అజరామర సూక్తి – 250
अजरामर सूक्ति – 250
Eternal Quote – 250
यथा धेनु सहस्रेषु वत्सो विन्दति मातरम l
तथा पूर्व कृतं कर्मा कर्तार मनुगच्चति || महाभारत – शान्ति पर्व 181.16
యథా దేను సహస్రేషు వత్సోవిన్దతి మాతరం l
తథా పూర్వ కృతం కర్మ కర్తారామనుగచ్ఛతి ll మహా భారతము
(శాంతి పర్వము 181. 16)
"నా భుక్తం క్షీయతే కర్మ" అంటారు పెద్దలు.
మన కర్మ బ్యాంకి బాలెన్సు లాంటిది . క్రెడిట్ బాలెన్సన్నా ఐతే పరవాలేదు గానీ డెబిట్
బాలెన్సయితే వడ్డీ కూడా వచ్చి చేరుతుంది . పురాకృత సుకృత దుష్కృతాలు కర్తను
ఎప్పుడూ వదిలి పెట్టవు .
వేలకొలది ఆవుల మంద లో కూడా కర్మ అనే దూడ తనజన్మ హేతువును అనగా
తల్లియావును వెదుక్కొంటూ వస్తుంది.
భాగవతమున నారదుడు ధర్మరాజుకు చెప్పిన ఉపదేశ వాక్యములలోని కొన్ని
సందర్భోచిత వాక్యములను ఈ క్రింద ఇచ్చుట జరిగినది. ఇవి సప్తమ స్కందము
వర్ణాశ్రమ ధర్మములలో వస్తాయి. ఇవి వర్ణాశ్రమమునకు సంబంధించిన మౌలిక
సూత్రములు. ఈ సూత్రములను అనుసరించి ఆయా వర్ణములవారు తమ విధులను
అనగా కర్మలను నిర్వర్తించగలిగితే పథమును వీడక ధర్మ విహిత కర్మాచరణ బద్ధులయి
ఉన్నారని అర్థము. ఒకపరి ఆ లక్షణములను గమనించండి.
దమమును శౌచముఁ దపమును
శమమును మార్దవముఁ గృపయు సత్యజ్ఞాన
క్షమలును హరిభక్తియు హ
ర్షము నిజలక్షణము లగ్రజాతికి నధిపా!
బహిరింద్రియ నిగ్రహం, అంతరింద్రియ నిగ్రహం, శుచిత్వం, తపస్సు, సౌమ్యత, దయ,
సత్యం, జ్ఞానం, క్షమ, విష్ణుభక్తి, హర్షము బ్రాహ్మణ వర్ణమునకు సంబంధించిన వ్యక్తికి
స్వాభావికమైన లక్షణములుగా ఉండవలెను.
శౌర్యము దానశీలముఁ బ్రసాదము నాత్మజయంబుఁ దేజమున్
ధైర్యము దేవభక్తియును ధర్మము నర్థముఁ గామమున్ బుధా
చార్యముకుందసేవలును సత్కృతియుం బరితోషణంబు స
ద్వీర్యము రక్షణంబుఁ బృథివీవరశేఖర! రాజచిహ్నముల్.
మహారాజా! ధర్మరాజ! క్షత్రియుల లక్షణాలు శౌర్యం; దానము; ప్రసన్నత; మనోనిగ్రహము;
తేజస్సు; ధర్మనిష్ఠ; అర్థ సంపాదన; ఇచ్ఛా; బుధసేవ; ఆచార్యసేవ; పరమాత్ముని సేవ;
సత్కార్యాచరణ; తన పాలితులను సంతోషపరచుట; సద్వీర్యము అనగా అసమానమగు
శూరత్వము,శ్రేష్ఠత అన్నది అనవరతము మంచి రేతస్సు అని కాదు; సంరక్షణ అనగా
ధర్మ సంరక్షణ. ఇవి అన్నియు క్షత్రియసత్కర్మాచరణము క్రింద వస్తాయి.
ధర్మార్థకామవాంఛయు
నిర్మల గురుదేవ విప్ర నివహార్చనముల్
నిర్మదభావముఁ బ్రమదము
శర్మకరత్వమును వైశ్యజన లక్షణముల్.
ధర్మ, అర్థ, కామములు వాంఛించుట; గురువుల, దేవతల, బ్రాహ్మణుల సేవ; నిగర్వము;
సంతోషం; తృప్తిపరచుట అనునవి వైశ్య వర్ణస్థుల సత్కర్మలు.
స్తేయము లేనివృత్తియు శుచిత్వము సన్నుతియున్ నిజేశులన్
మాయలు లేక డాయుటయు మంత్రము జెప్పక పంచయజ్ఞముల్
చేయుటయున్ ధరామరుల సేవయు గోవులరక్షణంబు న
న్యాయము లేమియున్ మనుజనాథ! యెఱుంగుము శూద్రధర్మముల్.
చౌర్యమునకు పాల్పడకుండుట; పరి శుభ్రత కలిగియుండుట; భగవధ్యానము చేయుట;
నిష్కపట సేవాధర్మమును కలిగియుండుట; బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞం,
భూతయజ్ఞం, మనుష్యయజ్ఞం నిర్వర్తించుట; పండితాదరణ; గోరక్షణ; న్యాయజీవనం.
