అజరామర సూక్తి – 343
अजरामर सूक्ति – 343
Eternal Quote – 343
https://cherukuramamohan.blogspot.com/2021/08/343-343-eternal-quote-343.html
आशा नाम
मनुष्याणां काचिदाश्चर्यशृङ्खला ।
यया बद्धाः
प्रधावन्ति मुक्तास्तिष्ठन्ति पङ्गुवत् ॥
ఆశా నామ మనుష్యాణాం కాచిదాశ్చర్య శృంఖలా l
యయా బద్ధాః ప్రధావంతి ముక్తా తిష్ఠంతిపంగువత్ ll
మనిషికి ఆశ అనేది అత్యంత ముఖ్యమైన అంశం. ఆశ అనగా కోరిక, ఒక నిర్దేశిత
గమ్యం, ఒక లక్ష్యం, జీవిత సాఫల్యానికై ఏర్పరుచుకునే ఉత్కృష్ట లక్ష్యం. ఈ ఆశలు
అనేకానేక రకాలు. విద్యా సాధన కావచ్చు, విశేష ధన సముపార్జన కావచ్చు, ఐహికమైన
సుఖాల లబ్ధి కావచ్చు. శారీరక సుఖాలను అనుభవించుట కావచ్చు లేదా ఉన్నతమైన
అధికార కాంక్ష కావచ్చు. అనాదిగా మనుష్యులు వెంపరలాడే ఇతరములైన అనేకానేక
విషయాలు కావచ్చు. పరతత్వమును గ్రహించుట, పరమపదము సాధించుట కూడా
ఆశే! కానీ పొరబాటున కూడా ఆ విషయముల జోలికి పోము.
ఈ ఆశ అనేది మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయే దాకా వానిని నడిపించే లేదా
పరుగుపెట్టించే ఒక మహా శక్తి లాంటిది. ఈ ఆశ అనేది మనిషిని కట్టి పడవేసే ఒక
రకమైన అద్భుత అగోచర శృంఖలము. ఈ ఆశ అనే శృంఖలము చేత బంధింపబడిన
ప్రతి మనిషీ కూడా దానిని సాధించుటకు పరితపిస్తూ తన జీవితాంతం నిరంతరమూ
పరుగులు తీస్తూనే ఉంటాడు. నిజానికి బంధింపబడినవాడు అందునా గొలుసులతో,
పరిగెత్తుట వాస్తవమునకు విరుద్ధము. ఆశ గోప్పదనమదే! కట్టి పడవేసి పరిగెత్తింప
జేస్తుంది. సాధించిన నాడు ఆనందపడతాడు. విఫలమైన నాడు నిరాశా నిస్పృహలకు
లోను అవుతాడు. కానీ సాధించిన దానితో ఆగడు. తిరిగీ వేరొక కోరిక, మళ్ళీ పరుగు.
బ్రతికినంత కాలము ఇది తప్పదు.
నిజానికి సాధారణ మానవ జీవితాలలో అత్యంత ముఖ్యమైనది ఈ ఆశ. హద్దులు
ఉంచుకొన్నవారికి ఇది చాలా ఆవశ్యకము కూడా. విద్యనూ ఆర్జించుట ఆశయే అయినా
దానివల్ల సంఘమునకే ఎక్కడలేని ప్రయోజకత చేకూరుతుంది. అదే విధముగా
జ్ఞానులను సేవించవలెనను ఆశ. అది వ్యక్తియొక్క బుద్ధి వికసింపజేసి ఆత్మ
దర్శనమునకు ఆలంబనమౌతుంది.
