Thursday, 6 May 2021

అజరామర సూక్తి – 231 अजरामर सूक्ती - 231 Eternal Quote – 231

  అజరామర సూక్తి  231

अजरामर सूक्ती -  231

Eternal Quote – 231

https://cherukuramamohan.blogspot.com/2021/05/231-231-eternal-quote-231.html

नन्‍वात्‍मार्न बहु विगणयन्‍नात्‍मनैवावलम्‍बे

     तत्‍कल्‍याणि! त्‍वमपि नितरां मा गम: कातरत्वम्।

कस्‍यात्‍यन्‍तं सुखमुपनतं दु:खमेकान्‍ततो वा

     नीचैर्गच्‍छत्‍युपरि च दशा चक्रनेमिक्रमेण।। श्लोक 49 – मेघदूतम् - कालिदास

నన్వాత్మార్న బహు  విగణ యన్నాత్మ నైవావలంబే

తత్కళ్యాణి! త్వమపి నితరాం మా గమః కాతరత్వం l

కస్యాత్యంతం సుఖముపనతం ధుఃఖమేకాంతతో వా l

నీచై ర్గత్యత్యుపరి  చ దశా చక్రనేమిక్రమేణ ll శ్లోకము 49 మేఘదూతము- కాళిదాసు

ఈ శ్లోకము ఉత్తర మేఘదూతములో యక్షరాజగు కుబేరునిచే శాపగ్రస్తుడగు హేమమాలి యను యక్షుడు చిత్రకూటము వద్ద రామగిరి ప్రాంతములో తిరుగాడుచున్న వాడి మేఘముద్వారా అలకాపురిలోని తన ప్రియురాలికి మేఘముద్వారా పంపిన సందేశమే ఈ మేఘదూతము. మేఘదూతము రెండు భాగములు. 1. పూర్వము 2. ఉత్తరము. ఈ శ్లోకము ఉత్తర భాగము లోని 49వ శ్లోకము.

హేమమాలి తన సందేశ రూపములో ప్రియురాలికి చెప్పుచున్నాడు “కళ్యాణీ ఇంకా విను ఎన్నో విధములగు కల్పనలకు నా మనసును లోను చేస్తూ ఆలోచనలను ఆవలకు ద్రోలి మనో ధైర్యమును నాకు అండగా జేసుకొని జీవితము గడుపుచున్నాను. నీవుకూడా నీ హృదయము నుండి ధైర్యమును దూరము చేసుకోవద్దు.

ప్రపంచములో తాను కోరే సుఖము మాత్రమే అనుభవించే  వ్యక్తి దొరకడు అదేవిధముగా తానూ వద్దు అనుకొనే దుఃఖాలు మాత్రమే అనుభవించే వ్యక్తీ కూడా దొరుకడు.

సుఖము కలకాలముండదు దుఃఖమైన

వృత్త వ్యాసాన కొసలవి ఎంచి జూడ

తిరుగనాచక్రమివిగూడ తిరుగుచుండు

నిలకడయె లేని రీతిన నిముసమైన

ఒక పేరుమోసిన శాస్త్ర చికిత్సకుడు ‘నేను ఇన్ని Operations చేసినాను కానీ  నాకు

Operation చేసినపుడు కలిగిన బాధ నేను ఎవరిలోనూ చూడలేదు’ అన్నాడట. కష్టాలు 

కూడా అంతే! ప్రతియోక్కరూ అందరి కష్టాలకన్నా తమ కష్టమే ఎక్కువ అనుకొంటారు. 

ఆ కష్టాన్ని గూర్చి మాత్రమే ఆలోచించుకొంటూ ఉండిపోతే రక్త పీడనము పెరిగిపోవుట 

తప్పించి ఒరిగేదేమీ ఉండదు. అందుకే కష్టము వస్తే పరిష్కారమునకై ఆలోచించవలె 

గానీ అన్యథాకాదు. అదే విధముగా సుఖము ఎక్కువైనా హటాత్తుగా ఆనందము పెంచే విషయము సంభవించినా అదుపు చేసుకోలేని మనసు కలిగినవాడు అకస్మాత్తుగా బాల్చీ తన్నవచ్చు. అందుకే మంచిని గూర్చి గానీ చెడును గూర్చి గానీ పరిమితుల నెర్పరచుకొని పరిధి లోపల వుంటే మనసునకు అధిక డోలనము లేకుండా కష్ట సుఖములను సమానముగా చూచుకొనవచ్చును. ఆగుణము మనశ్శాంతికి హేతువు. అందుకే త్యాగయ్యగారు ‘శాంతము లేక సౌఖ్యము లేదు’ అన్నారు.

