుడు మొదలగు వారంతా కూడా తల్లిని దేవత గానే భావించి పూజించినారు. ) తల్లి విషయములో తప్పుడు పనులు చేయలేదు. ఆ తల్లులు తనయుల సంరక్షణలో సంతోషంగా వుండినారు. ఇపుడు అసలు విషయానికి వస్తాము. నేటి కాలములో కూడా interview, college seat securing,మొదలగు విషయాలకు తండ్రులు పిల్లల వెంట పోవుచున్నారు. భార్యా భర్త సినిమాకు పొతే సాధారణంగా భర్త భార్య వెనకాలవుంటాడు. పురాణెతిహాసములలో ఎక్కడా స్త్రీలు మేము అస్వతంత్రులము అని చెప్పలేదు. 'న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి.’ అనే మాటను విచక్షణతో ఆలోచించితే, వారికి భగవంతుడొసగిన శారీరికాకర్షణలు సమాజములో తెచ్చిపెట్టే ఇబ్బందుల నుండి తప్పించ వలెనంటే రక్షణ కావలెను కావున వారు విచ్చలవిడిగా సంచరించ కూడదన్న అర్థములో 'న స్వాతంత్ర్యం' అని వాడినారు గానీ అన్యధా కాదు.'పితా రక్షతి కౌమారే భర్తా రక్షతి యౌవ్వనే' పెళ్లి అయ్యే వరకు తండ్రి పిమ్మట భర్త, ఆపై 'పుత్రస్తు స్తావిరే భావే’ అంటే వయసుడిగి కదలలేని తనము వచ్చినప్పుడు, ఆమె భర్త అంతకన్నా ముసలివాడై ఉంటాడు , లేక గతించి కూడా ఉండవచ్చును. కావున 'పుత్రః' కొడుకుల తోడ వద్దా!
మరి తోడుంటే స్వాతంత్రము లేదు అనేనా అర్థము!. ఇప్పుడు ఈ శ్లోకము స్త్రీలకూ తగునో తగదో మీరే నిర్ణయించుకోండి. ఇప్పుడు వాడే ‘స్వాతంత్ర్యము’ అన్న పదమునకు అర్థము మారి పోయింది. స్వతంత్రము అన్న పేరుతో తమ పుత్రికలు విచ్చలవిడిగా , నియమ రహితముగా తిరిగితే నిజమైన తండ్రి ఊరుకోగలడా! తండ్రికి వయసు మీరితే ఆ బాధ్యత అన్న దమ్ములు తీసుకోరా! పెళ్లి అయిన తరువాత భార్య (భరింప బడునది)కు రక్షణ చేసే బాధ్యత భర్త (భరించువాడు) ది కాదా!
విశృంఖలముగా, విచ్చలవిడిగా వీధులు బట్టి తిరుగుతఎనా స్వాతంత్ర్యము. Software సంస్థలలో సాయకాలము ,రాత్రి సమయములలో పనిచేసే స్త్రీ పురుషులలో కొందఱు Office Spouse అన్న దగ్గరితనమును గలిగి యుంటారని ఒక వినికిడి. నిజానిజములు మనకు తెలియనివి. దీనిని స్త్రీ స్వాతంత్ర్యము అనగలమా!
పూర్వము భర్త భార్యను వశేన్ వశిని అని పిలిచేవారు. అర్థము తెలియక 'ఒశేవ్' 'వాశినీ...' అన్న అసభ్య అర్థములకు అవకాశాన్ని కలిగించినారు కొందరు. అసలు 'వశేన్' 'వశిని' అంటే Lakshmi యన్న అర్థము వున్నదని నేను నా బాల్యములో గొప్ప పండితులైన పెద్దవారు చెప్పగా విన్నాను.
ఈ సందర్భములో ఒక సామెత చెబుతాను. " కాశీ పాత్ర విక్రయితి, కాంఛీ పాత్ర విక్రయితి, తిరుపతి మానిముంత నిశ్చయితి" అన్నది నా సామెత. యాత్రకు పోతే పాత్ర తేవలె నన్నది నాటి ఆచారము. బహుశ ఆ యాత్ర జ్ఞాపికగా ఉండవచ్చు. ఒక పేద బ్రాహ్మడు కాశీకి, కంచికి పోయినపుడు, ఒక్కొక్క ఇట్టాలి పాత్ర తెచ్చినాడట. ఆ కాలములో తిరుపతిలో మాత్రమె మాని ముంతలని ఎర్ర చందనముతో చిప్పలు, అబక కర్రలు ( కొయ్య గరిటెలు) బొమ్మలు తయారుచేసేవారు. తిరుపతి యాత్ర వెళ్ళిన వారు ఆ సామాను కొనటము కద్దు. ఆ బ్రాహ్మడు ఇల్లు జరగక ఇత్తడి పాత్రలను అమ్ముకున్నాడుగానీ తిరుపతి మానిముంతలు మాత్రము అమ్ముడు పోక తానె నిలుపుకున్నాడు . అందుకు అతడు బాధతో పై మాటలు అన్నాడు. మనము కూడా ఆవిధమైన లోహ పాత్రలవంటి కలకాలము విలువగలిగిన మాటలను వదిలి పెట్టి మానిముంతలవంటి విరిగి,పగిలి, కాలిపోయే సరుకును పట్టుకున్నాము, పెట్టుకున్నాము. ( పై మాట సందర్భానుసారముగా తీసుకునేది. ఈ నాడు ఎర్రచందనము ఎంతో విలువైనది. దానితో చేసిన వస్తువులు ఇప్పుడు తిరుపతిలో దొరుకుట కూడా లేదు, అక్రమ రావాణాదారులకు తప్ప)
********************************************************************************************************
7. అసలు ఈ మదర్స్ డే అనే ఆనవాయితీ ఏవిధముగా వచ్చింది కాస్త తెలుపుతారా?
3. మదర్స్ డే-Anna Jarvis (ఫాదర్స్ డే ను గూర్చి కూడా ఇందులోనే ఒకమాట చెప్పినాను.)
1914 లో వుడ్రో విల్సన్ కు 'అన్నాజార్విస్' చెప్పే వరకూ అమ్మ గుర్తుకు రాలేదు. ఆయన సెకరెట్రీ లకు గుర్తు రాలేదు. అసలు అమ్మ సేవాభాము తో మరణించే ముందు వరకూ అన్నా జార్విస్ కే అమ్మ గుర్తుకు రాలేదు. మన సాంప్రదాయమది కాదు. అమ్మ ఏ విధముగా మరణించినా ఆమె మరణ తిథి ని మరవకుండా గుర్తు పెట్టుకొని ప్రతి యేటా ఆ తిథిన అమ్మకు తద్దినం పెట్టె సాంప్రదాయము మనది. బ్రతికినంతకాలము ఆమె ఆ కుటుంబమునకు చేసిన సేవ అమూల్యము. ప్రతి అమ్మ కు ఆవిధం గా తద్దినమో తర్పణమో వదులుతూ వుంటే తల్లిని ఇంట జనాభా వుండే దేశము లో రోజూ తలచు కొన్నట్లు కాదా. అది daily, Mothers'Day అయిపోదా.
పాశ్చాత్యులు బ్రతికియున్న తమ స్వంత తల్లి\తండ్రి తో సంవత్సరానికి ఒక సారి భోజనము చేయుట వారి సాంప్రదాయము. క్రొవ్వొత్తులు కార్డు ముక్కలు వారి సంప్రదాయమే కానీ మనది కాదు. కావున ఆమె ప్రకటన (statement ) తమ వారికే గానీ మనకు కాదు. అసలు తన తండ్రితో తాను పుట్టిన పిదప తన అమ్మ తన తండ్రితో ఎంత కాలము వుండినది, విడిపోయిన తరువాత తలిదండ్రులు ఒక్కొక్క పర్యాయము ఒక్కొక్కరి వంతున ఎంత మందిని పెళ్లి చేసుకున్నారు అన్న వివరాలు మరియు , వారు ఒక వేళ స్వర్గస్థులై ఉంటే ఆ తేదీ వారికి తెలిసే అవకాశము మృగ్యము. అందుకే ఉమ్మడిగా ఒక తేదీ ఏర్పాటు చేసుకొన్నారు. మరి మనకు ఆయా తేదీలు మరపు రావు కదా! అటువంటప్పుడు మనకెందుకు వివిధములైన దినములు. అన్నా జార్విస్ అమ్మ మే 9, 1915 లో చనిపోతే, అన్నా మే 10, 1918 నాటికి సాధించింది. On May 10, 1908, three years after her mother's death, Jarvis held a memorial ceremony to honor her mother and all mothers at Andrews Methodist Episcopal Church, today the International Mother's Day Shrine, in Grafton, West Virginia, marking the first official observance of Mother's Day. The International Mother's Day Shrine has been a designated National Historic Landmark since October 5, 1992. Although Jarvis did not attend this service, she sent a telegram that described the significance of the day as well as five hundred white carnations for all who attended the service. As she spoke in Philadelphia at the Wanamaker's Store Auditorium, she moved her audience with the power of her speech.

