అజరామర సూక్తి – 346
अजरामर सूक्ति – 365
Eternal Quote – 346
https://cherukuramamohan.blogspot.com/2021/08/346-365-eternal-quote-346.html
यश्च
दिष्टपरो लोके यश्चापि हठवादिकः ।
उभावपि
शठावेतौ कर्मबुद्धिः प्रशंस्यते ॥ - महाभारत, अरण्यपर्व
యశ్చ దిష్టపరో లోకే యశ్చాపి హఠవాదికః l
ఉభావపి శఠావేతౌ కర్మ బుద్ధిః ప్రశంస్యతే ll - మహాభారతము – అరణ్యపర్వము
ముందు 'దిష్టపర' అన్న మాటకు అర్థమును తెలుసుకొందాము. దిష్టపరుడు అంటే
మందు మాకు మంత్రము మొదలగు వాని ఉపయోగము ద్వారా ప్రయోజనము
సాధించగలను అన్న మనస్తత్వము కలిగిన వాడు. ఇతనికి కౌలికుడు అన్నది
నామాంతరము. హఠవాదికుడు అంటే పునర్జన్మము పై నమ్మకము లేక అందుచే తనకు
నచ్చినపనిని, మంచి చెడుగులతో సంబంధము లేకుండా, చేసేవానిగా
సందర్భోచితముగా చెప్పుకొనవచ్చును. 'ఉభావ' అంటే అధమాధముడు అని అర్థము.
కర్మ బుద్ధి అంటే సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మానుసారముగా జీవితము జరుగుచున్నదని తలచువాడు, ఋజువర్తకుడు.
ఇప్పుడు శ్లోకార్థము ఏమని తెలుపుచున్నదంటే 'దిష్టపర' 'హఠవాది' అన్న ఈ ఇరువురూ
మూర్ఖులే! తనకరమ ఫలమును తాననుభావింపక తప్పదని తలచి నిరంతర
భగవన్నామ సుధారస సేవనాసక్తుడు సర్వవిధములా
శ్రేష్ఠుడు.
ఒకరి గురించి సక్రమముగా
తెలుసుకోకుండా, గుడ్డిగా మరియు మొండిగా ఉండటం వలన అతను ప్రాణాంతకుడగుచూ తన
ప్రాణానికి తానే ముప్పు తెచ్చుకొంటాడు. హటవాది అసలు పునర్జన్మయే లేదని నమ్ముచూ,
మంచి చెడుగులను గూర్చి తలవకుండా తనకు
తోచిన రీతి నడచుకొనేవాడు మొండివాడు - ఇద్దరూ అధములే! తన పనులను తన విధులుగా
భావించేవాడు ప్రశంసనీయుడు.
ఫెటలిస్ట్: ప్రతిదీ
విధి ద్వారా ముందే నిర్ణయించబడిందని మరియు దేనినీ మార్చలేమని నమ్మే వ్యక్తి! అనుకోకుండా
రాయి తగిలి కింద పడినా, పక్కన
ఎవరూ అతనిని తమకు తాముగా వైద్యుని వద్దకు పిలుచుకు పోయే వారు లేకుంటే, ఆ గాయమును
విధికి వదలి తనపని తాను చూసుకొంటూ వుంటారు. ఇటువంటి వారు కూడా ఉంటారా! అని
అనుకోకండి , ఉంటారు. తన చర్యలకు బాధ్యత వహించకుండా, అతను
విధి పేరిట తన దారికి వచ్చే దేనికైనా లొంగిపోతాడు.
మొండివాడు: ఒక వ్యక్తి
తన సొంత వైఖరి మరియు దృక్పథం గురించి మొండిగా ఉంటాడు, ఇతరుల అభిప్రాయాలకు ఎప్పుడూ లొంగడు. తాను పట్టిన
కుందేటికి మూడే కాళ్ళు అంటాడు కానీ అసలు 4వ కాలు ఉన్నదా లేదా అన్న విషయమును గమనింప
తలచడు. వాస్తవానికి, అతను తనను తాను చాలా నమ్ముతాడు, అతను మరింత ఎదగడానికి తనకు అవకాశం ఇచ్చుకోడు.
వ్యాసులవారు ఈ
ఇరువురినీ అధములని వర్గీకరించినారు. విధిని నిందించడం మరియు బాధ్యతల నుండి
తప్పుకోవడం సరియైన ఆలోచన కాదు.
