అజరామర
సూక్తి – 345
अजरामर सूक्ति – 345
Eternal Quote – 345
https://cherukuramamohan.blogspot.com/2021/08/345-345-eternal-quote-345.html
जनिता
चोपनेता च यस्तु विद्यां प्रयच्छति l
अन्नदाता
भयत्राता पञ्चैते पितरः स्मृताः ll - चाणक्य नीति 4-19
జనితా చోపనేతా చ
యస్తు విద్యాం ప్రయచ్ఛతి |
అన్నదాతా భయత్రాతా పంచైతే పితరః
స్మృతాః || చాణక్య నీతి 4 - 19
జన్మనిచ్చువాడును, యజ్ఞోపవీత ధారణచేయించువాడును, విద్యనేర్పువాడును,
అన్నదాతయు, భయమునుండి రక్షించువాడు - ఈ అయిదుగురును పితరులని
చెప్పబడుదురు.
ఇది భారతం ఆదిపర్వం శకుంతలో పాఖ్యానంలో కూడా
చెప్పబడింది. ఈ విషయంలో
తలిదండ్రులకే గతిలేదు. మిగిలినవారి సంగతా దేవుడెరుగు. కాలంయెంతమారింది?
కాలమాలేక మానవుల యాలోచనలా?
ఈ శ్లోకము వలన పితరులు జీవించిన వారే యని తెలియుచున్నది. మరణించినవారు
పితరులు కారు. పారక్షణే అను ధాతువుతో పితర శబ్దము తయారగును. కాని యర్థము
రక్షించువాడు. జీవించియున్నవాడు రక్షింపగలడు. కాని మరణించినవాడు కాడు గదా!
మరణించినవాడు తన్ను రక్షించుకొనలేడు. ఇతరుల రక్షింపలేడు. పాండవ కౌరవులకు
యుద్ధము జరుగునపుడు సేన లెదురెదురుగా నున్నపుడు శ్రీకృష్ణుడర్జునుని ప్రార్థన వలన
నాతని రథమును రెండు సేనల మధ్యనిలిపి-
'తత్రాపశ్య త్థ్పితాన్ పార్థః
పిత్రూనథ పితామహాన్' | (గీత. 1-22)
అర్జును డక్కడ నిలబడి తండ్రులను తాతలను మొదలైన వారిని చూచెను. ఇచ్చట పితర
అను దానికి చనిపోయిన తాత ముత్తాతలైనచో అర్జునుడు చనిపోయిన వారి నెట్లు
చూచును? ఏల భయపడును? ఆ శస్త్రధారులందఱు చనిపోయినట్లేనా? తేలిన
సారాంశము
పితరులనగా బ్రతికినవారే.
ఇప్పుడు శ్లోకము ఉ కాస్త విశ్లేషించుకొందాము.
1. 'తండ్రి' జన్మనిచ్చినవాడు. తన సంతు ఉజ్వల భవిత కోరేవాడు. తాను శ్రమపడి తన
సంతుకు నందనము చూపించదలచేవాడు. జీవితాంతమూ తన తండ్రికి రుణపడి
సముచిత గౌరవము ఇవ్వవలసిన బాధ్యత
కుమారునిది.
2. 'ఉపనేత' -. ఆధ్యాత్మిక జీవన విధానము వైపు వేయించేసే మొదటి అడుగు అది. ఆ
మార్గ నిర్దేశము చేసి సకల దైవిక కర్మలను చేసే యోగ్యత సిద్ధింపజేసి, వేదాధ్యాయిగా
చేయుటకు యజ్ఞోపవీత ధారణము చేయించు మహనీయుడు పితృ సమానుడు.
అందువల్ల అతను ఆజన్మాంతమూ పూజింప దగినవాడు.
3. జ్ఞానాన్ని ఇచ్చేవాడు - ఒక గురువు, తన విద్యార్థికి నిస్వార్థంగా విద్యను అందిస్తాడు.
