Sunday, 1 August 2021

అజరామర సూక్తి – 318 अजरामर सूक्ति – 318 Eternal Quote – 318

 

అజరామర సూక్తి  318

अजरामर सूक्ति  318

Eternal Quote  318

https://cherukuramamohan.blogspot.com/2021/08/318-318-eternal-quote-318.html

वैद्यानां शारदी माता पिता  कुसुमाकरः ।

यमदम्ष्ट्रा स्वसा प्रोक्ता हितभुक् मितभुक् रिपुः ॥

వైద్యానాం శారదీ మాతా పితాచ కుసుమాకరః l

యమదంష్ట్రా స్వసా ప్రోక్తా హితభుక్ మిత భుక్ రిపుః ll

వైద్యులకు శరదృతువు తల్లి లాంటిది మరియు వసంతకాలం తండ్రి లాంటిది. ఈ రెండు కాలాలు మృత్యుదేవత అయిన యమరాజు యొక్క రెండు దంతాలుగా భావించవలసియుంటుంది. దీనికి ఒకే ఒక పరిష్కారం ఉందిఅదే హితాహారం మితాహారం తినడం.

 

వర్షాకాలంలో పేరుకుపోయిన శరీరములోని పిత్తము తరచుగా శరదృతువులో సూర్య కిరణాల వల్ల చిరాకు చెందుతుంది. అందువల్లపిత్తమును  చల్లార్చుటకు ఆహారం తీసుకొనుట అత్యవసరము. అనేక చేదు మరియు  ఘాటైన రసాలతో ఆయుర్వేదమున తయారు చేయబడిన ఘృతాన్ని తగిన మోతాదులో వైదుని సలహా ప్రకారము తీసుకొంటే మంచిది. ఆయుర్వేద ఔషధములలో తిక్తఘృతమహతిక్త ఘృతభూనింబాది ఘృతఅమృత భల్లాతక అవలేహపంచతిక్త ఘృతమహాఖాదిరాది ఘృత మొదలైనవి వైద్య పర్యవేక్షణలో తీసుకొనుట మంచిది.

శరదృతువులో పిత్తమును చల్లార్చడానికివీరేచనము కొరకు, అంటే కడుపును శుభ్రము చేయుటకు ఈ ఔషధములు తీసుకొనుటచే, ఆ పిత్తము శరీరము నుండి బయటకు వస్తుంది.

ముఖ్యముగా శరదృతువులోతీపి రసాలు మరియు తిక్త రసాలను పెద్ద పరిమాణంలో తీసుకోవాలికానీ అతిశయముగా మాత్రము కాదు. తగినంతగా ఆహారమును తీసుకోవాలి. ముఖ్యంగా శరదృతువులో ఒక విషయం గుర్తుంచుకోవాలిఆకలి ఉన్నప్పుడు మాత్రమే ఆహారం తినాలిఆకలి ఉంటే తప్ప ఆహారం తినకూడదులేకపోతే శరీరములో పిత్తము పెరుగుతుంది.

ఆయుర్వేదం ప్రకారంశరదృతువులో రక్తదానం చేయకూడదు అని ఆయుర్వేదము చెబుతుంది.

శరదృతువులోచేదు రసాలుఆలస్యంగా జీర్ణం కావడము చేతఅప్పళములుఊరగాయలుపుల్లని పదార్థాలుఉప్పు వంటివి తినకూడదు అతిగా తినకూడదు. ఎందుకంటే అవి మన శరీరంలోని పిత్తాన్ని పెంచుతాయి శరత్కాలంలో చంద్రుని కిరణాలలో శరీరముపై పడుట మంచిది.

శరదృతువు సమయంలో చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నందునఆ ఋతువు వైద్యుడికి తల్లి లాంటిది.

మదన లేదా మన్మధ ప్రమేయము లైంగికమగు  లేదా ఇతరత్రా కోరికలను విపరీతముగా పెంచి మనిషిని ఊపిరి సలుపనివ్వదు. కోరికను పెంచడం ద్వారాఅది మనిషిని ఎక్కడలేని ఉద్వేగముతో కూడిన అసౌకర్యమును పెంచి అతడిని అనారోగ్యమునకు గురి చేస్తుంది.

అస్వస్థతకు గురియైనపుడువారు యమలోకమునకు దగ్గరయినట్లే కదా! సోదరి అంటే తీసుకొనే యోగ్యత కల్గినది. అందుకే యమసదనము వైద్యునికి సహోదరి. ఈ బంధుగులగు ఈ ముఖ్యమగు మూడు కారణములు, వైద్యుని సంపాదనకు ఎంతగానో దోహదపడుచు, అతనికి ధనమును అవసరానికి మించి సంపాదించే విధముగా సహాయ పడుతాయి.

అదే హితాహారము మితాహారము తీసుకొంటూ  ఆరోగ్యమును అనవరతము కాపాడుకొనే వ్యక్తికి  వైద్యుని అవసరము ఉండదు. అందుకే అతను వద్యునకు శత్రువుతో సమానము.

హితము మితమగు ఆహారమే మనిషి ఆరోగ్యమునకు మూలకారణము.

