అజరామర సూక్తి – 349
अजरामर सूक्ति – 349
Eternal Quote – 349
https://cherukuramamohan.blogspot.com/2021/08/349-349-eternal-quote-349.html
पितृभिस्ताडितः
पुत्रः शिष्यस्तु गुरुशिक्षितः ।
घनाहतं
सुवर्णञ्च प्राप्यते जनमण्डनम् ॥
పితృభిస్తాడితః పుత్రః శిష్యస్తు గురుశిక్షితఃl
ఘనాహతం సువర్ణంచ ప్రాప్యతే జనమండనం ll
కుమారుడు (పిల్లవాడు)
తన తల్లిదండ్రులచే నయానో భయానో దండించుట చేతనో, క్రమశిక్షణ పొందుతాడు, అదేవిధముగా ఉపాధ్యాయునిచే శిక్షణ, క్రమశిక్షణ పొందుతాడు విద్యార్థి, సమ్మెట
పోటుచేతనే ఆభరణమగుచున్నది బంగారము -
ఇవన్నీ విలువలను ప్రశంసలను పొందుటకు కారణము సరియైన సమయములో సరియగు చికిత్స.
పిల్లలు, స్వాభావికముగా జిజ్ఞాసువులుగా ఉంటారు. వారు తమ
చుట్టూ ఉన్న ప్రపంచం గురించి మాత్రమే కాకుండా, వారు ఏమి
చేయాలి లేదా చేయకూడదు అనే సరిహద్దుల గురించి కూడా ఆసక్తిగా చూస్తూవుంటారు. వారిలో
పరిశీలనా పటిమ విస్తృతము. వారు తమ
పరిశీలనలో పొరబాట్లు చేసే అవకాశము కూడా కద్దు. కొన్ని మార్లు, వారు చేయకూడనివని తెలిసినప్పటికీ, చేస్తే ఏమౌతుందో
చూస్తామని తలచవచ్చు. ఆ సమయంలో, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా వారికి మార్గనిర్దేశం చేసే వ్యక్తి, వారికి సరైన దిశానిర్దేశం చేయుట చాలా అవసరము. పిల్లలు బాధపడకూడదనే
ప్రయత్నంలో వారి నడవడికను తలిదండ్రులు మరియు గురువులు కట్టడి చేయకపోతే నిజానికి వారంతా
పిల్లలకు అపకారము చేస్తాసినవారౌతారు!
మొక్కైవంగనిది మానై
వంగుతుందా అంటారు పెద్దలు. అందుచే పిల్లలను చిన్నానాటి నుంచే క్రమశిక్షణగా
పెంచాలంటారు కొందరు . ఈ విషయంలో నీతి శాస్త్రము ఈవిధముగా చెప్పినది . ఇది పిల్లల
పాలన పోషణ ఎతీరున ఉండాలన్నది అసలు ఎంతో నిర్దుష్టముగా తెలుపుచున్నది. ఆ శ్లోకమును ఒకపరి
పరికించుదాము.
రాజవత్ పంచవర్షాణి | దశ వర్షాణి దాసవత్ |
ప్రాప్తే తు షోడశే
వర్షే | పుత్రం మిత్రవదాచరేత్ ||
‘రాజవత్ పంచవర్షాణి’ అంటే
పిల్లల్ని అయిదేళ్లవరకు రాజ మర్యాదలతో పెంచాలి . పదేళ్లు వచ్చే వరకు దాసులుగా
పెంచాలి . పదహారేళ్ల నుంచి మిత్రులుగా చూడాలి .. అన్నది ఈ శ్లోకం అర్థం . లాలయేత్
పంచవర్షాణి" అని పాఠాంతరం కూడా ఉన్నది .
అయిదేండ్ల వయసు వచ్చు వరకు
పిల్లవానిని బుజ్జగించాలి . ఈ శ్లోకంలో ‘పుత్రన్’ అంటూ చెప్పినా .. ఇది పుత్రుడు , పుత్రికలు ఇద్దరికీ వర్తిస్తుంది . ఈ కాలంలో
పుత్రికలు , పుత్రులు అంటూ తేడా ఏముంది వాస్తవానికి.
తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు ఇద్దరూ పిల్లలు రాణించడానికి చిత్తశుద్ధితో
ప్రయత్నించవలసియుంటుంది. అందుకే పెద్దలు ‘పుత్రాదిచ్ఛేత్ పరాజయం’ అని ‘శిష్యాదిచ్ఛేత్
పరాజయం’ అని అన్నారు. దీని అర్థం తల్లిదండ్రులు తమ పిల్లల
నుండి ఓటమిని కోరుకుంటారు మరియు గురువులు తమ విద్యార్థుల నుండి ఓటమి కోసం
ఆరాటపడతారు! అంటే వాస్తవానికి వారి బాధ్యత మరయు ఎంతటి రుజుత్వము ఉండవలెనో
గమనించండి. పిల్లలకు తగిన విద్యాబుద్ధులు చెప్పిన సార్థకత, ఆనందము, వారు తమను
ఓడించినపుడే కలుగుతుంది.
