అజరామర సూక్తి – 248
अजरामर सूक्ति – 248
Eternal Quote – 248
काकः कृष्णः पिकः कृष्णः को भेदः पिककाकयोः ।
वसन्तकाले संप्राप्ते काकः काकः पिकः पिकः ॥ - कुवलयानन्द
కాకః కృష్ణః పికః కృష్ణః కో భేదః పికకాకయోః ।
వసంత కాలే సంప్రాప్తే కాకః కాకః పికః పికః ॥ - కువలయానంద కావ్యము
కాకి, నలుపు, కోయిలకూడా నలుపు. మరి ఆ రెండింటి మధ్య భేదమేమున్నది?
కాకి కోకిలల మధ్య భేదము ఎప్పుడు తెలుస్తుందంటే వసంత కాలము
మొదలైనప్పుడు, కాకిది కఠోరమైన అరుపుగానూ, కోయిలది శ్రవణానందకరమైన
కూతగానూ తెలియవస్తుంది. పుడుతూనే కాకి, కోకిల ఒకేవిధంగా ఉంటాయి. వాటిని
వేరు చేయడం కొంత కష్టమైన పనే. పైగా రెండూ కాకి గూటిలోనే ఉంటాయి. జాగ్రత్తగా
పరిశీలిస్తే తప్ప ఆకారంలోనూ, తేడా కనిపెట్టడము కాకికే కష్టము. కానీ వసంతకాలం
ఆరంభమైన వెంటనే పిల్ల కోయిల గొంతు విప్పుతుంది. కాకి దానిని వెంటనే తరిమి
వేస్తుంది. మామిడి మొదలైన చెట్ల చిగురాకులని తిని, కోకిల తన గొంతు సవరించుకుని
గళం విప్పి షడ్జమం లో కూయడం మొదలుపెడితే, ఆ అద్భుతమైన స్వరానికి సకల జీవ
జాలమూ, మనుష్యులతో సహా సమ్మోహనం చెందక తప్పదు ఆ గాత్ర మాధుర్యములో.
అప్పుడు మనక్లు అవగతమౌతుంది కాకి అరుపునకు, కోకిల నిస్వనమునకు గల తేడా!
అదే విధముగా సజ్జనులనూ, సాదువులనూ, విశేష ప్రతిభావంతులనూ,
మహానుభావులనూ, మహాపురుషులనూ సామాన్య జనావళినుండి, వారివారి
ప్రత్యేకతలను గమనించినపుడు మనము గుర్తించగలము అన్న వాస్తవమును,
పరోక్షంగా ఈ సుభాషితము మనకు తెలియజేస్తూ ఉన్నది. రూప లావణ్యాలతో,
అవయవాల అమరికతో మనుష్యులందరూ ఒకే విధంగా కనపడిననూ, వారు అందరూ
ఒకే విధమైన వారు కాదు. వారి వారి చదువులూ, సంస్కారమూ, ముఖ్యముగా
మాటతీరు, స్నేహశీలత, ఉన్నతభావ సమాగమము, దృక్పధము, భావ వ్యక్తీకరణ, శాస్త్ర
పాండిత్యాము, సకల మానవ సౌభ్రాతృత్వము, మానవతాయుత మమతానురాగాములు,
విశ్వ కళ్యాణ పృక్తసదాశయ సాధకత్వము వంటి లక్షణాలను బట్టి, వారిని సాధారణ
మానవ సమూహాలనుండి వేరుగా చూడ గలము.
బలుపును జూచి మోసపోక చిన్నగా ఉన్నా ఎంతో మిన్నయగు మనిషి మనస్తత్వమును
గమనించమని ఈ సుభాషితము పరోక్షముగా మనలను హెచ్చరించుతూ వున్నది.
ఇదే వాస్తవమును తెలుపుచున్న నేను వ్రాసిన ఈ దిగువ పద్యమును ఒకపరి పరికించేది.
మేలు చెలమ నీరు మినరలు వాటరు
శుద్ధముగనె యుండు చూచుటకును
స్వాస్త్యమొసగు చెలమ జలముకు సరిసాటి
బ్రాండు వాటరెట్లు బరగనగును
काकः कृष्णः पिकः कृष्णः को भेदः पिककाकयोः ।
वसन्तकाले संप्राप्ते काकः काकः पिकः पिकः ॥ - कुवलयानन्द
कोयल भी काले रंग की होती है और कौवा भी काले रंग का ही होता है फिर दोनों में क्या भेद (अन्तर) है? वसन्त
ऋतु के आगमन होते ही पता चल जाता है कि कोयल कोयल होती है और कौवा कौवा होता है।
कौआ कोकिला पहले तो एक ही घोस्लेमे कव्वे के अंडे के साथ रखती है l जनम के बाद वे दोनों साथ साथ घूम सकते हैं; और
दोनों एक ही तरह खाना और उड़ान का भी कोशिश करसकते हैं । लेकिन ये केवल बाहरी नकलें होंगी। पहले पहल
जाब कोयल अपने गलेसे आवाज निकालती है तो कव्वा उसे अपने घोस्लेसे हटा देता है l
एक कोकिला का वास्तविक स्वरूप उसकी मधुर आवाज है, जो एक कौवे में अनुपस्थित है। कौवा और कोकिला का
रूपक यह बताने के लिए दिया गया है कि हमें वही होना चाहिए जो हम हैं। अगर हम बात करने में, चलने या किसी
और की तरह काम करने में अच्छा नहीं होता है, ऐसा नक़ल करने में हम दूसरों से पकडे भी जासकते हैं l इस धरती पर
प्रत्येक प्राणी अनमोल है और ईश्वर ने प्रत्येक प्राणी को एक उद्देश्य के साथ बनाया है। 'दूसरों' की भूमिकाएं हम
लेनेका कोइ प्रयास नहीं करनी चाहिए। हम किसी ऐसे व्यक्ति होने का नाटक करने के बजाय स्वयं बनें जो हम खुद
हैं। बाहरी दिखावे से कोई फर्क नहीं पड़ता, जो अंदर है वह सब मायने रखता है!
No comments:
Post a Comment