అజరామర సూక్తి – 340
अजरामर सूक्ति – 340
Eternal Quote – 340
https://cherukuramamohan.blogspot.com/2021/08/340-340-eternal-quote-340.html
निर्धनश्चापि
कामार्थी दरिद्रः कलहप्रियः ।
मन्दशास्त्रो
विवादार्थी त्रिविधं मूर्खलक्षणम् ॥ - सुभाषितसुधानिधि
నిర్ధనశ్చాపి
కామార్థీ దరిద్రః కలహాప్రియః l
మందశాస్త్రో
వివాదార్థీ త్రివిధం మూర్ఖ లక్షణం ll సుభాషిత సుధానిధి
ఏగాని చేత లేకున్నా ఎంత
బంగారం కిలో అంటాడు, దరిద్రత ధనములోనే కాక తలపులలో కూడా తాండవించుచున్ననూ వాదమునకు
సంసిద్ధం అంటాడు, జ్ఞానము పరబ్రహ్మ
పదార్థమే అయినా వివాదాలకు విచ్చుకత్తిని కట్టిన కోడినంటాడు, మూర్ఖుల మూర్ధన్యుడు.
ఈ మూడు లక్షణములు కలిగిన వాడు, లొత్త గవ్వ, చెల్లని కాసు, ఉప్పు లేని పప్పు వంటి
మూర్ఖుని లక్షణాలు.
ఎవరైనా తన శక్తికి
మించి తన కోరికలను సాగదీయకూడదు. ఆ గుణము అతడిని ఇబ్బందుల్లోకి నెట్టుటకు మాత్రమే ఉపయోగపడుతుంది.
కోరిక ఒక క్షుద్రమైన విషయం. ఇది కోరికను నెరవేర్చుకొనుటకు, అన్ని విధముల అనైతిక చర్యలను చేయడానికి మనస్సును
ఒప్పిస్తుంది. జ్ఞానము గలవారు ఈ వాస్తవమును అర్థము చేసుకొంటారు. మూర్ఖులు మాత్రమే తమ శక్తికి మించి దావానలములో చేతులు
పెట్టి కాల్చుకొంటారు.
వివాదాస్పద వైఖరులు
ఎవరిలోనూ ప్రశంసించబడవు. చేతగాని వారు ఆ
విషయమును తెలుసుకొనక, తనకు తెలియనిది లేదని తలంచుతూ వితండ వాదములు చేస్తూ ఉంటారు.
అసలు వాదనకు దిగే వ్యక్తి, వాదనకు దిగడానికి, ఎదుటి వ్యక్తి ఏమి
మాట్లాడుతున్నాడో తెలుసుకోవాలి. అతని వాదనకు ప్రామాణికత ఉందో లేదో అర్థం
చేసుకోవడానికి తగిన పరిజ్ఞానము తప్పక కలిగి ఉండాలి. అందుకు తగిన చతురత లేకపోతే వాదనలో ప్రవేశించుట నిరర్థకము. తెలివైనవారు
అటువంటి పరిస్థితులలో తల దూర్చరు; అట్టి పనులు అవివేకులు
మాత్రమే చేస్తారు.
కావున, పై 3 లక్షణాలు తెలివైన వారికి సరిపోవు. పైన పేర్కొన్న
వాటిలో దేనియందైనా కాలూనుట మూర్ఖత్వమునకు తిరుగులేని సూచన.
మనము జ్ఞాన దీపమును
కలుగవలెనా లేక అజ్నానాధకారములోనే కొట్టుమిట్టాడవలెనా అన్నది మన నిర్ణయమునకు సంబంధించిన విషయము. పైన తెలియజేసిన విషయమును ఈ పద్యములో ఇమిడించ ప్రయత్నించినాను.