ఈ శ్లోకములో ఇచ్చిన ఉదాహరణ బంగారం. బంగారం, గనుల నుండి తవ్వినప్పుడు, కాంతి
విహీనముగా ఉంటుంది. స్వర్ణకారుడు దానిని కరిగించి, దాన్ని
పదే పదే కొట్టి దానికి సరియగు ఆకృతిని ఇస్తాడు. అప్పుడే అది మెరుపు మరియు విలువను
పొందుతుంది! అదేవిధంగా, చిన్న వయస్సు నుండే క్రమశిక్షణ మరియు
విలువలతో పెంచినచో పిల్లలు ప్రశంసనీయమైన లక్షణాలను పొందుతారు, ఆవిధముగా పెద్దలు, పిల్లలకు ఉజ్వల భవిష్యత్తును ఇచ్చినట్లవుతుంది. అందువల్ల,
తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు తమ పిల్లలు మరియు విద్యార్థులను ఈ
అత్యుత్తమ నైపుణ్యంతో భావి పౌరులుగా తీర్చి దిద్దుత అత్యంత ఆవశ్యకము.
క్రమశిక్షణ అనేది
లక్ష్యాలు మరియు విజయాల మధ్య వారధి. భావితర విజయముల కోసం తల్లిదండ్రి, గురువులు
వారధిగా ఉంటేనే తమ బాధ్యత సక్రమముగా నిర్వహించినవారవుతారు. వేమన పద్యముతో ఈ
విశ్లేషణను ముగించుచున్నాను.
చాకివాడు కోక చీకాకు
పడజేసి
మైలబుచ్చి మంచి మడుపు
జేయు
బుద్ధి చెప్పువాడు
గుద్దితే నేమయా
విశ్వదాభిరామ వినురవేమ.
మాకాలంలో మైల బట్టలు
ఉతకాలంటే అది చాకలి వృత్తిలో ఉన్నవారి పని. గ్రామాలలో నదులు, చెరువులు ఉన్న చోటుకి ఊరివాళ్లు ఇచ్చిన మైలబట్టలు
తీసుకుపోయి వాటిని పెద్ద బండలకు వేసి బాది మలినాన్ని(మైల) పోగొట్టి చక్కగా
ఎండబెట్టి, చక్కని మడతతో తిరిగి ఏ ఇంటి బట్టలు ఆ ఇంటికి
ఇచ్చేవారు చాకలివారు.
ఈ పద్యంలో కోక అనే
పదానికి ఒకప్పుడు వస్త్రము అనే విస్తృతార్థం ఉండేది కానీ ఇప్పుడు కొన్ని
మాండలికాలలో కోక అంటే స్త్రీలు ధరించే చీర అనే అర్థానికి పరిమితమై కనిపిస్తుంది.
అలాగే నన్నయ కాలం నాటికి చీర అనే పదానికి స్త్రీ పురుషులు ఎవరు ధరించినదైనా
వస్త్రం అనే విస్తృతార్థం ఉండేది. అది ఇప్పుడు చీర - స్త్రీలు ధరించే వస్త్రవిశేషం
అనే అర్థానికి పరిమితమైంది.
చాకలివారు బాగా
మాసిపోయిన వస్త్రాలను తీసుకుపోయి బాగా ఉతుకుతారు. ఆ వస్త్రం మలినం పోగొట్టడానికి
వారు దాన్ని బండకేసి బాదుతారు. జాడిస్తారు. మెలికలు తిప్పుతారు. ఎండలో వేస్తారు.
ఏదో విధంగా వస్త్రాన్ని రకరకాలుగా చికాకు పెట్టి చివరకు అతి చక్కని మడత పెట్టి
శుభ్రంగా చేతికి ఇస్తారు.
ఆవిధంగానే సమాజానికి
బుద్ధి చెప్పి మంచిదారిలో పెడదామని చూసేవాడు ఆ మంచి చెప్పే పద్ధతి కొంచెం కఠినంగా
ఉండవచ్చు. అలాగే మరీ దారి మళ్లుతున్నారనిపిస్తే దండించడం కూడా జరగవచ్చు. అయినాకూడా
అతను మంచి మార్పుకోసము ఇలా చేసినప్పుడు దాన్ని భరించి అతనినుంచి మేలు పొందాలంటున్నాడు
వేమన.
