ఒకసారి ఈ భర్తృహరి సుభాషితాన్నితిలకించండి
అమ్భోజినీ వనవిహార విలాసమేవ
హంసస్య హన్తునితరాం కుపితోవిధాతా
నత్వస్య దుఘ్ద జలభేడ విధౌ ప్రసిద్దాం
వైదగ్ధ్య కీర్తి ముపహర్తు మాసౌ సమర్థః
దీని తెలుగుసేత ఏనుగు లక్ష్మణకవి గారు ఈ విధముగా చేసినారు
వనజభవుండు కోపమున వాహనమైన మరాళ భర్తకున్
వనజ వాణీ విహార కలనంబు తోలంగగా జేయుగాని,గుం
భానమున దుగ్ధజీవన విభాగ విధాన నిరూఢ నైపుణీ
జనిత మహాయశో విభవసారము హంసకు మాన్పజాలునే
బ్రహ్మ దేవునికి కోపము వచ్చి తన వాహనమైన హంసను తామర కొలనిలో తిరుగాకుండా చేయవచ్చునేమోగానీ జన్మతః సంక్రమించిన , పాలను నీటిని వేరుచేయు,గుణమును మాన్పలేడు కదా !
ఈ విషయము అక్షర సత్యము సాహిత్య మేరువు శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యుల వారి విషయములో. బహుముఖ ప్రజ్ఞాశాలి , 16 భాషలలో నిపుణుడు, పాఠశాలకు పోకనే అసాధారణ పాండితీ ప్రకర్ష కలిగిన మహనీయుడు .
వారిని గూర్చి వారికి సన్నిహితుడు,ఆప్తుడు,ఎంతోవాశి గలిగిన వారి అంతేవాసి అయి, నాకు అన్నలాంటి వారయిన
సదానందీశ్వరయ్య గారు వారిని గూర్చి చాలాకాలము క్రిందట వ్రాసి ప్రముఖ తెలుగు పత్రికలలో వచ్చిన వ్యాసము వారి యనుమతి పై నేను నా కుడ్యము పై ప్రకటించుచున్నాను.
ఇక్కడ రెండు మాటలు సదానందీశ్వరయ్య గారిని గూర్చి చెప్పవలసి వుంది. ఇది నామాటగా కాకుండా వారికి జరిగిన సన్మానమే చెబుతుంది .
అక్కడివరకు వ్రాసి మీకు ప్రోద్దతురులో జరిగినసన్మానపు కరపత్రము జోడించుదామంటే అది నాకు చేత కావడములేదు. మళ్ళీ ప్రయత్నించి చేస్తాను . ఇంతవరకు బాగుందా అన్నది చూడండి . మొదట ఇది ప్రకటించి తరువాత మిగతది చూస్తాను . ఏవైన సలహాలుంటే mail లో తెలియబరచేది.

No comments:
Post a Comment