అజరామర
సూక్తి – 334
अजरामर सूक्ति – 334
Eternal Quote – 334
https://cherukuramamohan.blogspot.com/2021/08/334-334-eternal-quote-334.html
न पश्यति च
जन्मान्धः कामान्धो नैव पश्यति ।
न पश्यति
मदोन्मत्तः स्वार्थी दोषान्न पश्यति ॥ - चाणक्य नीति
న పశ్యతి చ జన్మాంధః కామాంధో నైవ పశ్యతి l
నపశ్యతి మదోన్మత్తః స్వార్థీ దోషాన్నపశ్యతి ll
శ్లో || న పశ్యతి చ జన్మాన్ధః కామాన్ధో నైవ పశ్యతి |
న పశ్యతి మదోన్మత్తో స్వార్థీ
దోషాన్ న పశ్యతి || 7
పుట్టుగ్రుడ్డి చూడలేడు. కామాంధుడు కూడ మంచిచెడ్డలను పర్యవసానమును
చూడలేడు. మదించినవాడు, మధ్యము పుచ్చుకొన్నవాడు, మాదక ద్రవ్యములను
సేవించినవాడు, కూడ ముందు వెనుక చూడడు. స్వార్థపరుడైన మనుష్యుడుకూడ
చేయు పనిలోని మంచిచెడ్డల గమనింపడు. వీరందరూ
ఒకవిధముగ్కా గుడ్డివాళ్ళే !
పుట్టుగుడ్డిని గూర్చి మనము చెప్పుకోన వలసినది ఎక్కువగా ఉండదు. ఒక విధముగా
దుస్తర దుర్భర దుర్మార్గ భరితమైన ఈ ప్రపంచమును చూడని పున్యాత్మునిగా
చెప్పుకొనవచ్చును. మహాత్ముడగు సూరదాసు గుడ్డివాడై పరమాత్ముని సన్న్ధిని
సాధించినాడు. అదే ధృతరాష్ట్రుడు గుడ్డివాడి కూడా మమకార మదమాత్సర్యములచేత
ఆవరించినవాడై, చరిత్రలో దుర్మార్గమును పోషించే తండ్రిగా నిలచిపోయినాడు.
గుడ్డితనము అన్నది ఒకటే అయినా దానిని బలముగా ఒకరు ఉపయోగించుకొంటే,
బలహీనతగా ఒకరు
ఉపయోగించుకొన్నారు. ఇక కామమును గూర్చి.......
కామప్రాబల్యమును గూర్చి భర్తృహరి-
కృశః కాణః ఖంజః
శ్రవణరహితః పుచ్ఛ వికలో
వ్రణీ పూయక్లిన్నః
కృమికులశతై రావృతతనూః |
కక్షుధాక్షామీ జీర్ణ
పిఠరక కపాలార్పితగలః
శునీమన్వేతి శ్వా హతమపి
నిహన్త్యేవ మదనః ||
(భర్తృ. శృం. దుర్విరక్త పద్ధతి - 78)
కరము కృశించి కాల్ విరిగి కన్నూ గానక పుచ్ఛ హీనమై
పురుగులు గ్రంముచున్న వ్రణ పుంజము మేనలమంగ నాకటం
బరవశ మై ఘటీముఖ కపాలగళంబగు కుక్క పెంటితో
నరిగెడు గూల జంతువుల నైన వద్గించు మనోజుదక్కటా !
జవసత్వములుడిగి మిక్కిలి బక్కచిక్కియున్నను, కాలు విరిగి కుంటి,దైనను, కన్నులు
కానరాక పోయిననూ, తోక తెగినడైననూ, పుండువడి చీము కారుచున్నను, పురుగులు
పడిన శరీరము కలదైనను, ఆహారము లేక ఆకటితో సోక్కియున్ననూ, పగిలిన కుండ
మూతిని, మెడకు తగిలించుకొనియున్న కుక్క సంభోగము కొఱకు ఆడ కుక్క
వెంటబడిపోవుచుండును. ఓహో! ఇన్ని విధముల నష్టపోయి బాధపడుచున్ననూ
మన్మధుడు జంపజూచుచున్నాడే ఆతడెంత నిర్దయుడో కదా!
ఇపుడు మదాంధుని దుస్థితిని నేను వ్రాసిన ఈ పద్యమున గమనిద్దాము.
అంగ
బలమ్ము అర్థబల మందుకు తోడుగ మందు మానినీ
సంగము
తో మదంబు మద సామజమై తలనంటగా మదిన్
అంగజు
డంచు తా జెలగు అడ్డము ఆపును లేని ఉద్ధృతిన్
భంగము
జేయగా తగిన భావజహారి జనించులోపునన్
మదముతో
పెంపొందినవాడు తప్పక తగిన వ్యక్తి చేత శృంగభంగము గావించుకొనక తప్పదు.
ఇక
స్వార్థపరుని అంధత్వమును ఒకపరి అవలోకించుదాము.
