అజరామర
సూక్తి – 325
अजरामर सूक्ति – 325
Eternal Quote – 325
शरीरं ज्ञानजननं रोगो विष्णुस्मृतिप्रदः ।
विपद्वैराग्यजननी त्रयं सुखकरं सताम् ॥ - रसगङ्गाधरम्
– जगन्नाथ पंडितराय
శరీరం జ్ఞాన జననం రోగో విష్ణు స్మృతిప్రదః l
విపద్వైరాగ్య జననీ త్రయం సుఖకరం సతం ll
– రసగంగాధరం – జగన్నాథ
పండిత రాయలు
జ్ఞానాన్ని తెచ్చేఈ నశ్వరమమగు శరీరము; విష్ణునామ జపమునకు అంకితము చేసే
అనారోగ్యము; నిర్లిప్తతను లేక ఉదాసీనతను తెచ్చిపెట్టే బాధలు,ఈ మూడు గొప్పవారికి
ఎనలేని ఓదార్పునిస్తాయి.
1.
మోక్షము
జనన మరణ చక్రము నుండి విముక్తి. అసలు
పునర్జన్మ నిజమై తిరిగీ జన్మించి, మరణించె వరకు కర్మలూ చేయవలసినదే! కర్మ ఫలాలను
అనుభవించుతూ వుండవలసినదే ! రగుల రాట్నములో
కూర్చున్న వాడు మొదట ఒక విధమైన ఆనందమునకు గురియౌతాడు కాని రాను రానూ దిగితే
బాగుంటుంది అని అనిపిస్తుంది. జీవితచక్రము కూడా అంతే ! ఈ శ్లోకమును ఒకపరి గమనించండి:
అనిత్యాని శరీరాణి
విభవో నైవ శాశ్వతః ।
నిత్యం సన్నిహితో
మృత్యుః కర్తవ్యో ధర్మసంగ్రహః ॥
శరీరములు అనిత్యమైనవి.
ఐశ్వర్యమూ శాశ్వతము కాదు. మృత్యుదేవత ఎల్లపుడు ప్రక్కనే పొంచి ఉన్న విషయమును మనము, విషయవాంఛలలో మునిగిపోయి గమనించము. గమనించే స్థితికి చేరునపటికి ఏమి
చేయవలసినదీ తోచదు. అందుచేత ధర్మసంపాదన చేసుకోవాలి. ధర్మముదరిజేరితే భక్తి
ప్రపత్తులు అడుగకుండానే వస్తాయి.
ఈ విషయమునే పండితరాయలవారు
మన మేలుకోరి పైశ్లోకమును మనకు అందించుచున్నారు. జీవుడు శరీరమును వదిలే సమయములో శ్రేష్ఠులు
మృత శరీరానికి కృతజ్ఞతలు తెలుపుతారు. కారణం: మిగిలిపోయిన జ్ఞానార్జన మరు మానవ
జన్మలో చేసుకోనవచ్చునన్నది ఉద్దేశ్యము. కానీ దీనికి సత్కర్మాచరణ ఎంతో అవసరము. అది
ఉంటేనే, మానవ జన్మమును, సద్వ్కపుషమును సాధించ గలడు. శరీరం లేకుండా జ్ఞానాన్ని పొందడం
అసాధ్యం. కాబట్టి, వారు
పుట్టాలనే ఆలోచనను కలిగియుంటారు.
2. జబ్బు పడాలని ఎవరూ కోరుకోరు.
మరి ఆరోగ్యముగా ఉంటే ఆ పర్కమాత్ముని గూర్చి అనుకొంటామా అంటే అసలు ఆ ఆలోచనే రాదు. అయితే, సహజమైన ప్రతిస్పందనగా, అనారోగ్యముతో
బాధపడుచున్న సమయములలో భగవంతుని, ఆరోగ్యమును
కుదుటబరచుమని స్మరిస్తాము. మరి స్వాస్త్యత చేకూరిన పిదప ఆ పరమాత్ముని మరువక ఆయన
నామమును తలపోయుచునే ఉంటామా అంటే అది ఉత్తదే ! బాగయిన వెంటనే పగటి కలలో, రాత్రి
కలలో, రంగు రంగులలో కంటూనే ఉంటాము. అట్లు చేయక ఆ నారాయణ నామమును జీవితాంతమూ
స్మరించితే శుభమే జరుగుతుంది కానీ అశుభము ఉండదు కదా ! మోక్షమునకు చేరువౌతాము కదా!
3. ఇబ్బందులు పడవలెనని ఎవరు
కోరుకుంటారు? ప్రతి ఒక్కరూ ఇబ్బందులు
ఎదురుగాకుండా ఉండవలేననియే కోరుకొంటారు. కానీ నిజమైన ఆలోచనాపరుడు, మోక్షగామి
అటువంటి పరిస్థితులలో నిర్లిప్తతను ఉదాసీనతను అలవరచుకొని ఆ కష్టాలతో
మమేకమౌతూ ఆ మహామహునిని ఆర్తితో తలచుకొంటూ ఉంటాడు. అట్లు చేయుట చేత పరమాత్మునికి, మొక్షేచ్ఛ అన్న
తన ఆశయమును నివేదించుకొనుచున్నాడు.
