Friday, 20 August 2021

అజరామర సూక్తి – 337 अजरामर सूक्ति – 337 Eternal Quote – 337

 

అజరామర సూక్తి  337

अजरामर सूक्ति  337

Eternal Quote – 337

 https://cherukuramamohan.blogspot.com/2021/08/337-337-eternal-quote-337.html

अधना धनमिच्छन्ति वाचं चैव चतुष्पदाः ।

मानवाः स्वर्गमिच्छन्ति मोक्षमिच्छन्ति देवताः ॥ - चाणक्य नीति

అధనాః ధనమిచ్ఛంతి వాచంచైవ చతుష్పదాః l

మానవాః స్వర్గమిచ్ఛంతి మోక్షమిచ్ఛంతి దేవతాః ll  చాణక్య నీతి

ధనహీనులు ధనమును కోరుచుందురు. నాలుగు కాళ్ల పశువులు వాక్కును 

(మాట్లాడవలెనని) కోరుచున్నవి. మానవులు స్వర్గమును (సుఖమును) కోరుచుందురు. 

దేవతలు (విద్వాంసులు) మోక్షమును కోరుచున్నారు.

జీవికి, ఐహికముగా సుఖమయమగు జీవితము కావలయునని ఉంటుంది.  అందుకు 

ఏదో కావలెనను తపన. ముఖ్యముగా పొరుగు వారికి ఉన్న, తన వద్ద లేనిది, 

సాధించవలెనని అనుకొంటాడు. ఏది కావాలన్నా ధనము కావలసిందే! అందువల్ల తాను 

జీవితములో అడుగు పెడుతూనే ధనార్జన పై మరులుగొంటాడు. అసలు ధనము యొక్క 

ప్రాధాన్యతనుగూర్చి వాల్మీకి రామాయణములోనే విశ్వామిత్రుడు రాములవారికి కొన్ని 

రాజ ధర్మాలు చెపుతూ, ఈ విధముగా అంటాడు:

ధన మార్జయ కాకుత్స్థ ‘ధనమూలమిదం జగత్' l

అంతరం నాభిజానామి, నిర్ధనస్య మృతస్యచ ll

కకుస్థుడు అనేరాజు పేరుతో రాముని వంశం ప్రసిద్ధిపొందింది. కనుక రాముని ‘కాకుత్స’ 

అని విశ్వామిత్రుడు సంబోధించినాడు. “ఓ రామా! ధనాన్ని బాగా సంపాదించు. 

ఎందుకనగా ఈ జగత్తు ధనంపై ఆధార పడి ఉంది. ధనం లేని వాడు చనిపోయిన 

వాడితో సమానం, వారిమధ్య వ్యత్యాసం నాకు ఏమీ కనబడుట లేదు. మరియు కులం

గోత్రం, బలం, అందం ఇవియేవి లేకపోయినా ధనం ఉంటే చాలు అందరూ 

గౌరవిస్తారు. కష్టాలు, ఆపదలు కూడ ధనం ఉంటే దరిచేరవు, ప్రాణం లేని మద్దెల,లేక 

మృదంగము కూడా’ధనం,ధనం,ధనం,అని శబ్దం చేస్తుంది.(ధన్ ,ధన్ శబ్దాన్నికవి ఇలా 

అన్నాడు.) కనుకనే ‘ ధనమూల మిదం జగత్’ అన్నారు.

మరి ఈ ధనార్జనకు మూలము ధర్మము. అందుకే పెద్దలు ‘ధర్మార్థకామమోక్షము’లని 

పెద్దలు ఒక వరుసక్రమమును ఏర్పాటుచేసినారు. ఎప్పుడూ పాండవులకు ముందు 

ధర్మరాజు ఉన్నట్లు మిగిలిన మూడు పురుశార్తములకు ముందు ధర్మమూ ఉంటుంది. 

మనిషి చివరకు సాధించవలసినది మోక్షము. అందుకే అది చివరన ఉంది. ధర్మమూ 

తరువాత ఉన్నది అర్థము అనగా ధనము. అంటే ధనార్జన ధర్మయుక్తముగా 

ఉండవలెనని అర్థము. ఆ విధముగా సంపాదించిన ధనముపై తృప్తి ఏర్పరచుకోన్నవానికి తాను ‘మోక్షగామి’ కావలయుననే కామితము కలిగియుంటాడు. విషయవాంఛా పరివృతుడై పరదారా పరిశ్వంగము కోరుకోడు. చెప్పినది 4 పదాల వాక్యమైనా అందలి భావమును సాధించుటకు జీవన కాలము పడుతుంది. అందుకే వేదమూలమగు జ్ఞానమును, లక్ష్మీదేవి వంటి గృహిణి, చేయగలిగినంత వ్యవసాయము ఉంటే లోకమునకు గానీ పరలోక సాధనకు గానీ పనికివచ్చుటకు తగిన ధనమును ఆర్జించుతాము.  అందుకే పెద్దలు ఈ మాట చెప్పినారు.

