అజరామర సూక్తి – 247
अजरामर सूक्ति – 247
Eternal Quote – 247
आपदि मित्रपरीक्षा च शूरपरीक्षा च रणाङ्गणे ।
विनये वंशपरीक्षा च शीलपरीक्षा तु धनक्षये ॥
ఆపది మిత్రపరీక్షా చశూర పరీక్షాచ రణాంగణే l
వినయే వంశపరీక్షా చ శీల పరీక్షాతు ధనక్షయే ll
తనకు విపత్తు సంభవించినపుడే నిజమైన స్నేహితుడు ఎవరన్నది తెలియవస్తుంది.
యుద్ధభూమికి వెళ్లి యుద్ధము చేయవలసి వచ్చినపుడే ధైర్యవంతులు
పరీక్షించబడతారు; వంశము యొక్క గౌరవము వారి వినయ విధేయతలతో
ముడిపడియుంటుంది. వ్యక్తి యొక్క గుణ శీలములు పేదరికము దాపురించినపుడే
తెలియవస్తాయి.
ఒక వ్యక్తికి స్నేహితులు అన్న పేరుక్రింద ఎంతమందో ఉండవచ్చు, వారు అతని ఆస్తి
అంతస్తులు చూసి స్నేహితులై ఉండవచ్చు. కానీ స్నేహానికి నిజమైన పరీక్ష కష్ట
సమయాల్లో తెలియవస్తుంది. స్నేహితులందరి నిజమైన రంగులు అతను విపత్తులో
ఉన్న సమయములో తెలియవస్తుంది. అప్పుడు అండగా నిలచేవాడే నిజమైన
స్నేహితుడు.
తన ధైర్యమును గూర్చి ఒక వ్యక్తి ఉపన్యాసాలు ఇవ్వటము వల్లనో ఏ కరాటే లాంటి
విద్యలు నేర్చుకొనుట వల్లనో ధైర్యవంతునిగా గుర్తింపబడలేడు. ఒక వ్యక్తి
నిజజీవితమున క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనవలసి వచ్చినప్పుడు లేక ఏ
యుద్ధభూమిలోనో యుద్ధము చేయవలసి వచ్చినప్పుడు ఒక వ్యక్తి యొక్క ధైర్యం
వెలుగులోకి వస్తుంది. అదే అతని శూరతకు నిజమైన పరీక్ష.
వంశము యొక్క ఔన్నత్యము, సంపద, స్నేహితులు దాసదాసీజనము వల్ల కలుగదు.
కుటుంబానికి నిజమైన పరీక్ష దాని విలువలలో ఉంటుంది. బాల్యములోనే పిల్లలకు
నేర్పించిన సంస్కృతి మరియు నైతికత, వారు పెద్దయిన తరువాత వంశ ప్రతిష్ఠ
నిలుపుటకు దోహదము చేస్తాయి. అందుచేత చెప్పినట్లు నేర్చుకొనే వయసులోనే
సంస్కారము నేర్పించుట మంచిది.
ఒక వ్యక్తి ప్రపంచంలోని అన్ని సంపదలను కలిగి ఉన్నప్పుడు, నియమాలను
పాటించుట, ఇతరులకు మంచి చేయుట, ఉల్లాసంగా ఉండుట సులభమైన పనులు.
కానీ ఈ భౌతిక సంపద పోయినప్పుడు, వనరుల కొరత ఏర్పడినపుడు, అయిన వారు
దూరము జరిగినపుడు, ఆ వ్యక్తి పాత్ర యొక్క శీలము పరీక్షించబడుతుంది.
‘గాఢాంధకారమలముకొన్న భీతి జెండాకు సందేహపడక వేల్గులోకి సాగు
ముందుకు’ అన్నదే ధ్యేయమై ‘పవిత్రమైన ఆశయాల కృంగదీయక’ ముందుకు
సాగడమే శీలవంతుని లక్షణము.
आपदि मित्रपरीक्षा च शूरपरीक्षा च रणाङ्गणे ।
विनये वंशपरीक्षा च शीलपरीक्षा तु धनक्षये ॥
एक मित्र की परीक्षा विपत्तियाँ आनेपर होती हैं; युद्ध के मैदान में बहादुरों की परीक्षा होती है; एक वंश
की परीक्षा उसकी विनम्रता में होती है। और चरित्र की परीक्षा गरीबी के समय में होती है।
हो सकता है कि किसी के लाखों दोस्त हों, जिनके साथ वे घूमते हैं और बहुत से कम लोग ऐसे हैं जो
उसे जानना चाहते हैं। दोस्ती की असली परीक्षा मुसीबत के समय में होती है। सभी दोस्तों के असली
रंग तब सामने आजाते हैं जब वह किसी विपदा में होता है। जो व्यक्ति हर मुश्किल समय में उसके
साथ खडा रहता है, वही उसका सच्चा मित्र होता है।
साहस की बात करना और यहां तक कि कराटे का प्रशिक्षण भी किसी को
बहादुर नहीं बनाता है। एक व्यक्ति की वीरता तब सामने आती है जब उसे वास्तविक
परिस्थितियों का सामना करना पड़ता है और युद्ध के मैदान में युद्ध लड़ना पड़ता है। यही
उसकी असली परीक्षा का मैदान है।
एक परिवार को उनकी संपत्ति, धन, मित्र और शत्रु के अनुसार नहीं तौला जाता है। असली परीक्षा
उसके मूल्यों में होती है। बच्चों द्वारा जिस तरह की संस्कृति और नैतिकता को आत्मसात किया जाता
है, वह परिवार में मामलों की स्थिति के बारे में बहुत कुछ बताता है!
सुखद समय में व्यक्ति महान चरित्र का हो सकता है। जब उसके पास संसार की सारी दौलत हो, तो
उसके लिए नियमों का पालन करना, दूसरों का भला करना, प्रसन्नचित्त रहना आदि आसान हो जाता
है। लेकिन जब भौतिक धन समाप्त हो जाता है, तो संसाधनों की कमी हो जाती है, और उनके सभी
कमियाँ तब सामने आजाते हैं। , तब व्यक्ति के चरित्र की सूक्ष्मता की परीक्षा ली जाती है। किसी भी
परिस्थिति में अपने नैतिक आधार को बनाए रखने के लिए साहस और चरित्र की आवश्यकता होती है।
āpadi mitraparīkṣā ca śūraparīkṣā ca raṇāṅgaṇe ।
No comments:
Post a Comment