In the ensuing years, Anna Jarvis embarked upon a campaign to make "Mother's Day" a recognized holiday. She spent a significant amount of time writing to countless business executives, church groups, and politicians at the state and national level to promote the commemorative day. (Wikipedia).
ఆమె గొప్ప వనిత . తన తల్లి జ్ఞాపకార్థము తాను ఏర్పరచిన రోజుననే ప్రపంచములోని ప్రజలంతా తమ తల్లులను కూడా తలచుకొమ్మని లోకానికి సందేశము నందించినది. ఇంకా ఈ విషయమును గమనించండి.
ఎవరి స్వార్థము వారిది అన్న రీతిలో మొదలైన ఈ 'డే' లకు మనము ఫిడేలు వాయించవలసిందేనా! A B అన్న జంట పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలు పుట్టి కళ్ళు తెరిచే లోపలనే A, C తో B, D తో పెళ్లి చేసుకుంటారు ఆ శృంఖల ఆ విధముగా కొనసాగుతూనే వుంటుంది. అందుకే ఆ జంటలు ముచ్చటించుకునేటపుడు ' Your children and my children are playing with our children' అని అనుకుంటూ సంతోష పడుతూ వుంటారు. ఇటువంటి సాంప్రదాయము కలిగిన వారు సంవత్సరములో ఒకరోజయిన తమ తల్లిని,'మదర్స్ డే' నాడు తమ తండ్రిని 'ఫాదర్స్ డే' నాడయినా అంటే సంవత్సరములో ఒకరోజయినా కలిసి భోంచేద్దామని అనుకుంటారు. మనకా సాంప్రదాయము ఉందా! ఒకవేళ లేదు అన్నది మీ జవాబైతే అటువంటివి జరుపుకోనుట అవసరమా! 'పుష్ప గుచ్చాలకు' GREETING CARDS (ఈ ఆనవాయితీనే మనకు లేదు. కాబట్టి తగిన తెలుగు పదము మన వద్ద లేదా అంటే మన భాష లో నాకు తెలిసినంత వరకు 'అభినందన పత్రిక'అని పెట్టుకొనవచ్చును.), WRIST BANDS (కంకణములు, తోరములు) వ్యర్థముగా డబ్బు ఖర్చుచేయుట అవసరమా! మన సాంప్రదాయములో తోరములు కట్టుకునే నోములలో తోరపూజ తప్పనిసరి. అది సమంత్రకముగా కట్టుకుంటారు. రాఖీ నాడు కూడా ఒక పసుపు దారమును దేవుని ముందుంచి మనసారా నమస్కరించి నాలుగు అక్షింతలు వేసి ఆడబడచు తన సహోదరునికి కట్టితే సరిపోయేదానికి ఈనాడు వందలు వేల రూపాయలను పెట్టి వానిని మార్కెట్లలో కొంటున్నాము. ఇకనైనా ఈ కట్టు 'పాట్లు' మానుకుని మన 'కట్టుబాట్ల'లలో మనము వుండే ప్రయత్నమూ చేద్దాము. అసలు ఇంత కష్టపడి వ్రాసిన ఈ వ్యాసము మీ పిల్లలు చదువుతారు అన్న నమ్మకము నాకు లేదు . కారణాలు రెండు.
8. మన దేశపు తల్లులు తమ పిల్లలు ఇల్లును గూర్చి, తమ దేశమును గూర్చి బాధ్యత ఎంతవరకు తీసుకుంటారు?
ఇక మన దేశపు తల్లుల గూర్చి ఒక నిముసము తలపొస్తాము.
బన్‌బీర్ అనే రాజు చిత్తోఢ్ ను ఆక్రమించి యువరాజు ఉదయ్ సింగ్‌ను చంపడానికి వస్తే, దాసి పన్నాతాయి తన కొడుకును ఉదయ్ సింగ్ స్థానంలో వుంచి ఉదయ్‌ని తప్పించుటకు ఆమె తన కన్నకొడుకును బన్‌బీర్ కత్తికి బలిచేసిన యదార్థము నిజంగా కంటతడి పెట్టిస్తుంది. ఇక అనంతామాత్యుడు వ్రాసినాడని చెప్పబడే ఆవు పులి కథ అందరికీ తెలిసినదే! నిజము , నిజాయితి, కన్నా బిడ్డపై మమకారము తెలిపే కథ, పిల్లల కొరకు ప్రాణాలనే త్యాగము చేసిన తల్లుల గాథలు ఎన్నో! ఇవేవి గాకుండా మరి జార్విస్ గారి Mothers’Day నే మనము పాటించవలసిన అవసరము వున్నదా! ‘ తల్లికి పెద్ద పీట వేసిన ‘మాతృదేవోభవ’ అన్న ఆర్య వాక్కు జార్విస్ గారి Mothers’Day కన్నా కొన్ని వేల (మాట వరుసకే, ఇంకా ఎక్కువ కాలమే కావచ్చు) సంవత్సరాల క్రితము నాటి మాట మనము సరకుగొన నవసరము లేదా! మనము తిథి వార నక్షత్ర యోగ కరణ సహిత నిర్దుష్ఠమైన మన పంచాంగమును అనుసరించి తిథిని పాటించుతాము. ఆ ప్రకారమే మన పితరుల స్వర్గస్థ దినమును గుర్తుంచుకొని ఆ రోజు మన శక్త్యానుసారము పుణ్య కార్యములుచేసి వారిని తలంచుకుంటాము. వాళ్ళకన్నా పూర్వీకులు గానీ లేక ముఖ్యులై (ఒకవేళ తల్లిదండ్రులే కావచ్చు గాక) వారి స్వర్గస్థ తిథి తెలియకపోతే మహాలయము నాడు తర్పణము వదులుటయో, లేక ఏదయినా పుణ్యకార్యము చేయుటయో చేస్తాము. మాహాలయము నాడే ఈ విశ్వము లయమైనది అన్నది శాస్త్రవాక్కు. అందువల్ల ఆ రోజుకు అంత ప్రాముఖ్యత. అసలు భాద్రపద కృష్ణ పక్షము అంతా మహాలయ పక్షము అంటారు. నేను పాశ్చాత్యులను తప్పు పట్టుట లేదు. మన ఆచారముల మరచి వారి మాట మనకు శిరోధార్యము అన్న తలపులు కలిగిన వారి కొరకు ఇది వ్రాయ వలసి వచ్చింది.
1909 లో ఎందరో సెనేటర్లు ఆమె యొక్క ‘Mother’s Day holiday’ ఆలోచనను అవహేళన చేసినారు. ఆమె తీర్మానమును మూర్ఖత్వమునకు ప్రతీక యని హెన్రీ మూర్ అను సెనేటరు ఈసడించినాడు. నేను పొందె ప్రతిదినము Mother’s Day నె అన్నాడు. సెనేటరు జాకోబ్ గల్లింజెర్ (Senator Jacob Gallinger) అసలు ఈ ఆలోచనే మాతృ భావనకు కళంకమన్నాడు. ప్రతి మే నెల రెండవ ఆదివారమున (పై సంవత్సరమున మే 10 న ఆ రెండవ ఆదివారము వచ్చినది) వచ్చే ఈరోజున బాహిరములైన ఆర్భాటములు మాతృ ప్రేమకు మాయని మచ్చ అన్నారు. ఆమె ఈ ప్రతిపాదన తెచ్చినపుడు ఆమెను బాల పరచినవారు పుష్పగుచ్చ సంస్థల యజమానులు. ఆమె వారి మద్దత్తును అంగీకరించి విరాళాలు కూడా వారినుండి గ్రహించినది. అట్లు వారి మద్దత్తుతో పుష్ప గుచ్ఛములను (carnations) ఇచ్చుట ఒక ఆపలేని ఆనవాయితీ కూడా అయి కూర్చొన్నది. ఆ తర్వాత కాలములో ఆమె వద్దన్నా ఆ విషయముల పట్టించుకున్న వారు లేరు. ఇది ఇట్లుండగా ఈ సంస్థలు బ్రతికియున్న తల్లుల కోసం అమితముగా ఆకర్షించే పుష్పములను ధరించుటను ఆనవాయితీ గా చేసినారు. ఆపై ఇంకా ఎన్నో మార్పులు చేర్పులు కూర్పులు తప్ప హార్దికమైన అనురాగము అమావాస్య నాటి చంద్రుడే!
ఆవసానదశ లో అప్పులపాలై ఆరోగ్యము బాగులేక ఆసుపత్రి పాలైన అన్నా అప్పులను అంతో ఇంతో ఉదాత్తముగా కట్టినారట ఆ carnations వారు . ఆమె 1948 నవంబరు 24 న దయనీయముగా మరణించినది.
1. వారు ఇంత తెలుగు చదవలేరు\ఓపికగా వినలేరు.
2. వారు ఇంతసేపు చదవలేరు\ విననూలేరు.
