Sunday, 9 May 2021

అజరామర సూక్తి – 234 अजरामर सूक्ती - 234 Eternal Quote – 234

 అజరామర సూక్తి  234

अजरामर सूक्ती -  234

Eternal Quote – 234

https://cherukuramamohan.blogspot.com/2021/05/234-234-eternal-quote-234.html

 निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु

लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम् ।

अद्यैव वा मरणमस्तु युगान्तरे वा

न्यायात् पथः प्रविचलन्ति पदं  धीराः ॥ नीतिशतक

నిందంతు నీతి నిపుణా యదివా స్తువంతు

లక్ష్మీః సమావిశతు గచ్చతు యథేష్టంl

అద్యైవ మరణమస్తుఁయుగాంతరే వా

న్యాయ్యాత్పథాత్ప్రవిచలంతి పదం న ధీరాః ll  భర్తృహరి నీతి శతకము

పై  శ్లోకమునకు ఏనుగు లక్ష్మణ కవి గారి తెలుగుసేత ఈ క్రింది పద్యము

నీతిప్రౌఢ విహారులైన నిపుణుల్ నిందిచనీ మెచ్చనీ

ఖ్యాతిన్ జెందిన సంపదల్ నిలువనీ గాఢంబుగా సాగనీ

ఘాతంబప్పుడ బొందనీ నియతిమైఁ గానీ యుగాంతంబునన్

నీతిశ్లాఘ్య  పదంబు దప్పరు గదా నిత్యంబు ధీరోత్తముల్  

నీతిపరులు నిందింతురుగాక, లేదా పొగడుదురు గాక! ప్రసిద్ధి జెందిన సంపదలు వచ్చినిల్చిననూ లేక  పోయిననుమరణము మరుక్షణమే లేదా యుగాంతము నందు కలుగును గాకధీరోదాత్తులు న్యాయమార్గము నుండి అడుగైనా తొలగరు. ఇచట పోతన బలిచక్రవర్తితోవామనావతార ఘట్టమున చెప్పించిన పద్యము ఉటంకించుట అత్యంత సమంజసము.

నిరయంబైన, నిబంధమైన, ధరణీ నిర్మూలనంబైన, దు

 ర్మరణంబైనఁ, గులాంతమైన నిజమున్ రానిమ్ము; కానిమ్ము పో;

 హరుఁ డైనన్, హరి యైన, నీరజభవుం డభ్యాగతుం డైన నౌఁ;

 దిరుగన్ నేరదు నాదు జిహ్వ; వినుమా; ధీవర్య! వే యేటికిన్?

బలి చక్రవర్తి నుండి వామనుడు దానం పట్ట బోతున్నాడు. శుక్రాచార్యుల వారు వారించగా,  బలి చక్రవర్తి తన నిర్ణయమును ఈ విధముగా,  చెబూతున్నాడు.

 నే నరకమునే చేరినా, గొలుసులతో బందింపబడినా,  దుర్మరణమే  కలిగినా,  కులమే నాశనమయినా,  భూమండలము  బద్దలబద్దలయినా, అవి కలుగుతాయా లేదా అన్న ఆలోచనే లేకుడా, నేను మాత్రం మాటకే కట్టుబదియుంటాను. నా ధర్మ పథము వీడను. దానగ్రహీత, సాక్షాత్తు ఆ పరమ శివుడే అయినా, ఆ విష్ణుమూర్తే అయినా, ఆ బ్రహ్మదేవుడే అయినా సరే నా నాలుక ఆడిన మాట నేను తప్పను.  పరమ విఙ్ఞాన స్వరూపుడవగు శుక్రాచార్య! నా నిర్ణయము మారదు. ఇది ఆకాలము నాటి ధర్మ నిరతి. దానినే 2000 సంవత్సరముల క్రితము భర్తృహరి 3 దశాబముల క్రితము ఏనుగు లక్ష్మణ కవి చెప్పినారు.

మనిషికి, మరణము యొక్క స్పృహ ఉండవలసినదే గానీమరణభయమన్నది  ఉండకూడదు. “జాతస్య హి ధ్రువో మృత్యుః, ధ్రువం జన్మ మృతస్య చ” అని కదా గీతాచార్యుని సందేశం. నిరంతరం మరో ధ్యాసలేకుండా మరణభయంతో అల్లాడేవాడు. జీవితానందాన్ని కోల్పోతారు. శంకరుల వారుకూడా ‘నిత్యం సన్నిహితో మృత్యుః కర్తవ్యమ్ ధర్మ సంగ్రహం’ అన్నారు. అసలు ధర్మ మార్గమును అవలంబించినవానికి ఏవిధమైన భయమూ ఉండదు. ఈ ఆర్య వాక్కునుబ్ గమనించండి:

“అజరామరవత్ ప్రాజ్ఞో విద్యామర్థం చ సాధయేత్,

గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్”

“ప్రాజ్ఞుడు తనకు ముసలితనము, మరణము లేవనే ఆలోచనతో - విద్యను, ధనాన్ని సంపాదించాలి. మృత్యువు తన జుట్టుపట్టుకొని తీసుకు పోవటానికి సిద్ధంగా ఉందనే ఆలోచనతో ధర్మాన్ని ఆచరించాలి”అని దీనిభావం.

