అజరామర సూక్తి – 243
अजरामर सूक्ति – 243
Eternal Quote – 243
नात्यन्तं सरलैर्भाव्यं गत्वा पश्य वनस्थलीम् ।
छिद्यन्ते सरलास्तत्र कुब्जास्तिष्ठन्ति पादपाः ॥ - चाणक्य नीति
నాత్యంతం సరళైర్భావ్యం గత్వా పశ్య వనస్తలీం l
చిద్యన్తే సరళాస్తత్ర కుబ్జాః తిష్ఠంతి పాదపాః ll
వనమున గాంచిన ముందుగ
ఘనమౌ పొడవైన చెట్లు ఖండించబడున్
విను వంకరలను గల్గిన
వన భూజము నరుకరెవరు వరబుధ రామా!
ముకురముగ నీవు నిలచిన
మకిలిన తా మసలినట్టి మహిషము నిలువన్
తా కనును తనదు రూపే
చేకొనుమా గుణమటంచు చెప్పేద రామా!
వనము లోనికి గొడ్డలితో వెళ్ళినవాడు చెట్లకు మాత్రము శత్రువే! కానీ భూరుహములు
అతనితో తలపడలేవు. మరి తమను తాము రక్షించుకోనవలేనంటే వంకరటింకరగా
పెరగటమే ఒక విధముగా రక్షణ. నిటారుగా నీలగి నిలచిన చెట్లే గొడ్డలి వ్రేటుకు మొదట
గురియయ్యేది. అదిచూచి మనము నేర్చుకోనవలసినది ఏమిటంటే , నీవు
నిలువుటద్దమయి నిలిస్తే ఎదురుగా నిలచిన వానికి తనరూపే కనిపిస్తుంది. అంటే ఎదుటి
వ్యక్తిని బట్టే మనలోని మంచిదనము లేక కరకుదనము కనిపిస్తే ఎదుటి వ్యక్తి తన
పరిధిలో తానుంటాడు.
नात्यन्तं सरलैर्भाव्यं गत्वा पश्य वनस्थलीम् ।
छिद्यन्ते सरलास्तत्र कुब्जास्तिष्ठन्ति पादपाः ॥ - चाणक्य नीति
अपने व्यवहार में बहुत सीधे ना रहे, वन में जो सीधे पेड़ पहले काटे जाते हैं, और जो पेड़ टेढ़े हैं वो खड़े
हैं ।
र्मनुष्य को अत्यन्त सरल और सीधे स्वभाव का नहीं बनना चाहिए । वन में जाकर देखो, वहाँ सीधे वृक्ष
काट डाले जाते हैं और टेढे-मेढे वृक्ष खडे रहते हैं, उन्हें कोई नहीं काटता । मुख्यतः दुष्टों के साथ टेढ़े मेढे
ही व्यवहार करना चाहिए l
मनुष्य को इतना सरल व सीधा-सादा नहीं बनना चाहिए कि जो देखे वही मुख में डाल ले । मनुष्य में
कोमलता हो, परन्तु साथ ही उसमें तीक्ष्णता भी होनी चाहिए , दुष्टों को दण्ड देने की शक्ति भी होनी
चाहिए l हम दर्पण को हमारा आदर्श रखलेना चाहिए l जो भी उस के सामने आता है उसी का
प्रतिबिम्ब उसमे नजर अता है l
No comments:
Post a Comment