3. ఒకవేళ తల్లిదండ్రులు చదివినా బిడ్డలకు చెప్పుకునే అవకాశము ఉండదు. ఒకసారి వీరబ్రహ్మము గారు తన శిష్యుడు సిద్దయ్యతో 'లోకమెట్లుందిరా సిద్దా' అని అడిగినాదట! అందుకు బదులుగా సిద్దయ్య ' ఏం జెప్పెది సామీ ఎవరిలోకం వాళ్ళది' అన్నాడట. ఇదీ నేటి పరిస్థితి లేక దుస్థితి.
8. మన దేశపు తల్లులు తమ పిల్లలు ఇల్లును గూర్చి, తమ దేశమును గూర్చి బాధ్యత ఎంతవరకు తీసుకుంటారు?
గృహిణి -- ఇంటికి పొదిగిన మణి
చదువు సంధ్య లేకున్నా సంస్కారములో మిన్న
పెంపకాన మనసుంచును కలిగియున్న బుద్ధికన్న
మెతుకు గతుకునోలేదో తనకు మాత్రమె తెలుసు
బిడ్డ కంటిలో ఎపుడూ పడనీయదు నలుసు
కన్న కలలు పగలంతా రెప్పలపై ఏర్చిపేర్చు
పనులన్నీ ముగియుదాక రేయినిదురనోదార్చు
ఇంటిబయట తనపేరును అంటించగ తా కోరదు
తన సేవాధర్మముతో ఇంటి యశము సమకూర్చు
మొగుని విసుగు నంతయును ముసినవ్వున మరుగుపరచు
మూతిని ముడిచిన మొగ్గను కుసుమముగా వ్యక్త పరచు
మానై తా నెండ నోర్చి తెరువరులకు నీడనిచ్చు
ఇంటికి తా దేవతయై స్వర్గమునే నిలిపియుంచు
ఇక మన దేశపు తల్లుల గూర్చి ఒక నిముసము తలపొస్తాము.
బన్‌బీర్ అనే రాజు చిత్తోఢ్ ను ఆక్రమించి యువరాజు ఉదయ్ సింగ్‌ను చంపడానికి వస్తే, దాసి పన్నాతాయి తన కొడుకును ఉదయ్ సింగ్ స్థానంలో వుంచి ఉదయ్‌ని తప్పించుటకు ఆమె తన కన్నకొడుకును బన్‌బీర్ కత్తికి బలిచేసిన యదార్థము నిజంగా కంటతడి పెట్టిస్తుంది. ఇక అనంతామాత్యుడు వ్రాసినాడని చెప్పబడే ఆవు పులి కథ అందరికీ తెలిసినదే! నిజము , నిజాయితి, కన్నా బిడ్డపై మమకారము తెలిపే కథ, పిల్లల కొరకు ప్రాణాలనే త్యాగము చేసిన తల్లుల గాథలు ఎన్నో! ఇవేవి గాకుండా మరి జార్విస్ గారి Mothers’Day నే మనము పాటించవలసిన అవసరము వున్నదా! ‘ తల్లికి పెద్ద పీట వేసిన ‘మాతృదేవోభవ’ అన్న ఆర్య వాక్కు జార్విస్ గారి Mothers’Day కన్నా కొన్ని వేల (మాట వరుసకే, ఇంకా ఎక్కువ కాలమే కావచ్చు) సంవత్సరాల క్రితము నాటి మాట మనము సరకుగొన నవసరము లేదా! మనము తిథి వార నక్షత్ర యోగ కరణ సహిత నిర్దుష్ఠమైన మన పంచాంగమును అనుసరించి తిథిని పాటించుతాము. ఆ ప్రకారమే మన పితరుల స్వర్గస్థ దినమును గుర్తుంచుకొని ఆ రోజు మన శక్త్యానుసారము పుణ్య కార్యములుచేసి వారిని తలంచుకుంటాము. వాళ్ళకన్నా పూర్వీకులు గానీ లేక ముఖ్యులై (ఒకవేళ తల్లిదండ్రులే కావచ్చు గాక) వారి స్వర్గస్థ తిథి తెలియకపోతే మహాలయము నాడు తర్పణము వదులుటయో, లేక ఏదయినా పుణ్యకార్యము చేయుటయో చేస్తాము. మాహాలయము నాడే ఈ విశ్వము లయమైనది అన్నది శాస్త్రవాక్కు. అందువల్ల ఆ రోజుకు అంత ప్రాముఖ్యత. అసలు భాద్రపద కృష్ణ పక్షము అంతా మహాలయ పక్షము అంటారు. నేను పాశ్చాత్యులను తప్పు పట్టుట లేదు. మన ఆచారముల మరచి వారి మాట మనకు శిరోధార్యము అన్న తలపులు కలిగిన వారి కొరకు ఇది వ్రాయ వలసి వచ్చింది.
తలిదండ్రులను గౌరవించు విషయము మనము ఇతరుల వద్ద నేర్చుకోను కర్మ పట్టలేదు.
సంస్కృతిని సనాతన కాలము నుండి నే సకల దిశలకూ వ్యాపింప జేసిన ఈ దేశమునకు, అనుబంధము, ఆప్యాయత అనురాగము, ఆత్మీయత, అంతఃకరణ, అంటే తెలియని అన్య దేశములనుండి ఉపదేశములు వినే దుర్గతి పట్టనీయకండి. ‘ధర్మ ఏవ హతో హన్తి ధర్మో రక్షతి రక్షితః’ అన్న ఆర్య వాక్కును మనసున ధరించండి. దేశాన్ని, ధర్మాన్ని, సంస్కృతిని కాపాడండి. గర్వముగా మన దేశ పతాకను హిమాలయాలపై సదా ఎగుర నివ్వండి.
************************************************************************************
9. FRIENDSHIP DAY ను గూర్చి మీ అభిప్రాయమును తెలుపుతారా?************************************************************************************
ఉత్సవే వ్యసనే ప్రాప్తే దుర్భిక్షే శత్రుసంకటే
రాజద్వారే శ్మశానేచ య తిష్ఠతి స బాంధవః
ఆనందములోనూ ఆపత్తులోనూ దుర్భిక్షము లోనూ దుష్ట బాధలందును మహారాజు ఆస్థానములోనైనా మరుభూమియందైనా అండగా నిలచినవాడే అసలైన మిత్రుడు. అసలు సూర్యునికి మిత్రుడు అన్న నామాంతరముంది. మరి నిజంగానే ఈ సృష్ఠికి ఆయన మిత్రుడే కదా. ఆయన వెలుగేలేని ఒక రోజునైనా ఉహించగాలమా! ఎన్ని చిక్కటి మబ్బులకైనా చిక్కక ,అంతో ఇంతో ఎంతో కొంత తనకు వీలయినంత వెలుతురు లోకానికి పంచే ఆయన, మిత్రులు అనిపించుకోదలచిన వారలకు, ఆదర్శప్రాయుడు కావలెను. ఆయన సహాయ సహకార సౌజన్యములులేక మనమేపనయినా చేసుకోగలమా! స్నేహిత ధర్మమంటే అది. మరి రాత్రి వుండదే అంటే అది నీ వ్శ్రాంతి కొరకే! అందుకే పెద్దలు
దదాతి ప్రతిఘృహ్ణాతి గుహ్యమాఖ్యాతి పృచ్ఛతి
భుంక్తేచ భోజయిత్యైవ ఇత్యేతత్ మిత్ర లక్షణం
భుంక్తేచ భోజయిత్యైవ ఇత్యేతత్ మిత్ర లక్షణం
అన్నారు పెద్దలు. కష్ట సుఖాలు ,మంచిచెడ్డలు, ఆపదానందాల నన్నింటిలో భాగస్వామ్యము కలిగినవాడే అసలైన మిత్రుడు. అట్టి మిత్రుని ఒక రోజు తలచుకుంటే సరిపోతుందా! మన పురాణ ఇతిహాసాలు తిరుగ వేస్తే ఎంతోమంది అనిర్వచనీయమైన స్నేహ శీలురను చూడవచ్చు. వారికి (FRIENDSHIP Day) మైత్రీ దివసమన్న ఆలోచన రాలేదు. ఒకరి కొర కొకరు ప్రాణత్యాగము చేయుటకు కూడా వెనుకాడలేదు. ఇటువంటి నిరర్థకమైన సాంప్రదాయాలను ముఖ్యముగా మన పిల్లలపై రుద్ది కోట్ల ధనమును పాశ్చాత్య సంస్థలు వారి అనుబంధములైన దేశీయ సంస్థలు కొల్లగొట్టుచున్నారు.
