Friday, 27 August 2021

అజరామర సూక్తి – 344 अजरामर सूक्ति – 344 Eternal Quote – 344

 అజరామర సూక్తి  344

अजरामर सूक्ति  344

Eternal Quote – 344

https://cherukuramamohan.blogspot.com/2021/08/344-344-eternal-quote-344.html

खल्वाटो दिवसेश्वरस्य किरणैस्सन्तापितो मस्तके

गच्छन्देशमनातपं द्रुतगतिस्तालस्य मूलं गतः ।

तत्राप्यस्य महाफलेन पतता भग्नं सशब्दं शिरः

प्रायो गच्छति यत्र दैवहतकस्तत्रैव यान्त्यापदः ॥ -नीतिशतक-भर्तृहरि

ఖర్వాటో దివసేశ్వరస్య కిరణైః సంతాడితో మస్తకే

వాంఛన్దేశమనాతపం విధి వశాత్తాలస్య మూలం గతః ।

తత్రాప్యస్య మహాఫలేన పతతా భగ్నం సశబ్దం శిరః

ప్రాయో గచ్ఛతి యత్ర దైవహతక స్తత్రైవ యాంత్యాపదః ॥ భర్తృహరి నీతి శతకము -84

పై శ్లోకమునకు ఏనుగు లక్ష్మణకవి గారి తెనుగు సేత.

“ధర ఖర్వాటుడొకండు సూర్యకర సంతప్త ప్రధానాంగుడై

త్వరతోడన్‌ పరువెత్తి చేరినిలిచెన్‌ తాళద్రుమఛ్ఛాయ త

ఛ్ఛిరమున్‌ తత్ఫలపాత వేగమున విచ్చెన్‌ శబ్దయోగంబుగా

పొరి దైవోపహతుండు పోవుకడకున్ పోవుంగదా ఆపదల్‌”

తాటిపండు ఓ బట్టతల మనిషి చావుకు కారణమైంది. ఎండ తీవ్రతకు బట్టతల 

మాడిపోతుంది. నీడలో తల దాచుకుందామంటే కనుచూపు మేర ఒక్క చెట్టూ లేదు. 

అన్నీ తాళవృక్షాలే. ఏమీ లేని చోట అదే మహావృక్షం అనుకునిఓ తాటిచెట్టు 

కిందకిపోయి నిల్చున్నాడతను. పాపం! తాటిపండు రాలి పట్టతల పగిలింది. 

అక్కడికక్కడే ప్రాణాలు విడిచినాడు. ఇలా భర్తృహరి తన సుభాషితాల్లో ఈ తాటిపండు 

ప్రస్తావన తీసుకురాగా. దాన్ని ఏనుగు లక్ష్మణకవి గారు మత్తేభంలో అమర్చుట జరిగినది.

      ఈ వృత్తాంతాన్నే కాకతాళీయం అనే దానికి ఉదాహరణగా కూడా చెబుతుంటారు. 

ఆ తాటిపండుపైన ఓ కాకి వచ్చి వాలేసరికి బరువుకు తాళలేని ఆ తాళఫలం నేరుగా ఆ 

పట్టతల మనిషి నెత్తి మీద పడిందట! కాలం కలిసిరాకపోతే తాడే పామై 

కరుస్తుందంటారు కదా! ఇదీ అలాంటిదే!! నిజానికికల్పవృక్షముతో పోల్చదగిన 

వృక్షఆజములలో తాళవృక్షము అనగా తాటిచెట్టుఅత్యంత ముఖ్యమైనది.

ఈ సూక్తి గుర్తుకు వచ్చినపుడల్లా గతములో Supreme Court Judge గా ఉండిన కీ. శే. 

Justice Raghvir గారు గుర్తుకు వస్తారు. ఒకసారి వారు Bank పనిపై నా వద్దకు వచ్చుట 

జరిగినది. వారిని కూర్చుండబెట్టి వారిపనిని చేయించ పురమాయించి వారి తో 

సంభాషణలో పాల్గొనవలసి వచ్చినది. ‘దేవుని దయ’ అన్న అంశమును గూర్చి 

మాట్లాడుతూ వారికి ఈ సూక్తిని తెలిపి తాత్పర్యమును వివరించినాను. ఆయన ఎంతో 

వినయముతో ఈ రోజు మీవద్దనుండి ఎంతో విలువైన సూక్తిని తెలుసుకొన్నాను అని 

వారి హర్షాతిరిక్తతను వ్యక్తము జేసినారు. గర్వమేలేని వారి నడవడికకు నమస్కారము.