వేదమూల మిదం జ్ఞానం, భార్యామూల మిదం గృహంl

కృషి మూలమిదం ధాన్యం, ‘ధనమూలమిదం జగత్ ll

జ్ఞానానికి మూలం వేదము, ( విద్=జ్ఞానము  అని అర్థము.) ఇంటికి దీపము ఇల్లాలే. 

అందుకే భార్యను ‘ గృహ లక్ష్మి’ అన్నారు. ధాన్యం అధికదిగుబడి రావాలంటే వ్యవసాయం 

బాగా చేయాలి,

(కృషి అంటే వ్యవసాయమని అర్థము, కానీ నేటి పరిస్థితికి అన్వయించుకొంటే 

శ్రమపడుట అని తలువ వచ్చును.) ఆవిధముగా ఈ జగత్తులో అన్నింటికి మూలమగు  

ధనమును సంపాదించవలెను. అంతే కానీ అడ్డదారులు తొక్కి సంపాదించమని కాదు.

ఈ శ్లోకమును కూడా గమనించండి:

అధమా: ధనమిచ్ఛంతి ధనం నామం చ మాధ్యమా: l

ఉత్తమా: మానమిచ్ఛంతి మానం హి మహతాం ధనం ll

అధములు ధనమునే కోరుకొందురు. మధ్యములు ధనం-గౌరవం రెంటిని 

కోరుకొందురు. ఉత్తములు గౌరవమునే కోరుకొందురు. ఉత్తములకు 

గౌరవమే(కీర్తియే)ధనం. వారికి కీర్తి కంటే ధనం గొప్పది కాదు. ఆర్జనకు హద్దు 

అవసరము. అప్పుడు సద్బుద్ధి కలిగి సత్కార్యాచరణ చేసి కీర్తివంతులౌతారు.         

తనకు లేనిది కోరుకొనుట ప్రాణికోటికి సహజము. అందుకే జంతువులు మాటలాడుట

కోరుకొంటాయట. మాటలాడే శక్తి కలిగిన మానవుడంటే బహుశ జంతువులకు అసూయనేమో!

మానవుడు యౌవ్వనము కలిగినంతకాలమూ విషయలోలుడై ఉంటాడు. 

సాధారణముగా అది మానవుని సహజ గుణము. ఎప్పుడయితే యౌవ్వనముడిగి ఇటు వార్ధక్యము అటు సంసారబాధ్యతలు మీదపడుతాయో అప్పుడు ఏమాత్రము అవకాశము అంటే ఏకాంతము దొరికినా తన యౌవ్వనానుభావములను నెమరువేసుకొంటూ ఉంటాడు. అందుకే నిత్యయౌవ్వనులు ఉండే స్వర్గముపై మక్కువ ఎక్కువ చూపుతాడు.

ఇక దేవతలో మోహవాంఛా  ప్రవృత్తికి రోశి పరమాత్మను చేరదలచి మోక్షమును 

కోరుకొంటారు. ఇంద్రుడు అన్న మాట కూడా ఒక పదవి లేక పట్టము. ఆయన పాలనా 

వ్యవధి ఒక మన్వంతరము. ఆ తరువాత ఇంద్రుడు మారుతాడు. ఇప్పుడు 14వ ఇంద్రుడు 

స్వర్గాధిపతి. ఇక్కడ దేవతలు అన్న మాటకు విబుధులు, విద్వాంసులు, పండిత శ్రేష్ఠులు 

అన్న అన్వయము కూడా తీసుకొన వచ్చును. ఈ కోవకు చెందినవారు తక్కువ మంది 

అహంకారులుగానూ ఎక్కువ మంది జ్ఞానులుగానూ మారుతారు. వారు భూమిపై నడయాడు దేవతలతో సంకానమే కదా! మరి అట్టి జ్ఞానులయినవారు కోరుకొనేది మోక్షమే కదా!

ఎంతటి చక్కనయిన సూక్తియో చూడండి.

