Friday, 14 May 2021

అజరామర సూక్తి – 239 अजरामर सूक्ती - 239 Eternal Quote – 239

 అజరామర సూక్తి  239

अजरामर सूक्ती -  239

Eternal Quote – 239

https://cherukuramamohan.blogspot.com/2021/05/23-9-2-3-9-eternal-quote-2-3-9-l-ll_14.html

दारिद्र्यनाशनं दानं शीलं दुर्गतिनाशनम् ।

अज्ञाननाशिनी प्रज्ञा भावना भयनाशिनी ॥ - चाणक्य नीति

దారిద్ర నాశనం దానం శీలం దుర్గతి నాశనం l

అజ్ఞాన నాశినీ ప్రజ్ఞా భావనా భయనాశినీ ll

పేదరికాన్ని అరికట్టడంశీలము దుర్గతి నుండి కాపాడుతుంది, ప్రజ్ఞ అజ్ఞానాన్ని 

పారద్రోలుతుందిధ్యానం భయాన్ని చెదరగొడుతుంది.

1.       దానము అన్నది ఇటు దాతకు అటు గ్రహీతకు పేదరికము లేకుండా చేస్తుంది.

ఇదేమిటి దానము గ్రహించేవాని దరిద్రమైతే తీరుస్తుంది కానీ ఇచ్చేవాడు దరిద్రము 

లేనివాడు, పైగా సంపద కలిగినవాడు అతనేవిధముగా దరిద్రుడౌతాడు అన్న 

సందేహము మనసును తొలుస్తూ వుంటుంది. వండిన వంట కడుపునిండా తిని

శీతకరండము (Fridge) లో ఉంచినా తరువాత ఒక పర్యాయమో రెండు 

పర్యాయములో తినవచ్చు. అట్లే ఉంచి తిందామా అంటే అది ఉంటే ఒక వారము సవ్యముగా అందులో ఉంటుంది. తరువాత చెడిపోయేదే! ధనమైనా అంతే! ఒక హద్దు దాటిన తరువాత అది, దొంగలకో, మోసగాళ్ళకో, అప్రయోజకులైన సంతానానికో, ఆశపోతులైన అల్లుళ్ళకో, సంతాన లేమిచే, దాయాదులకో  లేక అనాధ శరనాలయాలకో పోయేది. మరి సంపాదించి దాచి దాచి, సాధించినదేముంది. బహుశ రక్తపీడనము (Blood Pressure) మధుమేహము (Diabetis). మరి ఇదంతా దరిద్రము కాక ఏమిటి? ఉన్న దానిలో వారసులకు ఇచ్చినా, మిగిలినది దాన ధర్మములు చేస్తే మనసుకు ఎక్కడలేని ప్రశాంతత చేకూరుతుంది.

 ఈ గుణము అలవరచుకొంటే సాంఘీక సంక్షేమమునే కాక, స్వకీయ సంక్షేమమునకు 

కూడా దోహదము చేసినవారమౌతాము.

2.    ప్రాణం వాపి పరిత్యజ్య మానమేవాభి రక్షతు l

         అనిత్యో భవతి ప్రాణో మానమా చంద్ర తారకంll

అన్నది పెద్దల మాట. ఇక్కడ ‘మానము’ అన్న మాటకు స్త్రీ యొక్క శీలము అని 

మాత్రమే అర్థము కాదు. పురుషునికి కూడా మాన మర్యాదలు ఉంటాయి. ఆచంద్ర 

తారార్కముగా నిలచేవి అవే! కారణమేమిటంటే ‘వాన రాకడయినా చెప్ప వచ్చును 

గానీ ప్రాణము పోకడ చెప్పలేము’. కాబట్టి మానము అన్న మాటకు శీలము అన్నది 

సరియైన, సమంజసమైన అర్థము.  ఆ శీలమే మనిషికి సభ్య సమాజములో 

గౌరవమును తెచ్చేది. నేడు ఆలోచనా విధానము మారినది. ‘మానము పోతే పోనీ 

కొన్ని రోజులకు అంతా మరచిపోతారు, మరి సంపద పోతే సర్వస్వము 

పోయినట్లే’ అని తలచేవారు అమితమైపోయినారు. నిజానికి శీలము వుంటే 

మరణానంతరము కూడా పేరు చిరస్థాయిగా నిలుస్తుంది. రాక్షసుడైన 

బలిచాక్రవర్తే ఇందుకు ఉదాహరణ.

3. జ్ఞానాజ్ఞానములు వెలుగు చీకటులు. ఒకటి ఉంట రెండవది ఉండదు. కానీ 

అజ్ఞానమనే చీకటి ఉన్న చోట చిన్న దీపమును వెలిగించి కొంత వెలుగును 

పొందవచ్చును కానీ పగటి పూట వేలుగులనిచ్చే సూర్యునికి చేయి అడ్డపెట్టి చీకటి 

చేయలేము. కావున జ్ఞానము ప్రజ్ఞా హేతువు. అది ఉంటే అజ్ఞానమనే చీకటికి 

అడ్డుకట్ట వేసినట్లే!

