అజరామర సూక్తి – 245
अजरामर सूक्ति – 245
Eternal Quote – 245
यथा चतुर्भिः कनकं परीक्ष्यते निघर्षणच्छेदनतापताडनैः ।
तथा चतुर्भिः पुरुषः परीक्ष्यते त्यागेन शीलेन गुणेन कर्मणा ॥ - चाणक्य नीति
యథా చతుర్భిః కంనకం పరీక్ష్యతే నిఘర్షణఛేదనతాప తాడనైః l
తథా చతుర్భిః పురుషః పరీక్ష్యతే త్యాగేన శీలేన గుణేన కర్మణా ll
వరపురాయి పైన రుద్దుట చేతగానీ, కడ్డీని లేక బిళ్ళను సుత్తె మరియు ఉలి
సహాయముతో విరిచి గానీ, వేడి చేయుట మరియు కొట్టు్ట ద్వారా గానీ బంగారాన్ని
పరీక్షించినట్లే; మనిషిని పరీక్షించుటకు కూడా నాలుగు ప్రాతిపదికలు గలవు. అవి ఏవన
త్యాగము, శీలము, గుణము మరియు చేసే సత్కర్మాచరణము.
బంగారం అత్యంత సున్నితమైన మరియు విలువైన మూలకము. దీన్ని పలుచటి
రేకులుగా గానీ పొడవైన తంతెగా కానీ సాగాదీయవచ్చు. దీని మెరుపు కూడా
అసామాన్యమైనది. ఈ లోహముతో పగటిపూట పనిచేసే ఒక స్వర్ణకారుడు, తన వద్దకు
తెచ్చిన బంగారము యొక్క ప్రామాణికతను పైన చెప్పిన రీతిలో పరీక్షించుతాడు. అతను
దీనిని వరపురాయికి రుద్ది దాని మెరుగును పరిశీలించి పరీక్షించి విలువ కడతాడు.
నిజమైన బంగారం దాని ప్రకాశాన్ని కోల్పోదు. అతను దానిని కొడతాడు, వేడి చేస్తాడు
మరియు దానిని అంచనా వేసే ప్రక్రియలో కత్తిరించూతాడు. ఈ ప్రక్రియలన్నీ బంగారము
యొక్క విలువ, నాణ్యత తెలుసుకొనుటకే!
అదేవిధంగా, ఒక వ్యక్తియొక్క గుణమును ఈ విధముగా పరిశీలించుతారు.
1. త్యాగము : దీనిని ఒక విధముగా ఔదార్యము అని కానుకోవచ్చును. త్యాగము అంటే
తనకు లేకున్నా ఫరవాలేదని ఉన్నదంతా ఇచ్చివేయుట. అది ఈకాలమున జరుగదు
కావున ఔదార్యము అన్న పదమును వాడినాను. ఆ ఉదారత సేవ రూపమున కావచ్చు,
ధన రూపమున కావచ్చు, లేక జ్ఞాన బోధనము కావచ్చు. ఈ సేవలన్నీ అతని దయ జాలి,
కరుణ లకు ప్రతీకలే!
2. శీలము – ‘ప్రాణం వాపి పరిత్యజ్య మానమేవాభి రక్షతు l
అనిత్యో భవతి ప్రాణో మానమా చంద్ర తారకంll’
అని అంటుంది నీతి శాస్త్రము. మానము అంటే మట్టు మరియాద. మది మగవాళ్ళకు
కావలసినదే, ఆడవాళ్ళకూ కావలసినదే!
3. గుణము – గుణమును ఒక వ్యక్తి యొక్క నడవడికగా మనము గ్రహించవచ్చును.
సద్గుణము కలిగిన వానికి సద్గణము చేరుతుంది. అది సత్సంగమనబడుతుంది.
జగద్గురువులు శంకరాచార్యులవారు ‘భజగోవిందము’ లో చెప్పనే చెప్పినారు.
సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చల తత్వే జీవన్ముక్తి
‘మోహముద్గర’మను నామకరణము కలిగి ‘భజగోవిందము’ గా పేరొందిన 31 బోధనా
శ్లోకాల లో తొమ్మిదో శ్లోకమిది. సత్పురుషుల సాంగత్యము వల్ల ఈ ప్రాపంచిక
విషయాల పట్ల సంగభావము తొలగిపోతుంది. దానివల్ల క్రమంగా మనలో ఉన్న భ్రమ
వ్యామోహము దూరమౌతుంది. మోహము తొలగిందంటే మనోనిశ్చలత ఏర్పడుతుంది.