ప్రపంచములో తాను కోరే సుఖము మాత్రమే అనుభవించే  వ్యక్తి దొరకడు అదేవిధముగా తానూ వద్దు అనుకొనే దుఃఖాలు మాత్రమే అనుభవించే వ్యక్తీ కూడా దొరుకడు.

ఇది ఆమెకే కాదు లోకానికే ఉపదేశ వాక్యము. అందుకే వివరముగా మహా కవి కాళీదాసు పాదములకు సాష్టాంగ నమస్కారమాచారించి ఈ శ్లోకమునకు భావము తెలియజేసినాను. 

 नन्वात्मार्न बहु विगणयन्नात्मनैवावलम्बे

     तत्कल्याणित्वमपि नितरां मा गमकातरत्वम्

कस्यात्यन्तं सुखमुपनतं दु:खमेकान्ततो वा

     नीचैर्गच्छत्युपरि  दशा चक्रनेमिक्रमेण।। श्लोक 49  उत्तर मेघदूतम् - कालिदास

मेघदूतम् महाकवि कालिदास द्वारा रचित विख्यात काल्पनिक काव्य है l यक्षराज कुबेर अलकापुरी से उनके भृत्य हेममाली को निष्कासित कर देता है। निष्कासित यक्ष रामगिरि पर्वत पर निवास करता है। वर्षा ऋतु में उसे अपनी प्रेमिका की याद सताने लगती है। हेममाली संदेश दूत के माध्यम से भेजने का निश्चय करता है। वर्ष ऋतु होनेसे मेघ को दूत बनाके भेजता है l

जो श्लोक हम लिए हैं वह इस काव्य के उत्तरार्थ का है l इस में हेममाली अपनी प्रेमिका से इस तरह कहता है

 

प्रियेऔर भी सुनो। बहुत भाँति की कल्पनाओं में मन रमाकर मैं स्वयं को धैर्य देकर जीवन रख रहा हूँ। हे सुहागभरीतुम भी अपने मन का धैर्य सर्वथा खो मत देना। कौन ऐसा है जिसे सदा सुख ही मिला हो और कौन ऐसा है जिसके भाग् में सदा दु: ही आया होहम सबका भाग् पहिए की नेमि की तरह बारी-बारी से ऊपर-नीचे फिरता रहता है।” अह सिर्फ प्रेमिका को ही नहीं बल्कि हम सबको है. किसी भे कठिन परिस्थिथी में हम अपना धीरज नहीं खोबैठना  है l

Nanvaatmaarna bhu viganayannaatmanaiaavalambe  

Tatkalyaani! Tvamapi nitaraam maa gamah kaataratvam l

 Kasyaatyantam sukhamupanatam dukhamekaantato vaa

Neechairgachchhatyupari cha dashaa chakranemikramena ll

This verse is from Meghadootam written by the great kavi Kalidasa. Hemamali the servant of the Yaksha king Kubera was coursed for his negligence of duty and sent to Ramagiri of Chitrakuta. There from e sends his love message through a cloud to his lady love. The present sloka is from the second part of Meghadootam.

Hemamali is consoling his love “Oh my fair lady! Listen, by giving room for thinking on several fancies and fantasies I divert my sad feelings of departing from you, by keeping my courage intact. You too don’t let lose your courage. There is none who is always happy and comfortable and none who is always unhappy and miserable.  Happiness and sorrow alternate like the rim of a wheel which goes up and down” I feel this is a message not only to her by Hemamali but a directive to the man kind to be always courageous without leaving any space for disheartenment.

స్వస్తి. 

No comments:

Post a Comment