4. భావన భయనాశిని అంటున్నారు ఆర్య చాణక్యులవారు. భావన అంటే రెండు 

విధాల విశ్లేషించుకోవచ్చు. ‘ఎదుర్కొనవలసిన సమస్యను ‘ఇదేముందిలే’ అని 

భావన చేస్తే దాని పరిష్కారమును యోచించవచ్చు. అదే ‘ఓయమ్మా! ఇంతటి 

సంయస్య మీదపడిందే, ఏమి చేయుటకూ తోచలేదని దిగులుపడి కూర్చుంటే ఆ 

‘గిలి’ ‘పులి’యై మనలను మిగేస్తుంది.  

ఇక రెండవ భావన ‘పరమాత్మ భావన’. మనకు ఏ సమస్య వచ్చినా అన్నిటికీ ఆ 

దేవుడే ఉన్నాడు అన్న ధృడనమ్మకము ఆ పరమాత్మునిపై నిలుపుకొంటే ముందు 

మనముందున్న భయమనే భూతము మాయమౌతుంది అంటే ఈ ధ్యానం 

అతనిలోని అన్ని భయాలను చెదరగొడుతుంది మరియు సమస్యపై అతని 

అవగాహనను సుస్పష్టము చేయగలుగుతుంది.

‘శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు’ అన్నారు పెద్దలు. వారే ‘మనసుంటే 

మార్గము ఉంటుంద’నికూడా చెప్పినారు. ఈ రెంటినీ సమన్వయించుకొంటే ఆవ్యక్తి 

అన్నివిధములా ఔన్నత్యమును పొందగలుగుతాడు.

दारिद्र्यनाशनं दानं शीलं दुर्गतिनाशनम् ।

अज्ञाननाशिनी प्रज्ञा भावना भयनाशिनी ॥ - चाणक्य नीति

दान दरिद्रता को नष्ट कर देता है । शील स्वभाव से दुःखों का नाश होता है । बुद्धि अज्ञान को नष्ट 

कर देती है तथा भावना से भय का नाश हो जाता है ।

 उद्योगे नास्ति दारिद्रयं जपतो नास्ति पातकम्। मौनेन कलहो नास्ति जागृतस्य च न भयम्॥

उद्यम से दरिद्रता तथा जप से पाप दूर होता है । मौन रहने से कलह और जागते रहने से भय नहीं 

होता ।

 अपुत्रस्य गृहं शून्यं दिशः शून्यास्त्वबान्धवाः। मूर्खस्य हृदयं शून्यं सर्वशून्यं दरिद्रता॥

पुत्रहीन के लिए घर सूना हो जाता हैजिसके भाई न हों उसके लिए दिशाएं सूनी हो जाती हैंमूर्ख 

का  हृदय सूना होता हैकिन्तु निर्धन के लिए सब कुछ सूना हो जाता है ।

अत्यन्तलेपः कटुता च वाणी दरिद्रता च स्वजनेषु वैरम्। 

नीच प्रसङ्गः कुलहीनसेवा चिह्नानि देहे नरकस्थितानाम्॥

अत्यन्त क्रोधकटु वाणीदरिद्रतास्वजनों से वैरनीच लोगों का साथकुलहीन की सेवा - नरक 

की आत्माओं के यही लक्षण होते हैं ।

 दरिद्रता धीरयता विराजते कुवस्त्रता स्वच्छतया विराजते। कदन्नता चोष्णतया विराजते 

कुरूपता शीलतया विराजते॥

धीरज से दरिद्रता भी सुन्दर लगती हैसाफ रहने पर मामूली वस्त्र भी अच्छे लगते हैंगर्म किये 

जाने पर बासी भोजन भी सुन्दर जान परता है और शील-स्वभाव से कुरूपता भी सुन्दर लगती है ।

 प्रियवाक्यप्रदानेन सर्वे तुष्यन्ति मानवाः । 

तस्मात् तदेव वक्तव्यं वचने का दरिद्रता ॥

मधुर वचन बोलनादान के समान है । इससे सभी मनुष्यों को आनन्द मिलता है । अतः मधुर ही 

बोलना चाहिए । बोलने में कैसी गरीबी !

ए पूरे श्लोक तात्पर्य सहित पढ़ेंगे तो कितना सक्षम व्यक्तित्व पासकते हैं , 


dāridryanāśana dāna śīla durgatināśanam 

ajñānanāśinī prajñā bhāvanā bhayanāśinī ॥ - akya nīti

 Giving quells poverty, integrity dispels bad times, awareness dismisses ignorance and contemplation dissipates fear.

 1. Giving is an action which quells the poverty of the giver and the receiver alike! The receiver gains what he needs and the giver gains on the scale of virtue. This eradicates poverty on different levels for all the people involved.

 2. No matter what the circumstance or conditions are, trading values and integrity is not a choice. Everything else may be in shambles, but his soul won't be! Be it good times or bad times, the integrity of a person is what protects him and allows him to come out unscathed.

 3. Awareness and ignorance are antonyms of each other, just like light and darkness. These two swords can never fit in one scabbard. When one is in, the other is out! When one has awareness, ignorance gets dismissed automatically!

 4. Is one afraid in his own house if it is dark? Because of his familiarity with the dimensions of the house, he won't bump into the walls. That familiarity with the house leads him to contemplate his space and time required to get from one place to another. This contemplation dissipates all fears in him and makes his perception of the surroundings clearer.

 To turn any weakness into strength, acquire the right tool that dispels the weakness from its very roots!

 స్వస్తి.

No comments:

Post a Comment