 वैद्यानां शारदी माता पिता  कुसुमाकरः ।

यमदम्ष्ट्रा स्वसा प्रोक्ता हितभुक् मितभुक् रिपुः ॥

अर्थात वैद्यों के लिए शरद ऋतु माता के समान तथा वसन्त ऋतु पिता के समान है । यह दो ऋतु मृत्यु 

के देवता यमराज की दो दाँत है ऐसा समझना चाहिए । इसके लिए केवल एक ही उपाय है कि हित 

कर आहार तथा लघु आहार का सेवन करें ।

वर्षा ऋतु में संचित पित्त शरद ऋतु में सूर्य की किरणों से सहसा  कुपित हो जाती हैं । अतः पित्त के 

शमन के लिए खाद्यान्न का सेवन करना चाहिए । तिक्त रस से युक्त जैसे कि करेला तथा तिक्त द्रव्यो से 

सिद्ध किया घृत का सेवन करना चाहिए । जैसे कि आयुर्वेदोक्त औषधि तिक्तक घृतमहातिक्तक घृत

भूनिम्बादि घृतअमृत भल्लातक अवलेहपँचतिक्त घृत महाखदिरादि घृत आदि ।

शरद ऋतु में पित्त के शमन के लिए विरेचनयानी पेट साफ के लिए औषधि सेवन करना चाहिए

जिससे कि शरीर में से पित्त बाहर निकल जाएँ ।

शरद ऋतु में विशेष रूप से मधुर रस तथा तिक्त रस का अधिक मात्रा में सेवन करना चाहिएपरंतु  

गुरु आहार नहीं;  अपितु लघु आहार का सेवन करना चाहिए । शरद ऋतु में विशेष रूप से एक बात 

का ध्यान रखना चाहिए कि जब भूख लगे तभी भोजन करना चाहिए;  जब तक भूख ना लगे तब तक 

भोजन नहीं करना चाहिएअन्यथा आपके शरीर में पित्त बढ़ जाएगी ।

आयुर्वेद के अनुसार शरद ऋतु में रक्त दान नहीं करना चाहिए क्योंकि शरद ऋतु में रक्त मोक्षण के 

लिए कहा गया है l शरद ऋतु में कटु रसदेर से पचने वाली, पापड, अचारखट्टी चीजें,  नमकीन 

आदि का सेवन नहीं करना चाहिए क्योंकि इससे आपके शरीर में पित्त बढ़ेगीऔर आप अग्निमान्द्य 

रोग से ग्रसित हो जाएँगे । शरद ऋतु में चन्द्रमा की किरणों में टहलना चाहिये ।

शरत्काल के समय इतने आरोग्य समस्याएँ रहनेसे वैद्याकेलिये वह माता सामान होती है l

कुसुमाकर माने मन्मध. मदन या मन्मध इच्छाओंको परिवर्धन करता है, चाहे वे श्रृंगार के हो या अन्यथा l 

किसी चीज पर लालासता बढ़ने से आदमी का असहानता बढ़ाता है और उसे तुरंत अनारोग्य बनादेता है l

जा लोग अस्वस्थ होजाते हैं तो वे यमलोक के निकट होते हैं l बहन निकट बंधू होती है न l इसीलिए यमदंष्ट्र 

वैद्याकेलिए भगिनी सामान है l इन आप्त बन्धुवों के जरिए वैद्य अच्छा कमासकता है l

जो मिताहार और हिताहार लेता है वह दुरुस्त रहनेसे वैद्य की जरूरत नहीं पड़तीउसलिए वह 

वैद्यका दुश्मन बनजाता है l

इस श्लोक यह सूक्ति हमें दी है कि आहार अवसर से ज्यादा नालो और सदा केलिए तंदुरुस्त रहो l

vaidyānā śāradī mātā pitā ca kusumākara 

yamadamṣṭrā svasā proktā hitabhuk mitabhuk ripu 

For a doctor, autumn is the mother, Cupid is the father. The 

toot of Yama (Lord of death) is the sister. One who eats 

suitable and measured portions is the enemy!

The narration is given according to European seasons. Please 

follow.

When does one go to a doctor? When he is sick. The doctor 

earns a living because sick people come to him. People fall 

sick when the weather changes, like during autumn. They 

fall sick when they are love-struck and are not eating or 

sleeping well. Those in the clutches of death will certainly 

visit a doctor in an effort to get better. Kith and kin aid to 

one's prosperity. Likewise, autumn, Cupid and clutches of 

death help the doctor to keep the doctor's practice alive! Hence, 

the poet very humorously says that they are like family to 

him.

The poet proceeds to say that he who eats suitable food in 

limited portions is an enemy to the doctor! Such a person will 

stay fit and healthy, and will not need to see him. Isn't it 

only the enemies that curtail the growth and prosperity of 

another person! So, he is a doctor's enemy.

Moral of the story: eat healthily and eat within limits. It is 

the biggest open secret to good health! Just by being 

conscious and aware of what is going into your mouth, you 

can keep illnesses at bay. He who has health has hope. He 

who has hope has everything! May everyone have everything!

స్వస్తి.

 

No comments:

Post a Comment