एक बच्चे को उसके माता-पिता द्वारा अनुशासित, एक शिक्षक द्वारा प्रशिक्षित छात्रों, गहन रूप से
सोने की लता - ये सभी प्रशंसनीयता प्राप्त करते हैं।
अपने
माता-पिता द्वारा अनुशासित पुत्र एक शिक्षक द्वारा प्रशिक्षित छात्र,
गहन रूप से सोना
चढ़ाया - ये
सभी प्रशंसा प्राप्त हैं।
बच्चे स्वभाव से ही जिज्ञासु होते हैं। वे न केवल अपने आस-पास की दुनिया के बारे में उत्सुक हैं,
बल्कि इस बात की भी सीमाओं के बारे में उत्सुक हैं कि उन्हें क्या करना चाहिए या क्या नहीं
करना चाहिए! उनके जिज्ञासु मन यह देखना चाहते हैं कि वे कितनी दूर जा सकते हैं। कई बार,
क्या करें और क्या न करें, यह जानने के बावजूद भी वे अपनी किस्मत आजमाना चाहेंगे। उस
समय, माता-पिता, शिक्षकों या जो भी उनके मार्गदर्शक व्यक्ति हैं, उन्हें उचित दिशा देना
आवश्यक हो जाता है। यदि मार्गदर्शन करने वाले लोग बच्चों को दुखी न करने के प्रयास में
उनकी मूर्खता को गद्दी देते हैं, तो वे उनका अहित कर रहे होंगे!
जैसे वे
कहते हैं,
'अपने बच्चों के लिए सड़क
तैयार मत करो, अपने बच्चों को सड़क के लिए तैयार
करो!' जब वास्तविक जीवन के मुद्दे हड़ताल करते हैं, तो वे बच्चे बेहतर तरीके से तैयार होते हैं
और गिरने पर जल्द ही ठीक हो जाते हैं।
वास्तव में, माता-पिता और शिक्षक दोनों ही बच्चों में उत्कृष्टता को आत्मसात करने का प्रयास
करते हैं।
कहावतें इस
प्रकार हैं – ‘पुत्रदिच्छेत् परजयम्’ और ‘शिष्यादिच्छेत
परजयम्’ । इसका मतलब है कि
माता-पिता
अपने बच्चों से हार चाहते हैं और गुरु अपने छात्रों से हार के लिए तरसते हैं!
वास्तव में,
युवाओं का मार्गदर्शन करने के लिए उन्होंने इतना प्रयास क्यों किया, इसका पूरा कारण यह है कि
उन्हें खुद को पार करते हुए देखना
है!
श्लोक में दिया गया उदाहरण सोने का है। खानों से निकाले जाने पर सोना नीरस और चमकहीन
होता है। सुनार इसे पिघलाता है, आँवले पर बार-बार पीटता है और आकार देता है। तभी वह
अपनी चमक के साथ-साथ मूल्य भी प्राप्त करता है! इसी तरह, जो बच्चे कम उम्र से अनुशासित
और मूल्यों के साथ आकार लेते हैं, वे प्रशंसनीय गुण अर्जित करते हैं जो उन्हें भविष्य में अधिक
खुश वयस्क बनाते हैं। इसलिए, माता-पिता के साथ-साथ शिक्षकों के लिए यह सबसे महत्वपूर्ण है
कि वे अपने बच्चों और छात्रों को इस सर्वोत्कृष्ट कौशल से लैस करें।
अनुशासन
लक्ष्यों और उपलब्धियों के बीच का सेतु है। भावी पीढ़ी की उपलब्धियों के लिए हम वह
मौलिक पुल
बनें !
pitṛbhistāḍitaḥ
putraḥ
śiṣyastu
guruśikṣitaḥ
।
ghanāhataṃ
suvarṇañca
prāpyate
janamaṇḍanam
॥
A son (child) disciplined by his parents, students trained by a teacher, intensely
clobbered gold - all these attain
praiseworthiness.
By nature, children are, by nature, curious. They are curious not just about the
world around them, but also about the boundaries of what they should or
shouldn't do! Their inquisitive minds want to see how far they can go. Many
times, despite knowing the dos and don'ts, they may still want to try their luck.
At that point, it becomes essential for the parents, teachers or whoever is their
guiding figure, to give them the proper direction. If the people guiding cushion
the follies of the children in an effort to not make them sad, they would be doing
a disservice to them!
Like they say, 'Do not prepare the road for your children, prepare your children
for the road!' When real-life issues strike, those are the children who are better
prepared and recover soon if they fall.
In reality, both parents and teachers strive to imbibe excellence in children. The
sayings go as - पुत्रादिच्छेत् पराजयम् (putrādicchet parājayam) and शिष्यादिच्छेत्
पराजयम् (śiṣyādicchet parājayam). This means that parents are desirous of
defeat from their children and gurus yearn for defeat from their students! In fact,
the whole reason why they put so much effort into guiding the youngsters is to
see them surpass themselves!
The example given in the verse is that of gold. Gold, when mined from the
mines, is dull and lusterless. The goldsmith melts it, beats it repeatedly on the
anvil and shapes it. Only then does it gain its luster as well as value! Similarly,
children who are disciplined and shaped with values from a young age accrue
praiseworthy traits that shall make them happier adults in the future. Hence, it is
of paramount importance for parents as well as teachers, to equip their children
and students with this
quintessential skill.
Discipline is the bridge between goals and accomplishments. Be that
fundamental bridge for the future generation's accomplishments
స్వస్తి.