అంటే మనసు అచంచాలముగా భగవంతునిపై నిలిచిపోతుంది. ఆవిధముగా మనసు
చలించకుండా భగవంతునిపై నిలిచిపోతే సమస్త కర్మబంధముల నుండి విముక్తి
లభిస్తుంది. జీవించి ఉండగానే ముక్తి లభిస్తుంది. అదే మోక్షం. మానవుడు ఈ
ప్రపంచంలో జీవించినంతకాలం సుఖాలను, భోగాలను, ఆనందాన్ని కోరుకుంటారు.
లోకంలో కనిపించే వస్తువుల ద్వారానే ఆనందాన్ని, సుఖాన్ని పొందగలననుకుంటాడు.
ఇలా వస్తువుల ద్వారా విషయాల ద్వారానే ఆనందము పొందగలుగుతామనుకోవడమే
మోహములేక భ్రమ. ఆ భ్రమ తొలగితే కలిగేదే ప్రమ.
4. సత్కర్మాచారణము – లోకానికి, సంఘానికి లేక కనీసము సాటి మనిషికి సహాయము
చేసినా, ఆ చేసిన వ్యక్తి ఎంతో పుణ్యకార్యము చేసినవాడౌతాడు. అదే అతని రక్షణ.
ఈ 4 ఉపదేశముల ఆధారముగా ఒక వ్యక్తి విలువను తెలుసుకోగలము. ఈ లక్షణాలు
లేకుంటే ఇకనైనా వాని కొరకు ఆత్మా సాక్షిగా ప్రయత్నించట మంచిది.
यथा चतुर्भिः कनकं परीक्ष्यते निघर्षणच्छेदनतापताडनैः ।
तथा चतुर्भिः पुरुषः परीक्ष्यते त्यागेन शीलेन गुणेन कर्मणा ॥ - चाणक्य नीति
घिसने, काटने, तापने और पीटने, इन चार प्रकारों से जैसे सोने का परीक्षण होता है, इसी प्रकार त्याग, शील, गुण, एवं कर्मों से पुरुष की परीक्षा होती है ।
सोना सबसे लचीला और तन्य तत्व का है। इसे सबसे पतली चादरों में पीटा जा सकता है या सबसे लंबे धागे बनाने के लिए फैलाया जा सकता है। इसकी चमक भी अनोखी है। एक सुनार, जो धातु के साथ दिन-रात काम करता है, अपने पास लाए गए सोने की प्रामाणिकता की जांच करता है। जिस तरह से वह इसे किसी खुरदुरे पत्थर से रगड़ता है। असली सोना अपनी चमक नहीं खोएगा और न ही धारियाँ छोडेगा। वह इसे घीसता भी है, पीटता भी है, गर्म करता है और इसका मूल्यांकन करने की प्रक्रिया में इसे काट भी देता है।
इसी तरह, किसी व्यक्ति के लिए परीक्षण के आधार हैं:
1. त्याग: त्याग ओ होताहै जो आदमी खुद केलिए बिना कुछ भी रखे अपने सबकुछ दूसरोंको निछावर कर्देताहा l इस वर्त्तमान जमाने में वैसे लोगों नको हम नहीं डेक सकते l उसी लिए हम उदारता को उस के बदलेमें ले सकते हैं l उदारता अपने धन, सेवाओं या करुणा से भी दिखासक्ता है।
2. शील माने चरित्र – नीति शास्त्र इ कहती है कि
प्राणञ्चापि परित्यज्य मानमेवाभिरक्षतु।
अनित्यो भवति प्राणो मानमाचन्द्रतारकम्॥
प्राण शाश्वत नहीं है लेकिन मान यानी शील माने चरित्र अजरामर है l उसीलिए चाहे ओउरत हो या मर्द किसी भी हालत में चरित्रहीन नहीं होना चाहिए l
3. गुण- संत कबीर जी के वाणी सुनीए
जौ मानुष ग्रह धर्म युत, राखै शील विचार |
गुरुमुख बानी साधु संग, मन वच सेवा सार ||
जो ग्रहस्थ - मनुष्य गृहस्थी धर्म - युक्त रहता, शील विचार रखता, गुरुमुख वाणियों का विवेक करता, साधु का संग करता और मन, वचन, कर्म से सेवा करता है उसी को जीवन में लाभ मिलता है | मनुष्य अपनाने केलिए सच्चे गुण अच्छे गुण होते हैं l अगर अपनाएंगे तो उन गुण हमें मोक्ष पथ पर चलनेका तरीखा बताता है l
4. कर्म- क्रिया का पहला रूप कर्म होताहै l सही कर्म करनेसे आदमी खुद केलिए और समाज केलिए भी उन्नति देसकता है l नहीं तो वो पाल में फस जाता है l
एक व्यक्ति को इन 4 दार्शनिक सूत्रोंको के आधार पर चलता है तो जरूर महान बनता है। उसीलिए लोग अपने नैतिक आधारों को जानें और सही रास्ते पर चलें।
No comments:
Post a Comment