మఱియు సంకరజాతు లయిన రజక చర్మకారక నట బురడ కైవర్తక మ్లేచ్ఛ భిల్లు లను
నంత్యజాతు లేడ్వురకును జండాల పుల్కస మాతంగ జాతులకును నాయా
కులాగతంబు లైన వృత్తులఁ జౌర్యహింసాదులు వర్జించి సంచరింపవలయు;
పంచ యజ్ఞములు:
బ్రహ్మయజ్ఞము: శూద్రునకు స్వాధ్యాయము అంటే వివిధములగు భగవత్ స్తోత్రములను
అనుదినమూ క్రమము తప్పక తాగాత్మ్యముతో పఠించుట బ్రహ్మయజ్ఞమే.
దేవయజ్ఞము: వివిధ దేవతల తృప్తికోసము యజ్ఞములను చేయించుట దేవయజ్ఞము.
పితృయజ్ఞము: పితృదేవతల ప్రీతికోసం సద్బ్రాహ్మణుల సహాయముతో చేసే కర్మలు,
తర్పణములు ఆ కార్యక్రమాల్లో చేసే అన్న సంతర్పణ, శక్తి, భక్తి కొలది దానములు అంతా
పితృయజ్ఞము.
భూతయజ్ఞము: ప్రతినిత్యం చేయవలసిన జీవరాశుల తృప్తికొరకు భూతబలిగా ఇచ్చే
ఆహార సమర్పణము, జంతువులకు ఆహారం పెట్టడము- భూతయజ్ఞము.
మనుష్యయజ్ఞము: తనకు కలిగిన విధంగా వచ్చిన అతిథి అభ్యాగతులకు అన్నదానం,
ఇతర సహాయాలు చెయ్యడం మనుష్యయజ్ఞము.
ఈ ఐదు యజ్ఞములూ అన్ని వర్ణములకూ వర్తించుతాయి.
భగవద్గీత త్రిగునాత్మకమగు కర్మలను గూర్చి ఈ విధముగా చెబుతూ వున్నది:
అనుబంధం క్షయం హింసా మనపేక్ష్యచ పౌరుషమ్l
మోహదారభ్యతే కర్మ లత్తామస ముదాహృతమ్.ll గీత 18-25
ముందు రాబోవు మంచిచెడ్డలను. నాశమును, హింసను తన సామర్థ్యమును
ఆలోచింపక మోహమువలన ప్రారంభింపబడు కర్మకు తామస కర్మయని
చెప్పబడుచున్నది.
యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణవా పునః l
క్రియతే బహుళా యానం తద్రాజస ముదాహృతమ్|| గీత 18-24
ఎవడు కోరికలు కలిగి అహంకారముతో గూడికొని మిగుల కష్టమునిచ్చు కర్మను
చేయుచున్నాడో అట్టివాడు చేయు కర్మ రాజన మని చెప్పబడును.
నియతం సంగ రహిత మరాగ ద్వేషత కృతమ్ l
అఫల ప్రేప్సునా యత్త త్సాత్విక ముచ్యతే ll గీత 18-23
తనకు విధించబడియుండు కార్యమును, తాను కర్తయను అభిమానములేకను,
దాగద్వేషములులేకను నియయముచేత స్వధర్మాను సారముగా చేయబడు కర్మ
సాత్విక కర్మ యనబడును.
ముక్త సంగో7నహం వాదీ ధృత్యుత్సాహ సమన్వితః l
సిద్ధ్యసిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే ll గీత 18-26
ఫలాపేక్షలేక తాను కర్తయను అభిమానములేక కార్యము సిద్ధించినను సిద్ధించక
పోయినను మనస్సున వికారము జెందక సమబుద్ధి గల వాడై ధైర్యోత్సాహముల వదలక
పని చేయువాడు సాత్విక కర్త యనబడును.
అందుకే పెద్దలు చెబుతారు:
ధనాని భూమౌ పశవశ్చ గోష్ఠే
నారీ గృహద్వారె జనాః శ్మశానే l
దేహశ్చితాయాం పరలో కమార్గే
కర్మానుగోగచ్ఛతి ఏకమాత్రాః ll
అనగా జీవుడు తన శరీరం విడిచినప్పుడు అతడు సంపాదించిన ధనం దాచిన చోటే
ఉండిపోతుంది. పశువులు కొట్టములోనే ఉండిపోతాయి. భార్య ఇంటి ద్వారం దాకానే
వస్తుంది. పుత్ర మిత్ర బాంధవులు శ్మశానం వరకూ వెంట ఉంటారు. శరీరం చితిలో కాలి
భస్మమౌతుంది. ఆ పిదప ఆ జీవితో బాటు పరలోకానికి పయనించేది కేవలం
అతడాచరించిన కర్మలు\కర్మఫలములు మాత్రమే! సాత్విక కర్మాచరణమే ఇహపర
సాధనము.