అతను, తన శక్తి మేరకు, వానీలోని చెడును చెఱచి మంచిని ప్రతిష్ఠించి వాని మనుగడ
కోసం నైపుణ్యాన్ని సమకూర్చి వానిని జీవన యానమునకు సిద్ధం చేస్తాడు. ఒక తండ్రి
తన పిల్లలు తనను అధిగమించాలని ఎప్పుడూ కోరుకుంటారు. అదేవిధంగా, నిజమైన
శిష్యుడు తన శిష్యుడు అతడిని అధిగమించినప్పుడు సంతోషించాడు! అతను
గౌరవనీయమైన తండ్రి వ్యక్తి కాదా? అతడే నిజమైన గురువు మరియు పితృ సమానుడు.
4. భోజన దాత - జీవించడానికి సహాయము చేయుట అంటే మొదట భోజన ప్రాప్తే!
ఎవరైనా ఆకలితో ఉన్నప్పుడు, ఏ సంపద అయినా అతని ఆకలిని తీర్చదు. ఆహారం
ఇచ్చేవాడు, అతనికి జీవితాన్ని ఇస్తున్నాడు! అతను తప్పక తండ్రితో సమానుడు.
5. భయము నుండి కాపాడేవాడు - ఒకరి అభద్రతను అణచివేస్తాడు మరియు
జీవితంలోని అడ్డంకులను అధిగమించడానికి అతనికి సహాయం చేస్తాడు. అతనిని త్రాత
అంటారు. అట్టివారి ఆధరువు దొరుకుట అరుదైన విషయము. తన భయాలు
తొలగిపోయినప్పుడు, అతను జీవితాన్ని కొత్త కోణంలో చూస్తాడు! అట్టి త్రాత తండ్రిగా
గౌరవనీయుడు.
ఇట్టి వారగు 5 మందిని తన జీవితాంతమూ గౌరవించినవాడు తానూ
యోగ్యుడగుటయేగాక
పదుగురికి యోగ్యత ప్రసాదించే పితాసమానుడౌతాడు.
जनिता चोपनेता च यस्तु विद्यां प्रयच्छति l
अन्नदाता
भयत्राता पञ्चैते पितरः स्मृताः ll - चाणक्य नीति
जन्मदाता, भगवान् को पानेकेलिये सही रास्ता दिखानेवाला,ज्ञानदाता, एना डाटा और भय से
छुटकारा दिलाने वाला , यह पाँच पिता सामान होते है| इनलोगों का रन हम कभी भी चुका नहीं
सकते | जीवन भर उनके महानता याद करलेते हुए खुद उसी तरह बननेका कोशिश करते रहना
चाहिए |
जो जन्म देता है, जो ईश्वर या आध्यात्मिकता के करीब लाता है (ब्राह्मणों आदि के लिए पवित्र धागा समारोह के माध्यम से दीक्षा के माध्यम से), जो ज्ञान देता है, वह जो भोजन देता है, वह जो भय से रक्षा करता है - ये 5 हैं पिता के रूप में समझा जाता है। जीवन के दौरान, कई रिश्ते ऐसे होते हैं जो सम्मान का आदेश देते हैं। सम्मान, उनके योगदान के लिए, उनके जीवन के कई अलग-अलग पहलुओं में वृद्धि के लिए।
1.
एक 'पिता' ऐसी ही एक शख्सियत है। एक पिता एक भड़काने वाला, आह्वान करने वाला और एक प्रणोदक होता है! जीवन के विभिन्न चरणों में, एक ऐसे पिता के रूप में आता है, जो अपने पिता के समान सम्मान प्राप्त करते हैं, जिन्होंने उसे जन्म दिया!
2.
'उपनेता' -. आध्यात्मिक जीवन की दिशा में यह पहला कदम है। वह जो किसी को उस मार्ग की सलाह देता है या मार्गदर्शन करता है वह एक पिता तुल्य है और इसलिए पूजनीय है। वेद पाठ पढनेका, जो योग्य बनाता है वह जरूर पूजनीय ही है l
3.
