అజరామర సూక్తి – 230
अजरामर सूक्ती - 230
Eternal Quote – 230
https://cherukuramamohan.blogspot.com/2021/05/230-230-eternal-quote-230.html
रिक्तः सर्वे भवति हि लघुः पूर्णता गौरवाय l कुमार संभवं – कुमार संभवम् - महाकवि कालिदास
రిక్తః సర్వేభవతి హి లఘుః పూర్ణతా గౌరవాయ ll కుమార సంభవము(మహాకవి కాళీదాసు)
జ్ఞాన,గుణ ,ధన దారిద్ర్యము సంఘములో వ్యక్తికి అత్యంత అగౌరవ హేతువు. అవి కలిగితే అంతకు మించిన గౌరవముండదు .
లేమి అన్నది, దేనిలోనైనా కలిగియుంటే అది ఆ వ్యక్తికి అగౌరవమును మాత్రమే ఆపాదించ గలుగు తుంది. అందుకే పెద్దలు
క్షణశః కణశశ్చైవ - విద్యామర్థంచ సాధయేత్ l
క్షణ త్యాగే కుతోవిద్యా - కణ త్యాగే కుతో ధనమ్.ll
దినమున నొక క్షణమైనను
గన విద్యాతురుడు హరణ కానివడెపుడూ
ధన దాహమున్నవాడును
కనగా కణకణము చేర్చు కదరా రామా!
విద్యను గ్రహించవలసి వచ్చినపుడు, అలసత్వమునకు తావు లేక వెనువెంటనే నేర్చుకోనవలెను. ఒక్క క్షణము కూడా వృథా కారాదు. అదేవిధముగా ధనాతురుడు కణము కణమూ చొప్పున సేకరించి ధనమును కూడబెట్ట వలెను. క్షణము వ్యర్థ పరచినచో విద్య సంపాదించు అవకాశము పోగొట్టుకోన్నట్లే! అదేవిధముగా ఒక ధనకణమును విడిచిపెట్టితిమేని మరి ధనమునెటుల కూడబెట్టనగును.
విద్యా సక్తులు ఒక్క క్షణమైనను వ్యర్థము చేయ కూడదు. అదేవిధముగా ధనాసక్తులు ధనమును ఒక కణమైనను విడిచిపెట్ట కూడదు. విద్యా ధనము తోడయితే అధికారమునకు కొదవే ఉండదు. అప్పుడు గౌరవమునకూ కొరత ఉండదు.
रिक्तः सर्वे भवति हि लघुः पूर्णता गौरवाय l कुमार संभवं – कुमार संभवम् - महाकवि कालिदास
चीज खाली होनेसे हल्की बनजाती है l गौरव तो पूर्णता सही मिलता हैl
चाहे ओ विद्या हो, धन हो, या अधिकार, कुछ न कुछ रहनेसे ही आदमी मान्यता पासक्ताहाईl उनके अनुपलब्धि में वह न्यूनता हीब पा सकता है l
Riktah sarve bhavati hi laghuh poornata gauravaaya ll - Kumarasambhavam (Mahakavi Kalidasa)
Empty (of wealth, knowledge, good qualities etc) one loses dignity and respect in society. Fullness (of wealth, knowledge, good qualities etc.), on the other hand, gives one dignity and respect in society.
స్వస్తి.
No comments:
Post a Comment