     సూక్తి లో ప్రధాన పాత్ర తాటిచెట్టుది కాబట్టి పనిలో పనిగా తాటిచెట్టును గూర్చి కాస్త 

తెలుసుకొందాము. తాటిచెట్టు ఓ కల్పవృక్షం. ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. 

వేసవి పూర్తయ్యే సమయానికి చేతికొచ్చే తాటిపండు గుజ్జుతో బూరెలురొట్టెలు 

చేసుకుని ఇష్టంగా తింటారు తెలుగువారు. తాటితాండ్ర అంటే కూడా మనవాళ్లకు 

ఎంతో ఇష్టమే! తాటి  దుంగలు పూర్వము మేడలు కట్టించుకొనుటకు దూలాలుగానూ 

దంతెలుగానూ వాడేవారు. తాటి దూలములకు దంతెలకు ఉన్న బంధన (Bond) వాటిని 

ఇనుపదూలములంత బలిష్ఠముగా ఉంచుతాయి. ఇంత శక్తి ఇతర వృక్షములకు 

ఉండదు. తాటి దుంగను నిడివికి రెండుగా చీల్చి మధ్యలో డొల్లజేసి బావి నీటిని పంట 

పొలములకు వాడుత కద్దు అసలు దుంగలను ఒకదానికొకటి ఆనించి ఏటిని 

అడ్డముగా దాటు సులభతరమగు వంతెనగా వాడుట పల్లెటూళ్ళలో నేటికినీ మనము 

చూడవచ్చును. తాటికొమ్మలు పూరి పాకల పైకప్పులుగా నేటికీ వాడుట మనము 

చూడవచ్చు. పచ్చి తాటి ఆకులతో, నన్ను పెంచిన తల్లి, మా అమ్మమ్మ పీకలు బొమ్మలు 

చేసి ఇస్తూవుండేది. తాటి ముంజలు లేక నుంజలు లేక నుంగులు అందరూ ఎంతో 

ఇష్టపడి తింటారన్నది అందరికీ తెలిసినదే! ఎక్కువ మందికి తెలియని విషయమొకటి 

చెబుతాను. ఎండు తాటి మట్టలు, కొమ్మలలో తాటి పళ్ళను యథాతథముగా వేసి ఆ 

ఆకులు, మట్టలు బూడిద అగువరకూ కాల్చి అందులో ఉడికిన ఆ పళ్ళ యోక్క గుజ్జును 

ముఖ్యముగా పల్లెటూళ్ళలో ఎంతో ఆస్వాదించుతూ పీల్చి పీల్చి చప్పరించి మింగుతారు. 

తాటి కల్లు, తాటి తేగలు అంటే కూడా వానిని గూర్చి తెలిసినవారు ఎంతో ఇష్టపడుతారు. 

కాగితము కనుగొనక ముందు, వ్రాతకు వాడుకొను విధముగా తీర్చి వ్రాసే వారు. 

పురాతన గ్రంధములన్నీ మనకు ఆవిధముగానే లభ్యములు.

తాటిపండుతో సామాన్యులు ఇలా తినుబండారాలు చేసుకుంటేకవులు మాత్రం 

పద్యపాకం చేసి దానికి సాహిత్య రుచిని జోడించినారు. శ్రీనాథుడి భీమేశ్వర పురాణము 

భీమఖండము కథనంలో వ్యాసుడు గంగానది తీరాన శిష్యులతో కూడి విహరిస్తూ, 

ఉండగా సూర్యాస్తమయమవుతుంది. ఆసందర్భామున ఆయన మాటగా శ్రీనాథుడు ఈ 

విధముగా తెలియజేస్తూ ఉన్నాడు.

సంజకెంపును దిమరపుంజంపు నలుపు

గమిచి బ్రహ్మాండభాండంబు గరముమెరసె

పరమ పరిపాక దశవృంత బంధమెడలి

 పతనమగుతాటిపంటితోఁబ్రతిఘటించి

 మిగుల మగ్గిన తాటిపండు కనిపిస్తే తినడం మానేసితొడిమ దగ్గర ఉన్న 

ఎరుపురంగును సాయంసంజె వేళ అరుణ వర్ణంతో పోల్చుచున్నాడు ఆ 

మహానుభావుడు. దానిపై ఉన్న నలుపునురాబోయే చీకటిగా వర్ణించినాడు. తాటిపండు 

మధ్యభాగంలో అక్కడక్కడా సన్నగా చీలిపోయి లోపలి భాగం కనిపిస్తుంటే సూర్య 

కిరణపుంజాలు వెలువడుతున్నట్టు తోచినాయి ఆయనకు. ఇలాంటి ఊహ అంతటి 

సరస్వతీ ఉపాసకులకే సాధ్యపడుతుంది.

