Sunday, 16 May 2021

అజరామర సూక్తి – 240 अजरामर सूक्ती - 240 Eternal Quote – 240

 అజరామర సూక్తి  240

अजरामर सूक्ती -  240

Eternal Quote – 240

 https://cherukuramamohan.blogspot.com/2021/05/2-40-2-40-eternal-quote-2-40-l-ll.html

पुत्राश्च विविधैः शीलैः नियोज्याः सततं बुधैः ।

नीतिज्ञाः शीलसम्पन्नाः भवन्ति कुलपूजिताः ॥ चाणक्य नीति

పుత్రాశ్చ వివిధైః శీలైః నియోజ్యాః సతతం బుధైః l

నీతిజ్ఞాః శీలసంపన్నాః భవంతి కులపూజితాః ll  

తల్లిదండ్రులు తమ సంతానమును బాల్యమునందే సద్గుణ సంపన్నులను చేస్తే వాళ్ళు 

నీతిమంతులు మరియు సద్గుణ సంపన్నులు అయి కులదీపకులౌతారు.

బజారు లో దొరికే  సరికొత్త బొమ్మలుతాజా యంత్ర ఉపకరణములు (Gadgets) 

 నిజంగా పిల్లల భవిష్యత్తును సుసంపన్నము చేయలేవు. రోజంతా దుర్దర్శనము, అదే 

దూరదర్శనము, చూడటముమధ్యలో చలితదృశ్య క్రీడలు (Video  Games) ఆడుట 

అన్నది జీవిత ధోరణిగా మారుతోంది. పిల్లలు వ్యక్తిగతమగు పరిచయములుతమ 

చుట్టూవున్న వ్యక్తుల నైపుణ్యములను గుర్తించుటకు తమ సమయమును 

వినియోగించలేక పోతున్నారు. పిల్లలు దానివల్ల మరింత ముఖ్యముగా నైతిక 

విలువలను కోల్పోతున్నారు.

ఈ శ్లోకము, తెలివిగల తలిదండ్రులు తమ పిల్లలు జీవితమంతా కష్టాలతో పోరాడుటకు 

ఇవ్వవలసిన సాధనము చిత్తశుద్ధి మాత్రమే ! ఆ ఒక్కటి చేత ఉండినదంటే అది; 

 నిజాయితీగా ఉండుటకష్టపడి పనిచేయుటసాటి మనుషులపై కరుణచూపుట

సహనగుణముఈవిధముగా చెప్పుకొంటూబోతే  జాబితా చేంతాడంత ఔతుంది. 

అటువంటి మూలములు కలిగిన పిల్లలుధృఢమైన శీలమును బలమైన నైతిక వైఖరిని 

కలిగి ఉంటారు. ఇందుకు తోడుగా సమాజంలో ఆసాంతము గౌరవించబడుతూ 

ఉంటారు. కాబట్టి ఈ ప్రాథమిక వాస్తవమును తెలుసుకొని తెలివైన తల్లిదండ్రులు పిల్లల 

పెంపకము పై మొదటి నుండియే శ్రద్ధ తీసుకుంటారు.

తమ చుట్టూ ఉన్న ప్రజలను గౌరవించుటకు మరియు విలువ ఇచ్చుటకు చిన్న వయసు 

నుండియే తలిదండ్రుల నుండి శిక్షణ పొందినట్లయితేవారు తరువాత జీవితంలో 

అత్యంత ఉన్నతిని సాధించగలుగుతారు. భౌతిక సుఖాల పెరుగుదల నైతిక వృద్ధికి ఏ 

విధంగానూ దోహదము చేయలేదు.

తల్లిదండ్రులు ఇచ్చిన భౌతిక సౌఖర్యములను పిల్లలు గుర్తుంచుకోరు. కానీజీవితాన్ని 

విశ్వాసముతో మరియు గౌరవముగా అసాన్థమూ కొనసాగించుటకు వారికి ఇచ్చిన 

నిష్ఠా,నీతి, నియమములు మరియు విలువలను వారు గుర్తుంచుకుంటారు మరియు 

ఆదరిస్తారు. ఆవిషయమును తల్లిదండ్రులు గుర్తుంచుకొంటే నీతివంతమగు సమాజ 

సృష్ఠికి దోహదము చేసిన తలిదండ్రులుగా గర్వాన్ని, గౌరవాన్ని కూడా పొందుతారు.

