అజరామర సూక్తి – 235
अजरामर सूक्ती - 235
Eternal Quote – 235
https://cherukuramamohan.blogspot.com/2021/05/235-235-eternal-quote-235.html
नाभिषेको न संस्कारः सिंहस्य क्रियते मृगैः ।
विक्रमार्जितवित्तास्य स्वयमेव मृगेन्द्रता ॥ - हितोपदेश, सुह्रुद्भेद
నాభి షేకో న సంస్కారః సింహస్యక్రియతే మృగైఃl
సింహమునకు, అడవి జంతువులచేత, అభిషేకము గానీ, ఇతర సంస్కార ప్రోక్షణములు
గానీ, చేయబడలేదు. అది కేవలము తన పరాక్రమముతో, మాత్రమే స్వయముగా,
ఆర్జించిన, రాజ్యమునకు, మృగేంద్రతను సిధ్ధించుకొన్నది. అంటే తన పరాక్రమము చేత
మాత్రమే రాజయినది, అన్యథా కాదు.
అరణ్యములోని జంతువులన్నీ కలిసి వచ్చి, “నీవే మా అరణ్యానికి అంతటికీ రాజువు, నీవు
మమ్మల్ని పరిపాలించు!” అని పవిత్రమైన గంగా జలాలని శిరస్సు మీద జల్లి, సింహానికి
సంస్కార ప్రోక్షణలు, అభిషేకాలు చేసి రాజ్యాభిషిక్తుని చేయలేదు. సింహము తన స్వంత
పరాక్రమముతోనే మృగరాజయినది.
స్వతహాగా నాయకత్వ లక్షణాలు ఉన్నవారు, స్వయంశక్తి అనగా తమ శారీరిక బౌద్ధిక
బలములతో, తలపెట్టిన కార్యసాధనని సాఫల్యం చేసుకుంటారు. వారికి తమ ప్రతిభా
పాటవాలు, స్వయంకృషి అన్న సాధనములు మాత్రమే ఉపయోగించుకొంటారు.
తద్వారా లక్ష్యమును సాధించుతారు. ప్రయత్నమే ప్రగతికి మార్గము అన్నది ఈ శ్లోకము ద్వారా మనకు తెలియవస్తూ వున్నది. ‘స్వయం కృషి స్వరూపమే’ నాయకుడు. ‘ఒకరు పెట్టే సద్ది, ఒకరు చెప్పే బుద్ధి’ ఎంతకాలము సాధ్యమౌతుంది.
नाभिषेको न संस्कारः सिंहस्य क्रियते मृगैः ।
विक्रमार्जितवित्तास्य स्वयमेव मृगेन्द्रता ॥ - हितोपदेश, सुह्रुद्भेद
न अभिषेक न संस्कार सिंह के लिए करते है मृग अर्थात जंगल के जीव जंतु जैसे हिरन, वन के राजा सिंह को राजा बनाने के लिए उसका न अभिषेक करते है न अन्य कोई संस्कार l विक्रम अर्थात पराक्रम से अर्जित राज्य के लिए स्वयं हि सिंह कर्म करता है अर्थात सिंह स्वयं अपने पराक्रम से हि स्वयं के लिए राज्य अर्जित करता है और जंगल का राजा बनता हैl
पराक्रम से राज्य बनाकर उसका राजा स्वयं हि बना जाता है और इस हेतु किसी से अभिषेक या संस्कार कराने की आवश्यकता नहि हैl इस श्लोक या मंत्र का भाव है की कर्म हि प्रधान है. राज्य पराक्रम /कर्म से हि बनाया जाता है. पाखंड (अभिषेक आदि )की परवाह नहि करनी है l बुद्धिमत्ता और परिश्रम ही आदमी को पहचान बनासकते हैं कुछ और नहीं l
No comments:
Post a Comment