Monday, 4 July 2016

కృష్ణా తరంగాలు కవితల పోటీ

కృష్ణా తరంగాలు అనే బృందం లో కవితల పోటీ కి ఇప్పుడే ఒక చిన్న కవిత రాసాను... ఏవైనా తప్పులుంటే శ్రమ అనుకోకుండా కొంచం సూచిస్తారా, ....
* * * * \ గోదాదేవి – (అండాళ్ ) / * * * *

అచ్చెరువున అద్దమున చిత్తరువును చూసే పడతి,

మాల మలచి మేన దాల్చి మాధవునే మదిని తలచె,

ప్రతిబింబము దర్పణమున గోపాలుడే ఎదుట నిలిచె,

విచిత్రమని పెరియాళ్వార్ విష్ణుచిత్తు చేక్కిటిపై చేయి చేర్చె,

ఆలయంపు తోట లోన అలరారే తులసి చెంత బాల వెలసె,

భూదేవియే అవతరించి సుందరమవు గోదాయిగా పేరు గాంచె,

భక్తి మీర ప్రేమ తోడ రంగనాధు పతిగ తలచి సేవలలో తేలియాడే,

తను దాల్చిన మాలలనే శ్రీ నాధుని మెడ ధారణమునకు పంపె,

అపచారమ్మని ఆళ్వార్ పూజ నుండి దండలను తిరిగి తెచ్చె,

చిత్రముగా శ్రీ రంగనాధు పలుకులతో తన కోర్కె తెలియజేసే,

గోదాదేవి వాడిన మాల తనకు ప్రీతి గోలుపు ననుచు తెలిపె,

ధనుర్మాస సమయాన చెలుల గూడి నాధునికై వ్రతము చేసి,

రంగనాధ స్వామీ వారి కరుణ పొంది శుభముగ కళ్యాణమాడె,

ఆండాళ్ గ పాశురముల రచియించిన చూడికోడుత్త నాచ్చియార్ ....
__________________________________________
విజయ సువర్ణ * * * * * Thursday, 27 March 2014


అమ్మా చి .కుం. సౌ. సువర్ణా నీవు అమ్మవారిని గూర్చి వ్రాసిన అందమైన కవితకు 'లయ'ను జేర్చి పంపుచున్నాను . అక్కడ ధనుర్మాసములో ఇది అందరి

'రసనారంగము'పై నర్తించునన్న నమ్మకముతో నిన్ను ఆశీర్వదిస్తూ పంపుచున్నాను . నీకిది ప్రీతిపాత్రమౌనని నమ్ముచున్నాను . ఇటువంటివి ఇంకా ఇంకా వ్రాసి మాన్యత

ధన్యత నీవు పొందవలేనన్నది నా ఆకాంక్ష ఆశీర్వాదము .


ఆలయాన పూదోటన తులసి కోట పుట్నిల్లుగ

భూదేవియె అవతరించె గోదాదేవిగ భువిపై

పెరియాళ్వారని మన్నన పొందు విష్ణుచిత్తుండతి

విభ్రమమున చేక్కిటిపై చేయిచేర్చి,చేరదీసి

కన్నబిడ్డగా పెంచెను,కన్నెకయైనంత నామె

తిరువరంగ మూర్తిని తన ఎద పీఠము నుండజేసి

పతిగదలచి ప్రతిదినమును వనములోని తావులీను

పూలనేల్ల ఏర్చిపేర్చి కూర్చి మిగుల సుందరమౌ

మాలమలచి మాధవునే మదినదలచి మున్ముందుగ

మెడన దాల్చి అద్దమందు అతిశయాన చిత్తరువును

ఆసాంతము తిలకించగ అద్భుతముగా అందులోన

ప్రతిబింబముగా రంగడు ఎదుటనిలిచె కేలుసాచి

అనుదినమూ ఇదేరీతి జరుగుచుండ నొకనాడది

గమనించిన పెరియవరులు మందలింప బాలికతో

అపచారమ్మనుచుదెల్ప, రంగనాథుడెరుకజేసె

నవియే తనకిష్టమనుచు ,ఆళ్వారుని స్వప్నమందు

ఆవిషయము ఆటదంతా అమ్మాయికి తెలియబరుప

ఆమె అంత చెలులగూడి అమితమైన భక్తితోడ

ధనుర్మాస కాలమంత శ్రీరంగాని వ్రతముజేసి

భోగినాడు వైభోగముతో నాస్వామికి వధువుగా

లీనమయ్యె జగన్మాత స్వామిలోన తళుకులీన

'చూడికుడుత నాచ్చియా' ' రాముక్త మాల్యదగా'

అమ్మవారి పెరునిలిచె ఆచంద్రార్కము భువిపై

అమ్మ భక్తీ పాశురములు 'నాచ్చియారు తిరుమొళి'