అంటే, మరణాన్ని మరచిపోయి విద్యార్జన, ధనార్జన చెయ్యాలి. ధనార్జనకైనా పరిమితి తప్పక ఉంచుకోనవలేనుగానీవిద్యకు హద్దులేదు. జీవుడు పంజరము వదిలేవరకూ విద్య గడించుతూ వుండవలసినదే! మరణాన్ని గుర్తుంచుకొని ధర్మాన్ని ఆచరించాలి. ఇది కూడా మానవ సమాజ గతికి, మరణానంతర సద్గతికి అత్యవసరం. నిజానికి ఈ విధమైన ధర్మజీవనం సాగించిన వాడు మరణాన్నే జయిస్తాడు. అమరుడౌతాడు.

అందువల్లఎపుడూమరణ భయంతో నిస్తేజులుకాకుండా అందరూ ఆత్మవిశ్వాసంతో, ధర్మం పట్ల దృఢదీక్షతో ఆనందంగా, నిర్భయంగా, ప్రయోజనకరంగా , సమాజహితైక కాంక్షతో జీవించాలి

निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम् 

अद्यैव वा मरणमस्तु युगान्तरे वा न्यायात् पथः प्रविचलन्ति पदं  धीराः  - भर्तृहरी -  नीतिशतक

नीति में निपुण मनुष्य चाहे निंदा करें या प्रशंसा, लक्ष्मी आए या इच्छानुसार चली जाए, आज ही मृत्यु हो जाए 

या युगों के बाद हो परन्तु धैर्यवान मनुष्य कभी भी न्याय के मार्ग से अपने कदम नहीं हटाते हैं

अर्थात् चाहे नीतिनिपुण लोग निन्दा करें या प्रशंसा, लक्ष्मी आए या जहां उसकी इच्छा हो चली जाए, मृत्यु आज

 हो या सौ वर्ष बाद, धीर पुरुष तो वह है जो न्याय के पथ से तनिक भी विचलित नहीं होता

 क्या तुममें ऐसी दृढ़ता है? बस यही तीसरी बात है

यदि तुममें ये तीन बातें हैं, तो तुममें से प्रत्येक अद्भुत कार्य कर सकता है

 तब फिर तुम्हें समाचार पत्रों में छपवाने की अथवा व्खाख्यान देते हुए फिरते रहने की आवश्यकता  होगी

 स्वयं तुम्हारा मुख दीप्त हो उठेगा

 फिर तुम चाहे पर्वत की कन्दरा में रहो, तो भी तुम्हारे विचार पर्वत की चट्टानों को भेदकर निकल आएंगे और

 सैकड़ों वर्ष तक सारे संसार में प्रतिध्वनित होते रहेेंगे

 और हो सकता है, तब तक ऐसे ही रहे, जब तक उन्हें किसी मस्तिष्क का आधार  मिल जाए, और वे उसी 

के माध्यम से कार्यशील हो उठें विचार, निष्कपटता और पवित्र उद्देश्य में ऐसी ही जबरदस्त शक्ति है

nindantu nītinipuṇā yadi vā stuvantu

lakmīḥ samāviśatu gacchatu vā yatheṣṭam 

adyaiva vā maraamastu yugāntare vā

nyāyāt pathaḥ pravicalanti padaṃ na dhīrāḥ  - nītiśataka

 Whether the astute of morality commends or blames them; whether wealth comes to them or leaves them at will; whether death comes to them right now or in another era - the brave will not take a step away from the path of righteousness.

No compromises! The brave (dhīra) will not deter from their path of virtue for any reason, whether they are criticized for their deeds, applauded or blamed. Wealth is not a factor either - it could accumulate or dissipate. Death doesn't scare them - whether Yama (Lord of death) comes right here, right now, or in a whole other era, it won't put a dent in their determination! They will still act as per their moral standards and continue to shine.

External factors do not affect the integrity of the inner self. It takes courage to heed to one's inner voice and not be carried away by fleeting, momentary pleasures.

స్వస్తి.

No comments:

Post a Comment