पुत्राश्च विविधैः शीलैः नियोज्याः सततं बुधैः ।

नीतिज्ञाः शीलसम्पन्नाः भवन्ति कुलपूजिताः ॥ चाणक्य नीति

बुद्धिमान पिता को चाहिए कि अपने पुत्र और पुत्रियों को अनेक प्रकार के शुब गुणों की सिक्षा देंक्योंकि नीतिज्ञ और शीलवान व्यक्तियों की ही कुल में पूगा होती है l

बाजार में नवीनतम खिलौनेनवीनतम यन्त्र-उपकरण --- क्या ये वास्तव में ऐसी चीजें हैं जो बुद्धिकुशलता के साथ संस्कार दे सकते हैपूरे दिन दूरदर्शन देखनाबीच-बीच में वीडियो गेम खेलना - यह जीवन का चलन बनता जारहा हैl बच्चे व्यक्तिगत बातचीत आसपास लोगों के कौशल और नैतिक मूल्यों का अनासक्त होते जारहे हैंयह श्लोक कहता है कि जो बुजुर्ग लोग होशियार हैं वे जानते हैं कि उन्हें अपने बच्चों को बांटने के लिए केवल एक ही सामग्री की आवश्यकता होती हैवह है सत्यनिष्ठा। एक ठोस नैतिक आधार कई प्रकार की अखंडता प्रदान करता है - ईमानदार होनाकड़ी मेहनत करनाकरुणामय होनाधैर्यवान होना ...सूची आगे बढ़ती हैऐसी आधारशिला वाले बच्चे ठोस चरित्र के होते हैं। यह वे हैं जिनके पास एक मजबूत नैतिक रुख और एक स्पष्ट चरित्र है जो समाज में सम्मान के लायक होतेहैं और लोगोंके नायक होसकते हैं। जो माता-पिता इस विषय को पहले ही पहचानते हैं, वे उस के जरिए अपने बच्चे पाने के अच्छे गुणों के श्रृंखला को जानकर और मानकर, वे बुद्धिमान माता-पिता हैं

यदि अपने बच्चों  को  उन्हें अपने युवा दिनों से अपने आसपास के लोगों का सम्मान करने 

और उन्हें महत्व देने के लिए प्रशिक्षित किया जाता हैतो वे जीवन गमन में बहुत कुछ बड़ों के जरिए 

सेख सकते हैं और अपना जीवन  बहुत बेहतरीन बनासकते हैं। भौतिक सुख-सुविधाओं में वृद्धि से

 किसी भी तरह से नैतिक विकास नहीं होता है

 आपके द्वारा दी गई भौतिक चीजों के लिए बच्चे आपको याद नहीं रखेंगे। 

हालांकिवे उन नैतिकताओं और मूल्यों को याद रखेंगे और आपने जीवन भर अपने माता-पिता के 

आभारी रह जायेंगे जो उनको आत्मविश्वास और सम्मान के साथ जीनेके तारीखे से सुसज्जित

 किया है

putrāśca vividhai śīlai niyojyāḥ satata budhai 

nītijñāḥ śīlasampannāḥ bhavanti kulapūjitāḥ ॥ cāṇakya nīti

Intelligent people always equip children with varieties of integrities. Those endowed with character and probity become worshiped in the family/community.

The newest toys in the store, the latest gadgets in the market - are these really the things we need to equip children with? Watching television all day, playing video games in between - this is becoming the trend of life and children are losing out on personal interactions, people skills and more essentially, moral values!

The verse says people who are smart know that the only paraphernalia they need to arm their children with is integrity. A sound moral ground provides varieties of integrities - being honest, working hard, being compassionate, being patient..., the list goes on! Children with such a cornerstone, become of solid character. It is they who have a strong moral stance and a pronounced character that comes to be respected in society. Knowing this chain of links, intelligent parents take those first steps right from the start.

If they are trained from their younger days to respect and value the people around them, they will be much better off later in life.  An increase in the material comforts one owns does not conduce moral growth in any way.

 Children will not remember you for the material things you gave them.  However, they will remember and cherish the morals and values you equipped them with to embrace life with confidence and respect.

 స్వస్తి.                                    

No comments:

Post a Comment