అజరామర సూక్తి – 327
अजरामर सूक्ति – 327
Eternal Quote – 327
https://cherukuramamohan.blogspot.com/2021/08/327-327-eternal-quote-327.html
अजरामरवत् प्राज्ञः विद्यामर्थं च साधयेत् ।
गृहीत इव केशेषु मृत्युना धर्ममाचरेत् ॥ - समयोचितपद्यमालिका
అజరామరవత్ ప్రాజ్ఞః విద్యామర్థంచ సాధయేత్ l
గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్ ll
పై శ్లోక సారము కలిగిన, నేను వ్రాసిన ఈ పద్యమును ఒకసారి గమనించేది.
విద్య గడియించు క్షణమైన విడువకుండ
పైస పైసాను జమచేయి పట్టు విడక
గడువ, కాలము సిరులేమి కలియ రావు
మిత్తి నెత్తిన కలదంచు మిగుల తలచి
ధర్మ మార్గాన చరియించు దారి విడక
క్షణ క్షణమూ ఉపయోగించుకొని విద్యను, కణము కణమూ చొప్పున సేకరించి
ధనమును కూడబెట్ట వలెను. క్షణము వ్యర్థ పరచినచో ఇక విద్య ఎక్కడ సంపాదించుట
జరుగును? అటులనే కణమునైనను విడిచిపెట్టితిమేని మరి ధనమునెటుల
సంపాదించుట జరుగును?
మృత్యువు నెత్తిపైనే ఉన్నదను వాస్తవమును గ్రహించి, అనగా అది ఎప్పుడు
కబళించుతుందో ఎవరికి ఎరుక? అందుకే 'ధర్మ పథము విడువవద్దు' అని కూడా పై శ్లోకము తెలియజేయుచున్నది.
విద్యా సముపార్జనాసక్తులు ఒక్క క్షణమైనను వ్యర్థము చేయ కూడదు. ధన
సముపార్జనాసక్తులు ఒక్క కణమాత్రమైనను విడిచిపెట్ట కూడదు అని గ్రహింపనగును. ఆ
రెంటినీ ధర్మమార్గామును అనుసరించి నడచేవాడు భూమి పై, ఎన్నికష్టములు వచ్చినా
ధర్మ మార్గమున జ్ఞానము, సామ్రాజ్యము స్వర్గము మూడింటిని పైన శ్లోకములో చెప్పిన
రీతిగా పొందినాడు. అట్టి సత్పురుషులే మనకు ఆదర్శము.
అందుకే పెద్దలు
క్షణశః కణశశ్చైవ - విద్యామర్థంచ సాధయేత్ l
క్షణ త్యాగే కుతోవిద్యా - కణ త్యాగే కుతో ధనమ్.ll
దినమున నొక క్షణమైనను
గన విద్యాతురుడు హరణ కానివడెపుడూ
ధన దాహమున్నవాడును
కనగా కణకణము చేర్చు కదరా రామా!
విద్యను గ్రహించవలసి వచ్చినపుడు, అలసత్వమునకు తావు లేక వెనువెంటనే నేర్చుకోనవలెను. ఒక్క క్షణము కూడా వృథా కారాదు. అదేవిధముగా ధనాతురుడు కణము కణమూ చొప్పున సేకరించి ధనమును కూడబెట్ట వలెను. క్షణము వ్యర్థ పరచినచో విద్య సంపాదించు అవకాశము పోగొట్టుకోన్నట్లే! అదేవిధముగా ఒక ధనకణమును విడిచిపెట్టితిమేని మరి ధనమునెటుల కూడబెట్టనగును.
విద్యా సక్తులు ఒక్క క్షణమైనను వ్యర్థము చేయ కూడదు. అదేవిధముగా ధనాసక్తులు ధనమును ఒక కణమైనను విడిచిపెట్ట కూడదు. విద్యా ధనము తోడయితే అధికారమునకు కొదవే ఉండదు. అప్పుడు గౌరవమునకూ కొరత ఉండదు. వీనికి మించి సక్రమ మార్గములో విద్యాధనములు సంపాదించినవాడు ధర్మపథమును వీడడు.
अजरामरवत् प्राज्ञः विद्यामर्थं च साधयेत् ।
गृहीत इव केशेषु मृत्युना धर्ममाचरेत् ॥ - समयोचितपद्यमालिका
समझदार मनुष्य को 'स्वयं अजर और अमर रहनेवाला है' ऐसा मानकर विद्या और संपत्ति प्राप्त
करने के लिए सोचते रहना चाहिए । और मृत्यु ने ले जाने के लिए जैसे अभी ही केश पकड़े है-
ऐसा मानकर (प्रत्येक क्षण का उपयोग करते हुए) धर्म का-सत्कर्म का आचरण करते रहना चाहिए।
यह सर्वविदित है कि इस जीवन से गुजरने से पहले पुण्य कर्म करने चाहिए। लेकिन वृद्धावस्था के
लिए उन कर्मों को टालना विद्वान के लिए मूर्खता सामान है। बुद्धिमान लोग हर समय पुण्य कर्म
करते हैं जैसे कि मृत्यु उन्हें उनके बालों से पकड़ रही है, और उनके जीवन को छीनने के लिए
तैयार है l धर्म पथ पर आदमी ऐसा समझकर चलना है कि हर कार्य जो उन्होंने करता है, वही
उनका अन्तिम कार्य था। तभी कोई जीवन भर धर्म निभा सकता है!
जब सीखने और कमाने की बात आती है, तो उनका नजरिया पूरी तरह से विपरीत दिशा में बदल
जाता है। वे इन दोनों क्षेत्रों को उसी जीवंतता के साथ अपनाते हैं जैसे उन्होंने अपनी युवावस्था में
किया था, जैसे कि वे कालातीत और चिरस्थायी हों। सीखने का कोई अंत नहीं है। केवल एक
जीवनकाल सभी सीखने के लिए पर्याप्त नहीं है, इसलिए वे समय बर्बाद नहीं करते हैं। उनके
लिए, बेकार बैठना और उत्पादक न होने का कोई विकल्प नहीं रहना चाहिए। वे समाज में
योगदान करने और नियत समय में धन अर्जित करने का प्रयास करते हैं।
ऊर्ध्व लिखित श्लोक का भावार्थ यह है कि ‘सीखते रहो, बढ़ते रहो। सदाचारी कर्म करते रहो।‘
ajarāmaravat prājñaḥ vidyāmarthaṃ ca sādhayet ।
gṛhīta iva keśeṣu mṛtyunā dharmamācaret ॥ - samayocitapadyamālikā
Intelligent people pursue knowledge and wealth as if (they are) ageless and
eternal. But they should tread on dharma as if death were holding them by the
hair.
It is well known that one should perform virtuous deeds before leaving this life.
But procrastinating those deeds for old age is not an option for the learned.
Intelligent people perform meritorious deeds at all times as if death was grabbing
them by their hair, ready to snatch away their life, resulting in it being their last
deed. Only then, can one perform dharma throughout his life!
When it comes to learning and earning, their perspective shifts completely to the
opposite direction. They pursue these two fields with the same vibrancy as they
did in their youth, as if they are timeless and ageless. There is no end to
learning. One lifetime is just not sufficient for all the learning that can be done, so
they waste no time. To them, sitting idle and not being productive is not an
option. They earn wealth in due course and strive to contribute to society.
‘Keep learning, keep growing. Abide righteous deeds always’ should be one’s
eternal moto.
స్వస్తి.
No comments:
Post a Comment