అజరామర సూక్తి – 253
अजरामर सूक्ति – 253
Eternal Quote – 253
https://cherukuramamohan.blogspot.com/2021/05/253-253-eternal-quote-253.html
वयाम्सि पशवाश्चैवा भूतानि च जनाधिपा l
गृहस्थैरेव धार्यन्ते तस्माच्च्रेष्ठो गृहाश्रमी ll (सं० वि० गृहाश्रम प्र०)
వయాంసి పశవశ్చైవ భూతాని చ జనాధిపా l
గృహస్థైరేవ ధార్యంతే తస్మాచ్ఛ్రేష్ఠో గృహాశ్రమీ ll (సం. వి. గృహస్తాశ్రమ ప్ర)
చతుర్విధ ఆశ్రమములు ఈ విధముగా చెప్పబడినాయి. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ,
సన్యాసాశ్రమములు. వీనిలో గృహస్థ ధర్మము అత్యంత శ్రేష్ఠమైనది. ఎందుకంటే మిగతా
మూడు ఆశ్రమ ధర్మాలవాళ్ళనూ పోషించ గలిగింది పోషింప వలసినది వాళ్ళే .
పక్షులు పశువులు మానవులు గృహస్థులచేతనేకదా పోషింపబడేది. అందుకే అది
శ్రేష్ఠతమము.
కృత, త్రేతా, ద్వాపర యుగములలో సన్యసించిన వారాలలో ప్రస్ఫుటముగా కనిపించే
పేరు శుకబ్రహ్మదే! ఆయన కౌపీనము కూడా లేకుండా పుడుతూనే అడవులకు
వెళ్ళిపొయినాడు. శ్రీకృష్ణుడు జగద్గురువైనా పెల్లయినవాడు పైగా ఆయన కూడా
ద్వాపరమునకు చెందినవాడు. పరమాత్మ తరువాత ఆ పట్టమునండి పుచ్చుకొన్న
మహనీయుడు ఆదిశంకరులవారు(క్రీ.పూ. 509-477). ఆ తరువాత ముఖ్యముగా 20,
21 శతాబ్దములలో ఎంతోమంది, బాబాలు, స్వాములు, గురువులు ప్రభవించినారు. ఆది
శంకరులు క్రీ.పూ. 5వ శతాబ్దికే ఈ మాట చెప్పినారు;
జటిలో ముండీ లుంజిత కేశః కాషాయాంబర బహుకృత వేషః l
పశ్యన్నపిచన పశ్యతి మూఢః ఉదర నిమిత్తం బహుకృత వేషః ll
చాలా మంది జటలు ధరించి.. లేదా గుండు గీయించుకుని కాషాయవస్త్రాలను ధరించి
అనేక వేషాలు వేస్తుంటారు. ఈ వేషాలన్నీ పొట్టకూటి కోసమేగానీ వీరు కళ్లతో చూస్తూ
కూడా సత్యాన్ని దర్శించలేని మూర్ఖులు అని దీని అర్థం. ‘భజగోవిందం’లో
శంకరాచార్యులు తొలి పన్నెండు శ్లోకాలు (ద్వాదశ మంజరికా స్తోత్రం) చెప్పిన
అనంతరం వారి శిష్యులు 14 శ్లోకాలు చెప్పినట్లు పెద్దలు చెబుతూ ఉంటారు. వాటిని
‘చతుర్దశ మంజరికా స్తోత్రం’గా వ్యవహరిస్తారు. వాటిలో మొదటి శ్లోకమే ఇది.
శంకరాచార్యులవారి శిష్యుడైన పద్మపాదాచార్యులవారు దీన్ని చెప్పినట్లు ఆర్య వాక్కు.
కష్టపడకుండా హాయిగా జీవించాలని, లేదా తక్కువ పని చేసి ఎక్కువ లాభం
పొందాలని మానవులు సహజంగా భావిస్తుంటారు. దానికి సన్యాసమే సరియైన
మార్గమని నాటికే ఉండినారంటే, అట్టివారు ఈ రోజుల్లో ఉండుట పెద్ద ఆశర్యమైన
విషయమేమీ కాదు.
నిజానికి ఐహిక భోగములను సంపూర్ణముగా తృణీకరించి మనసును పరమాత్మ పై
నిలిపిన వాడే నిజమైన సన్యాసి. అందుకే వేమన ‘హృదయముపదిలంబైతే, గుదికొను
సన్యాసమునకు కొమ్ములుగలవే’ అంటాడు. నిజమైన సన్యాసులు ప్రాపంచిక
విషయాలను వదిలిపెట్టి జీవిత పరమార్థం ఏమిటో తెలుసుకుని దాన్ని సాధించడానికి
సాధన చేస్తుంటారు. నిరంతరం పరమాత్మకు సంబంధించిన విషయాలను శాస్త్రాల
ద్వారా గురువుల ద్వారా తెలుసుకుంటూ, శిష్యులకు బోధిస్తూ ఆ విషయాలనే విచారణ
చేస్తూ మిగత సమయమును ధ్యానమునకు కేతాయిన్చుతూ నిస్సంగులై ఉంటారు.
అట్టివారు దేహపోషణకు ప్రాధాన్యమివ్వరు. అలాంటివారికి సమాజంలో ఎంతో గౌరవం
ఉంటుంది. వారిని మహాత్ములుగా పరిగణించి పిలిచి అన్నం పెట్టి తమ జన్మ ధన్యమైనట్టు
భావిస్తారు గృహస్థులు. అలాంటి గౌరవ మర్యాదలు పొందాలన్నా, కడుపు నిండా
కమ్మని తిండి తినాలన్నా ఆ వేషం వేయాలని కొందరు సోమరులు అనుకుంటారు. ఈ
మోసగాళ్లు కూడా భగవంతునికి సంబంధించిన మాటలు మాట్లాడుతారు.
నాడు గృహస్థులయి కూడా వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్య, అత్రి, జమదగ్ని వంటి మహర్షులు
ధనముపై వ్యామోహమును పొందక అనంత విజ్ఞానమును మనకందించినారు. నేడు
కేవలము వాక్పటిమ కాశాయములతో దేశములోని ధనరాశులను కొల్లగొడుతున్నారు. ‘సూక్ష్మములో మోక్షము’ దొరుకుతుందని భావించి ‘గొర్రె – కసాయి’ సామెతను
అనుసరించుతున్నారు.
నిజానికి గృహస్తుది గురుతరమైన బాధ్యత. అతను ఉన్నంతలోతాను తింటూ పరులకు
పెడతాడు. అందుకే కబీర్ దాసు అంటాడు;
సాఁయీ ఇత్నా దీజియె జామే కుటుంబ్ సమాయ్ l
మై భీ భూకా ణా రహూఁ సాధున భూఁకా జాయ్ ll
అంటే గృహస్తు భగవంతుని ఎల్లపుడు అతిథి అభ్యాగతులకు పెట్టి తానూ అనగా తానూ
తన కుటుంబము తినగాలిగినంత మాత్రమే ఇవ్వమని కోరుతాడు. అట్టి గృహస్తాశ్రమ
ధర్మము శ్రేష్ఠతమము.
No comments:
Post a Comment