************************************************************************************************************
ప్రేమికుల దినము :
ప్రేమికుల దినము :
ప్రేమల పేరిట నేటి సమాజంలో జరుగుతున్న అఘాయిత్యాల్ని నిత్యం చూస్తూనే ఉన్నాం. ఈ ప్రేమలు అంతకంతకూ వెర్రితలల్ని వేస్తూనే ఉన్నాయి. ఇటువంటి విషమ,విపత్కర, విపరీత పరిస్థితుల్లో విదేశాల నుండి ఈ మధ్య దిగుమతి అయిన ‘వాలెంటైన్స్ డే’ (ప్రేమికుల రోజు) అనే పండుగ సామాజికంగా మరిన్ని అవకతవకలకు అవకాశాల్ని కల్పించాతమే గాక పరాయి సంస్కృతి పై మన అవగాహనా రాహిత్యాన్ని కూడా ఎత్తి చూపుతూ ఉందేమో! ముందుగా ఒక్కమాటలో చెప్పాలంటే... ఇదొక అంటు జాడ్యపు దండుగ పండుగ’’. వాలెంటైన్ అనబడే ఇటలీ దేశస్థు డొకడు ప్రేమ గురించి తన ప్రాణాలను ధార పోసినాడని, అతను మరణించిన రోజుని ఫిబ్రవరి 14 గా స్థిరపరచుకుని ఆ రోజున అతని పేర ‘ప్రేమికుల రోజు’ను జరుపుకుంటున్నామని నేటి ప్రేమికులు చెప్పుకుంటున్నారు. వీరు చెప్పే ఈ అంశంలో నిజాము నేతి బీర లోని నెయ్యి మాత్రమె! చరిత్ర పుటలను తిరగివేస్తే అసలు విషయం బయలుపడుతుంది. వాలెంటైన్ వివరాలు కచ్చితంగా, సుస్పష్టంగా చరిత్రలో లేవు. 3వ శతాబ్ద కాలంలో ఇటలీ దేశ చరిత్రలో ముగ్గురు వాలెంటైన్లు కన్పిస్తున్నారు. ఒక వాలెంటైన్ మతాధికారిగా ఉండేవాడు. మరో వాలెంటైన్ రోమ్ చక్రవర్తి గ్లాడియస్-2 సైన్యంలో ఒక సైనికుడుగా ఉండేవాడు. 3వ వాలెంటైన్ ఒక రోము దేశ సామాన్య పౌరుడు. మొదటి వాలెంటైన్ మతాధికారిగా ఉంటూనే మరణించాడు. 2వ వాలెంటైన్, రోమ్ చక్రవర్తి గ్లాడియస్-2చే వధించబడ్డాడు. దీనికి ఒక కథ ఉంది. చక్రవర్తి గ్లాడియస్-2, తన సైనికులెవరినీ వివాహం చేసుకోనిచ్చేవాడు కాదు. అలా అయితే సైన్యం పూర్తిగా శక్తివంతంగా ఉంటుందని అతని భావం. అయితే ఆ సైనికులలో ఒకడైన వాలెంటైన్ తన సహచరులైన సైనికులకు రహస్యంగా పెళ్ళిళ్ళు జరిపించే వాడట. ఈ సంగతి తెలుసుకున్న చక్రవర్తి, ఆ వాలెంటైన్ ను వధించాడు. దీన్ని బట్టి చూస్తే, ఈ 2వ వాలెంటైన్ ఒక పెళ్ళిళ్ళ బ్రోకరు అని తెలుస్తుంది. ఇక 3వ వాలెంటైన్ సంగతి! ఇతనొక సాధారణ పౌరుడు కాబట్టి ఈతని ఘనతను గూర్చి నా పరిశోధన ఫలించలేదు.
ఈ ముగ్గురు వాలెంటైన్లలో ఏ ఒక్కడూ అమర ప్రేమికుడు అని చెప్పుటకు అర్హత లేనివాడే! ఇక ఫిబ్రవరి 14 అనే తేదీ వీళ్ళ పుట్టిన లేక చచ్చిన తేదీలు కావు.
ప్రాచీన రోమన్లు పూజించే దేవతల్లో ‘జూనో’ అని ఒకావిడ ఉంది. ఆ దేవత ‘‘స్త్రీలకు ప్రాతినిధ్యము వహించే దేవత’’ అని వారి నమ్మకం. ఆ జూనో పై ఉన్న భక్తి శ్రద్ధలతో ఫిబ్రవరి 14వ తేదీన రోమ్‌లో సెలవు ప్రకటించుకుని ఉత్సవాలు చేసుకునేవారు. ఫిబ్రవరి13 నుండి15వ తేదీన రోమ్ నగరంలో ఎంతో ఉత్సాహంతో జరుపుకునే వసంతోత్సవం క్రమంగా ఫిబ్రవరి 14కు మారిపోయింది. ఈ విధముగా 14వ తేదీకి ప్రాముఖ్యత వచ్చింది. క్రమేణా ఆ జాడ్యము మన ఆధునిక సాంప్రదాయ, సాంస్కృతిక గురువైన అమెరికా కు ప్రాకింది. అమెరికన్ పౌరులు, తమ పరస్పర ప్రేమల్ని తెలియ బరచు కొనుటకు ఆ రోజున ప్రేమ కార్డులను పంచడము మొదలు పెట్టినారు. ‘వాలెంటైన్’ దశ తిరిగింది. ముగ్గురు వాలెంటైన్లలో వాలెంటైన్ అన్న పేరును మాత్రము తీసుకుని, వాడికి అమర ప్రేమికుడుగా ముద్రవేసి ఏ మాత్రం సంబంధం లేని ఫిబ్రవరి 14వ తేదీకీ ముడి పెట్టి పుణ్యం కట్టుకున్నారు లోకాన్ని వెర్రివాళ్ల గా తయారు చేయగల ధీమంతులు. ‘‘వాలెంటైన్స్ డే... ఫిబ్రవరి 14... ప్రేమికుల రోజు’’ అంటూ మొదలయింది. అనేక దేశాల్లోకి ఈ వెర్రి పాకింది. అయితే ఈ మధ్య ఈ వెర్రి మరీ ముదరడం చూసిన చాలా దేశాల ప్రభుత్వాలు తమతమ దేశాల్లో ఈ ‘ప్రేమికుల పండుగ’ను నిషేధించాయి. చివరకు అమెరికాలో కూడా కొన్ని ప్రాంతాల్లో నిషేధించినారు. అయితే మన భారతదేశంలో మాత్రం ఈ పిచ్చి అంతకంతకూ ముదిరి పాకాన పడుతూ వుంది. Google నుండి సేకరించిన ఈ వాస్తవాలను చదవండి.
Lupercalia was a very ancient pre-Roman pastoral festival, observed on February 13 through 15, to avert evil spirits and purify the city, releasing health and fertility. Lupercalia subsumed Februa, an earlier-origin spring cleansing ritual held on the same date, which gives the month of February (Februarius) its name. Pope Gelasius I—who was pope from March 492 to his death in November 496—suppressed the Pagan festival and Christianised it by associating it with a martyred priest Valentine of Rome who was said to have received a rosary from the Virgin Mary.
In Roman mythology, Lupercus is a god sometimes identified with the Roman god Faunus, who is the Roman equivalent of the Greek god Pan. Lupercus is the god of shepherds. His festival, celebrated on the anniversary of the founding of his temple on February 15, was called the Lupercalia. His priests wore goatskins. The historian Justin mentions an image of "the Lycaean god, whom the Greeks call Pan and the Romans Lupercus," nude save for the girdle of goatskin, which stood in the Lupercal, the cave where Romulus and Remus were suckled by a she-wolf. There, on the Ides of February (in February the ides is the 13th), a goat and a dog were sacrificed, and salt meal cakes prepared by the Vestal Virgins were burnt.
ప్రేమికులు అన్న పేరు వినిపిస్తూనే ప్రతి యొక్కరూ ‘‘లైలా మజ్ను, రోమియో జూలియట్’’ అని చెబుతారు. రోమియో జూలియట్ ల కథను నికోలస్ రో, చార్లెస్ గిల్దన్, లార్డ్ కేమ్స్ మొదలయిన వారి తీవ్ర విమర్శలకు గురియైనది. శామ్యూల్ జాన్సన్ అన్న విమర్శకుడు మాత్రము దీనిని పొగిడినాడు. అసలు పొగిడినా తెగిడినా అసలా కథలో వాస్తవికత మృగ్యము. షేక్‌స్పియరు తన వర్ణనలతో, క్రొత్త పాత్రలతో ఆ కథకు నాటకీయతను ఆపాదించినాడు. ఇది అసలు మన సంస్కృతిని ప్రతిబింబించదు.
ఇక లైలా మజ్నుల కథ పర్షియాకు చెందినది. దానిని ఎంతో మంది చిలువలు పలువలు చేసి వ్రాసినారు. హతేఫీ అను పర్షియన్ రచయిత వ్రాసిన ప్రతిని మన దేశములో ప్రచురించి సర్ విలియం జోన్సు గారు దీనికి అత్యంతమైన ప్రాచుర్యము ప్రాధాన్యత చేకూర్చినారు.
Hatefi’s (d. 1520) version of romance of the couple became popular in Ottoman Turkey and India. Sir William Jones published Hatefi's romance in Calcutta in 1788. (Wiki)
రోమియో జూలియట్, లైలా మజ్ను లు ప్రేమకు ప్రతీకలై కూర్చొన్నారు.