यथा धेनु सहस्रेषु वत्सो विन्दति मातरम l
तथा पूर्व कृतं कर्मा कर्तार मनुगच्चति || महाभारत – शान्ति पर्व 181.16
जिस प्रकार हजारों गायों के एक समूह में उनके बछडे अपनी अपनी अपनी माताओं को ढूढ कर उनके पास चले जाते हैं ,उसी प्रकार किसी व्यक्ति द्वारा किये गये कर्म भी उस के पीछे पीछे उस का अनुसरण करते हैं , अर्थात उन किये गये अच्छे या बुरे कर्मों के परिणाम उसी को ही भोगने पडते हैं |
नियतं सङ्गरहितमरागद्वेषतः कृतम।
अफलप्रेप्सुना कर्म यत्तत्सात्त्विकमुच्यते॥ भगवद्गीता 18-23
भावार्थ : जो कर्म शास्त्रविधि से नियत किया हुआ और कर्तापन के अभिमान से रहित हो तथा फल न चाहने वाले पुरुष द्वारा बिना राग-द्वेष के किया गया हो- वह सात्त्विक कहा जाता है l सात्विक गुणों से भरपूर आदमी कभी भी उत्तम दर्जे का होता है l उसीलिए उनके कर्मालाप भी उतं दर्जे के होते हैंजो
उस आदमी को उत्तम गति प्राप्त करवाते हैं l
यत्तु कामेप्सुना कर्म साहङ्कारेण वा पुनः।
क्रियते बहुलायासं तद्राजसमुदाहृतम्॥ भगवद्गीता 18-24
भावार्थ : परन्तु जो कर्म बहुत परिश्रम से युक्त होता है तथा भोगों को चाहने वाले पुरुष द्वारा या अहंकारयुक्त पुरुष द्वारा किया जाता है, वह कर्म राजस कहा गया है l यह तो औसत दर्जे का होता है l इन के कर्मा फल तटस्त होता है l
अनुबन्धं क्षयं हिंसामनवेक्ष्य च पौरुषम् ।
मोहादारभ्यते कर्म यत्तत्तामसमुच्यते॥ भगवद्गीता 18-25
भावार्थ : जो कर्म परिणाम, हानि, हिंसा और सामर्थ्य को न विचारकर केवल अज्ञान से आरंभ किया जाता है, वह तामस कहा जाता है l इस गुण अप्नानेवाला अधम दर्जे का होता है l इन लोगों जो भी कर्म करते हैं उस
का बुरा असर भुगतना ही पड़ता है l
करम फल एक बैंक अकौंट जैसा होता है l जो अच्छे कामों का फल है वो उस इंसान का डिपाजिट अकौंट होता है l
ऐसे अकौंट वाला इह में सब सुख प्राप्त करलेता है और आर में भी l जो बुरे ही बुरे काम करता है वह निश्चय रूप से
लोन अकौंट अपनाता है l उसने अपने किए का फल असल के साथ ब्याज भी भरना पड़ता है l
सिनेमा कवी शैलेन्द्र के ए सुनहरे शब्द एक बार देखीए:
‘भला कीजे भला होगा,
बुरा कीजे बुरा होगा
बही लिख-लिख के क्या होगा
बही लिख-लिख के क्या होगा,
यहीं सब कुछ चुकाना है
सजन रे झूठ मत बोलो, खुदा के पास जाना है’
उसीलिए हम सावधान से कर्माचरण करना बहुत जरूरी है l
सत्व गुण से प्रेरित कर्मा सर्व श्रेष्ठ होता है l
Yathaa dhenu sahasreshu vatso vindati maataram
Tathaa poorva krutam karma kartaaramanugacchathi
Karma is like bank balance. It will not reduce unless it is drawn. If it is debit balance then interest will also accumulate. The karma good or bad present or past is like the calf of a cow, who can identify the mother even among a herd of thousands of cows.
The following are the Slokas from 18th chapter of Bhagavadgita which exhort the importance of Vihita Karma (Advisable result from good or bad deeds, viewed as resulting from one's actions).
Niyataṁ saṅga-rahitam arāga-dveṣhataḥ kṛitam l
Aphala-prepsunā karma yat tat sāttvikam uchyate ll 18-23
Action that is in accordance with the scriptures, which is free from attachment and aversion, and which is done without desire for rewards, is in the mode of goodness.
Yat tu kāmepsunā karma sāhankāreṇa vā punaḥ l
Kriyate bahulāyāsaṁ tad rājasam udāhṛitam ll 18-24
Action that is prompted by selfish desire, enacted with pride, and full of stress, is in the nature of passion. This is called 'Rajasic Guna'
Anubandham kshayam hinsam anapekshya cha paurusham l
Mohad arabhyate karma yat tat tamasam uchyate ll 18-25
That action is declared to be in the mode of ignorance, which is begun out of delusion, without thought to one’s own ability, and disregarding consequences, loss, and injury to others.
The intellects of those in tamo guṇa are covered by the fog of ignorance. They are oblivious to or unconcerned with what is right and what is wrong, and are only interested in themselves and their self-interest. They pay no heed to money or resources at hand, or even to the hardships incurred by others. Such work brings harm to them and to others.
No comments:
Post a Comment