అజరామర సూక్తి – 332
अजरामर सूक्ति – 332
Eternal Quote – 332
https://cherukuramamohan.blogspot.com/2021/08/332-332-eternal-quote-332.html
जीर्यन्ति जीर्यतः केशाः दन्ता जीर्यन्ति जीर्यतः ।
चक्षुःश्रोत्रे च जीर्येते तृष्णैका तु न जीर्यते ॥ महा भारत - अनुशासनिका पर्व
జీర్యంతి జీర్యతః కేశాః దంతా జీర్యంతి జీర్యతః l
చక్షుఃశ్రోత్రేచ జీర్యంతే తృష్ణై కాతు న జీర్యతే ll మహా భారతము అనుశాసనిక పర్వము
మహాభారత ఇతిహాసం కౌరవ-పాండవ యుద్ధం ముగిసిన తరువాత, దాని
దుష్ఫలితాలతో బాధపడుతున్న యుధిష్ఠిరుడు శరశయ్యాగతుడైన తాత భీష్ముడివద్ద
తన పలు సందేహాలను మరియు సమస్యలను ఉంచి, ఆయన బోధనను ఆత్మ సాక్షిగా
ఆలకించుచున్నాడు. చర్చలో అనేక విషయములు చోటు చేసుకొన్నాయి. ఒక
సందర్భమున యుధిష్ఠిరుని ఉద్దేశించి భీష్ముడు 'తృష్ణ' యొక్క సహజ స్వభావం
గురించి చర్చిస్తాడు- తృష్ణ అంటే భౌతిక సుఖాలు, సంపద, ప్రతిష్ట, అధికారం-ఆధిపత్యం
మొదలైన వాటిని పొందవలెనను అతిశయించిన తపన.
అపస్మారక స్థితిలో కూడా ప్రజలు కోరికలను వదలరేమోనని ఒక సందేహము.
ఇది వ్యాధికన్నా మిన్న. కోరిక మెదడును తోలిచిందంటే అదే చింతయై కూర్చుంటుంది.
‘చితా దహతి నిర్జీవం చింతా దహతి జీవితం’అన్నది ఆర్య వాక్కు. అప్పుడది
ప్రాణాంతకంగా మారుతుంది, ఆ కోరికను వదులుకోవడం ద్వారా మాత్రమే నిజమైన
ఆనందము లభిస్తుంది. ఆ విషయమును మానుడు ఎంత త్వరగా గ్రహించితే
అంత మంచిది.
ఒక వ్యక్తి వృద్ధాప్యానికి చేరుకున్నప్పుడు, అంటే అతని జుట్టు వెల్లనవుతుంది మరియు రాలుతుంది. అతని దంతాలు కూడా రాలుతాయి, అతని కంటి చూపు, చెవుల వినికి తగ్గిపోతాయి, కానీ అతని కోరిక ఇంకా యవ్వనములోనే ఉంటుంది.
వాస్తవానికి, వృద్ధాప్యంలో, శరీరంలోని వివిధ భాగాలు తమ శక్తి యొక్క గరిష్ట స్థాయినుండి దిగాజారుతాయి. వారిని రుగ్మతలు చుట్టుముట్టి శరీరమును అధోకరణము చేయుచూ శరీరాకృతిని రానురానూ, క్షీణింప జేస్తాయి. జుట్టు, దంతాలు, కళ్ళు మరియు చెవులు వంటి అవయవాలు వృద్ధాప్యానికి అనుగుణంగా మారడం ప్రారంభిస్తాయి. అన్ని అవయవాలు సహజ విధ్వంసం వైపు వెళ్లే సంకేతాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి. కానీ మనిషి కోరికలు ఎప్పటిలాగే తీవ్రంగానే ఉందుటయే కాక అవి తీర్చుకొమ్మని బుద్ధిని ఎంతగానో ప్రేరేపించుతాయి. నిస్సహాయంగా ఉన్నప్పటికీ, వ్యక్తి, ఆయుర్దాయమును, సంపదను మరియు సుదీర్ఘకాలం ఆనందాన్ని ఆస్వాదించాలనే కోరికను మాత్రము మది బయటికి వెడలనీడు. శరీరము తానూ జర లోనికి ప్రవేశించుచున్నట్లు ముందే సంకేతములను అందజేస్తుంది. ఇక నేను ఇంకేమీ కోరుకోను, అన్న నిర్దుష్టమగు మానసిక నిర్ణయము తీసుకొని ఏక్షణములోనయినా ప్రపంచమునకు వీడ్కోలోసగుటకు సిద్ధంగా ఉండాలి. ఈ భావన సాధారణ స్థితిలో మానవునికి మనస్సులో తలెత్తని భావన. ఈ భావాన్ని వేదపండితులు, భారతదేశంలో ‘సన్యాసము’ అంటారు. అందుకే మహాకవి ధూర్జటి తన కాళహస్తీశ్వర శతకములో శ్రీకాళహస్తీశ్వరుని ఆర్ద్రతాభరితమైన మనస్సుతో ఈ విధముగా వేడుకొన్నాడు:
దంతంబుల్పడ నప్పుడే, తనువు నం దారూఢి యున్నప్పుడే
కాంతాసంఘము రోయ నప్పుడె జరాక్రాంతంబు గానప్పుడే
వింత ల్మేన చరించ నప్పుడె, కురుల్వెల్వెల్ల గానప్పుడే
చింతింప న్వలె నీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వరా!
