Friday, 13 August 2021

అజరామర సూక్తి – 330 अजरामर सूक्ति – 330 Eternal Quote – 330

 

అజరామర సూక్తి  330

अजरामर सूक्ति  330

Eternal Quote – 330

https://cherukuramamohan.blogspot.com/2021/08/330-330-eternal-quote-330.html

वलीभिर्मुखमाक्रान्तं पलितैरङ्कितं शिरः ।

गात्राणि शिथिलायन्ते तृष्णैका तरुणायते ॥ - वैराग्यशतक

వలిభిః ముఖమాక్రాంతం పలితైరంకితంశిరః l

గాత్రాణి శిథిలాయన్తే తృష్ణైకా తరుణాయతే ll భర్తృహరి వైరాగ్య శతకము

పై శ్లోకమునకు ఏనుగు లక్ష్మణకవి వారి తెలుగుసేత:

కరచరణాద్యవయవముల

భరముడిగెన్ వళులు మొగముపై నిండారెన్

శిరసెల్ల దెల్లవారెను

దరిమాలిన తృష్ణ యొకటె తరుణత బూనెన్                 

చేతులు కాళ్ళు మున్నగు అవయవముల బరువు తగ్గెను.మొగమంతా ముడుతలు 

పడెను. వెంట్రుకలు తెల్లవారెను. దిక్కు అనగా అంతు, లేని ఆశ యొక్కటే 

యౌవ్వనములో ఉన్నది.

పై భావమును నా భాషలో దిగువన విస్తృతపరచినాను.

రాలు దంతములు రజత కేశములు

ముఖమున ముడుతలు మొగి జర స్ఫుటలు   (క్రమముగా ముసలితనము ప్రబలమగుట)

చేతులు కాళ్ళను చేరగ వణుకులు

జవసత్వంబులు చరమాంకమునకు

చేరువయైనా చెరగదు కాంక్ష

దాని యౌవ్వనము దాటదు గీత

కోర్కెల వలలో కోర్కెల అలలో

కడవరకూ కడతేరే వరకూ

తపనలతోడ పతనమగు వరకూ

మానవుడాపడు మదిలో కోర్కెలు

దైవ రూపమును తలవడు మదిలో

తామస రాజస తప్త హృదయుడై

యౌవనం జరయా గ్రస్తం ఆరోగ్యం వ్యాధిభిర్హతం l

జీవితం మృత్యురభ్యేతి తృష్ణైకా నిరుపద్రవా ll

యౌవనము జరాగ్రస్తము, ఆరోగ్యము వ్యాధిగ్రస్తము, ప్రాణము మృత్యుర్గ్రస్తము, కానీ 

తృష్ణ మాత్రము ఏ ఉపద్రవమూ లేనిది.

జగద్గురు శంకరులవారి ప్రశ్నోతరమాలోని ఈ శ్లోకమును ఒకపరి గమనించండి

బద్దోహి కో యో విషయానురాగీ

కావా విముక్తిః విషయేనురక్తి

కో వాస్తి ఘోరో నరకః స్వదేహః

తృష్ణా క్షయః స్వర్గపదం కిమస్తి ll

 

బంధనములలో తగులుకొని యున్నదెవరు?

విషయలోలుడు అనగా కోరికల జలధిలో కోరి మునిగినవాడు.

ముక్తి అనగా ఏమిటి ?

విషయ అనగా వాంఛా పరిత్యాగమే ముక్తి.

ఘోరమగు నరకము ఏది ?

వేరేదీ కాదు తన శరీరమే!

స్వర్గమనగా ఏది?

మన కోరికలనడచుకొంటే జీవతమున అన్నీ సాధించినట్లే! లేకుంటే అంతా 

పోగొట్టుకోన్నట్లే! మహనీయుల అనుభవాల సారాంశము ఒకటిగానే ఉంటుంది. 

ఇపుడు కోర్కె విషయమే తీసుకొందాము

పుట్టిన మనిషికి మరణము తథ్యము

సాగే బండికి గమ్యము తథ్యము

 పదవిన చేరిన విరమణ తథ్యము

వేసిన కూసము విడుచుట తథ్యము

అన్ని విషయములకంతము ఉన్నది.

మనిషికాశపై మరులు ఏలనో

ఆశకేల మరి అంతము లేదో

అన్నీ తెలిసిన అతడు ఒక్కడే

చెప్పవలెను ఆ చిదానండుడే!

ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా విషయము మాత్రము ఒకటే! వాంఛాపరిత్యాగము.

