అజరామర సూక్తి – 341
अजरामर सूक्ति – 341
Eternal Quote – 341
https://cherukuramamohan.blogspot.com/2021/08/341-341-eternal-quote-341.html
गिरिर्महान्
गिरेरब्धिः महानब्धेर्नभो महत् ।
नभसोऽपि
महद्ब्रह्मा ततोप्याशा गरीयसी ॥ - कुवलयानन्द
గిరిర్మహాన్
గిరోరబ్ధిః మహానబ్ధేర్నభో మహాత్ l
నభసోऽపి మహాద్బ్రహ్మా తతోప్యాశా గరీయసి ll
పై
శ్లోకమునకు నా యథాశక్తి అనువాదము:
అచలము చిన్నదై జనును ఆర్ణవమున్ సరిపోల్చి చూడగా
విచలిత వార్ధి చిన్నదగు వీగక సాగు నభంబు పోల్చినన్
అచర నభంబు బొల్చ బహు అల్పము బ్రహ్మము ముందు గాంచగన్
ప్రచురిత బ్రహ్మమౌ లఘువు ప్రస్ఫుట రీతిన ఆశముంగటన్
పర్వతము పెద్దదే కానీ సముద్రము అంతకన్నా పెద్దది. సముద్రము, ఆకసముతో
పోల్చినపుడు అతి చిన్నది. ఆ అంబరమే, పరబ్రహ్మముతో పోల్చినపుడు అత్యంత
అల్పము. కానీ ఆ పరబ్రహ్మమే ఆశముందు అత్యంత సూక్ష్మ కణము. అంటే మానవునకు
ఆశపై ఎంత
ఆశ ఉన్నదో ఆలోచించండి.
పెద్దలు చెప్పిన ఈ సూక్తిని ఒక పర్యాయము గమనించండి :
క్రోధో వైశ్వానరో దేవో ఆశా వైతరిణీ నది
విద్యా కామదుఘాః దేనుః సంతుష్టిః నందనం వనం
తన క్రోధమగ్ని గాంచగ
తన ఆశే వైతరిణిని తప్పక
చేర్చున్
తన విద్య కామధేనువు
తనతృప్తే నందనమ్ము తలవగ రామా!
కోపము అగ్ని వంటిది. అది తననూ కాల్చుకొంటుంది పరులనూ నిర్దాక్షిణ్యముగా
కాల్చివేస్తుంది. ఇక ఆశ వైతరిణీ నది వంటిది. ఈ వతరినీ నదిని గూర్చి ఒక్కమాట
చెప్పుకొందాము. ఇది వంద యోజనాల వెడల్పు ఉంటుంది. చిక్కని రక్తము, చీము
కూడా. భయంకర జలచరాలు, ఒక్క క్షణం కూడా భరించలేని దుర్వాసన
కలిగియుంటుంది. ఎన్ని దీనాలాపనలు చేసిన పాపి తను చేసిన పాపాలకు ఫలితం
అందులో మునిగి అనుభవించవలసిందే. అందుకనే తమ వారి కోసం భువిపై వారిపేరు
మీద గోదానం చేస్తారు. గోదానం చేస్తే వైతరిణి నదిని సులభంగా దాటగలరని గరుడ
పురాణంలో శ్రీమహావిష్ణువు స్వయంగా గరుత్మంతుడికి తెలియజెప్పినాడు. విద్య
పాలిచ్చే పాడియావు వంటిది. తన సంతృప్తే నందనవనము. ఎంతటి నీతి వాక్యములో
గమనించండి.
వైతరిణితో పోల్చబడిన ఆశ ఎంత హీనమైనదో చూడండి. దానికి ఎక్కడలేని ప్రాముఖ్యత
ప్రాధాన్యత ఇచ్చి దానినే మన సర్వస్వముగానెంచి వాంఛించి వాంఛించి వడలిపోయి
వసుధను వీడుచున్నాము. మనము చేసేది ఎంత హీనమైన పనే అన్నది ఒక పర్యాయము
మదిలో తర్కిన్చుకొంటే మనకే తెలిసివస్తుంది. దీనిని దాతుకోవలెనంటే పోతన చెప్పిన
తిరుగులేని మార్గమే మనకు శరణ్యము. అది ఏమిటన:
నీ పాదకమలసేవయు
నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాం
తాపార భూతదయయును
దాపసమందార! నాకు దయచేయఁ గదే.
ఓ తపోధనులకు కల్పవృక్ష మైనవాడా! శ్రీకృష్ణా! కమలాల వంటి నీ పాదాల
పరిచర్య, నీ పాదాలను పూజించే భక్తులతో మిత్రత్వం, ప్రాణులు అన్నిటిమీద అత్యంత
అపరిమతమైన దయను నాకు ప్రసాదించు.