శ్రీకాళహస్తీశ్వరా! పండ్లు ఊడిపోక ముందే, శరీరంలో ఇంకా పటుత్వం ఉండగానే, స్త్రీలు చూచి ఏవగించుకోక ముందే, ముసలితనం మీదపడక ముందే, శరీరంలో కొత్త, కొత్త వింతలు చోటుచేసుకోక ముందే, జుట్టు నెఱిసిపోక ముందే నీ పాదపద్మాలని ధ్యానించాలి.
నేడు, మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఏవైనా దుష్ప్రవర్తన మరియు ఆర్థిక అవినీతి ఎక్కువ పరిమాణంలో కనిపిస్తున్నది. కారణము మానవ మనస్సులో ఉన్న ఈ అచంచలమైన తృష్ణ లేదా తీరని ఆకలి ఫలిత తప్ప అన్యథా కాదు. ఆకలికి కూడా ఒక హద్దు వుంటుంది. మితము దాటినదేదీ హితము కాదు.
పై భావమును నా భాషలో దిగువన విస్తృతపరచినాను.
రాలు దంతములు రజత కేశములు
ముఖమున ముడుతలు మొగి జర స్ఫుటలు (క్రమముగా ముసలితనము ప్రబలమగుట)
చేతులు కాళ్ళను చేరగ వణుకులు
జవసత్వంబులు చరమాంకమునకు
చేరువయైనా చెరగదు కాంక్ష
దాని యౌవ్వనము దాటదు గీత
కోర్కెల వలలో కోర్కెల అలలో
కడవరకూ కడతేరే వరకూ
తపనలతోడ పతనమగు వరకూ
మానవుడాపడు మదిలో కోర్కెలు
దైవ రూపమును తలవడు మదిలో
తామస రాజస తప్త హృదయుడై
యౌవనం జరయా గ్రస్తం ఆరోగ్యం వ్యాధిభిర్హతం l
జీవితం మృత్యురభ్యేతి తృష్ణైకా నిరుపద్రవా ll
యౌవనము జరాగ్రస్తము, ఆరోగ్యము వ్యాధిగ్రస్తము, ప్రాణము మృత్యుర్గ్రస్తము, కానీ
తృష్ణ మాత్రము ఏ ఉపద్రవమూ లేనిది. తృష్ణ నుండి నిన్ను నీవు కాపాడుకో!
