అజరామర సూక్తి – 255
अजरामर सूक्ति – 255
Eternal Quote – 255
शरीरमाद्यं खलु धर्मसाधनम् l कुमारासंभावं – महाकवि कालीदास
శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం l కుమారసంభవము -మహాకవి కాళీదాసు
శరీర మాధ్యం = శరీరం + ఆధ్యం = మొట్టమొదట శరీరమే
ఖలు = అధిక
ధర్మసాధనం = సత్కార్యాచరణ సాధనముl
ధర్మ సాధనమునకు శరీరమునకు మించిన మాధ్యమము లేదు
నాత్యశ్నతస్తు యోగోఽస్తి న చైకాంతమనశ్నతః ।
న చాతిస్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున l।6-16 ।।
ఓ అర్జునా, ఎవరైతే మరీ ఎక్కువ తింటారో లేదా మరీ తక్కువ తింటారో; మరీ ఎక్కువ
నిద్ర పోతారో లేదా మరీ తక్కువ నిద్ర పోతారో - వారు యోగములో విజయం
సాధించలేరు.
ధ్యానము యొక్క విషయాన్ని మరియు దాని అంతిమ లక్ష్యాన్ని వివరించిన పిదప, శ్రీ
కృష్ణుడు కొన్ని నియమాలను చెప్తున్నాడు. శారీరిక నిర్వహణ నియమాలను
అతిక్రమించినవారు యోగములో సాఫల్యం సాధించలేరు అంటున్నాడు. తరచుగా,
ఆధ్యాత్మిక పథం లో కొత్తగా ఆరంభించినవారు, తమ అసంపూర్ణ జ్ఞానం తో ఇలా
చెప్తారు: "నీవు ఆత్మవు, శరీరానివి కావు. కాబట్టి శారీరిక నిర్వహణ మర్చిపోయి,
ఆధ్యాత్మిక కార్యకలాపాలలో నిమగ్నమవ్వుము." కానీ, ఇటువంటి సిద్ధాంతం మనిషిని
ఎక్కువ దూరం తీస్కువెళ్ళలేదు. ‘నేను’ అన్నది శరీరము కాదు అన్న విషయం నిజమే
అయినా, ఈ శరీరమే మన జీవించి ఉన్నతకాలం మన వాహనం, మరియు దానిని
చక్కగా చూసుకోవలసిన భాద్యత మనపై ఉంది. ఆయుర్వేద పుస్తకమైన 'చరక
సంహితా' ఇలా పేర్కొంటున్నది: “శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం” "ఈ శరీరమే
ధర్మ కార్యములు చేయటానికి సాధనము". ఒకవేళ శరీరం అనారోగ్యంపాలు అయితే
ఆధ్యాత్మిక ప్రయత్నాలు కూడా కుంటు పడుతాయి. రామాయణం ఇలా పేర్కొంటుంది :
“తను బిను భజన వేద నహీఁ వరనా” "ఆధ్యాత్మిక పనుల్లో నిమగ్నమై ఉన్నా శరీరాన్ని
నిర్లక్ష్యం చేయమని వేదములు చెప్పలేదు". నిజానికి
, భౌతిక ప్రాపంచిక శాస్త్ర సహాయంతో మన శరీరాన్ని చక్కగా చూసుకొమ్మని
ఉపదేశిస్తున్నాయి. ఈశోపనిషత్తు ప్రకారం:
అంధం తమః ప్రవిశంతి యే ఽవిద్యాం ఉపాసతే l
తతో భూయ ఇవ తే తమో య ఉ విద్యాయాం రతాః ll (9)
"భౌతిక విద్యను మాత్రమే పెంపొందించుకునేవారు నరకానికి పోతారు. కానీ, కేవలం
ఆధ్యాత్మిక విద్యనే పెంపొందించుకునేవారు అంతకంటే ఘోరమైన నరకానికి పోతారు."
భౌతిక విద్య అనేది మన శారీరిక నిర్వహణకు చాలా అవసరం, అదే సమయంలో
ఆధ్యాత్మిక శాస్త్రము అనేది మనలో అంతర్గత దివ్యత్వం ప్రకటితమవటానికి చాలా
అవసరం. మనం ఈ రెంటినీ జీవితంలో సమతుల్యంగా ఉంచుకోవాలి. కాబట్టి,
యోగాసనాలు, ప్రాణాయామం మరియు సమతుల్య ఆహారం అనేవి వైదిక జ్ఞానంలో
భాగమే. నాలుగు వేదాలలో ప్రతిదానికీ భౌతిక జ్ఞానాన్ని ఇచ్చే అనుబంధ వేదము ఉంది.
అథర్వ వేదము యొక్క అనుబంధ వేదము ఆయుర్వేదము, ఇది ప్రాచీనమైన ఆరోగ్య,
వైద్య శాస్త్రము. వేదములు శారీరిక స్వస్థత పట్ల కూడా చాల శ్రద్ధ చూపిస్తున్నా
యనటానికి ఇది ఒక నిదర్శనం. అందుకే, మరీ ఎక్కువ తినటం లేదా అసలు తినక
పోవటం, తీవ్ర పరిశ్రమ లేదా పూర్తి జడత్వం వంటివి యోగమునకు అవరోధాలు.