చేతిన
చిల్లిగవ్వయును చేర్చగలేకయు పేర్చు కోర్కులున్
కూతల
కేమొ గర్వియయి గొప్పలు చెప్పును ఏమి
లేకయున్
మూతయె
లేక, బోరగిలి, ముందర నిల్చిన శూన్య పాత్రలా
చేతన
యాతనల్ దరికి చేర్చక బాలిశుడాడు వాదముల్
निर्धनश्चापि कामार्थी दरिद्रः कलहप्रियः ।
मन्दशास्त्रो विवादार्थी त्रिविधं मूर्खलक्षणम् ॥ - सुभाषितसुधानिधि
दरिद्र अभी तक वांछित; गरीब अभी तक विवादास्पद; ज्ञान में कमजोर फिर भी विवाद चाहने वाले -
ये तीन लक्षण एक मूर्ख के हैं।
व्यक्ति को अपनी इच्छाओं और इच्छाओं को अपने साधनों से आगे नहीं बढना चाहिए। यह केवल उसे
परेशानी में डालेगा। चाहत भी अजीब चीज है। यह मन को इच्छाओं की पूर्ति के लिए सभी प्रकार के
अनैतिक कार्यों को करने के लिए मना लेगा। ज्ञानी इस तथ्य से भली-भांति परिचित हैं। केवल मूर्ख ही
अपने साधनों से परे खींचने में लिप्त होते हैं।
किसी में भी विवादास्पद और झागडालू रवैये की सराहना नहीं की जाती है, खासकर उन लोग जो
अतिरिक्त ऊर्जा खर्च करने का जोखिम नहीं उठा सकते। उन लोगों में ऐसा कोइ विकल्प नहीं रहेगा
जिस से वे अपनी बात बनासके l उस के बदले में उनका ऊर्जा पूरा लड़ाई-झगड़ों में ही खर्च होगा
जो किसी भी हालत में लाब्दायक नहीं होगा l । केवल मूर्ख ही ऐसे कार्यों में लिप्त होते हैं।
किसी विवाद में पड़ने के लिए, किसी को पता होना चाहिए कि वह किस बारे में बात कर रहा है।
किसी को यह समझने के लिए जानकारी होना चाहिए कि क्या उसके तर्क की वैधता है। यदि उसके
पास आवश्यक कुशाग्रता नहीं है तो तर्क में प्रवेश करने का कोई मतलब नहीं है। बुद्धिमान लोग ऐसी
स्थितियों में स्वयं को शामिल नहीं करते हैं; मूर्ख ही करते हैं।
इसलिए, उपरोक्त 3 विशेषताएँ बुद्धिमानों के अनुकूल नहीं हैं। उनमे से किसी में भी शामिल होना
मूर्खता का एक चिल्ला संकेत है।
अब यह हम पर निर्भर करता है कि हम बुद्धिमान बनना चाहते हैं या मूर्ख !
nirdhanaścāpi kāmārthī daridraḥ kalahapriyaḥ ।
mandaśāstro vivādārthī trividhaṃ mūrkhalakṣaṇam ॥ - subhāṣitasudhānidhi
Penniless yet desirous; poor yet contentious; weak in knowledge yet
seeking disputes - (these) three characteristics are those of an idiot.
One should not stretch his wants and desires beyond his means. It will
only get him in trouble. Desire is a strange thing. It will convince the mind
to perform all kinds of unethical actions, in order to fulfil the desires. The
wise are very aware of this fact. Only the foolish indulge in stretching beyond
their means.
Contentious and quarrelsome attitudes are not appreciated in anyone,
especially those who can't afford to expend extra energy from the repository of
their thoughts. Instead of making ends meet, efforts will be spent in fighting
for no meaningful reason. Only the silly,
engage in such actions.
In order to get into an argument, one should know what he is talking
about. One needs to be knowledgeable in order to understand if there is
validity to his argument. There is no
point in entering the argument if he does not have the required acumen. The wise do not involve themselves in such
situations; only the foolish do.
Hence, the above 3 characteristics do not suite the wise. It is a
screaming indication of foolishness to engage in any of the above.
It is up to us now, to determine whether we want to be wise or foolish!
స్వస్తి.
🙏
ReplyDelete