అట్లుకాక, ఐహిక దైహిక సుఖములే తన ఆశగా ఆశయముగా ఉంచుకొన్న వానికి అన్నీ
అనర్థములే! ఈ ఆశ అనే శృంఖలాల నుండి విముక్తి పొందిన వానికి ఈ ప్రపంచముతో
సంబంధ బాంధవ్యాలు తెగిపోతాయి, ప్రాపంచికమైన విషయ వాంఛలమీద ఏ రకమైన
ఆకర్షణలూ కానీ, మోహాలు కానీ ఉండవు. ఆ శృంఖలా బధ్ధతనుండి ఆ మోహ
వాంఛలనుండి విముక్తుడైన నాడు ఈ ప్రాపంచిక విషయ సాధనల లక్ష్యాలు ఏమీ
ఉండవు కావున వాటికై పరుగులు పెట్టడం మానేసి ఒక అవిటి వాని వలె చతికిలబడి
ఉంటాడు.
ఆశ అనే శృంఖలాలచే బధ్ధుడైన వాడు జీవితంలో పరుగులు పెడతాడు. వాటి నుండి
విముక్తుడైన వాడు అవిటివాని వలె చతికిల పడతాడు అని తాత్పర్యము.
ఇలా చతికిల బడే వాడు సామాన్యుడు కాడు. అసామాన్యుడు. ఎందుకంటే ఈ
శృంఖలాలనుండి విముక్తి దాదాపుగా అసాధ్యం. అటువంటి వారు నిజంగా మహాత్ములు,
మహోన్నతులు, యుగ పురుషులూ అయినా ఆశ్చర్య పోనవసరం లేదు. ఆ కోవకి
చెందిన వారిని చరిత్రలో మనం కొద్ది మందిని చూస్తూ ఉంటాం. పరమ పూజ్యులు ఆది
శంకరాచార్యులు, రామకృష్ణ పరమ హంస, స్వామీ వివేకానంద, ఇంకా ఎందరెందరో
మహానుభావులు ఈ కోవకు చెందిన మహోన్నత వ్యక్తులు. వారు విశ్వ కల్యాణానికై
అప్పుడప్పుడు జన్మించే కారణ జన్ములు.
आशा नाम
मनुष्याणां काचिदाश्चर्यशृङ्खला ।
यया बद्धाः
प्रधावन्ति मुक्तास्तिष्ठन्ति पङ्गुवत् ॥
आशा नाम की एक अदृश्य जंजीर से बंधा हुआ मनुष्य का जीवन आश्चर्यजनक रूप से प्रभावित होता
है | जो व्यक्ति इससे बंधे हुए होते है वे तो इधर उधर भागते हुए नजर आते है और जो व्यक्ति
उसके द्वारा बंधे हुए नहीं होते हैं वे कहीं भी आराम से बैठे हुए नजर आते हैं |
अधिक से अधिक पाने की आशा करने वाला व्यक्ति जितनी भागदौड करता है उतना एक संतोषी
व्यक्ति नहीं करता है | सदैव अतृप्त रहने वाली इच्छओं की तुलना एक जंजीर से कर इसके मानव
पर पडने वाले प्रभाव का तुलनात्मक विश्लेषण इस सुभाषित में किया गया है |
जो
इ जंजीरों में नहीं जकदते हैं वे महा पुरुष होते हैं l हम उनलोगों के पदचिह्नों पर
चलना है l
āśā
nāma
manuṣyāṇāṃ
kācidāścaryaśṛṅkhalā
।
yayā baddhāḥ
pradhāvanti
muktāstiṣṭhanti
paṅguvat॥
Desire is the name of a strange binding for man. Those tied keep running, but
those free (muktāḥ)
sit as if limp.
Those tied to desires keep running to achieve them. Those devoid of desires sit
relaxed.
The irony is that if one is tied, he should be limited to a place - unable to run. But
this verse shows that, those who are tied (to desires) are the ones always on the
run! Desire is such a strong thing. It can drive one to extremes while on the path
of acquiring them. But those who are free from desires have nothing to run
after. They sit unperturbed and without agitations.
Beware of desires and where they take you.
స్వస్తి.
🙏
ReplyDelete