అజరామర
సూక్తి – 335
अजरामर सूक्ति – 335
Eternal Quote – 335
https://cherukuramamohan.blogspot.com/2021/08/335-335-eternal-quote-335.html
लोभमूलानि
पापानि रसमूलाश्च व्याधयः ।
इष्टमूलानि
शोकानि त्रीणि त्यक्त्वा सुखी भव ॥ सूक्त मुक्तावली – पूर्वाच्गार्य
లోభమూలాని
పాపాని రసమూలశ్చ వ్యాధయః l
ఇష్ట
మూలాని శోకాని త్రీణి త్యక్తా సుఖీభవ ll సూక్త ముక్తావళి – పూర్వాచార్య
ఈ
శ్లోక భావమును తేలిపే నేను వ్రాసిన ఈ పద్యమును ఒకపరి తిలకిచండి.
లోభము గూర్చు పాపముల, లోలత ఖాద్య పదార్థ శ్రేణిపై
శోభను గూర్చబోక పలు చూడని వ్యాధుల పాలుజేయు నే
లాభము కూర్చకన్ మిగుల లంపట గూర్చును స్వార్థతత్వ మే
ప్రాభవ మందలేవు విడు వానిని సౌఖ్యముపొంద భూమిపై
లోభము
పాపములను కూర్చుతుంది. ఏ విధముగా అన్నది ఒకపరి పరిశీలించెదము. ఒక సంపన్నుడు,
ఆమాటకొస్తే ‘తన అవసరానికి మించి డబ్బుకలిగినవాడు’ అని ఒక వ్యక్తిని భావించుకొందాము.
ఇద్దరు ఆడ పిల్లలను, అనారోగ్యపు సంపాదన లేని భర్తను పోషించుటకు ఇంటిపనులు చేసే ఒక
ఇల్లాలు, తన కూతురి పెళ్లి తన సంపాదనతో చేయలేక తానూ పనిచేసే ఇండ్ల యజమానులను
ఆర్ధిక సహాయము చేయమని అడిగింది . ఆ అడిగిన వారిలో పైన తెలిపిన వ్యక్తి కూడా
ఉన్నాడు. ఆయన ఆమె అభ్యర్థనను మన్నించక పోగా ‘నీకేమి చాలా ఇండ్లలో పని చేస్తావు
కదా! ఆ వచ్చిన రాబడి లోనే పెళ్ళిచేయి. అడుక్కొనే అవసరము ఉండదు కదా ?’ అన్నాడు. ఆమె
బాధపడుతూ వెళ్ళిపోయి ఉంటుంది. ఇది కోరి చేసిన పాపము కాదా!. ఆపదలో ఉన్న వ్యక్తిని
ఆడుకోనక పోగా అనవసరమయిన మాటలు అని నొప్పించుట పాపపు పని కాక మరేమిటి. ఇపుడు ఆ
వ్యక్తిని గూర్చి విశ్లేషించుదాము. తన కొడుకు ఉద్యోగమూ కొరకు లంచమిస్తూ వున్నాడు.
పెళ్ళయిన కూతురికి భర్త డబ్బు తెమ్మని పంపినపుడెల్లా డబ్బు ముట్టజెపుతూనే ఉన్నాడు.
మరి ఆ పెదరాలికి ఇచ్చే ఒక 500\= రూపాయలు అతనికి బరువై పోయింది. అతడు బస్సులో
పోవునపుడు జేబులో ఉన్న 10000\= రూ. ఎవరో కొట్టివేసినారు. మరి ఈ ఖర్చులు అన్నీ
బాధతో కూడినవి. ఒక 500\= రూపాయలు చేతులారా ఇచ్చిఉంటే ఎంత సంతృప్తి మిగిలి ఉండేది.
లోభమును గూర్చిన ఈ చాటువును ఒకపరి గమనించండి.
లోభమూలాని
పాపాని సంకటాని తథైవచ l ఠి
లోభాత్ప్రవర్తతే
వైరం అతిలోభాద్వినాశయత్ ll
సకల పాపాలకు మూలము లోభము. మనోసంకటములన్నింటికీ మూలము లోభము.
వైరుధ్యములు వైషమ్యములకు మూలము లోభము. అట్టిలోభము వినాశకరమే కానీ అన్యథా కాదు. లోభము పాపకూపమని పైన సోదాహరణముగా చెప్పుకొన్నాము. ఇప్పుడు లోభము అనేకమగు మనోసంకటములను కలిగిస్తుంది అన్నది కాస్త విస్తారముగా చెప్పుకొందాము. లోభికి కూడబెట్టుటే తెలుసు మరి దానిని కాపాడుకోనవలెనంటే ఎంత మనో ప్రాణ శారీరిక సంకటము.
జాగరూకత, దొంగల భయము, అప్పుల కొరకు వచ్చేవారి బాధ,డబ్బు ఖర్చు పెట్టించే
సంతానము, ఇవన్నీ సంకట కారకములే! ఇంకొక విషయము, లోభి ఒకరికి
పెట్టనిచ్చగించడు. ముఖ్యమగు స్నేహితులకైనా అంతే! మరి వారితో కలహాలు రాక
వేరేమోస్తుంది? కావుననే ‘లోభికి మూట నష్ఠి’ అంటారు పెద్దలు.
అదేవిధముగా ఇష్టమని, ఇష్టమొచ్చినట్లు తిండి తింటే ఇక్కట్లపాలు కావలసి వస్తుంది.
నేను వ్రాసిన ఈ పద్యమును గమనించండి.
