Monday, 30 August 2021

అజరామర సూక్తి – 347 अजरामर सूक्ति – 347 Eternal Quote – 347

 

అజరామర సూక్తి  347

अजरामर सूक्ति  347

Eternal Quote  347

https://cherukuramamohan.blogspot.com/2021/08/34-7-3-47-eternal-quote-34-7-l-ll.html

अश्वं नैव गजं नैव व्याघ्रं नैव च नैव च ।

अजापुत्रं बलिं दद्यात् दैवो दुर्बलघातकः ॥- समयोचितपद्यमालिका

అశ్వం నైవ గజం నైవ వ్యాఘ్రం నైవచ నైవచ l

అజా పుత్రం బలిం దద్యాత్ దైవో దుర్బల ఘాతక:ll సమయోచిత పద్యమాలిక

గుఱ్ఱమును, ఏనుగును, పులిని బాలి ఇవ్వరు కానీ  బలం లేని మేకనే బలి యిస్తారు. 

దేవుడు దుర్బలులనే శిక్షించ దలచుతాదేమో ! చరిత్రను పరిశీలించితే , యిది 

నిజమేనెమో అనిపిస్తుంది !

వాజీగజముల కోరడు

పులిని బలిగ ఇమ్మనడు

అజము యాజమంటాడు       (మేకను బలి అడుగుతాడు)

దుర్బలులను- కోరుతాడు

ఆ దేవుడె ఇటులుంటే

ఇల బలసంపన్నులు మరి

ఇష్టమైన రీతి జెలగి

ఇబ్బందులపాలు జేసి

బలహీనుల కాలరాచి

బాహువులను చరుచుతారు

ఇంతేనా లోకరీతి

ఇదియేనా జనుల నిరతి

ఇదియా నిజమైన నీతి

నేతిబీర నేతి భాతి

మార్పునెటుల కననగునో

మనుషులేట్లు మననగునో

గుర్రం కాదు, ఏనుగు కాదు మరియు ఖచ్చితంగా పులి కాదు! దేవుడు కూడా ఒక 

మేకను బలిగా కోరుతాడు. అయ్యో, విధి బలహీనులతోనే కదా ఆడుకొంటుంది.

మన దైనందిన జీవితంలో, బలహీనులు వేధింపులకు గురికావటము, పక్కకు 

నెట్టబడటము, వెనుకబడిపోవటము మనము చూస్తాము. బలహీనులను వదిలిపెట్టేది 

వ్యక్తులు మాత్రమే కాదు. విధికి కూడా బలహీనులు లోకువే!

పై శ్లోకము ఈ మాటే చెబుతుంది. బలిపీఠం వద్ద పులి, ఏనుగు లేదా గుర్రాన్ని 

తీసుకురావడానికి కూడా ఎవరూ సాహసించరు. బలిపీఠము వద్ద ఒక మేక నిస్సహాయ 

స్థితి లో బలి ఇవ్వ బడుతుంది. కారణమేమిటంటే, ఇది పెద్దగా ప్రతిఘటించదు. పులిని 

బలిపీఠం వద్దకు తీసుకురావడానికి కూడా ఎవరూ ప్రయత్నించరు, ఎందుకంటే వారే 

నిజంగా బలిగా మారతారని వారికి బాగా తెలుసు!

ఈ శ్లోకము బలహీనులకు ఒకజ కనువిప్పు. మనము మన  జీవితముల బాధ్యతను 

స్వీకరించి, పరిస్థితులను ధైర్యముగా ఎదుర్కొనవలెనని గుర్తు చేస్తుంది. కఠినమైన 

పరిస్థితులలో మనుగడకు ధైర్యము ఒక్కటే సాధనము. మనమే మనకు సహాయం 

చేసుకోవాలి ఎవరో వస్తారని ఎదో చేస్తారని ఎదురు చూడ కూడదు. విధి బలవంతుల 

పక్షపాతి. మనము దేనిని చేయదలచుచున్నామో, దేనిని నమ్ముచున్నామో అది మన 

ప్రధాన బాధ్యత. నిర్భయంగా జీవించదలచినచో,  జీవితము మీద వత్తిడి  తక్కువగా 

ఉంటుంది. నిజానికి, మనము తలపెట్టిన పనులు మరియు ఉద్దేశాలు తప్పు అయినప్పుడు 

భయపడవలెను కానీ, అన్యథా కాదు.