మనకు పొరుగింటి పుల్లగూర రుచి కదా! అందువల్ల మన వారికి మన హిందూ ప్రేమికుల పేర్లేవీ మచ్చుకయినా తెలియవు. రాణీ సంయుక్త, పృథ్వీరాజుల పేర్లు ఎంత మందికి తెలుసునో నాకు తెలియదు. హీన స్వభావుడైన సంయుక్త తండ్రివల్ల పృథ్వీరాజు మరణము, దేశమునకు ముస్లీముల పరిపాలనము సంక్రమించినది. నిజమైన అమర ప్రేమికులు వారు. వారు తమ పవిత్ర ప్రేమను గెలిపించుకుని పెళ్ళి చేసుకుని, కాపురం చేశారు. దేశభక్తులైన వీరిద్దరూ విదేశీ దురాక్రమణదారులను ఎదిరించి వీరస్వర్గం పొందటము జరిగింది.
అసలు అంతగా ‘ప్రేమికుల రోజు’ అనే పండుగ చేసుకుని తీరాలని భావిస్తే ‘న భూతో న భవిష్యతి’ అనే విధంగా ఎన్నో ప్రేమలను విజయవంతం చేసిన శ్రీకృష్ణ పరమాత్ముని జన్మదినాన్ని (శ్రీకృష్ణాష్టమిని) ‘ప్రేమికుల రోజు’గా నిర్వహించుకుంటే పుణ్యం, పురుషార్థం లభిస్తాయి. శ్రీ కృష్ణుడు తనను మనసారా ప్రేమించిన రుక్మిణిని వీరోచితంగా చేపట్టాడు. అర్జునుణ్ణి ప్రేమించిన తన చెల్లెలు సుభద్రకు ఎదురైన అడ్డంకులను చాకచక్యంగా తొలగించి, విజయవంతంగా వివాహం జరిపించాడు. కావున శ్రీ కృష్ణుడు ‘నిజమైన ప్రేమకు ప్రతీక!’ మనం ప్రేమికుల రోజు జరుప దలచుకుంటే ఆయన జన్మదినమైన కృష్ణాష్టమికి మించిన మంచిరోజు ఉంటుందా!

అందుకే బాధ్యత గలిగిన తల్లి దండ్రులు ఈ విధముగా తమ పిల్లలకు అవసరము లేని స్వతంత్రమును ఇచ్చుట సమంజసమా? అని ఒక్క సారి ఆలోచించితే మంచిది. చేతులు కాలిన పిదప ఆకులు పట్టుకొనీ లాభము ఉండదు. ఈ వయసులో తల్లిదండ్రులు ఎంత ఎక్కువగా తమ పిల్లలతో స్నేహితము పెంచుకుంటే అంత మంచిది. అసలు అటువంటి రోజున కుటుంబము అంతా కలిసి ఒక గుడికో, గోపురానికో, గురువు దగ్గరికో వెళ్ళితే పిల్లలో వుండే అనైతిక ఆలోచనలకు అడ్డుకట్ట వేసినట్లౌతుంది. లైంగిక పరమైన ఉత్తేజమును కలిగించే
కథలు, కవితలు వ్రాయుట, ప్రచారము చేయుట మొదలైన పనులను ప్రచార సాధనాలు నిలిపితే, నిజమునకు, దేశమున కెంతో మేలుచేసిన వారవుతారు.
ఎంతో ప్రగతిని సాధించవలసిన యువత అధికముగా గల (దాదాపు 65%) ఈ దేశమున ఈ విధమైన సాంప్రదాయమునకు దోహదము చేయుట దేశమును నిర్వీర్యము చేయుటే !
మహనీయుడు వివేకానందుడు చెప్పిన Relationships are more important than life, but it is important for those relationships to have life in them…. ఈ మాటతో ఈ విషయాన్ని ముగిస్తున్నాను .
ఇంకొక రోజు మరికొంత......
**************************************************************************************
ఫాదర్స్ డే మదర్స్ డే- ఫాదర్స్ డే..... 4
సతి
అసలు ఈ వివరమును ఒక సారి గమనించితే ‘సతి’ కి ప్రాధాన్యత మన దేశాచారము లో లేదన్నది మనకు తెలుస్తుంది. ఇది కేవలము విదేశీ దండయాత్రల వల్ల ఏర్పడిన విపత్కర బాధామయ పరిస్థితి. లక్షలాది స్త్రీలను బలాత్కరించగా
కోట్లాది స్త్రీలు ఆత్మా సమర్పణము గావించుకున్నారు. అసలు ‘సతి’ అన్న మాట ఈశ్వరుని పత్ని ‘సతీ దేవి’ తండ్రి యగు దక్షుని చే అవమానమును పొంది యజ్ఞకుండమునకు ఆహుతి యగుట వల్ల ఆ పేరు సిద్ధమైనది. దీనిని బట్టి కూడా ఆ దురాచారము శాస్త్ర చోదితము కాదని తెలియుచున్నది. అసలు సింహాసన ద్వాత్రింశికలో, యుద్ధమునకు వెళ్ళు వీరుడు తన ఇల్లాలిని రాజు యండ లో నుంచి యుద్ధమున వీరమరణము పొందగా ఆమె సహగమనమునకు ఉద్యుక్తురాలయినపుడు రాజు ఎంతగానో నివారించగా ఆమె ఈ విధముగా చెబుతుంది. అసలు భర్త లేని ఇల్లాలికి కలుగు ఇబ్బందులు ఆమె ఎంత వివరముగా తెలుపుతుందో చూడండి.
"అకులపాటుతోడ అశుభాకృతియై యొకవేళనైన, పో
కాకును లేక, సొమ్ములకునర్రులు సాపక, పేరటంబులన్
పోక తొరంగి, పూతలును పువ్వులు దూరముగాగ ముండయై
యేకడ జేరినన్ విధవ కెగ్గులె కాక తరింపవచ్చునే?
కాకును లేక, సొమ్ములకునర్రులు సాపక, పేరటంబులన్
పోక తొరంగి, పూతలును పువ్వులు దూరముగాగ ముండయై
యేకడ జేరినన్ విధవ కెగ్గులె కాక తరింపవచ్చునే?
చచ్చియు చావక తనలో
వెచ్చుచు నియమముల నింక విధవత్వమునన్
నిచ్చట మాడుటకంటెను
చిచ్చురుకుట మేలు సతికి క్షితి మెచ్చంగన్
వెచ్చుచు నియమముల నింక విధవత్వమునన్
నిచ్చట మాడుటకంటెను
చిచ్చురుకుట మేలు సతికి క్షితి మెచ్చంగన్
దీనిని బట్టి కూడా ఇది శాస్త్ర విదితము కాదని పరిస్థితుల ప్రభావము, సంఘములో తన నిస్సహాయత చాటుచున్నవి. అవి నాటి పరిస్థితులు. ‘ప్రాణం వాపి పరిత్యజ్య మానమే వాభి రక్షతు’ అనుకున్నారు నాడు. మన పాశ్చాత్య నాగరికత ‘మానము పోయినా మంగళసూత్ర ముంటే చాల ‘ని చెబుతూవుంది. కాబట్టి ఒక సాంఘీక కట్టుబాటు నాటి ప్రజా బాహుళ్య విచార ధారను అనుసరించి యుంటుంది.
ఈ వాస్తవమును చదవండి.
Despite the fact that the Brahmins originally condemned the practice (Auboyer 2002) the tradition continued. Over the centuries the custom died out in the south only to become prevalent in the north, particularly in the states of Rajasthan and Bengal. While comprehensive data are lacking across India and through the ages, the British East India Company recorded that the total figure of known occurrences for the period 1813 - 1828 was 8,135; another source gives the number of 7,941 from 1815 - 1828, an average of 618 documented incidents per year. However, these numbers are likely to grossly underestimate the real number of Satis as in 1823, 575 women performed sati in the state of Bengal alone (Hardgrave 1998).
రాజస్థానులో, బెంగాలులో మహమ్మదీయుల దండయాత్రలవల్ల సహగమనమును పలు రీతులుగా పాటించవలసి వచ్చినది కానీ అన్యథా కాదు. పై పెచ్చు పైన కనబరచిన అంకెలు ఈ ప్రథ ప్రబలము కాదు అని చెప్పకనే చెప్పుచున్నవి. మరి ప్రబలముగా లేని ‘సతి సహగమనము’ ను మాన్పించుటకు అంత ప్రాచుర్యము ఎందుకు వచ్చినది ? ఆ ప్రాంతాలను ముస్లీములు దురాక్రమించుటయే గాక ప్రజల దనము ప్రాణములనే గాక స్త్రీల మానమును విచ్చలవిడిగా హరించినారు. వారి పోరు పడలేక అగ్నికి ఆహుతియైనారు ఎందఱో స్త్రీలు. ఆ స్త్రీలు మానానికి బదులుగా ప్రాణమునే వదిలిన సాధ్వీ మణులు .
Fanny Parkes, wife of a minor British civil servant during the early 1800's, who gives a frank eyewitness account in 1823 of a sati burning and the consequences: A rich baniya, a corn chandler, who was a Hindu and whose house was near the gate of our grounds, departed this life. On the 7th of November, his widow had determined to perform sati, i.e., to burn on his funeral-pile.