బాలకుడగు ప్రహ్లాదుడు
తండ్రి ఎన్నియాతనాలు పెట్టినా నారాయణ నామస్మరణ మానకుండా ఆయన అనుగ్రహమును
పొందగాలిగినాడు. అంబరీషుని కాచుటకు ఏకముగా దూర్వాసో ముని పైకి సుదర్శనమునే
పంపినాడు మహావిష్ణువు. పరమ భాగవతులెపుడూ పరమాత్మ నామస్మరణ మరువడు. మానవ జన్మ సార్థకత అందులోనే ఉన్నది.
शरीरं ज्ञानजननं रोगो विष्णुस्मृतिप्रदः ।
विपद्वैराग्यजननी त्रयं सुखकरं सताम् ॥ - रसगङ्गाधर –
जगन्नाथ पंडितराय
नश्वर शरीर जो ज्ञान लाता है; बीमारी जो भगवान विष्णु की याद दिलाती है; क्लेश जो वैराग्य लाता है -
(ये) तीनों उत्तम लोगों को दिलासा देने वाले हैं।
1.
कोई सोचता होगा कि मोक्ष प्राप्त करने के लिए जन्म और मृत्यु के चक्र से छुटकारा मिल जाना चाहिए, लेकिन महान लोग नश्वर शरीर के लिए आभारी हैं। कारण यह है कि शरीर के बिना ज्ञान प्राप्त करना असंभव है। इसलिए, वे जन्म लेने के विचार का स्वागत करते हैं,
ताकि वे ज्ञान प्राप्त कर सकें! जो
काम इस जनम में अधूरा रहगया वह तो अगले जनम होनेसे ही प्राप्त करसकते हैं l
2.
कोई बीमार पड़ने को नहीं कहता। लेकिन फिर,
एक स्वाभाविक प्रतिक्रिया के रूप में, हम बीमारी और कठिनाइयों के समय में प्रभु को याद करते हैं। बुधजन बीमार पड़ने केलिए धन्य महसूस करते हैं क्यों
कि उस पूरा समय भगवान् के नाम जपने में ही बिताते हैं !
3.
कौन परेशानी चाहता है? हर कोई परेशानी का सामना करने से बचने की कोशिश करता है। लेकिन ज्ञानी इस पर अलग राय जताते
हैं। मुसीबत के साथ एक मूल्यवान सबक भी आता है: वैराग्य का पाठ। जब हम मुसीबत में होते हैं,
तो हम महसूस करते हैं कि अंतिम फैसले में हमारी कोई बात नहीं है और हमें एहसास होता है कि हमारे लगाव कितने तुच्छ हैं। महान लोग इसे महत्व देते हैं और इसलिए खुले हाथों से परेशानी का स्वागत करते हैं।
महान लोग जीवन के किसी भी पहलू के उज्जवल पक्ष को देखते हैं,
जब अन्य सामान्य रूप से असमर्थ होंगे। वे किसी भी स्थिति का सर्वोत्तम उपयोग करते हैं और इसे बढ़नेके अवसर में बदल देते हैं।
क्या हर चीज में सर्वश्रेष्ठ देखने के बिना कोई बेहतर तरीका है?
śarīraṃ jñānajananaṃ rogo viṣṇusmṛtipradaḥ ।
vipadvairāgyajananī trayaṃ sukhakaraṃ satām ॥ - rasagaṅgādhara – Jagannatha Panditha Raya
The following three (aspects) are comforting to the noble: 1)
the mortal body, which houses knowledge; 2) sickness,
which brings to mind Lord Viṣṇu; 3) trouble,
which brings detachment.
1. One would think that in order to attain salvation, one should
be rid of the birth and death cycle, but the noble are thankful for the mortal
body. The reason being: it is impossible to attain knowledge without a body.
So, they welcome the idea of being born, so they can acquire knowledge!
2. Nobody asks to fall sick. But then, as a natural response, we
remember the Lord in times of sickness and hardships. The noble feel blessed to
fall sick if it will make them remember the Almighty!
3. Who wants trouble? Everyone tries to avoid coming face to
face with trouble. But the noble have a different take on it. Along with
trouble comes a valuable lesson: the lesson of detachment. When in trouble, we
realize that we have no say in the final verdict and we realize how trivial our
attachments are. The noble value this and hence welcome trouble with open arms.
The noble see the brighter side of any aspect of life, when others would
normally be unable to. They make the best of any situation and turn it into an
opportunity to grow.
Is there any better way of seeing the best in everything?
స్వస్తి.
No comments:
Post a Comment