అసలు తాటి పండు ఆరోగ్యానికి పూర్తిగా ఉపయోగపడుతుంది. పొటాషియంఐరన్

కాల్షియంభాస్వరం మరియు జింక్ వంటి ఖనిజాలు ఈ పండులో పుష్కలముగా 

కనిపిస్తాయి. పరిపక్వమైన పండు నుండి వచ్చే గుజ్జును చర్మశోథను నయం 

చేయడానికి ఉపయోగిస్తారు. ఇది ప్రదాహ రోధకముగానూ, తాపహారి గానూ (Anti-

inflammatory)మరియు అనామ్లజనక (Antioxidants) కూడా పనిచేస్తుంది. ఇది 

వికారము, గుండెలలో మంట, వాంతులు మరియు క్రిమి సంక్రమణ చికిత్సలో 

(కడుపులో పురుగులు పడుట)  ఉపయోగించబడింది.

తాటి చెట్టును అందుకే కల్పవృక్షముతో పోల్చుట అత్యంత సమంజసము. ఇన్ని 

సల్లక్షణములు కలిగిన ఈ చెట్టు, దేవునిదయలేనివానికి, తాటిపండు బడి 

తలపగులుటకు మాత్రమే ఉపయోగపడింది. అందుకే మనము చేసే ప్రతిపనికీ దేవుని 

దయ మిక్కిలి అవసరము.