మరి 'తిరుపావై',ధనుర్మాసమీ ధరపై వరలువరకు

జన రసనారంగముపై ఝణఝణమని నర్తించును

బంధనాలు భక్తికెప్పుడాటంకము కావటంచు

తెలియజేసే భూమాత 'ఆండాళు'గ భక్తతతికి

జోతలామె పాదములకు జోతలామే 'పదములకు'




తత్సత్

Suvarna Vijaya <suvarna115@gmail.com>
30 Mar

Reply

to me

Telugu
English
Translate message
Turn off for: Telugu
ఎంత అందంగా రాసారండి... రామమోహనరావు గారు... మీ ఆశీర్వచనం తో అందించిన అండాళ్ అమ్మవారిపై కవిత అద్భుతంగా ఉన్నది..... నాకు ఇంత చక్కగా 'లయ' తో రాసే నేర్పు లేనే లేదు... నేనేదో నాల్గు ముక్కలు వెనకా ముందుగా రాస్తే, ... అది మీ నుండి ఈ అందమైన కవిత రావడానికి కారణం అయ్యింది... నాకు అదే సంతోషం ....
ఈ పైన మీరు వ్రాసిన కవిత, మీరే మీ పేరుతొ పోస్ట్ చెయ్యాలని నా కోరిక...
దయచేసి మన్నించండి....
ధన్యవాదములు...

విజయ సువర్ణ


2014-03-28 2:53 GMT-04:00 RAMA MOHAN RAO Cheruku <ramamohanraocheruku@gmail.com>:


RAMA MOHAN RAO Cheruku <ramamohanraocheruku@gmail.com>
30 Mar

Reply

to Suvarna

కొన్ని ముద్రణా దోషములులుంటే అవి సవరించి తిరిగి పంపుచున్నాను . ఇది నచ్చివుంటే దీనిని సరియైన సమయములో చక్కగా ఉపయోగించేది . అంతకన్నా నాకేమి

కావలెనమ్మా.రుచికరమైన పప్పు చేసినవారికి 'బాగుంది' అన్న పేరు చెందుతుంది కానీ 'పోపు' పెట్టిన వానికి కాదుగదా . అమ్మా నిర్మలమైన నీ మనసుకు ఇది కానుక

అనుకొన్నా నాకభ్యతరములేదు . నేను దీనిని FB లో POSTచేయ పని లేదు . ఇది నీది నీ స్వంతము .


ఆలయాన పూదోటన తులసి కోట పుట్నిల్లుగ


భూదేవియె అవతరించె గోదాదేవిగ భువిపై


పెరియాళ్వారని మన్నన పొందు విష్ణుచిత్తుండతి


విభ్రమమున చేక్కిటిపై చేయిచేర్చి,చేరదీసి


కన్నబిడ్డగా పెంచెను,కన్నెకయైనంత నామె


తిరువరంగ మూర్తిని తన ఎద పీఠము నుండజేసి


పతిగదలచి ప్రతిదినమును వనములోని తావులీను


పూలనేల్ల ఏర్చిపేర్చి కూర్చి మిగుల సుందరమౌ


మాలమలచి మాధవునే మదినదలచి మున్ముందుగ


మెడన దాల్చి అద్దమందు అతిశయాన చిత్తరువును


ఆసాంతము తిలకించగ అద్భుతముగ అందులోన


ప్రతిబింబముగా రంగడు ఎదుటనిలిచె కేలుసాచి


అనుదినమూ ఇదేరీతి జరుగుచుండ నొకనాడది


గమనించిన పెరియవరులు మందలింప బాలికతో


అపచారమ్మనుచుదెల్ప, రంగనాథుడెరుకజేసె


నవియే తనకిష్టమనుచు ,ఆళ్వారుని స్వప్నమందు


ఆవిషయము అతడంతట అమ్మాయికి తెలియబరుప


ఆమె అంత చెలులగూడి అమితమైన భక్తితోడ


ధనుర్మాస కాలమంత శ్రీరంగని వ్రతముజేసి


భోగినాడు వైభోగముతో నాస్వామికి వధువుగా


లీనమయ్యె జగన్మాత స్వామిలోన తళుకులీన


'చూడికుడుత నాచ్చియా' ' రాముక్త మాల్యదగా'


అమ్మవారి పేరు నిలిచె ఆచంద్రార్కము భువిపై


అమ్మ భక్తిపాశురములు 'నాచ్చియారు తిరుమొళి'యు


'తిరుపావై',ధనుర్మాసమీ ధరపై వరలువరకు


జన రసనారంగముపై ఝణఝణమని నర్తించును


బంధనాలు భక్తికెప్పుడాటంకము కావటంచు


తెలియజేసే భూమాత 'ఆండాళు'గ భక్తతతికి


జోతలామె పాదములకు జోతలామె 'పదములకు'




తత్సత్

No comments:

Post a Comment