అజరామర సూక్తి – 249
अजरामर सूक्ति – 249
Eternal Quote – 249
https://cherukuramamohan.blogspot.com/2021/05/249-249-eternal-quote-249.html
छिन्नबन्धे मत्स्ये पलायिते निर्विण्णो।
धीवरो भणति धर्मो मे भवति ॥ विक्रमोर्वशीयम् (महाकवि कालीदास)
ఛిన్నబంధే మత్స్యే పలాయితే నిర్విణ్ణో l
ధీవరో భణతి ధర్మో మే భవతి ll విక్రమోర్వశీయము(మహాకవి కాళీదాసు)
వలను వేసి పట్టె చేప వైనముగా ఒక జాలరి
తెలివిగలిగినట్టి చేప తెంచి వలను జారుకొనెను
నెమ్మదిగా నీటిలోకి, నీదయచే బ్రతికితినని
దేవుని మదిలోమ్రొక్కుచు తిరుగసాగెనీటిలోన
తెగినవలను అతడటునిటు తేరిపారజూచి తలిచె
'నీటిలోన చేపనొదిలి నిక్కము బడసితి పుణ్యము'
కడుపేమో పాపమది కాలిపోయె పుణ్యముతో
కంటనీరు ఏమాత్రము మంటనార్ప లేకపోయే
నేను శ్లోకముననువాదము చేయలేదు. ఆ మహనీయుడు వ్రాసిన శ్లోకము చదివిన
తరువాత నాలో కలిగిన భావ సముచ్ఛయమును పై గేయ రూపములో ఉంచినాను.
ఇక్కడ చేతికి చిక్కిన చేప జారిపోతే, చెపను బ్రతికించిన పుణ్యాన్ని
తనకాపాదించుకొనుచున్నాడు,తన ఊహతో జాలరి. ఆ క్షణాన తన ఆకలి
మరచినాడు. ఇక పుణ్యము అతని బుద్ధి నైపుణ్యమేగానీ అన్యథాకాదు.
అది దైవ ఘటన. లేక లౌకికముగా చూస్తే ఆ చేప యొక్క తెలివి.
లోకములో ఈ విధముగా ఎవరికో చేరవలసిన గొప్పదనమును తమకాపాదించుకొనే
మహనీయులెందరో !
చేపది తెలివి చెడినది జాలరి కష్ట పడినది మాత్రము కడుపు .
ఎవరో ఏదో చేస్తే దానిఫలితము మాత్రము వేరెవరో అనుభవించే ఉదంతాలెన్నో !
छिन्नबन्धे मत्स्ये पलायिते निर्विण्णो।
धीवरो भणति धर्मो मे भवति ॥ विक्रमोर्वशीयम् (महाकवि कालीदास)
जब मछली पकड़ने का जाल फट गया और मछली पानी में कूद गई तो मछुआरा उदास हो गया
और खुद को यह कहते हुए सांत्वना दी कि वह मछली को भागने का मौका देके पुण्य प्राप्त करेगा।
मछली तो अपनी चतुरता से जाल से बचगया और मछवारा अपनेको सांत्वना देरहा है कि
वह मछली को भागने दिया l लेकिन वास्तव ए है कि वह भूक से तड़परहा था लेकिन फिर भी मन में
उन्होंने पुण्य मिलनेके तसल्ली से अपने भूक को भूल्नेका प्रयास कर रहा था l पुन्य को उस मछवारा नहीं देख सकता l
जो नन्हीं देख सकता वो महसूस नहीं करसकता l जो मेहसूस नहीं करसकता वो अनुभव में नहीं आ सकता l वास्तव से हट के
चिंता करना फायदेमंद नहीं होता l
No comments:
Post a Comment