పచ్చి
మిరప బజ్జి బల్ కమ్మగా నుండు
మితము
మీరి తినుట హితము కాదు
అతిగ
తినెడువాని అగచాట్లు గమనించు
రామమోహనుక్తి
రమ్యసూక్తి
ఇది
ఎక్కువ మందికి అనుభవైకవేద్యమే కావున విశ్లేషించనవసరము లేదని తలుస్తాను.
ఇక స్వార్థము అధికమయ్యిందంటే ఎదుటివారి ఇబ్బందులు సరుకుగొనక స్వలాభమే
ధ్యేయముగా పనిచేస్తూ ఉంటాము. ఇది విరోధమును కొనితెచ్చే వినాశాకరమగు
సాధనము. అందుకే దీనిని విడుచుట మంచిది,
కావున ‘అతి సర్వత్ర వర్జయేత్’ అన్న వాస్తవము మనకు అవగతమగుచున్నది
కదా!
लोभमूलानि
पापानि रसमूलाश्च व्याधयः ।
इष्टमूलानि
शोकानि त्रीणि त्यक्त्वा सुखी भव ॥ सूक्त मुक्तावली – पूर्वाच्गार्य
लोभ पापों को उत्पन्न करता है; तालू की तृप्ति रोगों की जड़ है; (और) इच्छा शिकायतों का स्रोत है। इन तीनों का त्याग करो और सुख की प्राप्ति करो!
कोई भी अपराध या पाप नहीं करना चाहता। प्रत्येक व्यक्ति की आंतरिक आदेश उसे वह करने के लिए चेतावनी देती है जो 'धर्म' है। यह विवेक सबके पास है। फिर भी दुनिया में इतने अपराध और पाप का कारण क्या है? प्रेरणा लालच है! लोभ से प्रेरित कर्म पाप की ओर ले जाते हैं। रुचि की वस्तु रखने की चिंता व्यक्ति को पाप करवाती है। लोभ के बारे में भी इस श्लोक को पढ़िए:
लोभमूलानि
पापानि संकटानि तथैव च ।
लोभात्प्रवर्तते
वैरं अतिलोभात्विनश्यति ॥
लोभ पाप और सभी संकटों का मूल कारण है । लोभ शत्रुता में वृद्धि करता है, अधिक लोभ करने
वाला विनाश को प्राप्त होता है ।
वे कहते हैं, 'तुम वही हो जो तुम खाते हो'। इसका मतलब है कि किसी का स्वास्थ्य उसके
खाने की आदतों की एक दर्पण छवि है। खाने की आदत स्वाद के लिए किसी की
कमजोरी से उत्पन्न होती है। अगर वह हर बार इसके लिए झुकता है, तो रोग प्रकट होना
लाजिमी है।
यदि कोई दुखी है तो इसलिए कि वह निराश है। निराशा किसी भी परिस्थिति से किसी
विशेष परिणाम की प्रत्याशा से उत्पन्न होती है। स्वयं अपेक्षा से अधिक, उस अपेक्षा के
वास्तविकता बनने की जिद ही दुख का कारण बनती है। यह जिद इच्छाओं से पैदा होती
है!
कवि कहता है, 'सुखमय जीवन जीने के लिए इन तीन संकटों से दूर रहो - लोभ, भोजन
की लालसा और कामना'।
1. पृथ्वी हर आदमी की जरूरतों को पूरा करने के लिए पर्याप्त प्रदान कर सकती है,
लेकिन एक आदमी के लालच के लिए पर्याप्त नहीं है।
2. स्वस्थ खाएं, स्वस्थ रहें।
3. अपनी इच्छाओं को आवश्यकता के अन्दर ही
रखें।
इन 3 बातों को याद कर सकते हैं जीवन को और भी खुशहाल बनासकते हैं l
Lobhamūlāni pāpāni rasamūlāśca vyādhayaḥ ।
Iṣṭamūlāni śokāni trīṇi tyaktvā sukhī bhava ॥ Sukta Muktavali –
Purvacharya
Greed emanates sins; gratification of the palate is the root for
diseases; (and) desire is the source of grievances. Abandon these
3 and attain happiness!
No one wants to commit a crime or sin. Every person's internal hard-
wiring warns him against performing that which is not 'dharma'.
Everyone has this conscience. Yet, what is the reason for so much
crime and sin in the world? The motivation is greed! Greed driven
actions lead to sin. The anxiety to possess an object of interest
makes one perform sin. Go
through this shloka also about greed:
Lobha moolaani paapaani
sankataani tathaivacha l
Lobhaatpravartate vairam
atilobhaatvinashyathi ll
Greed (Lobha) is the root of all sins and adversities , greed gives rise to
enmity and extreme greed brings about (one’s) total destruction.
They say, 'you are what you eat'. This means one's health is a
mirror image of his eating habits. Eating habits originate in one's weakness for taste. If he yields to it every time, diseases are bound to show up.
If one is sad it is because he is disappointed. The disappointment
arises from the anticipation of a particular outcome from any
circumstance. More than expectation itself, it is the insistence of
that expectation to become a reality causes sorrow. This insistence is born from desires!
The poet says, 'to lead a happy life, stay away from these three
troublemakers - greed, zest for food and desires'.
1. Earth can provide enough to
satisfy every man's needs, but not enough for one man's greed.
2. Eat healthy, stay healthy.
3. Moderate your desires.
Remembering these 3 points can make life much happier!
స్వస్తి.
No comments:
Post a Comment