खल्वाटो दिवसेश्वरस्य किरणैस्सन्तापितो मस्तके

गच्छन्देशमनातपं द्रुतगतिस्तालस्य मूलं गतः ।

तत्राप्यस्य महाफलेन पतता भग्नं सशब्दं शिरः

प्रायो गच्छति यत्र दैवहतकस्तत्रैव यान्त्यापदः ॥ -नीतिशतक-भर्तृहरि

एक गंजा आदमी सूरज की किरणों के कारण सिर झुलसने लागा l  छाया की जगह की तलाश में एक ताड़ के पेड़ के नीछे तेजी से दौड़ा। उधर भी एक बड़ा सा ताड़ का फल तेज से सीधा उनके सिरपर गिरने से आवाज के साथ उसका सिर फट गया! काश, मुसीबतें वहीं जातीं, जहां नियति द्वारा शापित लोग जाते...
यह कहानी बदकिस्मत के भाग्य का एक उदाहरण है। सबसे पहले, वह एक गंजा आदमी है जिसके बालों का एक कतरा भी उसे चिलचिलाती धूप से बचाने के लिए नहीं है। एक गर्म दिन में एक बंजर जगह में, वह केवल एक ताड़ का पेड़ पा सकता था। वह छाया के थोड़ा सहारा पाने के लिए पेड़ के नीचे दौड़ा (एक ताड़ के पेड़ में वैसे भी घनी छाया डालने के लिए घने पत्ते नहीं होते हैं।) जैसे ही वह खड़ा हुआ, एक विशाल ताड़ का फल उसके सिर पर गिर गया। इतना कहते ही उसका सिर फट गया, तेज आवाज के साथ!
काश! ऐसा लगता है कि वह बदकिस्मत था l कभी-कभी, जीवन की सड़क एक अप्रत्याशित मोड़ लेती है और आपके पास इसका अनुसरण करने और उस स्थान पर समाप्त होने के अलावा कोई विकल्प नहीं होता है जो आपको होना चाहिए! नहीं तो वह ताड़ के पेड़ के नीचे क्यों जाता और असामान्य रूप से, गिरते फल को अपना झुलसा हुआ गंजा सिर पर पड़कर उसका सिर टूट सके ! उस समय वहाँ अन्य स्थान भी हो सकते थे l  लेकिन परिस्थितियों और उसके विधि ने उसे उस मुकाम तक पहुँचाया जहाँ वह था। किसी के जीवन में कई बार ऐसा होता है, जहां कभी-कभी कोई अपनी परिस्थितियों को निपटने केलिए कैसे भी तैयार होता है या संभालता है, वैसा करने से उनके तकदीर में जो लिखा है वही होता है l मने ‘वही होता है जो मंजूरे खुदा होता है’l 
ऐसी परिस्थितियों में, जहां कोई तर्क, तुकबंदी या कारण घटनाओं की व्याख्या नहीं कर सकता, कोई इसे नियति के लिए जिम्मेदार नहीं ठहरासकता है। मनुष्य इतना ही समझ और समझा सकता है। कुछ चीजें उसकी सीमाओं से परे हैं। जो होना है, हो जाता है। अगर हम सब कुछ समझाने में सक्षम थे, तो क्या हमें खुद को भगवान नहीं समझना चाहिए? हमारी अनंत सीमाओं के बावजूद, एक प्रजाति के रूप में मनुष्य को एक जटिल अहंकार के लिए जाना जाता है। क्या होगा अगर हमें वह परम शक्ति दी गई जहां हम जानते और समझते थे कि सब कुछ एक निश्चित तरीके से क्यों हुआ?! तब ब्रह्मांड के लिए कोई राहत नहीं होगी।
 जबकि भाग्य एक कारक है, व्यक्ति को अपने बस में जो जो चीज नहीं होते, उनकेलिए उनको भगवान् के ऊपर ही भरोसा रखना पडेगा l 
थोड़ा ताड़ के बारे में भी जाने l ताड़ पृथ्वी के लिए कल्प तरु है l ताडका फल स्वास्थ्य के लिए बहुत उपयोगी होता है और फल में पोटेशियम, आयरन, कैल्शियम, फॉस्फोरस और जिंक जैसे खनिज पाए जाते हैंपरिपक्व फल के गूदे का उपयोग जिल्द की सूजन को ठीक करने के लिए किया जाता हैइसे एंटी-इंफ्लेमेटरी और एंटी-ऑक्सीडेंट गुणों के लिए भी जाना जाता हैइसका उपयोग मतली और उल्टी और कृमि संक्रमण के उपचार में भी किया जाता है

 khalvāṭo divaseśvarasya kiraaissantāpito mastake

gacchandeśamanātapa drutagatistālasya mūla gata 

tatrāpyasya mahāphalena patatā bhagna saśabda śira

prāyo gacchati yatra daivahatakastatraiva yāntyāpada 

-Nītiśataka-Bhartruhari

A bald man scorched in the head due to the sun's rays, in search of a place of shade rushed hurriedly to the base of a palm tree.  There too, due to the falling of a huge palm fruit, his head was fractured with a huge noise!  Alas, perils probably go where ever those cursed by destiny go...

This story is an example of the fate of the ill-fated.  To begin with, he is a bald man without even a strand of hair to protect him from the scorching sun.  On a hot day in a barren place, all he could find was a palm tree.  He scurried beneath the tree to get some scraps of shade (a palm tree doesn't have dense foliage to cast a thick shadow anyway.)  As soon as he stood, a huge palm fruit (palm fruits are not very large, to begin with) fell on his head.  Just by that, his head cracked, with a loud noise!

Alas! Looks like he was ill-fated... Reminds of the saying 'Sometimes, the road of life takes an unexpected turn and you have no choice but to follow it and end up in the place you are supposed to be!'  Otherwise, why would he go beneath a palm tree of all places and offer his scorching bald head to the unusually large, falling fruit, so his head can break?!!  There were a million other places he could have been at that time, but the circumstances and his won decisions led him to where he was.  There will be times in one's life, where sometimes no matter how one prepares or handles his circumstances, things may not appear to be going right.

In such circumstances, where no logic, rhyme or reason can explain the happenings, one decides to attribute it to destiny.  And rightly so!  There is only so much a human can understand and explain.  Some things are beyond his limitations.  It is just the way it is!  Whatever has to happen, happens.  If we were able to explain everything, shouldn't we deem ourselves as God?!  Even with our infinite limitations, humans as a species is known to have a complex ego.  What if we were given that ultimate power where we knew and understood why everything happened a certain way?!  Then there would be no respite for the universe.

 While luck/fate is a factor, one can do things to better his chances.  Then again, the Lord may choose to override them all!  At that time, one's mantra should be - what can't be cured, has to be endured!

స్వస్తి.

No comments:

Post a Comment