The [English] magistrate sent for the woman, used every argument to dissuade her, and offered her money. Her only answer was dashing her head on the floor, and saying, 'If you will not let me burn with my husband, I will hang myself in your court of justice.
*****************************************************************************
మదర్స్ డే --ఫాదర్స్ డే ... 5
మదర్స్ డే --ఫాదర్స్ డే ... 5
సతి...2
653 - 691 మధ్య కాలములో మన దేశము పై ముస్లీముల దండయాత్రలు ప్రారంభమైనవి. వారు జయించిన రాజ పత్నులను చెర బట్టే వారని మనము మన బ్రిటీషు చరిత్రకారులు వ్రాసి, వ్రాయించిన వ్రాతల ద్వారానే చదివినాము. చిత్తౌడ్ రాజ కుటుంబము, రాణా ఉదయసింగ్ II, 1567 లో రాజుగా ఉన్నపుడు రాజపుత్ర వనితలు జీవహర కుండములో (Jauhar Kund) అగ్నికి , మ్లేచ్ఛుల చేతిలో తమ మానములు కోల్పోలేక 1568 ఫిబ్రవరి 22 న అగ్నికి ఆహుతియైనారు. మరి ఇది కాక వేరే గత్యంతర మేమయినా మిగిలినదా వారికి?
ఇది ఆంగ్లేయ ప్రభుత్వ కాలములో బెంగాలులో జరిగిన ఉదంతము :
Fanny Parkes, wife of a minor British civil servant during the early 1800's, who gives a frank eyewitness account in 1823 of a sati burning and the consequences: A rich baniya, a corn chandler, who was a Hindu and whose house was near the gate of our grounds, departed this life. On the 7th of November, his widow had determined to perform sati, i.e., to burn on his funeral-pile.
The [English] magistrate sent for the woman, used every argument to dissuade her, and offered her money. Her only answer was dashing her head on the floor, and saying, 'If you will not let me burn with my husband, I will hang myself in your court of justice.
ఇక ‘సతీ సహగమనము’ ను ఆంగ్లేయ ప్రభుత్వము ద్వారా మాన్పింప జేసినారు అని చెప్పబడే రామ్మోహన్ రాయ్ గారిని గూర్చి కాస్త తెలుసుకుందాము.
Ram mohan Roy, William Carey and one more friend Hariharananda Vidyabagish, who was a tantric, published a work on Trantrism known as “Maha Nirvana Tantra” in 1897. This work tried to portray the “One God” of ancient religious texts, wished to link the “Brahma” with “Jesus Christ” but the work could not impress the British who termed it a forgery..
(The Maha Nirvana Tantra's significance for Brahmoism lay in the wealth that accumulated to Ram Mohan Roy and Dwarkanath Tagore by its judicial use, and not due to any religious wisdom within, although it does contain an entire chapter devoted to "the One True God" and his worship.)
From 1803 till 1815, Ram Mohan served the East India Company's "Writing Service", commencing as private clerk "munshi" to Thomas Woodroffe, Registrar of the Appellate Court at Murshidabad (whose distant nephew, John Woodroffe — also a Magistrate — and later made a rich living off the spurious Maha Nirvana Tantra under the pseudonym Arthur Avalon).(Google)
In 1829 he went to England to plead the cause of the Mughal emperor Akbar II, with an ambassador of the emperor. The title “Raja” was given to him by Mughal
Emperor Akbar II to convince the British Government for the “welfare” of the Indian Public and ensure that the Regulation XVII is not overturned.
Such a rich man was reduced in England to total dependence upon others, even for food. His health broke down. The main reason for his financial difficulties was that the firm in which he had invested his capital became insolvent.
( http://www.gktoday.in/raja-ram-mohan-Roy/ )
రాయ్ గారు భారతీయులచే పొగడబడినట్లు మనము చూడ గలుగు చున్నామా అన్నది మనము యోచించ వలసిన విషయము. పైన తెలిపిన ‘సతి’ లెక్కలతో పోలిస్తే ఆ కాలములో 30 కోట్ల జనాభా వున్నా దేశములో ఎక్కడో ఒక మారుమూల అరకొర ఉదంతములకు అంత ప్రాధాన్యతనీయ నవసరము లేదు. అసలు బెంగాల్ లో సతీ సహగమనమును గూర్చి ‘రాజీవ్ దీక్షిత్’ గారి ఉపన్యాసము వింటే మనకు ఇంకా కొన్ని వివరములు తెలుస్తాయి.( https://www.youtube.com/watch?v=3psX9GaIyGU).
ఇంతవరకు వ్రాసిన ఈ విషయములు చదివిన వారికి ఈ దేశ సంస్కృతి ఎంత గొప్పదో తెలుస్తుంది. ఇక్కడ ఒక యదార్థ గాఢ తెలుపుతాను . హైదరాబాదులో భార్యకు విడాకులిచ్చిన ఒక 50 సంవత్సరముల వ్యక్తి భర్తను కోల్పోయి ఒక స్త్రీని వివాహమునకు ఆడిగితే ఆమె అతనితో ఈ జీవితానికి నా భర్తతో గడిపిన మధుర క్షణాలు గుర్తు చేసుకుంటూ తన జీవితము చాలిస్తానన్నది. నా మిత్రుని ద్వారా విన్న ఈ మాట నిజముగా నా మనసు కలచివేసినది. ఈ దేశములో ఇంకా అటువంటి మహాతల్లులున్నారని విని అటువంటి వారికి మనసా వందనముల నర్పించుకున్నాను.
కావున శ్రద్ధతో మన సంస్కృతిని గూర్చి వినండి చదవండి తెలుసుకోండి. ఈ భూమి పై పుట్టటమే మన పూర్వజన్మ సుకృతము.
తెలిసి తెలియక లేనిపోని అభియోగములను మన పూర్వజులపైన గానీ మన సంస్కృతి పై గానీ మోపి ఈ భూమిపై కళంకము నాపాదించ వద్దు.
రామ్మోహన్ రాయ్ గారు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. మొదటి భార్య చిన్న వయసులోనే చనిపోగా రెండవ పెళ్ళిచేసుకున్నారు. ఇద్దరు పిల్లను కని ఆమె మరణించగా మూడవ ఆమెను పెళ్లి చేసుకున్నారు. ఆమెకు పిల్లలు లేరు. ఆయన మరణ సమయమున ఆమె ఆయనతో ఇంగ్లాండు లో ఉండినదో లేదో తెలియదు, కానీ ఆయనకు కొడుకులతో సయోధ్య ఉన్నట్లు కనిపించదు.
Ram Mohan Roy was married three times, which fell in the strict framework of his polygamous and caste customs. His first wife died early in his childhood. He conceived two sons, Radha Prasad in 1800 and Ramaprasad in 1812 with his second wife, who died in 1824. Roy's third wife outlived him.
వారికి ఇస్లాము, ఖురాను పై మక్కువ ఎక్కువగా వున్నట్లు ఆయన సమకాలీనుడైన ఒక వ్యక్తి యొక్క ఈ క్రింది వ్రాతల ప్రకారము, మనము ఆ విషయమును గ్రహింప వచ్చును.
His faithful contemporary biographer writes, “Ram Mohan with his new found madrasa knowledge of Arabic also tasted the fruit forbidden to Brahmins of Quran and was converted to its strict monotheism. Ram Mohan's mother Tarini Devi was scandalised and packed her son off to Benares (to study Sanskrit and Vedas) before he could take the irrevocable step. In Benares, Ram Mohan's rebellion continued and he persisted in interpreting the Upanishads through the Holy Quran's monotheist strictures especially against idolatry.
1792 లో మత ప్రచారమునకై మన దేశములో అడుగుపెట్టిన విలియం కారీ తన గమ్యమునకు బ్రాహ్మణులు పండితులు అనువైన వారని తలచి వారికి ఎర వేసి తన మనోరథము నేరవేర్చుకోనుటలో సఫలీకృతు డైనాడు. ఆ విధముగా తానూ ఆకర్షించిన ప్రముఖులలో రామ్మోహన్ రాయ్ ఒకడు. Google నుండి గ్రహించిన ఈ విషయాలు చదవండి.
In 1792 the British Baptist shoemaker William Carey published his influential missionary tract, An Enquiry of the obligations of Christians to use means for the conversion of heathens.( Heathens=క్రైస్తవులు కాని వారు ) In 1793 William Carey landed in India to settle. His objective was to translate, publish and distribute the Bible in Indian languages and propagate Christianity to the Indian peoples. He realized the "mobile" (i.e. service classes) Brahmins and Pundits were most able to help him in this endeavor, and he began gathering them. He learnt the Buddhist and Jain religious works to better argue the case for Christianity in the cultural context.
In 1795 Carey made contact with a Sanskrit scholar, the Tantric Hariharananda Vidya Bagish, who later introduced him to Ram Mohan Roy, who wished to learn English.
Ram mohan Roy, William Carey and one more friend Hariharananda Vidyabagish, who was a tantric, published a work on Trantrism known as “Maha Nirvana Tantra” in 1897. This work tried to portray the “One God” of ancient religious texts, wished to link the “Brahma” with “Jesus Christ” but the work could not impress the British who termed it a forgery.