वह जो ज्ञान देता है - एक गुरु, अपने शिष्य को निःस्वार्थ रूप से शिक्षित करता है। वह, अपनी सर्वोत्तम क्षमता के अनुसार, उन्हें सही-गलत की शिक्षा देता है, उन्हें जीवित रहने के लिए निर्धारित कौशल से लैस करता है और उन्हें उनके जीवन की आगे की यात्रा के लिए तैयार करता है। एक पिता हमेशा चाहता है कि उसके बच्चे उससे आगे निकल जाएं। इसी तरह, एक सच्चा गुरु तब आनंदित होता है जब उसका शिष्य उससे श्रेष्ठ होता है! क्या वह भी एक सम्मानित पिता तुल्य नहीं है? उन्हें गुरु कहा जाता है।
4.
वह जो भोजन देता है - जीवित रहने में मदद करता है! जब कोई भूखा होता है, तो कोई भी धन उसकी भूख को तृप्त नहीं कर सकता। जो भोजन देता है, वह उसे जीवन देता है! वह भी एक पिता है।
5.
जो भय से रक्षा करता है - वह अपनी असुरक्षाओं को शांत करता है और जीवन की बाधाओं को दूर करने में उसकी मदद करता है। जब किसी का डर दूर हो जाता है, तो वह जीवन को एक नई रोशनी में देखता है! ऐसा व्यक्ति पिता के समान सम्माननीय होता है।
इस दुनिया में ऐसा कुछ भी नहीं है, जिसे देकर कोई भी इन 5 पिताओं के कर्ज से खुद को मुक्त कर सकता है। उसे जीवन भर ऋणी रहना पड़ता है। वह अपने बच्चों, शिष्य या अपने आस-पास के समाज को उनकी महानता का उपदेश देकर और स्वयं ऐसे ही एक व्यक्ति होने के कारण विरासत को पारित कर सकते हैं!
janitaa chopanEtaa cha
yastu vidyaaM prayachChati l
annadaataa bhayatraataa
pa~nchaitE pitara@h smRtaa@h ll - chaaNakya nIti
-4-19
One who gives birth, one who brings closer to God or to spirituality ( by means of
initiating through the sacred thread ceremony for Brahmins and the like), he who
gives knowledge, he who gives food, he who protects from fear - these 5 are
deemed as fathers.In the course of life, one comes across many a relationships
that command respect. Respect, for their contribution, towards the growth in
many different facets of his life.
1. A 'father' is one such figure. A father is an instigator, invoker and a propeller!
At different stages of life, one comes across such father figures, who command
the same exact respect as one's own father, who gave him birth!
2. 'upanetaa' -. That is the first step one takes towards a spiritual way of life. He
who counsels or guides one towards that path is a father figure and is hence
revered. (Who does upanayana fo brahmins and the
like)
3. He who gives knowledge - a preceptor, educates his pupil selflessly. He, to
the best of his ability, teaches them right from wrong, equips them with the skill
set for survival and prepares them for their onward journey of life. A father
always wants his children to surpass him. Similarly, a true preceptor rejoices
when his pupil excel him! Isn't he a respectable father figure as well? He is
called THE GURU.
4. He who gives food - helps one survive! When one is hungry, no amount of
wealth can satiate his appetite. One who gives food, is giving him life! He is a
father too.
5. He who protects from fear - quells one's insecurities and helps him overcome
the hurdles of life. When one's fears are dispelled, he sees life in a new light!
Such a person is respectable as a father.
There is nothing in this world, by giving which, one can free himself from the
debt of these 5 father figures. He has to be indebted all throughout his life. He
can pass on the legacy to his own children, pupil or the society around him, by
exhorting their greatness and being one such person himself!
స్వస్తి.
No comments:
Post a Comment