ఆధ్యాత్మిక సాధకులు - తాజా పోషకాలతో కూడిన ఆహారం భుజిస్తూ, ప్రతి రోజూ
వ్యాయామం చేస్తూ, రాత్రి పూట తగినంత నిద్ర పోతూ - తమ శరీరాన్ని చక్కగా
నిర్వహించుకోవాలి.
సకల మానవులకు శరీరమే ధర్మసాధక యంత్రం. ఆ శరీరాన్ని రక్షించే దైవం
ఆరోగ్యమే. ‘‘శరీరం ఆద్యం ఖలు ధర్మసాధనం’’ అన్నాడు మహాకవి కాళిదాసు. నిశ్చల
నిర్మల నిష్ఠాగరిష్ఠతతో మానవుడు జ్ఞాన , విజ్ఞానాలు, సముపార్జించాలన్నా శారీరక
ఆరోగ్యం కావాలి. శరీర ఆరోగ్యం కలవారే మానసిక ఆరోగ్యం కలిగి ఉంటారు.
దుఃఖేష్వను ద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః l
వీతరాగభయః క్రోధో స్థిత ధీర్ముని రుచ్యతే ll
కష్టాలు, దుఃఖాలు ఎదురైనప్పుడు కృంగిపోకుండా, ఐశ్వర్యాలు, సుఖాలు
సమకూరినప్పుడు పొంగిపోకుండా మానవుడు స్థిత ప్రజ్ఞుడుగా వుండాలని భగవద్గీత
బోధిస్తోంది. అలా వుండటానికి కూడా ఆరోగ్యం కావాలి. తర్కబద్ధత లేని, ఫలితం
తెలియని తపస్సులతో, నియమనిష్ఠలతో గౌతమ బుద్ధుడు ఎవరో ఉపదేశిస్తే పుష్ఠిగా
ఉన్న శరీరాన్ని ఆరేళ్లపాటు శుష్కింపజేసుకున్నాడు. ఫలితం కానరాలేదు. చివరకు స్పృహ
కోల్పోయి ఒక చెట్టు కింద పడి ఉండగా సుజాత అనే యాదవ మహిళ చూసి, నోట్లో
పాలు పోసి.. తాగించి బతికించింది.
ప్రయోజనం తెలియని నిష్ఠలతో.. తపస్సులతో.. ఉపవాసాలతో శుష్కీభూతం అయిన
శరీరం నుండి శుష్కీభూత ఆలోచనలే వస్తాయని బుద్ధుడు తెలుసుకున్నాడు. తనను
బ్రతికించిన మహిళ సుజాత తనకు జీవిత సత్యం చెప్పిన గురువు అయిందని
తెలుసుకున్నాడు. స్వయంగా తాను అనుభవించి, తెలుసుకున్న సత్యాన్ని సమాజానికి
సందేశంగా అందించాడు. 80 ఏళ్ల వయసు వరకూ పర్యటనలు చేసి, బౌద్ధతత్వశాస్ర్తాన్ని
విస్తరింపజేయగల శక్తికి మూలం ఆ మహనీయుని ఆరోగ్యభాగ్యమే! భారతీయ తాత్విక
చింతనను ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టినవిఉపనిషత్తులు. వందకుపైగా ఉన్న
ఉపనిషత్తులలో ముఖ్యమైన కఠోపనిషత్తు మానవ జీవితానికి చక్కని భాష్యం చెప్పింది.
ఆరోగ్యకరమైన దేహానికి, అవినాశియైున ఆత్మకి (దేహికి) ఉన్న సంబంఽధాన్ని
వివరించింది.
ఆత్మానాం రథినం విద్ది శరీరం రథమేవచ
బుద్ధింతు సారథిం విద్ది మనః ప్రగ్రహమేవచ
ఇంద్రియాణి హయానా హుర్విషయాస్తుషు గోచరాన్
మానవ శరీరం రథం! ఆత్మ(దేహి) రథికుడు! ఆ రథికుని బుద్ధి సారథి! మనస్సు పగ్గం!
ఇంద్రియాలు (కోరికలు) గుర్రాలు! విషయాలు (అనుభవాలు) మార్గాలు! బుద్ధి అనే
సారథి మనస్సు అనే పగ్గాన్ని చేతబట్టి, కోరికలు అనే గుర్రాల్ని సరియైున మార్గాల్లో
నడిపించాలంటుంది ఈ ఉపనిషత్తు. మానవులు ఇలా వుండాలంటే, శరీరాలు సంపూర్ణ
ఆరోగ్యంగా ఉండాలి. శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యాన్నీ, మేధాశక్తినీ,
పెంచుతుంది. అన్ని రకాల భోగభాగ్యాల కన్నా ఆరోగ్య భాగ్యమే మిన్న! అందుకే పెద్దలు
‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నారు.