जीर्यन्ति जीर्यतः केशाः दन्ता जीर्यन्ति जीर्यतः ।
चक्षुःश्रोत्रे च जीर्येते तृष्णैका तु न जीर्यते ॥ महा भारत - अनुशासनिका पर्व
महाकाव्य महाभारत के कौरव-पांडव युद्ध की समाप्ति के बाद उसके दुष्परिणामों से व्यथित
युधिष्ठिर शरशय्या पर पड़े पितामह भीष्म के समक्ष अपनी विविध शंकाएं-समस्याएं रखते हैं और
उनसे उपदेशात्मक वचन सुनते हैं । तत्संबंधित अनुशासन पर्व में नीति संबंधी अनेक बातों का
जिक्र मिलता है । एक स्थल पर भीष्म युधिष्ठिर को संबोधित करते हुए मनुष्य की सहज वृत्ति
‘तृष्णा’ की चर्चा करते हैं – तृष्णा अर्थात् ऐहिक सुख-सुविधा, धन-संपदा, मान-प्रतिष्ठा, अधिकार-
वर्चस्व आदि पाने-बटोरने की भूख ।
जो तृष्णा सुमतिहीन व्यक्तियों द्वारा न छोड़ी जाती है, जो मनुष्य के वृद्धावस्था में पहुंच जाने पर भी
स्वयं बुढ़ी नहीं होती, जो रोग की भांति प्राणघातक बनी रहती है, उस तृष्णा को त्याग देने पर ही
वास्तविक सुखानुभूति मिलती है
मनुष्य के जराप्राप्त होने यानी बुढ़ा होजाने पर उसके बाल भी वृद्ध हो जाते हैं, दांत भी उसके बूढ़े हो
जाते हैं, आंख-कान भी वृद्ध हो जाते हैं, किंतु उसकी तृष्णा फिर भी यथावत् युवा बनी रहती है वास्तव
में उम्र बढ़ने पर शरीर के विभिन्न अंग अपनी शक्ति-सामर्थ्य के चरम तक पहुंचते हैं और फिर उनमें
विकार एवं ह्रास आरंभ हो जाते हैं । हमारी काया धीरे-धीरे अशक्त होने लगती है, बाल, दांत, आंख
तथा कान जैसे अंग वृद्धावस्था के अनुरूप ढलने लगते हैं । सभी अंग नैसर्गिक नाश की ओर बढ़ने के
संकेत देने लगते हैं । लेकिन मनुष्य की इच्छाएं तब भी सदैव की भांति तीव्र बनी रहती हैं । असहाय हो
चुकने पर भी उसकी जिजीविषा, संपदा अर्जित करने की इच्छा तथा और अधिक समय तक सुख
भोगने की लालसा तब भी बनी रहती हैं । अब मुझे अधिक कुछ नहीं चाहना है, बल्कि संसार से किसी
समय पूर्वतः अघोषित क्षण पर अलविदा करने के लिए तैयार हो जाना चाहिये, यह भाव आम तौर पर
किसी के मन में नहीं जगता है । इस भावना को वैदिक, भारत में संन्यास कहा गया है ।
आज जो भी कदाचरण और आर्थिक भ्रष्टाचार अपने देश ही में नहीं बल्कि सारे विश्व में न्यूनाधिक
मात्रा में देखने को मिल रहा है, वह इसी अदम्य तृष्णा या मानव मन में व्याप्त अतृप्त भूख का परिणाम
है । पेट की भूख तो एक हद के बाद शांत हो जाती है, किंतु मन की भौतिक जगत् संबंधी पिपासा
उतनी ही बढ़ती जाती है जितनी उसकी तृप्ति का प्रयास किया जाता है ।
cakṣuḥśrotre ca jīryete tṛṣṇaikā tu na jīryate ॥ - Mahābhārata, anuśāsana parva
alas! (Thirst of) desire is not placated!
Hair becomes gray, teeth fall out and hearing and vision are not in their prime
either. The skin gets wrinkled, the back gets hunched and the limbs get weak
too. The effects of age can be seen on all faculties of the body! At least then,
one would think that he has lived his life and realized the impermanence of all
material things, including his own body. But no!! His desires are stronger and
his persistence...well, more persistent than ever! The need for self-gratification
and acquisition of material possessions come with much more force as if there is
a time crunch to fit in all his needs into the short amount of time left! On the
other hand, the nature of desires is such that the more they are indulged, the
more they grow! There is no end to wants. Quenching an unquenchable thirst
drains out all the energy and the true purpose of life is lost in the process...
Come old age, can one cut out all his desires? Not a chance! It is all in the
training of the mind. If one is used to rolling in likes and dislikes from childhood,
youth or adulthood, he cannot magically change in old age and decide to
renounce everything to become a saint! One has to keep a level head
constantly, instructing the mind the higher purpose of life and remind its
ephemeral nature.
Put a leash on desires from the get-go. Isn't it easier to train a horse with reigns
than a wild one running recklessly?!
స్వస్తి.
No comments:
Post a Comment