మధురకు బలరామ కృష్ణులు వచ్చినపుడు, శ్రేష్టమైన పూల మాలలు కట్టి అమ్మే
సుదాముని వద్దకు పోతారు. (ఈ సుదాముడు కుచేలుడు కాదు). ఎంతో సంతసించిన
సుదాముడు స్నిగ్ధము, మనోహరము, సురభిలము నగు మాలలను వారికి వేసి
భాషపూరిత నయనాలతో వారి ముందు నిలుస్తాడు. అప్పుడు, శ్రీకృష్ణుడు వరంకోరుకో
మని అనుగ్రహించుతాడు. ఆ సుదాముడు కోరిన వరమే భావయుక్తమగు పై పద్యము.
ఒక మాలాకారుని చేత యింతటి గంభీరమైన భావగర్భితమైన పలుకులు
పలికించటంలో పోతనామాత్యుల వారి విశిష్ఠత కనబడుతోంది. వారు భక్తి
పారవశ్యంతో మైమరచి పద్యాలలో యిలా మధుర మకరందాన్ని స్వచ్ఛమైన ప్రపత్తిని చిలకరిస్తుంటారు.
ఇదే మాటనే ఆదిశంకరులు కూడా ‘సత్సంగత్వే నిస్సంగత్వం’ అని చెప్పినారు.
మహానుభావులు ఎఇచెప్పినా వారి అభిప్రాయము మారదు.
गिरिर्महान्
गिरेरब्धिः महानब्धेर्नभो महत् ।
नभसोऽपि
महद्ब्रह्मा ततोप्याशा गरीयसी ॥ - कुवलयानन्द
स्वभावतः एक पहाड़ बहुत बड़ा है; समुद्र पर्वत से बड़ा है, आकाश सागर से बड़ा है, परब्रह्मा
आकाश से भी बड़ा है,
और इच्छा उससे (ब्रह्मा) भी बड़ी है।
यह एक ज्ञात तथ्य है कि पहाड़ बहुत बड़े हैं। सारे सागर मिलके एक ही महासागर बनता है l यह
महासागर इतना विशाल होता है कि वह आसानी से सारे पर्वतों को अपने में छिपा सकता है।
आकाश और भी बड़ा है, क्योंकि यह पूरा अंतरिक्ष फैलाहुआ है l इन सभी को बनाने वाला 'ब्रह्म
तत्व' निश्चित रूप से इन सबसे बड़ा है - इन सभी को बनाने में
सक्षम होने के लिए।
लेकिन एक छोटी सी चीज है जिसका कोई रूप नहीं होता और जो मन में जन्म लेती है। यह स्वयं
ब्रह्मा से भी बड़ा है! इसे बोलते हैं ‘इच्छा’। चाहतों की प्यास बुझाना आसान नहीं होता। एक इच्छा
पूरी होती है तो दूसरी आ जाती है। अगर वह तृप्त हो जाता है तो एक अलग पैदा होता है। यह
कभी न खत्म होने वाला चक्र है। ब्रह्मा स्वयं अपनी इच्छाओं को बुझाने से थक सकते हैं लेकिन
हमारे मन में पैदा होनेवाली इच्छा कभी भी ख़त्म
नहीं होती l
इच्छा का एकमात्र उपाय, उसी स्थान से उत्पन्न होता है जहां से इच्छा उत्पन्न होती है - मन। जब
इच्छाओं की नासमझी को समझा जाता है, तो मन अपनी अंतहीन समस्याओं का एक अचूक
इलाज ढूंढता है। अगर
इन इच्छाओं को कोई थम सकता है वह सिर्फ मन है l
मनको अगर हम काबू में रख सकते हैं तो इच्छाएँ घुसनेका कोई जगह अपने शरीर में नहीं मिलताl
इच्छाओं को अपने जीवन पर राज और बर्बाद न करने दें!
girirmahān girerabdhiḥ
mahānabdhernabho
mahat ।
nabhaso'pi mahadbrahmā
tatopyāśā
garīyasī
॥ - kuvalayānanda
A mountain is huge; an ocean is larger than the mountain, the sky is larger than
the ocean, Brahma is larger than the sky, and desire is even bigger than Him
(Brahma).
It is a known fact that mountains are huge. The oceans are vaster because they
can easily hide many mountains in them. The sky is even larger, as it spans
many such oceans and the whole earth. The 'Brahma tatva' that created all of
these, is certainly greater -
for being able to make all of these.
But there is one little thing which doesn't have a form and is born in one's mind.
It is even greater than Brahma himself! It is 'DESIRE'. This is not easy to quench
the thirst of desire. If one wish is satisfied, another pops up. If that is satiated
then a different one arises. This is a never-ending cycle. Brahma himself can get
tired of quenching one's desires.
The only remedy for desire, arises from the same place where the desire arises
from - one's mind. When mindlessness of desires is understood, the mind finds a
surefire cure for its endless problems.
Do not let desires rule (and ruin) your
life!
స్వస్తి.
🙏
ReplyDelete