(The Maha Nirvana Tantra's significance for Brahmoism lay in the wealth that accumulated to Ram Mohan Roy and Dwarkanath Tagore by its judicial use, and not due to any religious wisdom within, although it does contain an entire chapter devoted to "the One True God" and his worship.)
(The Maha Nirvana Tantra's significance for Brahmoism lay in the wealth that accumulated to Ram Mohan Roy and Dwarkanath Tagore by its judicial use, and not due to any religious wisdom within, although it does contain an entire chapter devoted to "the One True God" and his worship.)
In 1797, Ram Mohan reached Calcutta and became a "baniya" (moneylender), mainly to impoverished Englishmen of the Company living beyond their means. Ram Mohan also continued his vocation as pundit in the English courts and started to make a living for himself.
ఆయన, తమ అంతస్తుకు మించి ఖర్చుచేసే ఆంగ్లేయులకు పైకము వడ్డీలకు ఇచ్చేవాడు అది కాక ఇంగ్లీషు వారి కోర్టులలో తాను తన పాండిత్యమును ఉపయోగించి ధనార్జన చేసే వాడు.
ఈ క్రింద తెలియబరచిన విషయములను చదివితే రామ్మోహన్ రాయ్ గారిని గూర్చి మనము ఇంకా తెలుసుకొన వచ్చు.
From 1803 till 1815, Ram Mohan served the East India Company's "Writing Service", commencing as private clerk "munshi" to Thomas Woodroffe, Registrar of the Appellate Court at Murshidabad (whose distant nephew, John Woodroffe — also a Magistrate — and later made a rich living off the spurious Maha Nirvana Tantra under the pseudonym Arthur Avalon).(Google)
In 1829 he went to England to plead the cause of the Mughal emperor Akbar II, with an ambassador of the emperor. The title “Raja” was given to him by Mughal
Emperor Akbar II to convince the British Government for the “welfare” of the Indian Public and ensure that the Regulation XVII is not overturned.
Such a rich man was reduced in England to total dependence upon others, even for food. His health broke down. The main reason for his financial difficulties was that the firm in which he had invested his capital became insolvent.
( http://www.gktoday.in/raja-ram-mohan-roy/ )
1828 to 1835 కాలములో మన దేశపు గవర్నర్ జనరలైన లార్డ్ విలియం బెంటింక్ తో
రాయ్ గారికి సాన్నిహిత్యము అధికముగా వుండేది అని అంటారు.
రాయ్ గారికి సాన్నిహిత్యము అధికముగా వుండేది అని అంటారు.
రాయ్ గారు భారతీయులచే పొగడబడినట్లు మనము చూడ గలుగు చున్నామా అన్నది మనము యోచించ వలసిన విషయము. పైన తెలిపిన ‘సతి’ లెక్కలతో పోలిస్తే ఆ కాలములో 30 కోట్ల జనాభా వున్నా దేశములో ఎక్కడో ఒక మారుమూల అరకొర ఉదంతములకు అంత ప్రాధాన్యతనీయ నవసరము లేదు. అసలు బెంగాల్ లో సతీ సహగమనమును గూర్చి ‘రాజీవ్ దీక్షిత్’ గారి ఉపన్యాసము వింటే మనకు ఇంకా కొన్ని వివరములు తెలుస్తాయి.( https://www.youtube.com/watch?v=3psX9GaIyGU).
ఇంతవరకు వ్రాసిన ఈ విషయములు చదివిన వారికి ఈ దేశ సంస్కృతి ఎంత గొప్పదో తెలుస్తుంది. ఇక్కడ ఒక యదార్థ గాఢ తెలుపుతాను . హైదరాబాదులో భార్యకు విడాకులిచ్చిన ఒక 50 సంవత్సరముల వ్యక్తి భర్తను కోల్పోయి ఒక స్త్రీని వివాహమునకు ఆడిగితే ఆమె అతనితో ఈ జీవితానికి నా భర్తతో గడిపిన మధుర క్షణాలు గుర్తు చేసుకుంటూ తన జీవితము చాలిస్తానన్నది. నా మిత్రుని ద్వారా విన్న ఈ మాట నిజముగా నా మనసు కలచివేసినది. ఈ దేశములో ఇంకా అటువంటి మహాతల్లులున్నారని విని అటువంటి వారికి మనసా వందనముల నర్పించుకున్నాను.
కావున శ్రద్ధతో మన సంస్కృతిని గూర్చి వినండి చదవండి తెలుసుకోండి. ఈ భూమి పై పుట్టటమే మన పూర్వజన్మ సుకృతము.
తెలిసి తెలియక లేనిపోని అభియోగములను మన పూర్వజులపైన గానీ మన సంస్కృతి పై గానీ మోపి ఈ భూమిపై కళంకము నాపాదించ వద్దు.
మిగిలినది వేరొక సారి.........
************************************************
మదర్స్ డే --ఫాదర్స్ డే ...6
బాల్య వివాహములు మరియు వితంతు వివాహములు.
బాల్య వివాహము (Child Marriage) అనగా యుక్త వయసు రాక మునుపు అనగా బాల్య దశలో చేసే వివాహము. నేడు చట్ట ప్రకారము 18 సంవత్సరాల వయసు నిండని అమ్మాయికి, మరియు 21 సంవత్సరాలు నిండని అబ్బాయికి జరిగే వివాహమును బాల్య వివాహముగా చెప్పవచ్చు. పూర్వము బాల్య వివాహాలు ఎక్కువగా జరిగేవి. దీనికి పెక్కు కారణములున్నవి.
ఫ్రెంచివారు, పోర్చుగీసు వారు, డచ్ వారు, బ్రిటీషు వారు మొదలైన విదేశీయులు భారతదేశాన్ని పాలించు కాలంలో కొంతమంది విదేశీ అధికారులు భారతీయ కన్యలను బలవంతంగా వివాహమాడేవారు లేదా చెరచేవారు. వివాహితులను ఎత్తుకెళ్ళరని భావించిన భారతీయులు తమ పిల్లలకు బాల్యంలోనే వివాహం చేసేవారు. ఇక మహమ్మదీయులు చెరపట్టిన స్త్రీల సంఖ్య అగణ్యము.
పూర్వము కుటుంబాల మధ్య సంబంధ బాంధవ్యాలను పటిష్టపరచుకోవడానికి ఆడపిల్ల పుట్టగానే తమ బంధువర్గంలో పలానావాడికి భార్య పుట్టిందని ఇరువర్గాలవారు నిర్ణయించేసుకొని పిల్లలు కొంచెం పెద్దవారవ్వగానే వివాహం చేసేవారు.
కుటుంబాలలోని వృద్ధుల కోరిక మేరకు వారు చనిపోయేలోపు తమ వారసుల పెళ్ళిళ్ళు చూడాలనే కోరికను తీర్చడానికి కూడా బాల్యవివాహాలు జరిపించేవారు. మరికొన్ని కుటుంబాల్లో పిల్లలు యుక్తవయసు (Teenage) కు వచ్చిన తర్వాత వక్ర మార్గాల్లో ప్రయాణిస్తారనే భావనతో ముందు జాగ్రత్తగా బాల్యవివాహాలు జరిపించేవారు.
బాల్య వివాహం జరిపించినప్పటికీ అమ్మాయి యుక్త వయసుకు వచ్చిన తర్వాత మాత్రమే కాపురానికి పంపింఛేవారు. ఇలా చేయడం వల్ల అమ్మాయికి అబ్బాయికి ఒకరిపై ఒకరు ఇష్టం ఉన్నా లేకపోయినా కలిసి జీవితం గడపాల్సి వచ్చేది.
చాణక్యుడు బాలికకు వివాహ యోగ్యత 12 సంవత్సరములని నిర్ణయించినాడు. నా వయసు అనగా దాదాపు 70 సంవత్సరాలున్నవారికి తమ పెద్దల ద్వారా విన్న జ్ఞాపకము ఉండవచ్చు, వధువు కు వరునికి కనీసము 3 సంవత్సరాలుండవలెనన్నది మన సాంప్రదాయము. పోఎల్లి త్వరగా అంటే పిల్లల 18-21 సంవత్సరముల నడుమ జరిగిపోతే వారి సంతానము ఇల్లు పొలము పనులలో తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా వుండే వారు. ఒకవేళ చిన్న వయసులో పెళ్లి చేస్తే, పెళ్లి అయిన వెంటనే పునస్సంధానము జరిపేవారు కారు. కారణము పెళ్లిజంటకు లోకానుభావము రావలెననే! అబ్బాయికి 15 అమ్మాయికి 12 సంవత్సరములున్నపుడు వివాహమైతే, ముందు ఒకరికొకరు స్నేహితులౌతారు, ఆడుకుంటారు, పాడుకుంటారు ఆతరువాత ఆదిడంపతులవలె అన్యోన్యత పెంచుకుంటారు. అప్పుడు వారిరువురికి బంధనము గట్టిపడి సక్రమమైన సంతానము కలుగుటకు దోహద పాడుతారు. నిజానికి ఈ తంతులో పెద్దల పాత్ర ఎంతగానో వుంటుంది. ముదుసలికి బాలిక నంటగట్టుట శాస్త్రములందు చెప్పబడలేదు. అట్టివి పదివేల కుటుంబాలలో పది జరిగి వుంటే జరిగి ఉండవచ్చు. అసలు పెళ్లి మంత్రమే ఏమిచేబుతూ వుందో చూడండి :

'ఓ వర రత్నమా 18 సంవత్సరముల, కుమారునిగా పెంచబడిన, నా బాలికను నీకు దాసిగా సమర్పిస్తున్నాను. ఆమెను నీవు స్నేహితురాలిగా చూసుకొనేది' అని బాలిక తండ్రి వరునితో చెబుతాడు. ఈ ఒక్క మాట చాలు మన పూర్వుల సంస్కారంకి తార్కాణముగా! నా బిడ్డ నీ పనులన్నీ చక్కబెడుతుంది నీవు మాత్రము ఆమెను స్నేహితురాలిగా ఆదరముతో, అభిమానముతో ,ఆత్మీయతతో, అనురాగముతో, అనునయముతో,అత్యంత ప్రేమతో, అసాధారణ సానుభూతి తో ( అసలు సానుభూతి అంటే 'అయ్యో పాపము' కాదు, సహా+అనుభూతి అంటే ఒక విషయము పై ఇరువురి స్పందన ఒకే విధముగా ఉండుట) ఇవి కావలసినవి .