 

वलीभिर्मुखमाक्रान्तं पलितैरङ्कितं शिरः ।

गात्राणि शिथिलायन्ते तृष्णैका तरुणायते ॥ - वैराग्यशतक

चेहरे पर झुर्रियां पड़ गयी, सर के बाल पककर सफ़ेद हो गए, सारे अंग ढीले हो गए - पर तृष्णा 

तो तरुण होती जाती है |

तृष्णा के विषय में *महात्मा सुन्दरदास* जी ने बहुत सुन्दर भाव दिया है :--

नैनन की पल ही में पल के

क्षण आधि घरी घटिका जो गई है !*

जाम गयो जुग जाम गयो ,*

पुनि सांझ गयी तब रात भई है !!*

आज गयी अरु काल गई ,*

परसों तरसों कुछ और ठई है !*

सुन्दर ऐसे ही आयु गई ,*

तृष्णा दिन ही दिन होत नई है !!*

आज सारा संसार तृष्णा के फेरे में पड़ा हुआ है | धनी हो या निर्धन सभी इसके बन्धन में बन्धे हैं

निर्धन की अपेक्षा धनियों को तृष्णा बहुत है | धनी हमेशा निन्यानवे के फेरे में लगे रहते हैं | 99 

होने पर 100 पूरा करने की चिन्ता लगी रहती है | 1000 होने पर 10000 की , 10 हज़ार होने पर 

लाख की , लाख होने पर करोड़ की और करोड़ होने पर अरब-ख़रब की तृष्णा लगी रहती है

इसी फेर में मनुष्य रोगी और बूढा हो जाता है पर तृष्णा न रोगिणी होती है और न बूढी |

जैसा कि सुभाषित में लिखा है :--

यौवनं जरया ग्रस्तमारोग्यं व्याधिभिर्हतं l

जीवितं मृत्युरभ्येति तृष्णैका निरुपद्रवा ll

जवानी बुढ़ापे से, आरोग्यता व्याधियों से और जीवन मृत्यु से ग्रसित है; पर तृष्णा को किसी उपद्रव 

का डर नहीं |

शंकराचार्य जी ने अपनी प्रश्नोत्तरमाला में लिखा है -

बद्धो हि को यो विषयानुरागी !

का वा विमुक्तिर्विषयेनुरक्तिः !

को वास्ति घोरो नरकस्स्वदेहः

तृष्णाक्षयस्स्वर्गपदं किमस्ति ?

 अर्थात्:-

बन्धन में कौन है ? -- विषयानुरागी

मुक्ति क्या है ? -- विषयों का त्याग

घोर नरक क्या है ? -- अपना शरीर

स्वर्ग क्या है ? -- तृष्णा का नाश

अगर हम कामना काबू में रक्सकते हैं तो हम जीवित में सब कुछ पालिया l अगर नहीं रखेंगे तो सब कुछ खो 

लिया l

valībhirmukhamākrānta palitairakita śira

gātrāṇi śithilāyante tṛṣṇaikā taruṇāyate ॥ - vairāgyaśataka

Face encroached by wrinkles; head marked by grays; limbs frail/feeble; 

appetence alone is young!

Human beings possess body, mind and intellect.  Mind and intellect comprise of 

nothing but thoughts.  The deteriorating attributes of the body like graying hair, 

wrinkles on the face and feeble limbs are all signs of impending old age.  All 

organs lax and become fragile and incoherent because they have grown, 

matured, enjoyed being their best during youth and then ripened due to time and 

usage.  While the body shows signs of old age, there is one very powerful trait of 

the mind that doesn't undergo this cycle of growing, maturing, enjoying and 

ripening!  It definitely undergoes the first three stages.  But upon reaching its 

pinnacle, it remains there and keeps growing wider and deeper!  It is insatiable 

and infinitely expanding as well!!  'Appetence', 'thirst', 'intense craving', 'strong 

desire'...  Many are its names, but its effects are just the same!  It is insatiable at 

any age!  A new craving, a new thirst, a new desire.... once satisfied, there is 

some other craving, thirst or desire ready to take over.  This seems to have no 

end at any stage of life.  The poet observes that thirst is the only attribute of a 

person that gets stuck in its youth and never outgrows that stage. The attributes 

of the body show clear signs of dilapidation, but not the mind's desire!

The thirst of 'desire' can never be fulfilled nor fully quenched.  When drinking 

salty water, the thirst only increases after drinking.  Desire is just the same.  The 

more it is fed, the more it wants! Nipping it in the bud is the easiest way of 

conquering it.

స్వస్తి.

 

No comments:

Post a Comment