తలపున
నిండ స్వార్థమది తప్పక జూడడు నీతి నిష్ఠలన్
ఛలమును
చేరదీయుచును చక్షు విహీనత పొంది యుండుటన్
ఇల
కలకాలమున్నమిత ఈప్సిత సిద్ధికి దారులెన్నుచున్
కల
గనుచుండు నంధుడయి కాలప్రవాహ ప్రమగ్నుడై మహిన్
కావున
లేని అందత్వమును కోరి తెచ్చుకొని ఇక్కట్లపాలై క్షణికమైన ఐహిక సుఖములకు బానిసయై
పుట్టలో చెదలు వలె సార్థకత లేని జీవితము జీవించుటకంటే పరమాత్ముని తలచుచూ
పరమపదమునకై ప్రాకులాడుట సమంజసము కదా!
न पश्यति च
जन्मान्धः कामान्धो नैव पश्यति ।
न पश्यति
मदोन्मत्तः स्वार्थी दोषान्न पश्यति ॥ - चाणक्य नीति
जो जनम से अँधा है उस व्यक्ति देख नहीं सकता; इच्छा व तृष्णा से अंधा व्यक्ति भी नहीं देखता;
जो घमण्ड से माराहुआ है, वह भी नहीं देखपाएगा; न ही स्वार्थी देखपाता है अपने दुर्बलता या
दोष को।
ऊपर के
श्लोक के अनुसार अंधापन 4 प्रकार का होता है।
एक है शारीरिक कमी। जिसकी आंखें उस तरह से काम नहीं करतीं जिस तरह से उन्हें करना
चाहिए और उसे अंधा समझा जाता है, वह कुछ भी नहीं देख सक्ता और कुछ लोग स्पष्ट रूप से
कुछ भी नहीं देख सकते हैं l दोषों की तो बात ही छोड़ दें। वह केवल एक प्रकार का अंधापन है;.
आलंकारिक अंधापन के अन्य रूप हैं। अंधेपन से भी बदतर केवल एक चीज है, 'दृष्टि तो है
लेकिन दृष्टि नहीं है।' दृष्टिहीन धृतराष्ट्र अनधा होतेहुए भी नही सुधर सका और संत सूरदास अपने
अन्धत्व का फ़ायदा उठाकर सीधा श्रीकृष्ण को देखसका l दुरबलता को कोई अपने बल मे
तबदील करसके तो वह महापुरुष होजाता है l
जिसकी अत्यधिक इच्छाएँ हैं, वह उन इच्छाओं से परे नहीं देख सकता। वह अपनी इच्छाओं और
जरूरतों को प्राप्त करने के लिए किसी भी चीज पर नहीं रुकेगा। वह केवल यह सोच सकता है
कि अपनी रुचि की वस्तुओं को कैसे प्राप्त किया जाए। वह अपनी कमियों को कैसे देख सकता
है? जो अहंकार के नशे में धुत है, उसे अपने सिवा कुछ दिखाई नहीं देता! वह किसी को या कुछ
और नहीं देखता है। उनकी राय में, वह सबसे अच्छा है! ऐसी मनोवृत्ति से वह कोई कमी कैसे देख
सकता है?
एक स्वार्थी प्राणी और भी बुरा है। वह अपने और अपनी जरूरतों से परे कुछ भी नहीं देख सकता
है। वह अथक रूप से अपने सर्वोत्तम हित के लिए काम करता है। ऐसा व्यक्ति अपने आप में या
अपने कर्मों में कमियां कैसे देख सकता है!
बहुत बड़ा अंतर है 'देख नहीं सकता' और 'नहीं' देखता है’ में! यदि यह वास्तविक अंधापन है
जिसका इलाज नहीं किया जा सकता है, तो उनके पास एक बहाना है। लेकिन बाकी..., बस एक
बहाना है (अस्तित्व का)!
आत्म-प्रवृत्त
भ्रांतियों से कोई राहत नहीं है!
na paśyati ca janmāndhaḥ
kāmāndho
naiva paśyati
।
na paśyati madonmattaḥ
svārthī
doṣānna
paśyati
॥ - cāṇakyanīti
A person born blind cannot see; one blinded by desire does not see;
he who is intoxicated with pride will not see; nor is the selfish (able
to) see - (his own) defects.
Blindness is of many
orders. There are 4 types of blindness.
One is a physical deficiency. One whose eyes do not function the
way they should and is deemed blind can obviously not see
anything, let alone faults. That is only one type of blindness;. There
are other forms of figurative blindness. The only thing worse than
blindness is, 'having sight but no
vision.' :(
One who has excessive desires cannot see beyond those desires. He
will stop at nothing to achieve his wants and needs. All he can
think of is how to acquire the objects of his interest. How can he see his own flaws?
One who is intoxicated with pride can see nothing but himself! He
sees no one or anything else. In his opinion, he is the best there is!
With such an attitude, how can he see any
shortcomings?
A selfish being is even worse. He can see nothing beyond himself
and his needs. He tirelessly works towards his own best interest. How can such a person see inadequacies, whether in himself or in his deeds! The huge difference is in 'cannot' see and 'does not' see! If it is actual blindness which cannot be treated, they have an excuse. But the rest..., are just an excuse (of existence)!
There is no respite from
self-inflicted fallacies!
స్వస్తి.
No comments:
Post a Comment