నేను చట్టమును విమర్శించుట లేదు గానీ నేడు వయసు ముదిరిన ఆడ మగ పిల్లల పెళ్ళిళ్ళు జరుపుత ఎంత కష్టమౌతూ వుందో తల్లిదండ్రులకు తెలియనిది కాదు. అసలు ఈనాటి పెళ్ళిళ్ళలో ఆడపిల్లలో సిగ్గు, పిల్లవానిలో అమాయకత్వము నేతిబీరలోనేయ్యి పెరుగు తోటకూరలోని పెరుగు అన్నది ఒక బహిరంగ సత్యము. మరి పెళ్ళయినా పదికాలాల పాటు ఉంటుందా అంటే అది చీదితే ఊడేముక్కు, జాడీలో బూజు పట్టిన తొక్కు.
మరి పెళ్లి వయసును నిర్ణయించిన మేధావుల సూచనలు సరియైనవేనా! ఈ కాలము యోగ్యత విజ్ఞత చేత నిర్దారిమ్పబదుట లేదు. సంఘసంస్కరణల పేరుతో సంస్కర్తలగా తమకు తాము ఉద్ఘాటించుకొని వీదులలోకోచ్చిన మహానీయులనేకులు అప్పటి పాశ్చాత్య ప్రభుత్వపు గుర్తింపు కొరకు కాదా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడో స్వార్థపరుల నడుమ జరిగిన కొన్ని అవకతవకలకు భూతాద్దము పట్టి వీనిని సమూలముగా పెకలింప వచ్చిన అవతార పురుషులమని తాము చాటుకుని తమ మద్దత్తుదారులచే చాటింప జేసుకున్నారేమో!
వీరేశలింగం పంతులు గారిని గూర్చి కాస్త తెలుసుకుందాము.
April 16, 1848 న పుట్టిన వీరు ప్రారంభదశ నుండి ఆంగ్లేయ పాఠశాలల యందు చడువుటచే పాశ్చాత్య
నాగరికతా విధానమును దేశీయ లేక ప్రాంతీయ విధానములకు జోడింప సమకట్టినారు.
వారిని గూర్చి ఈ క్రింది వివరములు పుష్టిని చేకూర్చుతాయి.
Receiving formal education at an Indian school, Veeresalingam was sent to an English school where his
talents and versatility were noticed and underwent further improvement.
Veeresalingam completed his matriculation in 1869 and got his first job as a teacher in
Korangi village.
After working as a teacher for sometime and as a head master for two years, he moved to
Dhavaleswaram, near Rajahmundry City as a head master in an English medium school.
వారికి రావ్ బహద్దూర్ అన్న బిరుదమును ఘనమైన బ్రిటీషు ప్రభుత్వము ఇచ్చింది. వారి
ధోరణిలో వీరు పనిచేయుటవల్ల అన్న
విషయమును మనకు తెలుపకనే తెలుపుచున్నది కదా!
He was honored with title of "Rao Bahadur" in 1893 by the government in appreciation of
his work towards the society.

In some parts of Europe, including Russia, Czechoslovakia, Greece, Italy and Spain, widows used to wear black for the rest of their lives to signify their mourning, a practice that has since died out. Many immigrants from these cultures to the United States as recently as the 1970's have loosened this strict standard of dress to only two years of black garments. However, Orthodox Christian immigrants may wear lifelong black in the United States to signify their widowhood and devotion to their deceased husband.
Often, women are required to remarry within the family of their late husband after a period of mourning. With the rise of HIV/AIDS levels of infection across the globe, rituals to which women are subjected in order to be "cleansed" or accepted into her new husband's home make her susceptible to the psychological adversities that may be involved as well as imposing health risks.
As of 2004, women in United States who were "widowed at younger ages are at greatest risk for economic hardship.
లక్షలాది సంవత్సరముల నాగరికతను త్రోసిరాజని క్రీస్తు శకము 14 వ శతాబ్దిలో కన్ను తెరచిన నాగరికతను, ఎటువంటి పరీక్షా,పరిశీలన, పరిశోధన లేకుండా ఆదర్శము చేసుకొనుట ఆత్మా సాక్షిగా ఆలోచించితే మనకే అవగతమౌతుంది. వారు శేష జీవితమును , తమవేదికయైన రాజమహేంద్రవరము, కాకినాడ విశాఖపట్టణము మొదలగు ప్రాంతములను వదలి చేన్నపత్తనములో గడిపి 27 మే 1919 లో తనువూ చాలించినారు. వీరు చేసినారని చెప్పబడే సంస్కరణలలో బాలికలకు విద్య కూడా ఒకటి. స్త్రీ విద్యనూ గూర్చి T.B. మెకాలే గారి Parliament ప్రసంగాన్ని ఒకసారి చదవండి. 17, 18 శతాబ్దములలో కూడా స్త్రీలు ఎంత విద్యా వంతులై వుండినారో మీకే తెలుస్తుంది. ఈ విషయముపై మీరు రాజీవ్ దీక్షిత్ హిందీ భాషణమును వింటే మన దేశములో స్త్రీ విద్య ఎంత ప్రబలముగా ఉండేదో అర్థమౌతుంది. నేను నా చదువు మా అమ్మమ్మ గారి వద్దనున్దినే మొదలుపెట్టినాను. ప్రాథమిక పాఠశాలకు పోకుండానే 6వ తరగతికి ఉన్నత పాఠశాలలో చేరినాను. ఈ దేశములోని ఇల్లాండ్రు ఒకవేళ బడికి పోకున్నా తమ పెద్దలద్వారా వలసిన చదువు విజ్ఞానము నేర్చుకున్నారు. స్త్రీల పరిస్థితి,, 14,15 శతాబ్దములలో పాశ్చాత్య దేశాములందు మిక్కిలి దయనీయముగా వుండేది. ఘోష, లోపాముద్ర, గర్గి, మైత్రేయి వంటి 27 మంది సాధ్వీమణులు మంత్రములను ఋగ్వేదములో సంకలనము చేసినది మనము గమనిచ వచ్చును. ఝాన్సీ లక్ష్మి బాయ్(నవంబరు 19, 1828 –జూన్ 17, 1858) 12 వ శతాబ్దములోని, నాయకురాలు నాగమ్మ, రాణీ రుద్రమ్మలు ఎంతటి విజ్ఞానవంతులో మనకు తెలుసు.ఈ దేశములో చరిత్ర కందని చదువుకున్న స్త్రీలు ఎందరో మనము లెక్క కట్టలేము. మరి చదువు లేనిది మన దేశపు స్త్రీలా లేక ఆడుగడుగునా పురుషాధిక్యతతో అవనత శిరములతో అవమానములను అనుభవించిన పాశ్చాత్య స్త్రీలా!
భారత దెశమును తమ కబంధ హస్తాలలలో కబలించి యుంచుకున్న పాశ్చాత్యులు కొంత మంది విద్యావంతులైన మహానుభావులను పలు విధములుగా ప్రలోభపెట్టి వారికి సంఘ సంస్కర్తాలన్న ముసుగు తగిలించి దేశముపైకి వదలినారు. అంతే కానీ అన్యధా కాదు.
మనసు పెట్టి మన పూర్వుల చరిత్ర, దేశ సంస్కృతి, వారి సేవానిరతి, వేద ప్రాశస్త్యము, శాస్త్ర పరిజ్ఞానము ను తెలుసుకుంటే మనపై లేక మన దేశముపై కళంకమును ఆపాదించిన వారిని సహేతుకముగా సప్రమానముగా, సమర్తవంతముగా ఎదుర్కొనవచ్చును.
మిగతది మళ్ళీ ........
శుభం భూయాత్

No comments:
Post a Comment