 

अधना धनमिच्छन्ति वाचं चैव चतुष्पदाः

मानवाः स्वर्गमिच्छन्ति मोक्षमिच्छन्ति देवताः ॥ - चाणक्य नीति

दरिद्र धन की कामना करते हैं, चौपाइयों की इच्छा वाणी, मनुष्य स्वर्ग की कामना करते हैं, (और

देवता मोक्ष की कामना करते हैं

इच्छा बहुत मजबूत फंदा हैहर कोई इसकी चपेट में जाता है और इस जाल से बचना बहुत 

कठिन परीक्षा है

1.        गरीब पैसे की ख्वाहिश रखते हैंधन का एक आश्चर्यजनक गुण है - किसी के पास कितना भी हो

      वह उससे तृप्त नहीं होता हैजितना अधिक वह इसमें लिप्त होता है, उसकी प्यास उतनी ही 

      बढती जाती है! इस निम्न लिखित सूक्थी को एक बार पढ़िए:

 अधमा: धनमिच्छन्ति धनं नामं मध्यमा: l

 उत्तमा: मानमिच्छन्ति मानं हि महतां धनम् ||

अपने विचारों में जो निम्न रहता है वह केवल धन दौलत कमाना चाहता है l जिन के विचार मध्यम 

गति के होते हैं वह तो धन और नाम कमाना चाहता है लेकिन उत्तम जो होते हैं वे सदा मान सम्मान 

यानी कीर्ती ही चाहते हैं l इस में भी धर्मं मार्ग पे चलके ही कीर्ति कमाना चाहते हैं l वही कीर्ती वैसे 

लोगों को स्वर्ग पहूँचा सक्ती है l

 2. चार पैर वाले जानवर भी इच्छा के चंगुल से नहीं बचे हैंवे उस संकाय के लिए तरसते हैं जो उन्हें 

नहीं दिया गया था - भाषण की शक्तिवे उन मनुष्यों से ईर्ष्या करते हैं जिनके पास वह क्षमता है और 

वे लगातार अपने लिए इस क्षमता की आकांक्षा रखते हैं

3. मनुष्य को स्वर्ग का स्वप्न होता है कि वह सुखधाम होवे इसे प्राप्त करने की आकांक्षा रखते हैं। 

उनके सभी कार्य और विचार उन्हें उस स्थान तक उठाने के लिए एक सीढ़ी की ओर तैयार किए 

जाते हैंस्वर्ग जाने केलिए आदमी धर्मबद्ध होकर जीवित गुजारना चाहिए l उसकेलिए अपने मन में 

निरंतर उसी कामना रखते हुए धर्मं पथ पर जो पैसा कमाया उसका विनियोग करता है l

4. देवताओं को 'इच्छा' से भी नहीं बख्शा जाता हैस्वर्ग के देवता भी अपने गुणों से बाहर हो जाएंगे 

और जीवन के चक्र में वापस जाएंगेतो उनकी अभीप्सा है मुक्ति, मोक्ष, निर्वाण इन्द्र काभी एक 

पद है l वह उनका नाम नहीं l हर एक मन्वंतर को इंद्रा बदलता है l वैसाब चौदहवाँ इंद्रा स्वर्ग्पालन 

कर रहा है l उसलिए देवता लोग भी अपने सारे सुखों से तंग होकर मोक्ष चाहते हैं l

इसलिए कोई भी इच्छा से रहित नहीं हैकोई कोई इच्छा किसी किसी रूप में उनके पास होता 

हैयह स्वयं पर निर्भर करता है कि वह किस प्रकार की इच्छा रखना चाहता हैयह अधिक धन 

प्राप्त करना या मोक्ष प्राप्त करना हो सकता है लेकिन किसी भी हालत में कमाई पर काबू रखना ही 

चाहिएयदि इच्छा रखने के अलावा कोई विकल्प नहीं है, तो एक ऐसा क्यों हो जिसका लक्ष्य 

उच्चतर अच्छाई हो l 

adhanā dhanamicchanti vāca caiva catupadāḥ

mānavāḥ svargamicchanti mokamicchanti devatāḥ ॥- cāṇakya nīti

The penniless desire money, the four-footed desire speech, humans desire heaven, (and) 

the Gods desire absolution.

Desire is a very strong noose. Everybody comes under its grip and escaping the snare is a 

very tough ordeal.

1. The poor aspire for money. Money has an astonishing trait - no matter how much one 

has, he is not satiated with it. The more he indulges in it, the more his thirst increases!

2. Even the 4 legged animals are not spared from the clutches of desire. They long for the 

faculty that was not bestowed on them - the power of speech. They envy humans who 

possess that capability and constantly aspire this ability for themselves.

3. Humans have the vision of heaven to be a place of bliss. They aspire for attaining that. 

All their actions and thoughts are geared towards a ladder to raise them to that spot.

4. Gods are not spared from 'desire' either. The Gods in heaven too, shall run out of their 

virtues and come back to the circle of life. So their aspiration is liberation, absolution, 

nirvāṇa.

Hence, no one is devoid of desires. Everyone has them in one form or the other. It is up 

to oneself to choose what kind of desire he wants to possess. It could be to acquire more 

wealth or to attain moka (absolution).

If there is no choice but to have a desire, then why not have one which aims at a higher 

good!

స్వస్తి.

 




























































 

No comments:

Post a Comment