మంచి ఆలోచనలకు నాంది పలుకుదాం, వానిని కార్యరూపము దాల్పింపజేసి 

 ధైర్యముతో సత్ఫలితము సాధిద్దాం. మన హృదయములను ఎల్లవేళలా సంఘర్షణలు 

గురికానీకుండా నిర్మలముగా ఉంచితే తలచిన కార్యము సఫలము చేయుటకు ఎన్నో 

ఆలోచనలు ఉత్పన్నమౌతాయి.

अश्वं नैव गजं नैव व्याघ्रं नैव च नैव च ।

अजापुत्रं बलिं दद्यात् दैवो दुर्बलघातकः ॥- समयोचितपद्यमालिका

घोड़ा नहीं, हाथी नहीं और निश्चित रूप से बाघ भी नहीं! एक बकरी को बलि के रूप में माँगता है

भगवान् l  अफसोस, भागगवां भी कमजोरों पर हाथ उठाता है l

हमारे दैनिक जीवन में, हम देखते हैं कि कमजोरों को तंग किया जा रहा है, किनारे किया जा रहा 

हैपीछे छोड़ दिया जा रहा है। यह केवल वे लोग नहीं हैं जो कमजोरों को पीछे छोड़ते हैं। दुर्बलों 

के लिए नियति की भी कम प्राथमिकता होती हैl , इस श्लोक का मुख्य सारांश यही है। बलि की 

वेदी पर कोई भी उस बात के लिए बाघ, हाथी या घोड़ा भी लाने की हिम्मत नहीं करेगा। बलिपीठ 

(बलि की वेदी) पर चढ़ने वाली बकरी ही होती है क्यों कि वह दुर्बल और निस्सहाय है l  यह ज्यादा 

विरोध नहीं करसकता है। कोई भी बाघ को वेदी पर लाने की कोशिश नहीं करता, क्योंकि वे 

अच्छी तरह जानते हैं कि वे वही होंगे जो वास्तव में बलि बनेंगे!

यह एक अनुस्मारक है कि हमें अपने जीवन को संभालना है और जीवन की परिस्थितियों का 

बहादुरी से सामना करना है। कठिन परिस्थितियों में जीवित रहने के लिए साहस ही एकमात्र 

साधन है। हमें खुद की मदद करने की जरूरत है और यह उम्मीद नहीं करनी चाहिए कि कोई 

अलौकिक आत्मा हमारे बचाव में आएगी। नियति भी पक्ष लेती है। यह केवल उन लोगों को चुनता 

है जो अपने लिए खड़े होने की हिम्मत करते हैं और जो उनके लिए मायने रखता है। हम जो बनना 

चाहते हैं और जिसमें हम विश्वास करते हैं, उसके लिए प्रयास करना हमारी प्रमुख जिम्मेदारी है। 

निर्भय होकर जीने पर जीवन कम तनावपूर्ण हो जाता है। दरअसल डर तब आना चाहिए जब कर्म 

और इरादे गलत होंअन्यथा नहीं।

आइए सोचने की हिम्मत करें, आइए कार्य करने का साहस करें - अपने दिल और दिमाग के साथ!

aśva naiva gaja naiva vyāghra naiva ca naiva ca

ajāputra bali dadyāt daivo durbalaghātaka - samayocitapadyamālikā

Not a horse, not an elephant and certainly not a tiger! Give a kid (a young goat) 

as oblation; (alas), destiny slays the weak.

In our day-to-day lives, we see the weak being bullied, being sidelined, being left 

behind. It is not just people who leave behind the weak. Even destiny has a low 

priority for the weak, says this verse. At the sacrificial altar no one would dare 

bring a tiger, an elephant or even a horse for that matter. A little helpless young 

one of a goat (kid) is the one slaughtered at the balipīṭha (sacrificial altar). The 

reason being: it doesn't protest much. No one even tries bringing a tiger to the 

altar, as they know pretty well that they will be the ones actually becoming 

oblation!

 

This is a reminder that we have to take charge of our lives and face life's 

circumstances bravely. Courage is the only tool for survival through tough 

situations. We need to help ourselves and not expect some supernatural spirit to 

come to our rescue. Even destiny takes sides. It only chooses those who dare to 

stand up for themselves and for what matters to them. It is our prime 

responsibility to strive to be who we want to be and what we believe in. Life 

becomes less stressful when lived fearlessly. In fact, fear should come when the 

deeds and intentions are wrong, not otherwise.

Let's dare to think, let's dare to act - with our hearts and minds in their right 

places!

స్వస్తి.

No comments:

Post a Comment