शरीरमाद्यं खलु धर्मसाधनम् l
शरीरमाद्यम् = शरीरम् + आद्यम् = पहले पहल शरीर
खलु = अधिक
धर्मसाधनम् = धर्म + साधनम् = उचित काम करनेका साधन होता है l
उपनिषद् का उपदेश है कि हमारा शरीर एक रथ है। हमारा शरीर एक वाहन ही तो है जो चलता रहता है । इसमें यदि कोई रुकावट आ जाए यानि इसमें रोग आ जाए, दुर्घटना घटी या किसी कारण से चोट आ जाए तो सब अस्त-व्यस्त हो जाता है। मृत्यु आने के पहले ही अगर यह निष्क्रिय हो जाता है तो उसे भंगार में फैंक देते हैं । अब आदमी जीतेजी मृत सामान होजाता है l
इससे यही समझ आता है- 'जान है तो जहान है।' यदि शरीर स्वस्थ है तो हम दुनिया के किसी भी काम को करने में समर्थ होते हैं परंतु इसके अस्वस्थ होते ही चक्का जाम जैसी स्थिति हो जाती है। हम स्वयं को असहाय समझने लगते हैं। ऐसा लगता है मानो हमारे साथ-साथ पूरी दुनिया भी स्थिर हो गयी है।
महाकवि कालिदास ने सत्य कहा है- 'शरीरमाद्यं खलु धर्मसाधनम्' अर्थात् हमारा शरीर धर्म(कर्म) का साधन है। शरीर स्वस्थ है तो हम अपने सामाजिक, नैतिक, धार्मिक, पारिवारिक दायित्वों को पूर्ण कर सकते हैं। शरीर के अस्वस्थ होने पर हमें किसी से बात करना या किसी भी प्रकार के शोर को सुनना नहीं चाहते बल्कि
चिड़चिड़े हो जाते हैं। कहने का तात्पर्य है कि हमें कुछ भी अच्छा नहीं लगता।
इस प्रकार कष्ट की स्थिति में हम किसी भी काम को करने में असमर्थ हो जाते हैं। हम भगवद् भजन भी नहीं कर सकते। वह भी तभी कर सकेंगे जब हम स्वयं स्वस्थ होंगे। शरीरिक कष्टों के आने पर और उस परेशानी के चलते हम प्रभु को स्मरण भी न करके उसे अपने कष्टों के लिए उलाहने देते हैं।
शरीर का स्वस्थ रहना हमारे लिए बहुत आवश्यक है। इसके लिए हमें स्वास्थ्य के नियमों का पालन करना चाहिए। उचित आहार-विहार पर ध्यान देना आवश्यक है। इसे सजा-संवार कर रखना चाहिए। मात्र शरीर को सब कुछ समझ कर चौबीसों घंटे इसी शरीर की सेवा में लगे रहकर शेष सभी दायित्वों से मुँह नहीं मोड़ना
अनुचित है।
शरीर के साथ साथ दिमाग भी स्वस्थ रहना चाहिए l कई शारीरिक रुग्मता हमारे बुद्धि के असंतुलन से ही होते हैं l उसलिए हमारे सूक्ष्म शरीर, जिस में मन भी एक अविभाज्य भाग है, को संतुलन रखना है l अगर स्थूल और सूक्ष्म शरीर ठीक रास्ते पर चलते हैं तो कारण शरीर, जो तीसरा है, उसे अच्छे अच्छे कर्मों का फल प्राप्त होनेसे वहा भी दुरुस्त रहता है और इंसान को सीधे रास्ते पर चलाता है l
हमारा यह शरीर साधन है साध्य नहीं। नश्वर शरीर को ही सब कुछ मानकर दीन-दुनिया भूल जाना उचित नहीं। किसी विद्वान ने इस विषय में कहा है-
'क्या तन माँजता रे आखिर माटी में मिल जाना'
समय बीतते यह शरीर विकारों से युक्त हो जाता है। इसका सौंदर्य भी कुछ निश्चित समय के लिए ही होता है। जहाँ तक हो सके शरीर से आगे सोच कर इस संसार में आने के उद्देश्य(मोक्ष) को प्राप्त करने की ओर कदम बढ़ाएँ और अपने इस मानव जीवन को सफल बनाने के लक्ष्य में सफलता प्राप्त करें।
Sharira Madhyam Khalu Dharma Sadhanam l Kumarasambhavam-Mahakavi Kalidas
At the outset let me first separate the conjunctions of the words and convey the meaning of each word of the said saying by Kalidasa in Kumara Sambhavam.
SharIramAdyaM (शरीरमाद्यम्) = Sharira (शरीर) + Adyam (आद्यम्)
SharIra = body
Adyam = first
Adi (आदि) = beginning
Khalu (खलु) = for emphasis and also used at times as meter filler
DharmasAdhanam (धर्मसाधनम्) = dharma (धर्म) + Saadhanam (साधनम्)
Dharma = duty, right act, what needs to be done...
Saadhanam = instrument
To consolidate, the meaning goes as follows:
Physical body is the medium for the righteous action.
Mahakavi Kalidasa in his work Kumarasambhavam says this eternal truth..
No comments:
Post a Comment