తన కర్మను
కర్తవ్యముగాభావించి నిర్వర్తించు ‘విధి
భావన’ కలిగిన వ్యక్తి మాత్రమే ప్రశంసనీయుడు. పారితోషికం ఆశించడు జయాపజయములకు కుంటి
సాకులు వేదకడు; నేర్చుకోవడానికి మరియు
ఎదగడానికి ఎల్లవేళలా సంసిద్ధత చూపుతాడు. ఇవన్నీ ఒకరి వ్యక్తిత్వంలో విధిగా,
ప్రతిఫలించి ప్రదర్శించినపుడు మాత్రమే అతని మానసిక ధృడతలో అంతర్భాగమవుతాయి.
అందువల్ల, అతను మాత్రమే ప్రశంసించబడతాడు దేవుని అనుగ్రహమునకు
పాత్రుడు కూడా ఔతాడు..
ఎప్పటికీ మనము
గుర్త్గుర్తున్చుకోనవలసినది ఏమిటంటే కర్తవ్యమే మనవంతు, కాపాడుట పైవానివంతు.
यश्च
दिष्टपरो लोके यश्चापि हठवादिकः ।
उभावपि
शठावेतौ कर्मबुद्धिः प्रशंस्यते ॥ - महाभारत, अरण्यपर्व
अपनों के बारे में अंधा और अडिग होना सिर्फ भाग्यवादी है और जो भी घटना घटती है वह उसे भाग्य
से जोड़ देता है l ऐसे लोग जिद्दी हैं l – वासतव में ए दोनों मंद बुद्धी हैं। जो अपने कर्मों को अपना कर्तव्य
समझता है वह प्रशंसनीय है।
भाग्यवादी: कोई है जो मानता है कि सब कुछ भाग्य से पूर्व निर्धारित है और कुछ भी नहीं बदला जा
सकता है! उनकी टोपी जमीन पर गिरती है , तो भी वह उसे अपना भाग्य पर छोडदेता है । अपने
कार्यों की जिम्मेदारी न लेते हुए, वह भाग्य के नाम पर अपने रास्ते में आने वाली किसी भी चीज के
आगे झुक जाता है और आत्मसमर्पण कर देता है।
जिद्दी: एक व्यक्ति अपने स्वयं के दृष्टिकोण के बारे में अडिग रहता है और कभी किसी और की राय
के सामने नहीं झुकता। वह ऐसा समझता है कि वह सही है और वह अकेला है। वास्तव में, वह खुद पर
इतना विश्वास करता है कि वह खुद को आगे बढने के लिए जगह नहीं देगा!
महरशि वयास कहते हैं कि दोनों लोग बुद्धिहीन हैं! भाग्य को दोष देना और जिम्मेदारियों से दूर
भागना किसी भेए प्रामाणिकता से अच्छे विचार नहीं होते हैं।
जो कर्तव्य के नाम पर अपने कर्म करता है, और जिसमें कर्तव्य की भावना है, वही प्रशंसनीय है।
पारिश्रमिक की कोई उम्मीद नहीं; कार्यों की सफलता या विफलता के लिए कोई लंगडा कारण नहीं
दियाजाता है; सीखने और बढ़ने की तत्परता - ये सभी व्यक्तित्व का एक अभिन्न अंग बन जाते हैं, जब
वह कर्तव्यों के नाम पर प्रसन्नतापूर्वक अपना योगदान देता है वहेए परशमसा का लायक बनता है l
कर्तव्य हमारा है, फल उसका है!
yaśca diṣṭaparo
loke yaścāpi
haṭhavādikaḥ
।
ubhāvapi śaṭhāvetau
karmabuddhiḥ
praśaṃsyate
॥ - mahābhārata,
araṇyaparva
Being blind and adamant about one's own He who is a fatalist and he who is
stubborn - both are rogues. He who deems his
deeds as his duties is laudable.
Fatalist: Someone who believes that everything is predetermined by fate and
nothing can be altered! At the drop of a hat, he will leave it up to fate. Not taking
responsibility for his actions, he succumbs and surrenders to anything that
comes his way, in the name of destiny.
Stubborn: A person adamant about his own stance and viewpoint, never yielding
to anyone else's opinions. He is right and he is right alone. In fact, he believes
so much in himself that he won't give room himself to grow further!
This author says both people are rogues! Blaming fate and ducking away from
responsibilities is not a choice; neither is
ideas.
Only he who performs his deeds in the name of duties, and who has a sense of
duty is commendable. No expectation of remuneration; no lame reasons given
for either the success or failure of the tasks; readiness to learn and grow - all
these become an integral part of one's personality only when he performs
cheerfully, in the name of duties. Hence, he alone is commended.
Duty is ours, results are His!
స్వస్తి.
No comments:
Post a Comment