Wednesday, 25 August 2021

అజరామర సూక్తి – 342 अजरामर सूक्ति – 342 Eternal Quote – 342

 అజరామర సూక్తి  342

अजरामर सूक्ति  342

Eternal Quote – 342

https://cherukuramamohan.blogspot.com/2021/08/342-342-eternal-quote-342.html

आशायाः ये दासाः ते दासास्सर्वलोकस्य ।

आशा येषां दासी तेषां दासायते लोकः ॥ - समयोचितपद्यमालिका

ఆశాయాః యేదాసాః తే దాసాః సర్వలోకస్య l

ఆశా ఏషాం దాసీ తేషాం దాసాయతే లోకః ll

ఆశ కల్గువాడు అందరి బానిస

ఆశ బానిసైన అతడె రాజు

ఆశ నిగ్రహించు ఆశయముంచుకో

రామమోహనుక్తి రమ్య సూక్తి

ఆశకు స్వార్థము కూడిన

ఆశలకంతెక్కడుండు అవిరళ రీతిన్

ఆశాస్వార్థము లణచగ

ఆశయమొకటున్నచాలు అందును నభమే!

ఆశకు పూర్తి వ్యతిరేకము సంతృప్తి. తృప్తి కలిగితే శాంతి లభిస్తుంది. అందుకే ‘దాంతునికైన వేదాంతునికైన

శాంతము లేక సౌఖ్యము లేదు సారస దళ నయన !  అన్నారు త్యాగరాజస్వామి వారు.

ఒకప్పుడు ప్రతి రైలు బోగీ లోనూ ‘Less luggage More Comfort Make Travel A 

Pleasure’ అన్న సందేశము కనిపించేది. ఇది నాకు మనసుకు హత్తుకొన్న మాట.  మన 

పెరిగే వయసుతో బాటూ ఆశ అనులోమ నిష్పత్తిలో ఉంటే శేష జీవన యానము 

సుఖమయముగా సాగుతుంది. జీవితమును నడిపించేది వయసు. కానీ వయసు పెరిగే 

కొద్దీ జీవితము తరుగుతూ వస్తుంది. జీవితమును ఒక పరావాలయము (Perabola) 

నకు పొల్చవచ్చును. అనగా ఒక కొండతో పోల్చవచ్చును. శిఖరము చేరిన పిమ్మట దిగక 

తప్పదు. ఎక్కుసమయములో యౌవ్వనములో ఉంటాము కావున శక్తిని ఉపయోగించి 

శిఖరము చేరుకొంటాము. దిగుట ప్రారంభమయ్యే కాలానికి మనలోని జవసత్వములు 

తగ్గిపోతూ వస్తాయి. దిగుడు కాబట్టి తూలిపడే అవకాశము ఎక్కువ. దానికి తోడూ 

ఆశలతో నిండి బరువు కలిగిన మూటను నేత్తికెత్తుకొన్నామంటే పడటము తప్పదు. మరి 

పడిన తరువాత అసలు లేచుటయే జరుగక పోవచ్చు. జరిగినా కాలోచేయో విరిగి 

యుండవచ్చు. ముఖమంతా చెక్కుకొని పోయి లోకానికి తనముఖము చూపించు 

యోగ్యత కోల్పోవచ్చును. దీనికి మూలకారణము ఆశ. ఆశ ఆకాశముతో సమానము. 

అందుకొనుటకు మనము ఎంత ఎత్తుకు ఎగిరితే అది అంత పైకి పోతుంది. 

అందుకొనుట అసాధ్యము. ఆ వాస్తవమును ఆదిలోనే గ్రహించితే ఆనందమే ఆనందము.

ఆశను అంతముజేసి ఆనందమును పొందండి.

आशायाः ये दासाः ते दासास्सर्वलोकस्य ।

आशा येषां दासी तेषां दासायते लोकः ॥ - समयोचितपद्यमालिका

जो वासना के दास हैं, वे सारे संसार के दास हैं; लेकिन जिनके लिए इच्छा गुलाम है, उनके लिए पूरी 

दुनिया गुलाम है

'इच्छा' में एक अजीब शक्ति होती हैएक बार जब यह किसी व्यक्ति पर अपनी पकड़ बनालेता है, तो 

वह ऐसा व्यवहार करेगा जैसे कि उस पर उसका कब्जा है! जीवन में उसका एकमात्र उद्देश्य उस 

इच्छा को पूरा करना बन जाता हैआने वाले समय में वह जीवन में अपने वास्तविक लक्ष्यों, मूल्यों

नैतिकता और आत्मसम्मान को हवा में उड़ा देगाबिना आत्मसम्मान या नैतिकता वाला व्यक्ति 

अपनी इच्छाओं को प्राप्त करने के लिए किसी भी स्तर तक गिर जाएगावह किसी का या किसी भी 

चीज का गुलाम बनने को तैयार होगा, ताकि उसकी इच्छाएँ पूरी हों! इसलिए उन्हें पूरी दुनिया का 

गुलाम माना जासकता है

जिस व्यक्ति के पास अपनी 'इच्छाओं' पर काबू पाने की इच्छाशक्ति है, उसके लिए जीवन आनंदमय 

हैउसके मन में उच्च और महान लक्ष्य होंगे और उन्हें प्राप्त करने का प्रयास करेंगेस्वाभाविक रूप 

से, वह अपने आसपास के लोगों का सम्मान अर्जित करता हैवह उन ऊंचाइयों तक बढ़ सकता है 

जहां पूरी दुनिया उसके साथ काम करने के लिए तैयार रहता है l उसकी क्रूर इच्छा की शक्ति है

लेकिन, एक बार जब वह सीमा पार हो जाती है, तो व्यक्ति की वृद्धि और विशालता को कोई रोक नहीं 

सकता है

āśāyāḥ ye dāsāḥ te dāsāssarvalokasya

āśā yeṣāṃ dāsī teṣāṃ dāsāyate loka ॥ - samayocitapadyamālikā

 

Those who are enslaved to desire, are enslaved to the whole world; (but) for those to 

whom desire is enslaved, to them the entire world is enslaved.

'Desire' has a strange power. Once it gets its hold on a person, he will act as if he's 

possessed by it! His sole purpose in life becomes fulfilling that desire. In due course, he 

will throw his true goals in life, values, morals and self-esteem to the wind. A person 

with no self-esteem or morals will stoop to any level just to achieve his desires. He 

would be willing to be a slave to anyone or anything just so his desires are met!  Hence, 

he is considered a slave to the whole world.

To a person who has the willpower to overcome his 'desires', life is merry. He will have 

higher and nobler goals in mind and will strive to achieve them. Naturally, he earns the 

respect of those around him. He can grow to heights where the whole world is ready to 

work with him, look up to him, and is willing to serve him!

Brutal is the power of desire! But, once that threshold is overcome, then there is no 

stopping the growth and magnanimity of the person.

స్వస్తి.

 

No comments:

Post a Comment